30 Dec 2022

రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..!

ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఇద్దరు వికెట్ కీపర్లను రంగంలోకి టీమిండియా దింపింది. కేఎల్ రాహుల్ అశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రస్తుతం వన్డేలో వికెట్ కీపర్ స్థానం టీమ్ మేనేజ్ మెంట్ చాలా కష్టపడుతోంది. ప్రపంచకప్‌లో పంత్ ఆడిన 2 మ్యాచ్‌లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.

ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్

గూగుల్ వాయిస్ కాల్‌లకు "అనుమానాస్పద స్పామ్ కాలర్" హెచ్చరికను జోడిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇది అనవసరమైన, అప్రధానమైన కాల్స్ ను ఫిల్టర్ చేస్తుంది. అయితే ఇన్‌కమింగ్ కాల్ స్పామ్ అని వినియోగదారులు ధృవీకరించాలి.

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా 1990 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నఅంజనీకుమార్‌కు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్?

ఓటీటీల్లో అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా చెప్పుకునే నెట్ ఫ్లిక్ల్, ప్రస్తుతం తెలుగు సినిమాల మీద, సిరీస్ ల మీద గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం

ఉక్రెయిన్ యుద్ధం, బలమైన డాలర్, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రూడ్ దిగుమతిదారు చైనా నుండి డిమాండ్ తగ్గడం వలన చమురు ధరలు శుక్రవారం పెరిగాయి.

న్యూఇయర్ అలర్ట్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెండ్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 10గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

పెట్: ఎలాంటి బ్రీడ్ కుక్కపిల్లను పెంచుకోవాలో మీకు తెలుసా? ఇది తెలుసుకోండి

చాలామందికి పెట్స్ ని పెంచుకోవాలని ఇష్టంగా ఉంటుంది. కొందరు కుక్కలను పెంచుకుంటే కొందరు పిల్లులను పెంచుకుంటారు. కుక్కపిల్లల్ని పెంచుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

జనవరి 6న బీపీఎల్ సమరం

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సర్వం సిద్ధమైంది. అటగాళ్లను జాబితాను ఆయా జట్టులు ప్రకటించాయి. బీపీఎల్ లీగ్ లో ఏడు జట్లు నువ్వా-నేనా అన్నట్లు గా పోటిపడనున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా బీపీఎల్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం

కంపెనీలోని షార్ట్ సెల్లర్లు-లేదా ఒక ఆస్తి ధర పడిపోయినప్పుడు లాభపడే బేరిష్ పెట్టుబడిదారులు దాదాపు $17 బిలియన్ల మార్కెట్ లాభాలను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. S3 పార్టనర్స్ డేటా ప్రకారం టెస్లా సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన స్వల్ప వాణిజ్యంగా మారింది.

భారత్‌తో పోరుకు సై అంటున్న వార్నర్

ఆస్రేలియా డేంజరేస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన వంద టెస్టులో సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫిబ్రవరిలో భారత్తో టెస్టు సిరీస్ జరగనుంది. దీనిపై డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. భారత్ టెస్టు సిరీస్ గొప్ప సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది.

రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది

క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ యాక్సిడెంట్ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తున్నారు.

రాశి ఫలాలు: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. ఈ రాశుల వారికి పెళ్ళిళ్ళు

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది కాబట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. రాశిఫలాల ప్రకారం తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ

కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.

డిసెంబర్ 30న ఉచిత Fire MAX కోడ్‌లు: ఎలా రీడీమ్ చేయాలి

Garena Free Fire MAXలో ఉచిత కోడ్‌లను రీడీమ్ చేయడానికి వినియోగదారులు కొన్ని నియమాలను పాటించాలి.

ఈ ఏడాది ఎంట్రీతో సత్తా చాటిన బౌలర్లు వీరే..

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాడ్ తరుపున ఆరగ్రేటం చేసిన మ్యాటీ పాట్స్ అద్భుతంగా రాణించాడు. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో విలియమ్సన్ వికెట్ తీసి సత్తా చాటాడు. 4/13 రాణించి టెస్టులో అకట్టుకున్నాడు.

అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్

2022సంవత్సరం హీరో నిఖిల్ కి బాగా కలిసొచ్చింది. ఆగస్టులో కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విజయం అందుకుని, చివర్లో 18 పేజెస్ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థాయికి ఎదిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ టెన్‌లో ఈ ఏడాది తన సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తి కూడా అదానీ మాత్రమే.

మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ

మాల్దీవులోని భారత హైకమిషన్‌పై దాడికి ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు అబ్బాస్ ఆదిల్ రిజా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరు దేశాలు అలర్ట్ అయ్యారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు.

కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత, యశోద సినిమా విడుదల సమయంలో తన అనారోగ్యం గురించి అందరి ముందు బయటపెట్టింది. ఆటో ఇమ్యూన్ వ్యాధిరకమైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది సమంత.

2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి

భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి

ఐసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన నిలిచారు. ఐసీసీఐ ప్రతిపాదించిన పురుషుల జాబితాలో సూర్య, మహిళల జాబితాలో స్మృతి మందాన చోటు దక్కించుకున్నారు.

అన్ స్టాపబుల్: ఢిల్లీ హై కోర్టులో ఆహా పిటీషన్.. అవి తొలగించాలని నిర్ణయం

అన్ స్టాపబుల్: ఏ ముహూర్తంలో ఈ షోకి ఆ పేరు పెట్టారో గానీ నిజంగా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. వ్యాఖ్యాతగా బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తున్నారు.

అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ టీ20 కెప్టెన్ గా నియమితులయ్యారు. మహమ్మద్ నబీ స్థానంలో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రషీద్ కు జట్టు పగ్గాలను అప్పగించింది.

కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

కేరళ గురువాయూర్ ఆలయ ఆస్తులపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆలయం పరిధిలో ఎన్ని రూ. కోట్ల డిపాజిట్లు ఉన్నాయి? ఎంత భూమి ఉంది? అనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చింది.

పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు

ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన నెంబర్ తో ఉన్న పరిమిత ఎడిషన్ పనిగేల్ V4 బగ్నాయా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా, పానిగేల్ V4 బౌటిస్టా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా అమ్ముడయ్యాయని Ducati సంస్థ ప్రకటించింది. ఈ సీజన్‌లో MotoGP, WorldSBKలో డుకాటీ విజయాన్ని పురస్కరించుకుని ఈ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది.

బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడం అనేది చాలా పెద్ద టాస్క్. దీనికోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా విఫలం అవుతుంటారు.

లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెజిల్కు మూడుసార్లు కప్పు అందించిన పీలే(82) కన్నుమూశారు. పీలే చాలా సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పీలే మరణాన్ని అతని కుమార్తె కెల్లీ నాసిమెంటో ఇన్ స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 1958, 1962, 1970లో బ్రెజిల్‌కు ప్రపంచ కప్పును అందించారు.

మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబేన్(100) కన్నుమూశారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. ఆతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చేలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పంత్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన రూర్కిలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని ఉన్న హమ్మద్ పూర్ట్ ఝల్ రహదారిపై జరిగింది.

వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి.

29 Dec 2022

జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్

అడవి శేష్.. క్షణం సినిమా నుండి మొన్న వచ్చిన హిట్ 2 వరకు అన్నింట్లోనూ విజయం అందుకున్నాడు. ఈ మధ్య తెలుగు సినిమాకి ఇన్ని హిట్లు అందించిన హీరో కనబడలేదు.

'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం

భారత ఔషధ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి తమ దేశంలో 18మంది చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు తెలిపింది.

భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి

భారత్ హాకీ ఇండియా సరికొత్త నిర్ణయం తీసుకుంది. హాకీని మరింత ప్రోత్సహించేలా జట్టులోకి సభ్యులకు నగదును బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందనలు తెలుపుతూ ట్విట్స్ చేస్తున్నారు. జనవరిలో జరిగే FIH పురుషుల ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్-రూర్కెలాలో జరగనుంది.

2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు

టెక్నాలజీ కంపెనీలు 2022 లో ఎప్పటిలాగే ఎన్నో ఆవిష్కరణల గురించి హామీ ఇచ్చారు కానీ వాస్తవానికి, హామీకి చాలా దూరంలో ఆగిపోయారు.

జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేసింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు

2022 సంవత్సరానికి ముగింపు పలికి 2023కి స్వాగతం పలకడానికి అందరూ రెడీ ఐపోతున్నారు. అందరూ ఇయర్ ఎండ్ మూడ్ లోకి వచ్చేసారు.

అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్న రవాణా శాఖ

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డీలర్ ప్రామాణికతను గుర్తించడానికి రిజిస్టర్డ్ వాహనాల డీలర్‌ల కోసం అధికార ధృవీకరణ పత్రాలను ప్రవేశపెట్టింది. ఈ చర్య వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.

ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'

దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరిస్థితులు అనుకూలించక పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు వేయలేని వారు చాలా మంది ఉంటారు. అలా గ్రామాలకు వచ్చి ఓటవేయలేని వారికోసం ఎన్నికల సంఘం 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'ను తీసుకురావాలని నిర్ణయించింది.

చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్

భారత్ చెస్ ప్లేయర్ సవితాశ్రీ భాస్కర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. కజకిస్తాన్‌లో జరిగిన ఎఫ్‌ఐడీఈ (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన మూడో భారత చెస్ ప్లేయర్‌గా నిలిచి అరుదైన ఘనత తన సొంతం చేసుకుంది.

చలికాలం: డయాబెటిస్ నుండి గుండె సంబంధ వ్యాధుల వరకు మెంతులు చేసే ప్రయోజనాలు

మనకు ఆరోగ్యాన్నిచ్చే చాలా పదార్థాలు మన కిచెన్ లోనే ఉంటాయి. కానీ మనం మాత్రం అది మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, ఏవేవో తింటుంటాం. సాధారణంగా కిచెన్ లో కనిపించే మెంతులు, మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయం ఇప్పడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ భద్రత విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. భారత్ జూడో యాత్ర ఈనెల 24న దిల్లీకి చేరిన సందర్భంలో.. రాహుల్ గాంధీ భద్రతపై నిర్లక్ష్యం తేటతెల్లమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇది రాజకీయంగా చర్చకు దారిసింది.

వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది

గాడ్ ఫాదర్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్

టీ20లో విధ్వంసకర బ్యాట్య్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది మంచి జోష్ ఉన్నారు. టీమిండియాలో అద్భుతంగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక ఆట శైలి ఉందని నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు

చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7తో ఉక్కిరిబిక్కరి అవుతున్న బీజింగ్‌లో ఇప్పుడు.. ఔషధార కొరత ఏర్పడింది. మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చైనీయులు భారతీయ ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవి లభ్యం కాకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ కొని మరీ.. వినియోగిస్తున్నారు.

గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు

చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ సుమలతకు తండ్రి పాత్రలో మెప్పించిన నటుడు వల్లభనేని జనార్ధన్, ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

భారీ అంచనాలతో అరంగ్రేట్రం... ఆ తర్వాత అడ్రస్ గల్లంతు..!

టీమిండియాలో చోటు సంపాదించడం చాలా కష్టం.. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చి.. తరువాత చోటు దక్కకపోతే భవిష్యతులో ఆ ప్రభావం ఆటపై పడే అవకాశం ఉంటుంది. 2021లో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు 2022లో ఇంటర్నేషన్ క్రికెట్ కి దూరంగా ఉండడం గమనార్హం.

కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

మరోమారు వివాదంలోకి రష్మిక మందన్న.. ఈ సారి సౌత్ సినిమాపై కామెంట్లు

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న, గత కొన్ని రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది.

2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ

భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

భారత్ టీంను ఢీకొట్టే శ్రీలంక జట్టు ఇదే..

జనవరిలో భారత్‌లో పర్యటించే శ్రీలంక జట్టును శ్రీలంక క్రికెట్‌బోర్డు ప్రకటించింది. టీమిండియా శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే సిరీస్ లను ఆడనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక జట్టు పగ్గాలను దసున్ షనకకు అప్పగించారు.

2022లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను వీడిన టాప్ 5 మోడల్స్

2022 సంవత్సరం భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో చాలా కార్లు, బ్రాండ్‌లు వచ్చి చేరాయి. అయితే అమ్మకాలు తగ్గడం, కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా కొన్ని మోడల్‌ల నిష్క్రమణ కూడా 2022లో జరిగింది.

జీర్ణ సమస్యలను అరికట్టే హెర్బల్ టీ.. ఇంట్లోనే తయారు చేసుకోండి

జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా సరైన ఆహారాన్ని తినలేకపోతున్నారు. దానివల్ల ఆ ఆహారం సరిగ్గా జీర్ణం అవక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ హెర్బల్ టీ తాగండి.

2023 జనవరిలో బీసీసీఐ నూతన సెలక్షన్ కమిటీ..!

2023 జనవరిలో అశోక్ మల్హోత్రా నేతృత్వంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ, కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ముంబైలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కార్యాలయంలో సమావేశం డిసెంబర్ 30న జరగనుంది. ఇందులో సభ్యులగా సులక్షణ నాయక్, పరంజ్పే ఉండనున్నారు.

'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు.

జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి

భారతదేశంలో POCO C50 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ జనవరి 3న విడుదల కాబోతుంది. ఇందులో MediaTek లేదా JLQ నుండి ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్‌ ఉండే అవకాశం ఉంది. JLQ మార్కెట్లో కొత్త, Android ఆధారిత హ్యాండ్‌సెట్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం SoCల తయారీపై దృష్టి పెడుతుంది.

వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ట్విట్టర్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఎదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నటి వరకు ఖాతాలు నిలుపుదల, ఇతర సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులు... ఇప్పుడు వెబ్ నుండి సైన్ ఇన్ చేయడంలో సమస్యను ఎదుర్కుంటున్నారు. కొందరు వారి ట్విట్టర్ నోటిఫికేషన్‌లు కూడా పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

వేసవిలో వస్తున్న నాగచైతన్య కస్టడీ.. విడుదల తేదీ ప్రకటన

థ్యాంక్యూ సినిమాతో అతిపెద్ద అపజయాన్ని మూటగట్టుకున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య, ప్రస్తుత్రం ద్విభాషా చిత్రం కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుండి నాగ చైతన్య పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.

ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు

అతివాద, నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం తెల్లవారుజామున కేరళ వ్యాప్తంగా సోదాలు చేపట్టింది. రాష్ట్రంలో దాదాపు 56చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది.

టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ

వచ్చే ఏడాది 2023 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీతికౌర్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఇక టాప్‌లో కొనసాగుతున్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించింది.