12 Jan 2023

జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటకలో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో ఘోర వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు హుబ్బళికి మోదీ చేరుకోగా.. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు.

భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్

ఫిబ్రవరి 1న జరిగే Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ సిరీస్‌ను ప్రారంభించనున్నట్లు సామ్ సంగ్ సృష్టం చేసింది. భారతదేశంలో లాంచ్ కి ముందే ప్రీ-బుకింగ్‌లకు మొదలయ్యాయి. ఈ సిరీస్ లో S23, S23 ప్లస్, S23 అల్ట్రా మోడల్‌లు ఉంటాయి. హ్యాండ్‌సెట్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారికి రూ. 5,000 విలువైన ఇ-వోచర్ తో పాటు అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

సాయంత్రం స్నాక్స్: నోటికి కారం తగిలి మనసుకు మజానిచ్చే కచోరీ వెరైటీలు ప్రయత్నించండి

సరాదా సాయంత్రాల్లో స్నాక్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. జనరల్ గా సాయంత్రాల్లో ఏదైనా కారంగా ఉండే ఆహారాలు తినాలని అనుకుంటారు. అలాంటప్పుడు ఈ కచోరీ వెరైటీలు బాగుంటాయి.

బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో మద్దతుదారులు మరో విధ్వంసానికి ప్లాన్ చేయగా.. అది అట్టర్ ప్లాప్ అయ్యింది. బోల్సొనారోను తిరిగి అధ్యక్షుడిని చేసేందుకు మెగా నిరసనలో భారీగా పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా ఆందోళనకారులు పిలుపునిచ్చారు.

శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో భారత్ రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ భారత్ బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక 215 పరుగలకు అలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లు ఫెర్నాండ్ (50), మెండిస్ (32) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్ మెన్స్ విఫలం కావడంతో శ్రీలంక తక్కువ స్కోర్ కే పరిమితమైంది.

నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న మొట్టమొదటి ఎక్సోప్లానెట్‌

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) మరో మైలు రాయిని చేరింది. మొదటిసారిగా, ఎక్సోప్లానెట్ ఉనికిని నిర్ధారించడంలో పరిశోధలకు సహాయపడింది. LHS 475 b గా పిలుస్తున్న ఈ గ్రహాంతర గ్రహం, భూమికి సమానమైన పరిమాణంలో ఉంది. ఆక్టాన్స్ నక్షత్రరాశిలో భూమికి 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

స్పానిష్ సూపర్ కప్ ఫైనల్‌కు రియల్ మాడ్రిడ్

స్పానిష్ సూపర్ కప్ ఫైనల్‌కు రియల్ మాడ్రిడ్ చేరుకొని సత్తా చాటింది. వాలెన్సియాను 4-3తో ఓడించడంతో మ్యాచ్ 1-1తో ముగిసింది. అదనపు సమయం తర్వాత మ్యాచ్ 1-1తో టైగా ఉండడంతో కరీమ్ బెంజెమా 39వ నిమిషంలో పెనాల్టీని శామ్యూల్ లినో రద్దు చేశాడు.

అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలవైకుంఠపురములో సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షెహజాదా పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది ఈ సినిమా.

మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV

మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త కూపే SUV ఫ్రాంక్స్‌ను విడుదల చేసింది. ఇందులో బాలెనో RS మోడల్‌లో చివరిగా కనిపించిన అత్యంత ప్రశంసలు పొందిన 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా రకాల్లో అందుబాటులో ఉంది.

సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది.

జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి

రిలయన్స్ జియో తన 5G సేవలను ఉత్తరాఖండ్‌కు అందుబాటులోకి తెచ్చింది. అర్హత ఉన్న వినియోగదారులు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడటంతో పాటు ఉచితంగా 1Gbps వేగంతో అపరిమిత డేటాను పొందుతారు.

జబర్దస్త్: పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి కిర్రాక్ ఆర్పీ సాయం

జబర్దస్త్ లో కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కిర్రాక్ ఆర్పీ, ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్ లోని కర్రీ పాయింట్ ఓపెన్ చేసారు.

వన్డేలోకి అరంగ్రేటం చేసిన శ్రీలంక ఆటగాడు ఫెర్నాండో

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ సువానీడు ఫెర్నాండో తన తొలి అంతర్జాతీయ క్యాప్‌ను అందుకున్నారు. కుడిచేతి వాటం కలిగిన ఈ ఓపెనర్ తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక వెన్నుముక గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఫెర్నాండో రెండో వన్డేలో ఎంపికయ్యాడు.

ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్

మహబూబాబాద్‌ జిల్లా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు భారీగా నిధులను ప్రకటించారు. జిల్లాలోని పలు తాండాలను పంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు.

ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం

ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఆదాయాన్ని పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఆదాయాన్ని సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో యూజర్ నేమ్స్ ను విక్రయించాలని ఆలోచిస్తుంది.

రంజీ ట్రోఫీలో దుమ్ములేపిన పృథ్వీషాను జాతీయ జట్టులోకి తీసుకోవాలి

రంజీట్రోఫిలో ముంబై తరుపున పృథ్వీ షా 379 పరుగులు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టాడు. పృథ్వీషా బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్నా జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు.

సంక్రాంతి పండగ: మొదటి రోజు భోగి పండుగను జరుపుకునే విధానాలు

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. తెలుగు వారందరూ పండగను ఘనంగా చేసుకోవడానికి సిద్ధమైపోయారు. జనవరి 15వ తేదీన జరుపుకోబోతున్న ఈ పండగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది

హ్యుందాయ్ తన ఎంట్రీ-లెవల్ వాహనం గ్రాండ్ i10 NIOS 2023 వెర్షన్ లాంచ్ చేసింది. ప్రస్తుతం బుకింగ్స్ తెరిచారు. అప్‌డేట్ చేసిన ఈ మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్‌కి పోటీగా ఉంటుంది.

ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు

దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.

తాలిబన్ల ఎఫెక్టుతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా

యూఏఈలో మార్చిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ నుంచి ఆస్ట్రేలియా తప్పుకుంది. బాలికలు, మహిళల విద్య, ఉపాధిపై తాలిబన్ల ఆంక్షల నేపథ్యంలో సిరీస్ నుంచి వైదొలిగిన ఆసీస్ జట్టు స్పష్టం చేసింది.

విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు

ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఒక నాన్ బెయిలబుల్ నేరం కూడా ఉందని కేసును విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ వెల్లడించారు.

అంపైర్‌ని కొట్టిన పాక్ క్రికెటర్..!

కరాచీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాడ్ చేతిలో టెస్టు సిరీస్ ను కూడా పాకిస్తాన్ కోల్పోయింది.

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చుండ్రును పోగొట్టే షాంపూలు

చలికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చుండ్రు, దురద, వెంట్రుకలు పొడిబారిపోవడం మొదలగు సమస్యలు ఈ కాలంలో వస్తాయి.

జనవరి 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఉచిత Fire MAXని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్.. రిపోర్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంపై నవోమి ఒసాకా క్లారిటీ

జపాన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ నవోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 2019, 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నవోమి ఒసాకా నిలిచింది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్ని ప్రారంభం కానున్న నేథప్యంలో ఓసాకా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై నిర్వాహకులను షాక్ గురి చేసింది.

వీరసింహారెడ్డి రివ్యూ: బాలయ్య అభిమానులకు పండగే

బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేసింది. దాంతో టాక్ బయటకు వచ్చేసింది. మరిఈ సినిమా ఎలా ఉందీ, కథేంటి? ఎలా తీశారు? మొత్తం వివరాలు తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో 2023లో EV9తో పాటు ఇతర కార్లని ప్రదర్శించిన కియా సంస్థ

ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశంలో వివిధ మోడళ్లను కియా మోటార్స్ ప్రదర్శించింది. బ్రాండ్ EV9 కాన్సెప్ట్, KA4 (కార్నివాల్)తో పాటుగా భారతదేశంలో ఇప్పటికే ఉన్న EV6, సెల్టోస్, సోనెట్ వంటి కొన్ని కార్లను విడుదల చేసింది. కియా మోటార్స్ తన సెల్టోస్ SUV 2019లో 44,000 కంటే ఎక్కువ అమ్మకాలతో భారతీయ మార్కెట్లో ప్రభంజనం సృష్టించింది.

నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ

నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దని ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది.

ఆస్ట్రేలియాలో మీడియా హక్కుల వేలం ప్రారంభం

గతేడాది నిలిచిపోయిన మీడియా హక్కుల వేలాన్ని ఆస్ట్రేలియాలో ఐసీసీ పున:ప్రారంభించనుంది. 2022 సెప్టెంబర్‌లో టెండర్ జారీ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను నిలిపివేశారు.

జాతీయ యువజన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర తెలుసుకోండి

ప్రతీ సంవత్సరం జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామి వివేకానంద పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు.

వీరసింహారెడ్డి: అమెరికాలో హాఫ్ మిలియన్ దాటేసిన కలెక్షన్లు

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఈరోజు విడుదలైంది. అమెరికాలో కాస్త ముందే థియేటర్లలోకి చేరిపోయింది. దాంతో అక్కడి నుండి సినిమా టాక్ మెల్లిమెల్లిగా బయటకు వస్తోంది.

న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచిన నవాజ్, నసీమ్

కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో పాక్ బౌలర్లు కివిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. న్యూజిలాండ్ (49.5) ఓవర్లకు 262 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. స్పిన్నర్లు మహ్మద్ నవాజ్, పేసర్ నసీమ్ షా ఇద్దరు కలిపి ఏడు వికెట్లు తీయడంతో కివీస్ బ్యాటింగ్ కుప్పకూలింది. షా మూడు కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA)చే నిర్వహించబడుతున్న హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ C/2022 E3 (ZTF) అనే తోకచుక్క చిత్రాన్ని బంధించింది. 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క ప్రత్యక్షం అయింది. ఇది ప్రస్తుతం అంతర్గత సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది. ఫిబ్రవరి 1 న 42 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి దగ్గరగా వస్తుంది.

బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి

బూడిద గుమ్మడికాయను ఇంటికి వేలాడదీస్తే దిష్టిని పోగొడుందని నమ్ముతారు. కానీ దాన్ని ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఎక్కువ మందికి తెలియదు.

హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో 41వ హాఫ్ సెంచరీని నమోదు చేశారు.

ప్రధాని నరేంద్ర‌‌మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. జనవరి 19న ప్రధాని పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హైదరాబాద్ రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

11 Jan 2023

మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది.

సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా

ఖగోళ శాస్త్రవేత్తలు, నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) సహాయంతో, TOI 700 e అనే ఒక ఎక్సోప్లానెట్‌ను కనుగొన్నారు, ఇది భూమికి 95% పరిమాణం ఉండడమే కాదు భూగ్రహం లాగే రాతిలాగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎక్సోప్లానెట్ అది తిరిగే నక్షత్రం (TOI 700) నివాసయోగ్యమైన జోన్‌లో నీటిని నిలుపుకోగలిగే దూరంలో ఉంది.

ఆహారం: గుండెకు మేలు చేసే బీట్ రూట్ గురించి తెలుసుకోండి

బీట్ రూట్ ని పెద్దగా పట్టించుకోని వారు దానివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి ఇప్పుడే తెలుసుకోండి. బీట్ రూట్ లో ఫోలేట్ అనే పోషకం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు

అఫ్గానిస్థాన్‌లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను శాశ్వతంగా నిషేధించలేదని చెప్పింది. తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది.

శ్రీలంక రెండో వన్డేలో పుంజుకునేనా..?

శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఎలాగైనా రెండో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన శ్రీలంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.

సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే

ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ భారతీయులను ఆకట్టుకున్నాయి. ఆర్ఆర్ఆర్ నుండి రెండు నామినేషన్లు ఉండడం దీనికి కారణం.

ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం IONIQ 5 ను భారతీయ మార్కెట్ కోసం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో ఈ బ్రాండ్ జనవరి 13నుండి 18 వరకు సాధారణ ప్రజలకు కోసం ప్రదర్శిస్తోంది. దీనికి ప్రత్యేకమైన డిజైన్ తో పాటు ఫీచర్-రిచ్ క్యాబిన్‌ ఉంది.

పృథ్వీషా ఆల్ టైం రికార్డు

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఆల్ టైం రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరుపున బరిలోకి దిగన పృథ్వీషా (383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్ లతో 379) పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ ఇన్నింగ్స్‌లో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు.

ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్

ముంబైకి చెందిన లిగర్ మొబిలిటీ తన స్కూటర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. వాటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి.

తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి తెలంగాణ మొట్టమొదటి మహిళా సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

వీరసింహారెడ్డి: హైదరాబాద్ లో బాలయ్య సినిమాకు వీరలెవెల్లో బుకింగ్స్, రికార్డుల మోత

ఒకరోజు తెల్లవారితే వీరసింహారెడ్డి సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. బాలయ్య నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!

తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.

నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన

గౌహతి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన సెంచరీని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 73 సెంచరీలు చేసిన పరుగుల వీరుడు..ఈ క్రమంలో పలు రికార్డులను అధిగమించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత తన సెంచరీపై కోహ్లీ స్పందించాడు.

ఫిబ్రవరి 1 నుండి యూట్యూబ్ Shorts క్రియేటర్లకు కూడా ఆదాయం

గత సెప్టెంబరులో, Shorts కోసం మానిటైజేషన్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని YouTube హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి, యూట్యూబ్ Shorts క్రియేటర్లు తమ కంటెంట్ పై రాబడిని పొందగలరు. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) అప్డేట్ లో భాగంగా ఈ మార్పును ప్రవేశపెట్టింది యూట్యూబ్.

3-0 తేడాతో మంచెస్టర్ యునైటెడ్ విజయం

కరాబావో కప్ 2022-23, మాంచెస్టర్ యునైటెడ్ క్వార్టర్స్‌లో చార్ల్టన్‌ను అధిగమించింది. 2022-23 కారబావో కప్ లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. చార్ట్లన్ అథ్లెటిక్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్స్ లో మంచెస్టర్ యునైటెడ్ అర్హత సాధించింది.

వాలేరు వీరయ్య: రిలీజ్ కి ముందు క్రేజీ సాంగ్ రిలీజ్, శృతి అందాలు అదరహో

వాల్తేరు వీరయ్య సినిమా నుండి క్రేజీ సాంగ్ బయటకు వచ్చింది. నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాట ఆద్యంతం అద్భుతంగా ఉంది.

తెలంగాణ సీఎస్‌: రామకృష్ణారావు వైపే కేసీఆర్ మొగ్గు!

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంత కుమారిలో ఒకరు సీఎస్‌గా నియామకం అయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో రామకృష్ణారావు ఎంపికకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం.

అమెరికాను వణికిస్తున్న భారీ వర్షాలు.. కాలిఫోర్నియాను వీడుతున్న ప్రజలు

మొన్నటి వరకు మంచుతుపానుతో అల్లాడిపోయిన అమెరికా ప్రజలను ఇప్పుడు భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌తో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో కుండపోత వర్షాలు, బలమైన గాలులతో ప్రజలు వణికిపోతున్నారు.

ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం.. సౌరబ్ గంగూలీ క్లారిటీ

భారత్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి 12 నెలలు పట్టచ్చు. అయితే మెగా ఐపీఎల్ టోర్నికి రిషబ్‌పంత్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.

కేజీఎఫ్ హీరోయిన్ కి తెలుగులో అవకాశం, సీనియర్ హీరో సరసన?

బాహుబలి స్ఫూర్తితో దక్షిణాది నుండి చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యాయి. అలా రిలీజైన వాటిల్లో మొదటగా అందరినీ ఆకర్షించింది మాత్రం కేజీఎఫ్ అని చెప్పవచ్చు.

జనవరి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఉచిత Fire MAXని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో తన Ace EV మినీ ట్రక్కు డెలివరీలను ప్రారంభించింది. ఇది మే 2022లో ఇక్కడ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక బాక్స్ లాగా ఉంటుంది, 600 కిలోల వరకు పేలోడ్‌ను మోయగల తేలికపాటి కంటైనర్‌ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జీకి 154కిమీల వరకు నడుస్తుంది.

ఆస్ట్రేలియా టెస్టు జట్టులో టాడ్ మర్ఫీకి చోటు

వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇండియాతో నాలుగు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆడనున్న ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన టీమ్ ను ప్రకటించింది. ఇందులో స్పిన్నర్లకు అవకాశం కల్పించింది.

సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలే తెచ్చిందే తుమ్మెదా అని పాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరం ముందుగానే వచ్చింది.

హైదరాబాద్ హై'టెక్' పోలీస్: సైబర్ యూనిట్ బలోపేతానికి 'ఏఐ' సపోర్టు

హైదరాబాద్‌లో శాంతిభద్రతలను మరింత మెరుగు పర్చేందుకు నగర పోలీసులు ఈ ఏడాది ప్రత్యేక కార్యచరణతో ముందుకుపోతున్నారు. అధునాత టెక్నాలజీ సాయంతో రాజధానిని హైటెక్ నరగంగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో అన్ని విభాగాల పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ కార్యాచరణను వివరించారు.

దటీజ్ రోహిత్ శర్మ.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్న కెప్టెన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి క్రీడాస్ఫూర్తిని చాటుకొని అందరి మనసులను గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 'మన్కడింగ్ రనౌట్' కు భారత బౌలర్ షమీ ప్రయత్నించగా.. వెంటనే కెప్టెన్ రోహిత్ నిరాకరించాడు. షమీచేత అప్పిల్ ను వెనక్కు తీసుకునేలా చేసి శబాష్ అనిపించుకున్నాడు.

BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించింది. నిషేధం జనవరి 12 వరకు అమలులో ఉంటుంది, కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పొడిగించే అవకాశం ఉంది.

కిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్

రాగులు.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రాగులను తైదలు అని పిలుస్తారు.

భారత ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్

శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేలో ఏ బౌలర్‌కు సాధ్యంకాని రికార్డును ఉమ్రాన్ మాలిక్ క్రియేట్ చేశారు. వన్డేలో అత్యంత వేగవంతమైన భారత్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఏకంగా 156కి.మీ వేగంతో బంతిని విసిరి ఈ ఘనతను సాధించాడు.

జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్‌ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక

భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ మార్కెట్లో పోటీపడుతున్న Realme, Redmi వంటి బ్రాండ్‌లు అనేక రకాల ఆఫర్‌లతో కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన Redmi Note 12కు పోటీగా Realme భారతదేశంలో Realme 10ని ప్రకటించింది.

వారిసు ట్విట్టర్ రివ్యూ: పాజిటివ్ ప్రశంసలతో నిండిపోతున్న సోషల్ మీడియా, కానీ

తమిళ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా వారిసు, సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది. ప్రీమియర్ షోస్ చూసిన వారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

దసున్ శనక సెంచరీ వృథా

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేసింది.

ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ, ప్రపంచ సినిమా పురస్కారాల్లో తన సత్తా చాటుతోంది. ఆల్రెడీ పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం, ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.