LOADING...

05 Jan 2023


బ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం!

బ్రిటన్ రాజకుటుంబంలో జరిగిన మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రిన్స్ హ్యారీ, విలియం మధ్య జరిగిన ఘర్షణనను అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది గార్డియన్' రాసుకొచ్చింది.

తెలుగు సినిమా: ఉస్తాద్ రామ్ తో ధమాకా శ్రీలీల రొమాన్స్ షురూ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. ఐతే ఇస్మార్ట్ విజయం తర్వాత రామ్ ఖాతాలో మరో విజయం చేరలేదు.

డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల

2022 డిసెంబర్ లో 15 శాతం వృద్ధిని నమోదు చేసి భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకులు దాదాపు 129 లక్షలకు చేరుకున్నారు.

మాంచెస్టర్ సిటీతో జియో కీలక ఒప్పందం

మాంచెస్టర్ సిటీ జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ (JIO)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ సేవల బ్రాండ్ క్లబ్ అధికారిక మొబైల్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ భాగస్వామిగా జియో అవతరించనుంది.

ఇంటి గోడలకు ఇంకా రంగు వేస్తున్నారా? రంగు లేకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి

గోడలకు రంగువేయడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇంటిని కళాత్మకంగా చేయడానికి రకరకాల పెయింటింగ్స్ వాడతారు. కానీ ఇప్పుడు అది పాత పద్దతిగా మారిపోయింది.

నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్

శ్రీలకంతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 10 బంతుల్లో 7 పరుగులు చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాకింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ 10 స్థానాలను మెరుగుపరుచుకొని 23 స్థానానికి, దీపక్ హుడా 97వ స్థానానికి చేరుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో హార్ధిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.

షాకింగ్ న్యూస్: దేశంలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు

చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో దేశంలో కూడా దీనిపైనే చర్చ జరిగింది. అయితే తాజాగా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయని తేలింది. ఈ విషయంగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను కనుగొన్నిది అంతర్జాతీయ ప్రయాణికుల్లోనే కావడం గమనార్హం.

మీకు తెలుసా? సౌరశక్తితో పనిచేసే కణాలు వృద్ధాప్యాన్ని వాయిదా వేయగలవు!

సౌరశక్తితో పనిచేసే కణాలు వినియోగం మానవ జీవితకాలాన్ని పొడిగించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చగల మైటోకాండ్రియా జన్యుపరంగా రూపొందించబడింది.

ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు

ప్రపంచ సినిమా అవార్డ్స్ అన్నింటిలో ఆస్కార్ స్థానం ప్రత్యేకం. ఏ దేశ కళాకారులైనా ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని ఆశపడుతుంటారు. ఆస్కార్ కోసమే సినిమాలు చేస్తుంటారు కూడా.

క్వెంటిన్ హాలీస్‌ను ఓడించిన నోవాక్ జొకోవిచ్

అడిలైడ్‌లో క్వెంటిన్ హాలీస్‌ను నోవాక్ జొకోవిచ్ ఓడించి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గురువారం హాలీస్‌ను 7-6(3), 7-6(5)తో పోరాడి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు నోవాక్ జొకోవిచ్.. 57 నిమిషాలు పాటు ఇద్దరు హోరాహోరీగా పోరాడాడు. భీకర ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ అద్భుతమైన షాట్లతో హాలీస్‌ను గెలుపొందాడు.

కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు

కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.

బాలయ్య అఖండ హిందీలో విడుదల

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కరోనా వల్ల థియేటర్లలోకి రావడానికి జనాలు ఇబ్బంది పడుతున్న సమయంలో రిలీజై, వసూళ్ళలో తుఫాను సృష్టించింది.

50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు

హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మారుతీ-సుజుకి NEXA బ్లాక్ ఎడిషన్ మోడల్స్

భారతదేశంలో 40 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి గుర్తుగా, స్వదేశీ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి NEXA సిరీస్ లో ప్రత్యేక బ్లాక్ ఎడిషన్ మోడల్స్ ను విడుదల చేసింది. అన్ని కార్లు ప్రత్యేక 'పెరల్ మిడ్‌నైట్ బ్లాక్' పెయింట్ స్కీమ్‌తో వస్తున్నాయి.

టీ20 సిరీస్‌పై టీమిండియా గురి

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అతి కష్టం మీద మ్యాచ్ ను గెలిచింది. నేడు సాయంత్రం పుణేలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి సిరీస్ సాధించాలని భావిస్తోంది టీమిండియా.

దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు

దిల్లీలోని సుల్తాన్‌పురి ఘటన మరవక ముందే... నోయిడాలో అలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ రోజు రాత్రి నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్ కౌశల్ యాదవ్ బైక్‌ను కారు ఢీకొట్టడంతో పాటు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కౌశల్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆహారం: ఉప్మా రవ్వతో నోరూరించే రెసిపీస్ తయారు చేయండిలా

ఉప్మా అనగానే అబ్బా అని ముఖం చాటేస్తారు. చాలా సులభంగా తయారయ్యే వంటకం కాబట్టి అలా ఫీలవుతారు.

వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

నీటి సరఫరా నిర్వహణపై కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీలను కోరారు. మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో 'వాటర్ విజన్- 2047'ను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.

టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత రికార్డు

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ టెస్టు మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిడ్ హెడ్ హఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. మొత్తం టెస్టులో 12 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. కేవలం 59 బంతుల్లో 70 పరుగులు చేశారు. ఎప్పటిలాగే హెడ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 450 పరుగులను పూర్తి చేసింది.

సబ్-బ్రాండ్ AFEELAని ప్రకటించిన సోనీ హోండా మొబిలిటీ

CES 2023లో టెక్నాలజీ దిగ్గజం సోనీ, జపనీస్ ఆటోమేకర్ హోండా మధ్య జాయింట్ వెంచర్ అయిన AFEELA అనే EV సబ్-బ్రాండ్‌ను ప్రకటించారు.

చర్మ సంరక్షణ: చర్మంపై పులిపిర్లు రావడానికి కారణాలు, వాటిని పోగొట్టే విధానాలు

పులిపిర్లు చర్మంలో ఏ ప్రాంతంలోనైనా ఏర్పడతాయి. ఆడ మగా తేడా లేకుండా ఎవ్వరిలో అయినా ఇవి ఏర్పడతాయి. వీటివల్ల హాని కలగదు కానీ చర్మం మీద ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.

మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు.

Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం బ్లాగ్ పోస్ట్‌లో OpenAI, DALL-E 2 నుండి ఇమేజ్-జెనరేషన్ సాఫ్ట్‌వేర్‌ను Bingకి అనుసంధానించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది.

శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ

ఇంగ్లండ్ యువ క్రికెటర్ శామ్ కర్రన్ ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శామ్ కర్రన్ కు ఎయిర్ లైన్ సంస్థ క్షమాపణలు కోరుతూ ట్విట్ చేసింది. బుధవారం బ్రిటిష్ విమానయాన సంస్థ అయిన వర్జిన్ అట్లాంటిక్ లో ప్రయాణించడానికి శామ్ కర్రన్ అసౌకర్యంగా భావించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా పోస్టు చేశాడు.

ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి

తెలుగు బాక్సఫీసు వద్ద సంక్రాంతి సందడి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటారు.

పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్

పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది.

గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ

టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్‌కి దురదృష్టం వెంటాడుతోంది. మంగళవారం వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూకి గాయమైంది. అతని స్థానంలో ఐపీఎల్‌లో అకట్టుకున్న జితేష్ శర్మ టీ20లో అరంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం బీసీసీఐ ధ్రువీకరించింది.

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023 MG 4ని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్ అయింది.

ఆహా: అన్ స్టాపబుల్ షోలో పవన్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేది ఆరోజే

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో దూకుడు చాలా ఎక్కువగా ఉంది. ఈ షో కారణంగా ఆహా సబ్ స్క్రయిబర్స్ గణనీయంగా పెరుగుతున్నారు.

టీమిండియాలో చోటు దక్కాలంటే యోయో, డెస్కా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే..

టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కొన్ని నెలలుగా చాలా అనుమానాలున్నాయి. గాయాలు కారణంగా బరిలోకి దిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే అందరికీ యోయో పరీక్షలంటే తెలుసు. దీనికి తోడు డెక్సా స్కాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

అమెరికా వాసులు ఇష్టపడే విప్డ్ క్రీమ్ రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకోండి

జనవరి 5వ తేదీన అమెరికాలో జాతీయ విప్డ్ క్రీమ్ డేని జరుపుకుంటారు. విప్డ్ క్రీమ్ అంటే మెత్తటి క్రీమ్ అని అర్థం. భారతదేశ ప్రజలకు అమెరికాతో సంబంధాలు ఎక్కువ కాబట్టి అక్కడి ఆహారాలను రుచి చూడాలనే కోరిక ఉంటుంది.

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది

డెత్ ఓవర్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే హర్షల్ పటేల్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా టీమిండియాకి కీ బౌలర్‌గా మారాడు. స్లో బాల్స్‌తో బ్యాటర్‌ను పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టడం హర్షల్ పటేల్ స్పెషాలిటీ. శ్రీలంకతో జరిగిన టీ20లో రెండు వికెట్లు తీసినప్పటికీ, 41 పరుగులు ఇచ్చాడు.

CES 2023లో సరికొత్త Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ ప్రారంభం

CES 2023లో గేమింగ్ పరిశ్రమ కోసం Govee మొట్టమొదటిసారిగా AI-ఆధారిత లైటింగ్ సొల్యూషన్‌ను పరిచయం చేయబోతుంది. దీనిని Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ అని అంటారు. ఇది ఆన్-స్క్రీన్ గేమింగ్ కంటెంట్ నుండి కీలక విషయాలను విశ్లేషించడానికి, వాటిని సాంకేతికత ఉపయోగించి మళ్ళీ సరికొత్త లైటింగ్ ఎఫెక్ట్స్ తో చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇది 2023లో లాంచ్ అవుతుందని ప్రకటించారు కానీ ధర ఇంకా వెల్లడించలేదు.

560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష

560 శవాలకు చెందిన అవయవాలను అక్రమంగా విక్రయించిన ఘటన ఆమెరికాలోని కొలోరాడోలో వెలుగుచూసింది. ఈ కేసులో ఓ మహిళకు 20ఏళ్లు, ఆమె తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.

అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను.. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరే సమయంలో సోనియాగాంధీ వెంట ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు.

04 Jan 2023


మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా

న్యూయార్క్ నుంచి దిల్లీ ప్రయాణిస్తున్నవిమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా చర్యలు తీసుకుంది. మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై 30 రోజలు పాటు నిషేధం విధించింది. నిషేధం ఉన్నన్ని రోజులు ఎయిర్ ఇండియా విమానంలో అతడు ప్రయాణించడానికి వీలు లేదని ఎయిర్ ఇండియా చెప్పింది.

2022లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల్లో రికార్డ్

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అమ్మకాలు 2022 సంవత్సరంలో భీభత్సంగా పెరిగాయి. కానీ అదే టైమ్ లో 2022 డిసెంబర్ లో మాత్రం తగ్గాయి. 2021 డిసెంబర్ లోని అమ్మకాలతో పోల్చితే 2022లో అమ్మకాలు తగ్గినట్లు కనిపిస్తోంది.

వాట్సప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ అదిరిపోయిందిగా..

వాట్సప్ రోజు రోజుకి సరికొత్తగా రూపాంతరం చెందుతోంది. యూజర్లు ఇష్టాలకు అనుగుణంగా వాటిని సరికొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్కైవ్ ఫీచర్ ని ఉపయోగించకుండా వాట్సప్ చాట్ ను చాలామంది దాచాలనుకుంటున్నారు. అయితే అది సాధ్యమయ్యే పని కాదు

మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో సినిమా.. ప్రభుదేవాకు అవకాశం?

వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు బాక్సాఫీసుకు సంక్రాంతి సంబరం తీసుకువచ్చే పనిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై అభిమానులందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి.

బరువు తగ్గడం: 80-20 రూల్ డైట్ పాటిస్తే వచ్చే లాభాలు

మీరు తినాలనుకున్నది తింటూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చన్న సంగతి మీకు తెలుసా? ఇది ఎవరికైనా చెబితే అసాధ్యం అని అంటారు. కానీ ఇది సాధ్యమే. డైట్ లో 80-20 రూల్ తో ఇది ఈజీగా సాధ్యపడుతుంది.

ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ముంబయి పర్యటనకు వెళ్లారు. గురువారం ఆయన ముంబయిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొంటారు. దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగానే యోగి దేశమంతా పర్యటించనున్నారు. జనవరి 5 నుంచి జనవరి 27 వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ముఖ్యమైన నగరాల్లో నిర్వహించే రోడ్ షోల్లో యోగి పాల్గొనున్నారు.

150కిలోమీటర్ల వేగంతో వెన్నులో వణుకు పుట్టించిన ఉమ్రాన్ మాలిక్

భారత్ యువ ఫాస్ట్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ త ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. బ్యాట్స్ మెన్స్ కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. కాశ్మీర్ కు చెందిన ఈ బౌలర్ ప్రస్తుతం భారత్ తరుపున ఫాస్టెస్ట్ బాల్ వేసి రికార్డు బద్దలు కొట్టాడు.

రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్!

దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా.. తమ వినియోగదారులకు 'ట్రూ 5 జీ' సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రిలయన్స్ జియోతో జతకట్టింది. ఈ విషయాన్ని బుధవారం ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి.

రిషబ్ పంత్ కోసం ప్రత్యేక విమానం.. ముంబైకి తరలింపు

రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ కు వెళ్తుండుగా.. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

అందం: 2023లో ఈ హెయిర్ స్టైల్స్ తో మీ జుట్టుకు కొత్త అందం తీసుకురండి

జుట్టును ఎన్ని స్టైల్స్ లో అయినా దాన్ని సెట్ చేసుకోవచ్చు. నిజమే.. హెయిర్ స్టైల్స్ వల్ల పూర్తి లుక్ మారిపోతుంది. ఒక్కో స్టైల్ లో ఒక్కో విధంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం మనమందరం కొత్త సంవత్సరంలో ఉన్నాం.

సూపర్ బౌలింగ్.. అక్షర పటేల్ : సాబా కరీమ్

శ్రీలంకతో జరిగిన టీ20 లో చివరి ఓవర్లో అక్షర్ పటేల్ అధ్బుతంగా బౌలింగ్ చేసి.. భారత్ కు విజయాన్ని అందించాడు. జోరుమీదున్న చమికకు షాట్‌ ఆడే అవకాశం ఇవ్వకుండా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బంతులు వేసి జట్టును గట్టెక్కించాడు.

ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా

చైనాలో కరోనా విరవిహారం చేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి.

సామ్ సాంగ్ మొబైల్: నైట్ విజన్ కెమెరాకు మరిన్ని మెరుగులు.. కొత్త మోడల్ విడుదల

స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ ఫోన్లలోని యాప్ ల మాదిరిగా ఎప్పటికప్పడు అప్డేట్ అవుతూనే ఉండాలి.

4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. టెస్టులో 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

'క్లౌడ్'తో టెక్నాలజీ రంగంలో పెను మార్పులు: సత్య నాదెళ్ల

టెక్నాలజీ రంగంలో 'క్లౌడ్'తో పెను మార్పులు జరగబోతున్నాయని, దీని వినియోగం కూడా భారీగా పెరిగిందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో నాదెళ్ల మాట్లాడారు.

భారీ ఆఫర్లను తిరస్కరించి.. చివరకి మెగా డీల్ పట్టిన రొనాల్డ్

ప్రపంచకప్ నుంచి కన్నీటితో నిష్క్రమించిన సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి క్రేజ్ కొంచె కూడా తగ్గలేదు. ప్రస్తుతం సౌది అరేబియాకు చెందిన అల్-నాసర్ జట్టు క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ చూసి పిచ్చెక్కిపోయింది.

నిర్మాత సురేష్ బాబుపై ప్రశంసల వర్షం.. ట్రాఫిక్ క్లియరెన్స్ వీడియో వైరల్

గొప్పవాళ్ళు కావడానికి పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. నిజానికి చిన్న చిన్న పనులను కూడా బాధ్యాతయుతంగా చేస్తారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో జరిగిన ఒక సంఘటన పై వాక్యాన్ని నిజం చేస్తోంది.

అన్ స్టాపబుల్: బాలయ్య షోలో సందడి చేయనున్న రామ్ చరణ్, కేటీఆర్?

ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నుండి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తోంది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో, జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ చెలరేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇది జరిగింది.. బస్సులో కాదు, ట్రైన్‌లో కాదు. అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఢిల్లీ ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఎయిర్ ఇండియా అధికారులు ధృవీకరించారు.

విజయంతో పీలేకు నివాళి

ఫుట్‌బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ తన ఆట వల్ల ఫుట్‌బాల్ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినవాడు మాత్రం పీలే ఒక్కడే.. మంగళవారం స్పానిష్ కప్ రోడ్రిగ్ ఒక గోల్ చేసి, కాసెరెనోపై 1-0 తేడాతో విజయం సాధించారు. ఈ విజయాన్ని పీలేకు అంకితం చేస్తున్నట్లు రోడ్రిగో ప్రకటించారు.

సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమ్మవారు మూల విరాట్టు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు దుర్గ గుడి ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విచారణకు ఆదేశించారు.

చర్మ సంరక్షణ: మీరు వాడుతున్న సన్ స్క్రీన్ ఎలర్జీ కలుగజేస్తుందని తెలిపే సంకేతాలు

చర్మ సంరక్షణలో సన్ స్క్రీన్ పాత్ర చాలా ఉంటుంది. సూర్యుడి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని పాడుచేయకుండా సన్ స్క్రీన్ లోషన్ కాపాడుతుంది. ఐతే చర్మానికి వాడే ఏ సాధనమైనా అది హాని చేయకుండా చూసుకోవాలి.

హడలెత్తించిన మావి.. భారత్ థ్రిలింగ్ విన్

కొత్త ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20లో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు రాణించారు. డెబ్యూ బౌలర్ శివమ్‌మావి లంక బ్యాటర్లకు చుక్కులు చూపించాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠను రేపింది.

కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజుల‌పాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.