11 Jan 2023
మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది.
సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా
ఖగోళ శాస్త్రవేత్తలు, నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) సహాయంతో, TOI 700 e అనే ఒక ఎక్సోప్లానెట్‌ను కనుగొన్నారు, ఇది భూమికి 95% పరిమాణం ఉండడమే కాదు భూగ్రహం లాగే రాతిలాగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎక్సోప్లానెట్ అది తిరిగే నక్షత్రం (TOI 700) నివాసయోగ్యమైన జోన్‌లో నీటిని నిలుపుకోగలిగే దూరంలో ఉంది.
ఆహారం: గుండెకు మేలు చేసే బీట్ రూట్ గురించి తెలుసుకోండి
బీట్ రూట్ ని పెద్దగా పట్టించుకోని వారు దానివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి ఇప్పుడే తెలుసుకోండి. బీట్ రూట్ లో ఫోలేట్ అనే పోషకం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.
స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు
అఫ్గానిస్థాన్‌లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను శాశ్వతంగా నిషేధించలేదని చెప్పింది. తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది.
శ్రీలంక రెండో వన్డేలో పుంజుకునేనా..?
శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఎలాగైనా రెండో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన శ్రీలంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే
ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ భారతీయులను ఆకట్టుకున్నాయి. ఆర్ఆర్ఆర్ నుండి రెండు నామినేషన్లు ఉండడం దీనికి కారణం.
ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం IONIQ 5 ను భారతీయ మార్కెట్ కోసం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో ఈ బ్రాండ్ జనవరి 13నుండి 18 వరకు సాధారణ ప్రజలకు కోసం ప్రదర్శిస్తోంది. దీనికి ప్రత్యేకమైన డిజైన్ తో పాటు ఫీచర్-రిచ్ క్యాబిన్ ఉంది.
పృథ్వీషా ఆల్ టైం రికార్డు
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఆల్ టైం రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరుపున బరిలోకి దిగన పృథ్వీషా (383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్ లతో 379) పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ ఇన్నింగ్స్‌లో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు.
ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్
ముంబైకి చెందిన లిగర్ మొబిలిటీ తన స్కూటర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. వాటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి.
తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి తెలంగాణ మొట్టమొదటి మహిళా సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
వీరసింహారెడ్డి: హైదరాబాద్ లో బాలయ్య సినిమాకు వీరలెవెల్లో బుకింగ్స్, రికార్డుల మోత
ఒకరోజు తెల్లవారితే వీరసింహారెడ్డి సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. బాలయ్య నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.
నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన
గౌహతి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన సెంచరీని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 73 సెంచరీలు చేసిన పరుగుల వీరుడు..ఈ క్రమంలో పలు రికార్డులను అధిగమించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత తన సెంచరీపై కోహ్లీ స్పందించాడు.
ఫిబ్రవరి 1 నుండి యూట్యూబ్ Shorts క్రియేటర్లకు కూడా ఆదాయం
గత సెప్టెంబరులో, Shorts కోసం మానిటైజేషన్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని YouTube హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి, యూట్యూబ్ Shorts క్రియేటర్లు తమ కంటెంట్ పై రాబడిని పొందగలరు. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) అప్డేట్ లో భాగంగా ఈ మార్పును ప్రవేశపెట్టింది యూట్యూబ్.
3-0 తేడాతో మంచెస్టర్ యునైటెడ్ విజయం
కరాబావో కప్ 2022-23, మాంచెస్టర్ యునైటెడ్ క్వార్టర్స్‌లో చార్ల్టన్‌ను అధిగమించింది. 2022-23 కారబావో కప్ లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. చార్ట్లన్ అథ్లెటిక్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్స్ లో మంచెస్టర్ యునైటెడ్ అర్హత సాధించింది.
వాలేరు వీరయ్య: రిలీజ్ కి ముందు క్రేజీ సాంగ్ రిలీజ్, శృతి అందాలు అదరహో
వాల్తేరు వీరయ్య సినిమా నుండి క్రేజీ సాంగ్ బయటకు వచ్చింది. నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాట ఆద్యంతం అద్భుతంగా ఉంది.
తెలంగాణ సీఎస్: రామకృష్ణారావు వైపే కేసీఆర్ మొగ్గు!
తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంత కుమారిలో ఒకరు సీఎస్‌గా నియామకం అయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో రామకృష్ణారావు ఎంపికకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం.
అమెరికాను వణికిస్తున్న భారీ వర్షాలు.. కాలిఫోర్నియాను వీడుతున్న ప్రజలు
మొన్నటి వరకు మంచుతుపానుతో అల్లాడిపోయిన అమెరికా ప్రజలను ఇప్పుడు భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌తో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో కుండపోత వర్షాలు, బలమైన గాలులతో ప్రజలు వణికిపోతున్నారు.
ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం.. సౌరబ్ గంగూలీ క్లారిటీ
భారత్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి 12 నెలలు పట్టచ్చు. అయితే మెగా ఐపీఎల్ టోర్నికి రిషబ్‌పంత్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.
కేజీఎఫ్ హీరోయిన్ కి తెలుగులో అవకాశం, సీనియర్ హీరో సరసన?
బాహుబలి స్ఫూర్తితో దక్షిణాది నుండి చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యాయి. అలా రిలీజైన వాటిల్లో మొదటగా అందరినీ ఆకర్షించింది మాత్రం కేజీఎఫ్ అని చెప్పవచ్చు.
జనవరి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఉచిత Fire MAXని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో తన Ace EV మినీ ట్రక్కు డెలివరీలను ప్రారంభించింది. ఇది మే 2022లో ఇక్కడ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక బాక్స్ లాగా ఉంటుంది, 600 కిలోల వరకు పేలోడ్‌ను మోయగల తేలికపాటి కంటైనర్ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జీకి 154కిమీల వరకు నడుస్తుంది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టులో టాడ్ మర్ఫీకి చోటు
వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇండియాతో నాలుగు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆడనున్న ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన టీమ్ ను ప్రకటించింది. ఇందులో స్పిన్నర్లకు అవకాశం కల్పించింది.
సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలే తెచ్చిందే తుమ్మెదా అని పాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరం ముందుగానే వచ్చింది.
హైదరాబాద్ హై'టెక్' పోలీస్: సైబర్ యూనిట్ బలోపేతానికి 'ఏఐ' సపోర్టు
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను మరింత మెరుగు పర్చేందుకు నగర పోలీసులు ఈ ఏడాది ప్రత్యేక కార్యచరణతో ముందుకుపోతున్నారు. అధునాత టెక్నాలజీ సాయంతో రాజధానిని హైటెక్ నరగంగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో అన్ని విభాగాల పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ కార్యాచరణను వివరించారు.
దటీజ్ రోహిత్ శర్మ.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్న కెప్టెన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి క్రీడాస్ఫూర్తిని చాటుకొని అందరి మనసులను గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 'మన్కడింగ్ రనౌట్' కు భారత బౌలర్ షమీ ప్రయత్నించగా.. వెంటనే కెప్టెన్ రోహిత్ నిరాకరించాడు. షమీచేత అప్పిల్ ను వెనక్కు తీసుకునేలా చేసి శబాష్ అనిపించుకున్నాడు.
BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించింది. నిషేధం జనవరి 12 వరకు అమలులో ఉంటుంది, కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పొడిగించే అవకాశం ఉంది.
కిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్
రాగులు.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రాగులను తైదలు అని పిలుస్తారు.
భారత ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్
శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేలో ఏ బౌలర్‌కు సాధ్యంకాని రికార్డును ఉమ్రాన్ మాలిక్ క్రియేట్ చేశారు. వన్డేలో అత్యంత వేగవంతమైన భారత్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఏకంగా 156కి.మీ వేగంతో బంతిని విసిరి ఈ ఘనతను సాధించాడు.
జోషిమఠ్ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక
భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ మార్కెట్లో పోటీపడుతున్న Realme, Redmi వంటి బ్రాండ్‌లు అనేక రకాల ఆఫర్‌లతో కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన Redmi Note 12కు పోటీగా Realme భారతదేశంలో Realme 10ని ప్రకటించింది.
వారిసు ట్విట్టర్ రివ్యూ: పాజిటివ్ ప్రశంసలతో నిండిపోతున్న సోషల్ మీడియా, కానీ
తమిళ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా వారిసు, సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది. ప్రీమియర్ షోస్ చూసిన వారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
దసున్ శనక సెంచరీ వృథా
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేసింది.
ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ, ప్రపంచ సినిమా పురస్కారాల్లో తన సత్తా చాటుతోంది. ఆల్రెడీ పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం, ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.
10 Jan 2023
పాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం.. అఫ్గాన్ శరణార్థుల బహిష్కరణ
పాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం వెంటాడుతోంది. దేశానికి తాలిబాన్ ముప్పు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అఫ్గాన్ నుంచి వచ్చిన శరణార్థులపై పాక్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బతుకుదెరువుకోసం అఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన వలసదారులను బహిష్కరిస్తోంది. గత మూడు రోజుల్లో 600 మందికి పైగా అఫ్గాన్ పౌరులను దేశం నుంచి వెళ్లగొట్టింది.
మీ ప్రియమైన వారికి గిఫ్ట్ అందించడంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర
ప్రియమైన వారికి బహుమతులు అందించడం పెద్ద టాస్క్. ఎందుకంటే ఏ బహుమతి ఇవ్వాలనే విషయంలోనే ఎటూ తేల్చుకోలేక రోజులను గడిపేస్తుంటారు.
రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు
గౌహతిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. శుభ్ మన్ గిల్ తో కలిసి మొదటి వికెట్ కు 143 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓపెనర్ గా వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడోస్థానంలో నిలిచాడు.
భారతదేశంలో 2023 BMW 3 సిరీస్ గ్రాన్-లిమౌసిన్ ధర రూ. 58 లక్షలు
జర్మన్ వాహన తయారీ సంస్థ BMW తన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కారు 2023 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 330Li M స్పోర్ట్, 320Ld M స్పోర్ట్. అప్‌డేట్ చేయబడిన డిజైన్, విలాసవంతమైన క్యాబిన్ టెక్-ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్ తో అందుబాటులో ఉంది.
'కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు'.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనేవి కశ్మీర్ ప్రజల హక్కు అన్నారు ఒమర్ అబ్దుల్లా. అయితే వాటిని నిర్వహంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని అడుక్కోరని చెప్పారు. కశ్మీరీ ప్రజలు బిచ్చగాళ్లు కాదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
యాంటీట్రస్ట్ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన గూగుల్
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి వ్యతిరేకంగా గూగుల్ చేస్తున్న పోరాటం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకుంది. గూగుల్ వాచ్‌డాగ్ అవిశ్వాస తీర్పును భారత సుప్రీంకోర్టులో శనివారం సవాలు చేసింది. గత వారం, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) CCI ఆర్డర్‌పై మధ్యంతర స్టే కోసం గూగుల్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.
కళ్యాణం కమనీయం: పెద్ద సినిమాల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంతోష్ శోభన్
పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడటం సహజం. ఈ సంక్రాంతికి అటు వీరసింహారెడ్డి, ఇటు వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో
రిలయన్స్ జియో కొత్త '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ. 61కు అందిస్తుంది. ఈ కొత్త ప్యాక్ 6GB హై-స్పీడ్ 4G డేటాను అందించడంతో పాటు అర్హత ఉన్న వినియోగదారులకు అంటే జియో 5G సేవకు సపోర్ట్ చేసే ఫోన్ తో పాటు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడినట్లయితే అపరిమిత 5G డేటా యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
ప్రపంచ కప్‌లో జార్జియా వేర్‌హామ్‌కు అవకాశం
ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ జట్టులో జార్జియా వేరేహామ్ కు చోటు లభించింది. గతంలో గాయం భారీన పడిన ఈ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే.
డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు
ప్రకృతి ప్రకోపానికి కుంచించుకుపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణంలో కూలిపోయే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రోజు రోజుకు పగుళ్లు వచ్చిన ఇళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది విపత్తుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు
అమెరికాలో అవార్డ్స్ సీజన్ మొదలైనప్పటి నుండి ఆర్ఆర్ఆర్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని, కొన్నింటికి నామినేట్ అయ్యి, మరికొన్నింటి నామినేషన్ కోసం ఎదురుచూస్తుంది ఆర్ఆర్ఆర్.
వివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత
తమ ప్రకటనలు వివక్షతతో ఉన్నాయనే ఆందోళనలను పరిష్కరించే ప్రయత్నంలో, మెటా కొన్ని మార్పులను రూపొందించింది.
వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం
శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక భారత్ తో జరిగిన వన్డేలో శ్రీలంక తరుపున అరంగ్రేటం చేశారు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ తన T20I కెరీర్‌లో మంచి ప్రారంభాన్ని ప్రారంభించాడు.
ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం
సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు, గ్రీన్‌హౌస్ వాయువులను స్థిరమైన ఇంధనాలుగా మార్చగల వ్యవస్థను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు వ్యర్థ ప్రవాహాలు ఏకకాలంలో రెండు రసాయన ఉత్పత్తులుగా మారడం సౌరశక్తితో పనిచేసే రియాక్టర్‌లో సాధించడం ఇదే మొదటిసారి. ఈ పరిశోధన ద్వారా సౌర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. ఈ పెరోవ్‌స్కైట్ పదార్ధం సాంప్రదాయ సిలికాన్ కు మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది చౌకగా తయారవుతుంది.
మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం
బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ వద్ద నిర్మాణలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
హరిహర వీరమల్లు: పవన్ కళ్యాణ్ చేతిలోకి కోహీనూర్ వజ్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో అనేక అంచనాలు ఉన్నాయి.
టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం
టీమిండియా యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రాను ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు బుమ్రా తప్పుకున్నాడు. ఈ పేసర్‌కు మరో మూడు వారాల విశ్రాంతి పొడిగించినట్లు సమాచారం.
మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఈ క్రమంలో ఆ ఆహారం తిన్న 30 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మయూరేశ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు
ప్రెగ్నెన్సీ సమయంలో మీరు సురక్షితంగా ఉండాలి. దానివల్ల మీ కడుపులో ఉన్న బిడ్డ సురక్షితంగా ఉంటుంది. ఐతే కడుపులో శిశువును మోస్తున్న సమయంలో చాలామంది చాలా సలహాలు ఇస్తుంటారు.
19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
సూర్యకుమార్ పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే కష్టమే: పాక్ మాజీ కెప్టెన్
సూర్యకుమార్ యాదవ్ లేటు ఎంట్రీ ఇచ్చినా టీమిండియా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్ మెన్స్ కొనసాగుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి
ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్ళాలని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.
జనవరి 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఉచిత Fire MAXని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఫుట్‌బాల్‌కు ప్రముఖ ప్లేయర్ వీడ్కోలు
వేల్స్ కు చెందిన అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకరైన గారెత్ బేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు
తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సోమేష్‌కుమార్ కేడర్‌ను రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు సోమేష్‌కుమార్ వెళ్లాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా
హోండా తన SUVని మే 2023 నాటికి భారతదేశంలో లాంచ్ పండుగ సీజన్‌లో అమ్మకాలు మొదలుపెట్టే అవకాశముంది. తాజా అప్డేట్ లో , ఈ బ్రాండ్ వాహనం టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది.
పెట్: పెంపుడు కుక్కను దాని తోక ఊపే విధానం ద్వారా అర్థం చేసుకోండి
కుక్కపిల్లల్ని పెంచుకునే వాళ్ళు వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ టైమ్ లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దానికోసం తోక ఊపే విధానాన్ని మీరు గమనించాలి. తోక ఊపే విధానాన్ని బట్టి ఆ కుక్కపిల్ల ఏం ఆలోచిస్తుందో పసిగట్టవచ్చు.
ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ
హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయి జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎక్కువ సార్లు బదిలీ అయిన అధికారిగా అశోక్ ఖేమ్కాకు పేరుంది. తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇది అతనికి 56వ ట్రాన్స్‌ఫర్.
జనవరి 13న హాకీ ప్రపంచ కప్
పురుషుల హాకీ ప్రపంచ కప్ 15వ ఎడిషన్ జనవరి 13-29 వరకు ఇండియాలో జరగనుంది. ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చివరిసారిగా 1975లో భారత్ ట్రోఫిని గెలుచుకున్న విషయం తెలిసిందే.
ధమాకా రైటర్ ని డైరక్టర్ గా మారుస్తున్న నాగార్జున, కోట్లలో పారితోషికం?
గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జునకు సరైన విజయం రాలేదు. బంగార్రాజు తర్వాత ఘోస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నాగార్జున ఏ సినిమా చేస్తున్నాడనేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ నుంచి భారత జట్టులో అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్
విమానాల్లో ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి. న్యూయార్క్- దిల్లీ, దిల్లీ-పాట్నా ఘటనలు మరవకముందే.. మరోసారి ఇలాంటి వార్తే ఆలస్యంగా బయటకు వచ్చింది.
పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం
చైనాలో వెలికితీసిన 120 మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజానికి విచిత్రమైన శరీర నిర్మాణం అంటే డైనోసార్‌ను పోలిన తల, పక్షిని పోలిన శరీరంతో ఉంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు "క్రాటోనావిస్ జుయ్" అనే శిలాజ నమూనాను అధ్యయనం చేశారు. ఈ పుర్రె పక్షులలా కాకుండా టైరన్నోసారస్ రెక్స్ డైనోసార్ ఆకారంలో ఉందని కనుగొన్నారు.
హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొంటున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణిచివేతపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్తాన్‌కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ అజేయంగా 77 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చలికాలంలో రూమ్ హీటర్స్ ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ప్రస్తుతం చలి చాలా ఎక్కువగా ఉంది. మద్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఈ టైమ్ లో రూమ్ హీటర్ ఉన్న వాళ్ళు వెచ్చగా నిద్రపోతారు. అలాంటి వారు రూమ్ హీటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో
ఎయిర్ టెల్, జియో 2022లో తమ 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. మొదట, 5G నెట్‌వర్క్ ఎంపిక చేసిన నగరాలకు మాత్రమే పరిమితం చేసాయి. ప్రస్తుతానికి, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రెండూ సంస్థలు తమ 5G నెట్‌వర్క్ కవరేజీని విస్తరిస్తున్నాయి.
12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత
కోల్‌కతాలోని రాజర్‌హట్‌లోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగిన జీ20మొదటి 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం 12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పారు. జీడీపీని అనేక రేట్లను పెంచినట్లు వెల్లడించారు.