17 Jan 2023
2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ.. జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు జేపీ నడ్డానే బీజేపీ చీఫ్‌గా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
X7 SUV 2023వెర్షన్ ను 1.2కోట్లకు లాంచ్ చేసిన BMW సంస్థ
జర్మన్ వాహన తయారీ సంస్థ BMW X7 SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది xDrive40i M Sport, xDrive40d M Sport వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కంపెనీ యొక్క కొత్త డిజైన్ తో పాటు సరికొత్త టెక్నాలజీతో ఉన్న ట్వీక్డ్ క్యాబిన్ తో వస్తుంది. రెండూ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.
రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో యూఏఈ రాజకుటుంబ సభ్యుడిగా నటిస్తూ మూడు నెలలకు పైగా అక్కడే ఉండి.. ఏకంగా రూ.23 లక్షలు బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు ఓ యువకుడు. అతడిని మహమ్మద్ షరీఫ్ వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. ఆచూకీకోసం వెతుకున్నారు.
ఐర్లాండ్‌తో సిరీస్‌పై కన్నేసిన జింబాబ్వే
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి ఐర్లాండ్, జింబాబ్వే మధ్య ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌కు అతిథ్యమివ్వడానికి జింబాబ్వే సిద్ధమైంది. ఇప్పటికే టీ 20 లీగ్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న జింబాబ్వే జట్టు ఆత్మ విశ్వాసంలో ఉంది. ఎలాగైనా ఐర్లాండ్ పై నెగ్గి ఈ సిరీస్‌ను సాధించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఐర్లాండ్ ఈ సిరీస్‌ను నెగ్గి సత్తా చాటాలని భావిస్తోంది.
ఫలితం రాకముందే వరస్ట్ వైఫల్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈ జబ్బు నుండి బయటపడే మార్గాలివే
ఏదైనా పనిచేసినపుడో లేదా చేయాలనుకున్నప్పుడో ఆ పనివల్ల జరిగే మంచితో పాటు చెడు కూడా ఆలోచించడం మంచిదే.
ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన గూగుల్
ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ మాదిరిగానే బ్లూటూత్ ట్రాకర్‌పై గూగుల్ పనిచేస్తోందని టెక్నాలజీ జర్నలిస్ట్ మిషాల్ రెహమాన్ పేర్కొన్నారు. డెవలపర్ ఈ ప్రోడక్ట్ కి "Grogu" అనే పేరు పెట్టారు.
రోనాల్డ్ కంటే విరాట్ తక్కువేం కాదు : పాక్ మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎన్నో తిరుగులేని రికార్డులను సాధించాడు. ప్రస్తుతం ఈ తరంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ గా టాప్ లో ఉన్నాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ మళ్లీ రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది.
హోరాహోరీ పోరులో మాటియో బెరెట్టినిపై ఆండ్రీ ముర్రే విజయం
మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, ఆండీ ముర్రే తొలి రౌండ్‌ను అతి కష్టం మీద అధిగమించాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభ రౌండ్‌లో (13వ సీడ్) మాటియో బెరెట్టినిని ఓడించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-5) తేడాతో ఓడించి సత్తా చాటాడు. దాదాపు మ్యాచ్ 4 గంటల 49 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగింది.
ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి
ఐబీఎస్ అనేది ప్రేగుల్లో ఏర్పడే రుగ్మత. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి, నీళ్ళ విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య అంత తొందరగా తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
కంటెంట్ క్రియేటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai
కంటెంట్ క్రియేటర్లు కంటెంట్‌ను ఆకర్షణీయంగా చేయడానికి సంగీతంపై ఎక్కువగా ఆధారపడతారు. కానీ అటువంటి సంగీతానికి కాపీరైట్ సమస్యలను ఎదుర్కుంటున్నారు. Beatoven.ai, భారతదేశంలో మొట్టమొదటి AI-సపోర్ట్ చేసే మ్యూజిక్ ను అందిస్తుంది.
భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీమిండియాకి భారీ షాక్, కీలక ఆటగాడు దూరం
టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ ఎదురైంది. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్‌కు కీలక ఆటగాడు దూరమయ్యాడు. వెన్నుముక గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆ స్థానాన్ని రజత్ పాటిదార్‌తో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
చర్మం నుండి జుట్టు వరకు ఆముదం నూనె చేసే అద్భుతాలు
ఆముదం నూనెని చాలామంది మర్చిపోయారు. కానీ దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. చర్మం సమస్యలు, జుట్టు సమస్యలను దూరం చేసే ఆముదం నూనె గురించి ఈరోజు తెలుసుకుందాం.
పాక్ మహిళను రెండోపెళ్లి చేసుకున్న దావూద్, సంచలన విషయాలను వెల్లడించిన 'డాన్' మేనల్లుడు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. మొదటి భార్య మైజాబిన్‌కు విడాకులు ఇవ్వకుండానే.. పాక్ పఠాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.
భారత్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత
భారత్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత సాధించాడు. 2023 రంజీ ట్రోఫీలో రాజ్ కోట్‌లో సౌరాష్ట్ర తరుపున 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఆడాడు. ఇటీవల ఢిల్లీపై సౌరాష్ట్ర విజయం సాధించడంతో ఈ లెఫ్టార్మ్ సీమర్ హ్యాట్రిక్ సాధించాడు.
నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం
నాసా సైక్ మిషన్ అక్టోబర్‌లో ప్రారంభించటానికి షెడ్యూల్ అయింది. అంగారక గ్రహం,బృహస్పతి మధ్య ఉన్న ప్రధాన గ్రహశకలం బెల్ట్‌లో ఉన్న సైక్ 16 అనే లోహ-సంపన్నమైన గ్రహశకలం గురించి తెలుసుకోవడానికి స్పేస్ ప్రోబ్ నిర్మించబడింది. ఈ మిషన్ వాస్తవానికి ఆగస్టు-అక్టోబర్ 2022 మధ్య ప్రారంభించాలని ప్రణాళిక వేశారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్ ఫ్లైట్ సాఫ్ట్‌వేర్ తో పాటు టెస్టింగ్ పరికరాలు సమయానికి డెలివరీ కాలేదు అందుకే ఆలస్యమైంది.
రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు
తెలంగాణలో మరో భారీ కార్యక్రమానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొననున్నారు.
భారత్‌తో వన్డే సిరీస్‌కు సై అంటున్న న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్ సాధించిన టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది. భారత్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా పైచేయిగా నిలిచింది.
నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం
నేపాల్ విమాన ప్రమాదం నేపథ్యంలో మృతదేహాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో రెండు బ్లాక్ బాక్స్‌లను సిబ్బంది గుర్తించారు. వాటిని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రమాదానికి గల కారణాలను గుర్తించడంలో ఉపయోగపడుతాయి.
XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహానాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. సరికొత్త కార్ టెక్నాలజీతో విశాలమైన క్యాబిన్ తో వస్తుంది. మహీంద్రా XUV400 గురించి గత సంవత్సరం సెప్టెంబరులో ప్రకటించారు. ఈ బ్రాండ్ కు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV. మార్కెట్‌లో, MG ZS EV, టాటా నెక్సాన్ EV వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది.
మీకు వడ అంటే ఇష్టమా? ఈ వెరైటీలను ఒకసారి ట్రై చేయండి
పొద్దున్న లేవగానే ఏ టిఫిన్ తిందామని వెతుక్కునే వారికి వడ ఊరిస్తూ ఉంటుంది. చట్నీ, సాంబర్ తో వడ తింటే వచ్చే ఆనందమే వేరు. ఈ వడల్లో చాలా రకాలుంటాయి.
ఆరు దశబ్దాల తర్వాత మొదటిసారి తగ్గిన చైనా జనాభా
1961 తర్వాత అంటే.. గత ఆరు దశాబ్దాల కాలంలో మొదటిసారి చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. 2021తో పోలిస్తే.. 2022లో జనాభా తగ్గినట్లు ఆ దేశ గణాంకాల విభాగం పేర్కొంది. చైనాలో ప్రస్తుతం 141.75కోట్ల జనాభా ఉన్నట్లు ప్రకటించింది.
పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సహచర క్రికెటర్ తో సెక్స్ చాట్ చేసినట్లు వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాబర్ అజామ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు.
జనవరి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఈ ఏడాది ఐపీఎల్ టీ20 టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. అతను గతంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించారు.
మార్టిన్ లూథర్ కింగ్ డే: ఇరువర్గాలు పరస్పరం కాల్పులు, 8మందికి గాయాలు
అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ పియర్స్‌లో 'మార్టిన్ లూథర్ కింగ్ డే' ఈవెంట్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరు వర్గాలు మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మహేష్ బాబు 28: ఫైట్ మాస్టర్లను మార్చేసి షూటింగ్ మొదలుపెడుతున్న త్రివిక్రమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది.
ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ పై ఆసక్తికర అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అధికారికంగా ప్రకటనలు వచ్చినవి కాకుండా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందని తాజాగా వార్తలు వచ్చాయి.
రెండో రౌండ్‌కు చేరుకున్న రష్యా స్టార్ మెద్వెదేవ్
ఆస్ట్రేలియా ఓపెన్లో సోమవారం జరిగిన ఓపెనింగ్ రౌండ్లో రష్యా స్టార్ డేనియల్ మెద్వెదేవ్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మార్కోస్ గిరోన్‌పై మెద్వెదేవ్ పోటిపడి గెలిచాడు. మెల్‌బోర్న్‌లో రెండో రౌండ్‌కు వెళ్లేందుకు 6-0, 6-1, 6-2 తేడాతో గెలుపొంది సత్తా చాటాడు.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) గుర్తించింది. ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఐరాస చేర్చింది.
ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆపిల్ సంస్థ
ఎట్టకేలకు ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్యను ఆపిల్ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ ఆన్ చేసినప్పుడు స్క్రీన్‌పై సమాంతర రేఖల సమస్య ఎదుర్కుంటున్న వినియోగదారులకు ఇది శుభవార్తే.
కుల్దీప్, చాహల్ ఎంపికపై కసరత్తు..!
ప్రస్తుతం టీమిండియాలో స్పిన్ కోటా బౌలర్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో భారత్ 3-0 తో విజయం సాధించడంతో ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడు. భారత్ మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు.
ఓమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5: అమెరికాను భయపెడుతున్న కరోనా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు
కరోనా కథ కంచికి వెళ్ళిందనుకునే లోపే కళ్ళముందు కనిపించి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా దాదాపు 38దేశాల్లో కొత్త రూపమైన XBB.1.5 విలయ తాండవం చేస్తోంది.
స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.
వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు
ఒక్కోసారి సినిమా విజయానికి దానికి వచ్చిన రివ్యూలకు పెద్దగా సంబంధం ఉండదు. చాలా సినిమాలకు రివ్యూ సరిగ్గా రాకపోయినా జనాలు మాత్రం వాటిని గుండెల్లో పెట్టుకున్నారు.
16 Jan 2023
Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద
దేశంలోని ఆర్థిక అసమానతలపై అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. 40శాతం సంపద కేవలం 1% ధనవంతుల చేతిలోనే ఉన్నట్లు పేర్కొంది.
సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు
న్యాయమూర్తులను నియమించే ప్రక్రియకు సంబంధించి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఎయిర్‌టెల్ 5G ప్లస్ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం
భారతి ఎయిర్‌టెల్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ఐదు ప్రధాన నగరాల్లో 5G ప్లస్‌ను ప్రారంభించింది. ఈ కవరేజీని వినియోగదారుల నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ 5G కనెక్టివిటీ సేవను అందిస్తుంది ఎయిర్ టెల్. ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే వ్యక్తులు 5G ప్లస్‌లో 20-30 రెట్లు వేగాన్నివినియోగదారులు చూస్తారు.
విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్
శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు
100 మంది ఉద్యోగులను తొలగించిన ఒక నెల తర్వాత, స్వదేశీ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇప్పుడు 20% మంది ఉద్యోగులను తొలగించింది. ఈ స్టార్టప్ తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.
మంచుతో నిండిన ఎన్సెలాడస్ గ్రహం చిత్రాన్ని విడుదల చేసిన నాసా
నాసా శని గ్రహ ఆరవ అతిపెద్ద చంద్రుడు ఎన్సెలాడస్ అద్భుతమైన చిత్రాన్ని పంచుకుంది. కాస్సిని అంతరిక్ష నౌక ద్వారా ఈ చిత్రం తీశారు. చంద్రుని నీడ వలన గ్రహం పూర్తిగా కనిపించదు. ఇటీవల, శాస్త్రవేత్తలు కక్ష్యలో ఉన్న స్పేస్ ప్రోబ్‌ను ఉపయోగించి మంచుతో నిండిన ఈ చంద్రునిపై జీవాన్ని పరిశోధించే ఆలోచనతో ఉన్నారు.
ఆహారానికి మరింత రుచిని అందించే జామ్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి
చిప్స్, బ్రెడ్స్, కాల్చిన చికెన్, చికెన్ 65, మటన్ ఫ్రై లాంటి ఆహార పదార్థాల అంచుకు జామ్ ఉంటే వాటి రుచి మరింత పెరుగుతుంది.
ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు
నోటిఫికేషన్‌ల నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పేరెంట్ సంస్థ మరో బ్లాక్ షార్ట్‌కట్‌పై పని చేస్తోంది. అయితే అది చాట్ లిస్ట్ నుండి యాక్సెస్ చేయాలి. రెండు ఫీచర్‌లు ప్రస్తుతం డెవలప్‌మెంట్, టెస్టింగ్‌లో ఉన్నాయి. రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ
కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రకటన చేశారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన ఆస్థులకు వారసుడిగా కుమారుడు రుచిర్ మోదీని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది చెప్పారు.
ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూసిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్
ఆర్ఆర్ఆర్ సినిమాకు అందుతున్న ప్రశంసలు ఇప్పట్లో ఆగేలా లేవు. ప్రపంచ సినిమా అభిమానులు అందరూ ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
షఫాలి వర్మ సూపర్ బ్యాటింగ్
ఐసీపీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా మహిళా కెప్టెన్ షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో 34 బంతుల్లో 78 పరుగులు చేసి సంచలనం సృష్టించింది.
మద్యాహ్నం నిద్ర మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తోందా? ఈ పనులు చేసి చూడండి
కొందరికి మద్యాహ్నం అన్నం తినగానే నిద్రొచ్చేస్తుంటుంది. ఇంకొందరికి అలసటగా అనిపిస్తుంటుంది. దానివల్ల మీ పనులు మీరు సరిగ్గా చేసుకోలేకపోతారు. అందుకే దాన్నుండి బయటపడే మార్గాలు తెలుసుకుందాం.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్
రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములు కావాలని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు కల్పించాలనుకున్నా పూర్తి సహకారం అందిస్తామని హామీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు.
పురుషుల సింగల్స్‌లో సత్తా చాటిన నాదల్
22సార్లు గ్రాండ్ స్లామ్ విజేత రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 పురుషుల సింగల్స్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. తొలి రౌండ్‌లో అరంగ్రేటం చేసిన జాక్ డ్రేవర్‌ను ఓడించారు. అయితే జాక్ డ్రేపర్‌తో జరిగిన ఫిట్ నెస్ పోరులో 7-5, 2-6, 6-4తో తిరుగులేని విజయాన్ని అందించాడు. దీంతో నాదల్ రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.
అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత
అమెజాన్ మరోమారు ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఈ నెలలో భారతదేశంలోని సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి ఉద్యోగి తెలిపారు.
అమెరికాలో వీరసింహారెడ్డిని దాటేసిన వాల్తేరు వీరయ్య
సంక్రాంతి సంబరంగా వచ్చిన రెండు తెలుగు సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇటు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, అటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
మోటివేషన్: జీవితంలో రిస్క్ తీసుకోలేక జీవితాన్ని ఆనందించలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి
బంగారు సింహాసనంలో కూర్చున్నా, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోలేం. బోర్ కొట్టేస్తుంది. జీవితం కూడా అంతే. ఒకే పని చేసుకుంటూ చాలు కదా అని ఆలోచిస్తే అక్కడికే జీవితం ఆగిపోతుంది.
ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు
ఉమెన్స్ ఐపీఎల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి జరగనున్న ఈ లీగ్ హక్కులు ఏకంగా రూ.951 కోట్లకు అమ్ముపోయామంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
ఎనిమిదో నిజాం ముకరం జా టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 89 ఏళ్ల ముకరం జా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు కొడుకులు ఉన్నా.. ఆయన వారసుడిగా మనవడు అయిన ముకరం జానే ప్రకటించారు. దీంతో ఎనిమిదో నిజాంగా ముకరం జా గుర్తింపు పొందారు.
న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..!
శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్ లను భారత్ కైవసం చేసుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ పై భారత్ కన్ను పడింది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగంలో రాణిస్తున్న టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగే పోరుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది.
నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే!
నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల్లో ఒకరు ఫేస్‌బుక్ లైవ్‌లో ఫ్లైట్ గ్లాస్ నుంచి అందాలను చూపించారు. అయితే ఆ లైవ్ ప్రారంభమైన సెకన్లకే విమానం కుప్పకూలి.. అందులో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలు ఫేస్ బుక్ లైవ్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో తీసిన వ్యక్తిని యూపీకి చెందిన జైస్వాల్‌గా గుర్తించారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న కిర్గియోస్
నిక్ కిర్గయోస్ ఆస్రేలియా ఓపెన్ నుండి తప్పుకున్నాడు. గాయం కారణంగా తన సొంత గ్రౌండ్ లో స్లామ్ ఆడకపోవడం చాలా దారుణమైన విషయమని కిర్గియోస్ చెప్పారు. టైటిల్ గెలవడానికి అవకాశంగా భావించిన ఈ ఆస్ట్రేలియన్ చీలిమండ సమస్య కారణంగా మొత్తం టోర్నికి దూరమయ్యాడు.
సముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు
సముద్రం పక్కన కూర్చుని ఎగసిపడే అలలను చూస్తూ నచ్చింది తింటూ ఎంజాయ్ చేయడం ఈజీనే. కానీ సముద్రం లోపల చుట్టు పక్కల సముద్రజీవులను చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మరో ప్రపంచంలా ఉంటుంది.
ఆటో ఎక్స్‌పో 2023లో ప్రవైగ్ వీర్ EVను లాంచ్ చేసిన ప్రవైగ్ డైనమిక్స్
స్వదేశీ స్టార్టప్ ప్రవైగ్ డైనమిక్స్ ఆటో ఎక్స్‌పో 2023లో వీర్ EVని ప్రదర్శించింది. ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ కారు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కోసం రూపొందించబడింది.
జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రెండు రోజుల పాటు జీ20 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాల్లో 'థింక్-20' అనే థీమ్‌పై చర్చించనున్నారు. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
క్రిస్టల్ ప్యాలెస్‌పై 1-0తేడాతో చెల్సియా విజయం
ప్రీమియర్ లీగ్ 2022-23 లో క్రిస్టల్ ప్యాలెస్ పై చెల్సియా ఘన విజయం సాధించింది. 1-0తేడాతో చెల్సియా అద్భుతంగా రాణించింది. నార్త్ లండన్ డెర్బీలో టోటెన్ హామ్ పై 2-0 తేడాతో ఆర్సెనల్ గెలిచింది. హావర్ట్జ్ చెల్సియాకు 1-0 తేడాతో స్వల్ప విజయాన్ని సాధించాడు
హృతిక్ రోషన్ పై కామెంట్లకు 14ఏళ్ళ తర్వాత రాజమౌళి వివరణ
రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఘనుడు.
జనవరి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పత్రిక పాంచజన్య నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మధ్యతరగితికి చెందిన వ్యక్తినని, వారి ఆర్థిక బాధలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు నిర్మలా సీతారామన్.
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన మహ్మద్ సిరాజ్
హైదరాబాద్ ఫేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత్ బౌలింగ్ అదరగొడుతున్నాడు. తన స్పీడ్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ భారత్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. మొన్న శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లోనూ మెరుగ్గా రాణించాడు.
iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్
వాట్సాప్ iOS వినియోగదారులకు కెమెరా మోడ్ అందించడం కోసం పని చేస్తోంది. ఇది త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే, WABetaInfo ద్వారా, రాబోయే ఫీచర్ ఎలా పని చేస్తుందో కొంత సమాచారం బయటికి వచ్చింది. కెమెరా మోడ్ iOS వినియోగదారులకు వేగంగా 'ఫోటో' నుండి 'వీడియో' మోడ్‌కి మార్చడం సులభమవుతుంది.
రికార్డుల మోత మోగించిన కింగ్ విరాట్ కోహ్లీ
శ్రీలంకతో జరిగిన 50వ వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీని నమోదు చేశాడు. శ్రీలంక జట్టుపై 10 వన్డే సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా కోహ్లీకి ఇది 74 ఇంటర్నేషనల్ సెంచరీ. సచిన్ 100 సెంచరీలతో ఈ జాబితాలో ముందున్నాడు.
డేటింగ్: మీ వర్క్ వల్ల మీ డేటింగ్ లైఫ్ ని మిస్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఆఫీసు పని, ఇంటి పనులు, ఇతర పనులు, ఫ్రెండ్స్ తో పార్టీలు.. వీటన్నింటి మధ్యలో డేటింగ్ అంటే ఊహించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. గజిబిజీ జీవితంలో డేటింగ్ కి సరైన సమయమే లేకుండా పోతుంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు
ఇండోనేషియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తుతం అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించింది.
2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది
2023 హోండా CB500X త్వరలో భారతదేశంలో కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఇదివరకే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెనెల్లీ TRK 502కి పోటీగా వస్తుంది. అయితే రెండింటిలో ఏది మంచిది అనేది తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం?
అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్లు జోరు మీద నడుస్తున్నాయి. గోల్డెన్ గ్లోబ్ అందుకున్న తర్వాత ఆస్కార్ కూడా ఒడిసి పట్టుకుంటుందన్న ధీమా అందరిలోనూ పెరిగిపోయింది.
మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ అతిపెద్ద విజయాన్న నమోదు చేసింది. 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ సెంచరీలు సాధించడంతో భారత్ 390/5 భారీ స్కోరు చేసింది.
నేపాల్ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 72మంది ప్రయాణిస్తున్న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 15మంది విదశీయులు మరణించినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది.