LOADING...

19 Jan 2023


టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్

టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఓడరేవుల నుండి ఇంధనం వరకు వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు మీడియా కంపెనీని కూడా కొనుగోలు చేసారు. కానీ టెలికాం రంగానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.

సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్‌లోని నల్లగుట్ట వద్ద ఉన్న డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పది మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

టాన్సిల్స్ లక్షణాలు, రావడానికి కారణాలు, నిరోధించే మార్గాలు

టాన్సిల్ అనేవి గొంతు వెనక భాగంలో గడ్డల మాదిరిగా ఉంటాయి. లింఫటిక్ కణజాలాల వల్ల ఈ గడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలకు బాక్టీరియా, వైరస్ సోకడ్ం వల్ల అవి ఉబ్బుతాయి.

సీడ్ కాస్పర్ రూడ్ పై జెన్సన్ బ్రూక్స్ బీ విజయం

ఆస్ట్రేలియా ఓపెన్ లో అన్ సీడెడ్ అమెరికన్, జెన్సన్ బ్రూక్ బీ సత్తా చాటింది. రెండో రౌండ్ లో సీడ్ కాస్పర్ రూడ్ ను ఓడించాడు. మూడు గంటల 55 నిమిషాల తర్వాత బ్రూక్స్‌బీ 6-3, 7-5, 6-7(4), 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేశాడు. రూడ్ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని 2-5తో తిరిగి వచ్చినా ఫలితం లేకుండా పోయింది.

విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం

స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో లియో ఈ-స్కూటర్ హై-స్పీడ్ వెర్షన్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 81,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీల వరకు నడుస్తుంది. ఈ నెల నుండి ఆ బ్రాండ్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది.

ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'

ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా స్పందించింది. అపఖ్యాతితో కూడుకున్న కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించబడిన ప్రచారాస్త్రంగా కనపడుతోందని చెప్పింది.

నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి

పాప్ కార్న్ అంటే మీకిష్టం అయితే ఈ రోజు ఇంట్లో తయారు చేసుకోగలిగే పాప్ కార్న్ వెరైటీల గురించి తెలుసుకుందాం.

ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం

ట్విట్టర్ ఆర్థికంగా కష్టాల్లో పడింది. దాని కొత్త సిఈఓ ఎలోన్ మస్క్ కంపెనీ ఆ కష్టాలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అందులో విజయం సాధించలేకపోతున్నారు. ట్విట్టర్ రీలింగ్ ప్రకటన వ్యాపార ప్రభావం ఆ సంస్థ ఆర్ధిక స్థితి మీద పడుతోంది. ఈ సంస్థను మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి 500 మంది ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు పెట్టడం మానేశారు.

రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్

టీమిండియాలో స్థానం కోల్పోయిన మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కర్నాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 208 పరుగులు చేసి సత్తా చాటాడు. అగర్వాల్ మూడో వికెట్‌కు నికిన్ జోస్‌తో కలిసి 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక

తండ్రి వజ్రాల వ్యాపారి, రూ. కోట్లలో ఆస్తి, విసాలవంతమైన జీవితం, ఏది కావాలన్నా క్షణాల్లో తెచిపెట్టే తల్లిదండ్రులు.. వీటన్నింటి త్యజించి, ఎనిమిదేళ్లకే భక్తి మార్గంలో నడవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. అనుకున్న విధంగానే జైన సన్యాసాన్ని స్వీకరించింది. ఈ అసాధారణ ఘటన గుజరాత్‌లో జరిగింది.

ఎనిమిది వారాలు పాటు రాఫెల్ నాదల్ ఆటకు దూరం

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ తప్పుకున్నాడు. అమెరికా ఆటగాడు మెకంజీ మెక్ డోనాల్డ్ రెండోరౌండ్‌లో నాదల్ 4-6, 4-6, 5-7తో పరాజయం పొంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు .

30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్

జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సహకారంతో నడిచిన నాసాకు చెందిన జియోటైల్ మిషన్ ప్రయాణం 30 సంవత్సరాల తర్వాత అధికారికంగా ముగిసింది. డేటాసెట్, భూ-ఆధారిత పరిశీలనల వాటిపై ఎన్నో పరిశోధనలు చేసింది జియోటైల్.

శాకుంతలం ప్రమోషన్స్: మల్లికా మల్లికా పాటకు విశేష స్పందన

సమంత నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా నుండి మల్లికా మల్లికా అనే పేరుతో మొదటి పాట రిలీజ్ అయ్యింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

దిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు, కారు అద్దంలో చేయి ఇరుక్కున్నా ఈడ్చుకెళ్లిన డ్రైవర్

దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్‌ను ఓ డ్రైవర్ వేధించాడు. ఆమె చేయి కారు అద్దంలో ఇరుక్కోగా, అమెను అలాగే కొంతదూరం లాక్కెళ్లాడు. రాత్రి 3గంటల సమయంలో ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ మిలస్ విజయం

AC మిలన్‌పై ఇంటర్ మిలస్ విజయం సాధించింది. AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో సూపర్ కోప్పా ఇటాలియానా ట్రోఫిని ఇంటర్ కైవసం చేసుకుంది.

అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం

హైదరాబాద్‌లో జన్మించిన కాట్రగడ్డ అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా అరుణ చరిత్ర సృష్టించారు.

2023 న్యూమరాలజీ: సంవత్సర సంఖ్య గురించి మీకు తెలుసా? 1-4సంవత్సర సంఖ్య గల వారి జీవితంలో జరిగే విషయాలు

న్యూమరాలజీ.. సంఖ్యాశాస్త్రం. దీనిమీద చాలామందికి నమ్మకం ఉంటుంది. కొంతమందికి ఉండదు. నమ్మని వాళ్ళ గురించి పక్కన పెడితే, న్యూమరలజీ ప్రకారం 2023సంవత్సరంలో మీ జీవితంలో ఏం జరగనుందో డాక్టర్ మధు కోటియా వివరిస్తున్నారు.

సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 బైక్ మార్కెట్లో విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సూపర్ మీటోర్ 650 బైక్‌ను సోమవారం భారతదేశంలో విడుదల చేసింది. ఇది నవంబర్ 2022లో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయింది. క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్, సెలెస్టియల్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

2023 న్యూమరాలజీ: మీ సంవత్సర సంఖ్య 5-9 ఐతే మీ జీవితంలో జరిగే విషయాలు

2023లో మీ సంవత్సర సంఖ్య 5-9మధ్య ఉంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో సంఖ్యాశాస్త్ర నిపుణులు డాక్టర్ మధు కోటియా తెలియజేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో రెండో వన్డేకి టీమిండియా రెడీ

హైదరాబాద్‌లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే అభిమానులకు మంచి కిక్‌ను ఇచ్చింది. ఇటు శుభ్‌మన్ గిల్, అటు బ్రాస్‌వెల్ ఉప్పల్ స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. దీంతో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కివిస్‌పై భారత్ పైచేయి సాధించింది.

'రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే ప్రక్రియ జరుగుతోంది: సుప్రీంకోర్టుకు తెలిపి కేంద్రం

రామసేతుపై కేంద్రం ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. రామసేతును 'జాతీయ స్మారక చిహ్నం'గా ప్రకటించే ప్రక్రియ జరుగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్

హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు. వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డును సృష్టించాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో 208 పరుగులు చేసి అరుదైన ఘనతను కైవసం చేసుకున్నాడు.

జనవరి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెస్‌వెల్ అరుదైన రికార్డు

హైదరాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే భారత్ అభిమానులకు మాజాను ఇచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఒకానొక దశలో టీమిండియాకు న్యూజిలాండ్ బ్యాటర్ మైఖేల్ బ్రెస్‌వేల్ చెమటలు పట్టించాడు. కేవలం 78 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు చేశారు.

సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు

సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ జాతి వివక్షకు గురైంది. అయితే అది ఇప్పుడు కాదు. 2021లో ఈ ఘటన జరిగింది. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఓటీటీ రిలీజ్: అంజలి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఝాన్సీ సీజన్ 2 వచ్చేసింది

హీరోయిన్ అంజలి, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలుగా నటించిన సిరీస్, "ఝాన్సీ" సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ లో ఉంది.

DBS 770 అల్టిమేట్ కార్ లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ స్టన్-మార్టిన్

బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన DBS 770 అల్టిమేట్ కారును లాంచ్ చేసింది. దీని ఉత్పత్తి 499 యూనిట్లకు పరిమితం అయింది. ఈ కారులో వివిధ టెక్నాలజీ ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్‌ ఉంది. ఇది 5.2-లీటర్ V12 ఇంజన్‌తో నడుస్తుంది.

మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు

కోచ్‌ల వేధింపులు తాళలేక 30మంది మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నాకు దిగారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేష్ పొగట్, సాక్షి మాలిక్ లైగింక వేధింపుల ఆరోపణలను చేశారు.

రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా

మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామ శివార్లలోని కొండగట్టులో కారు దగ్ధమై, ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగి చనిపోలేదని రూ. 7కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ మర్డర్ డ్రామాకు తెరలేపాడని పోలీసుల విచారణలో తేలింది.

"గాండీవధారి అర్జున" టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త చిత్రం

మెగా హీరోల్లో తన సినిమాల ద్వారా తనకంటూ భిన్నమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఆయన చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతారు.

బ్రాస్‌వెల్ భయపెట్టినా, భారత్ థ్రిలింగ్ విక్టరీ

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంతో భారత్ 349 పరుగులు చేసింది. ఒకానొక దశలో భారత్ ఓడేలా కనిపించేలా శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన యార్కర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు.

సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం

సౌర జ్వాల ఎక్కడ, ఎప్పుడు మొదలవుతాయో అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. సూర్యుని శిఖ నుండి వచ్చే సంకేతాలు సూర్యునిలో ఏ ప్రాంతాలు సౌర జ్వాలను విడుదల చేయడానికి ఎక్కువ అవకాశం ఉందో గుర్తించడంలో సహాయపడతాయి. ఈ కొత్త అధ్యయనం అంతిమంగా సౌర జ్వాల, అంతరిక్షంలో తుఫానులపై అంచనా వేసే అవకాశమిస్తుంది.

పెంపుడు కుక్కలను అర్థం చేసుకోవాలంటే వాటి నిద్రపోయే పొజిషన్ గురించి తెలుసుకోండి

పెంపుడు కుక్కపిల్లలు నిద్రపోతున్నప్పుడు వాటి పొజిషన్ ఆధారంగా దాని పరిస్థితి ఏంటన్నది అంచనా వేయవచ్చు.

రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది

2023లో భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాభాల్లోకి వెళ్ళేటట్లు కనిపిస్తోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా.

ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి

మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.

బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు

మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరోగా మారిన విజయ్ ఆంటోనీ, బిచ్చగాడు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్ళను సాధించింది.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!

2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 కి సంబంధించి అమెరికా క్రికెట్‌ అధ్యక్షుడు అతుల్‌ రాయ్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఓక్లాండ్, ఫ్లోరిడా, లాస్ ఏంజెల్స్ లోని వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

జెసిండా ఆర్డెర్న్: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన, వచ్చే నెలలో పదవికి రాజీనామా

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ తాను ప్రధాని రేసులో ఉండనని ఈ సందర్భంగా ప్రకటించారు.

18 Jan 2023


కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.

త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్

వాయిస్ సందేశాన్నిస్టేటస్‌గా పోస్ట్ చేసుకునే అవకాశం త్వరలో వాట్సాప్ తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌తో, టెక్స్ట్‌కు బదులుగా వాయిస్ క్లిప్‌లను రికార్డ్ చేసి పోస్ట్ చెయ్యచ్చు. పేరెంట్ సంస్థ మెటా ఆండ్రాయిడ్ ఛానెల్‌లోని కొంతమంది బీటా వినియోగదారులకు ఈ అప్‌డేట్ వెర్షన్ 2.23.2.8ను విడుదల చేసింది.

సిటీకి కొత్తగా వెళ్లారా? ఇంటివైపు మనసు మళ్ళుతోందా? ఈ పనులు చేయండి

చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఊరు వదిలి సిటీకి వెళ్ళడం సాధారణమే. ఐతే ఊరును విడిచి వచ్చిన కొత్తల్లో, సిటీలో ఉండాలనిపించదు. ఇంటిమీద బెంగగా ఉంటుంది. ఆ పరిస్థితిని దూరం చేయాలంటే కొన్ని పనులు చేయాలి.

ఎమ్మా రాడుకానుపై కోకో గౌఫ్ విజయం

2023 ఆస్ట్రేలియా ఓపెన్లో టెన్నిస్ స్టార్ కోకో గౌఫ్ అద్భుతంగా ఆడింది. ఎమ్మా రాడుకాను కోకో గౌఫ్ ఓడించింది. మ్యాచ్ టైబ్రేకర్‌కు ముందు గౌఫ్ తొలి సెట్‌లో 6-3తేడాతో గౌఫ్ ముందుకెళ్లింది.

ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త మ్యాజిక్ EVని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రధానంగా పాఠశాలలు, స్టేజ్ క్యారేజ్, అంబులెన్స్‌లు వంటి డెలివరీ సేవలను లక్ష్యంగా చేసుకుంది.

'రిపబ్లిక్ డే' ఈవెంట్‌లో 50 విమానాలు ఫ్లైపాస్ట్: ఐఏఎఫ్

జనవరి 26 రిపబ్లిక్ డే రోజున 50 విమానాలతో 'ఫ్లైపాస్ట్'ను నిర్వహించనున్నారు. రాజ్‌పథ్ మీదుగా ఈ ఫ్లైపాస్ట్‌ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 45 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నేవీకి చెందిన ఒకటి, ఆర్మీకి చెందిన నాలుగు హెలికాప్టర్లు 'ఫ్లైపాస్ట్'లో పాల్గొననున్నాయి.

శుభ్‌మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు

శుభ్‌మాన్‌ గిల్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ చేసి సత్తా చాటాడు. కేవలం 87 బంతుల్లో వంద పరుగులు చేశాడు.

2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ

ఆపిల్ తన 2023 వెర్షన్ MacBook Pro, Mac miniలను పరిచయం చేసింది. MacBook Pro 14-అంగుళాల, 16-అంగుళాల సైజులో అందుబాటులో ఉంది. Mac mini దాని ముందూ మోడల్స్ లాగానే కనిపిస్తుంది. MacBook Pro ప్రారంభ ధర రూ. 2 లక్షలు, Mac mini ధర రూ.59,900.

హాలీవుడ్ మూవీ ఎప్పుడు ఉంటుందో చెప్పేసిన రాజమౌళి

ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి గుర్తింపు శిఖరాగ్రానికి చేరిపోయింది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడంతో ప్రపంచ సినిమాలో గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడు రాజమౌళి.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఈసీ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 2న ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో కలిపి 9,125 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

చర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి

మొటిమలు చాలా సాధారణ సమస్య. దీన్ని పోగొట్టడానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వైద్యం కూడా మొటిమలను పోగొడుతుంది. ప్రకృతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..?

భారత్ 267 పాయింట్లతో టీ20లో ప్రస్తుతం ఆగ్రస్థానంలో నిలిచింది. అలాగే వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. త్వరలోనే టీ20 సిరీస్ కూడా ఉంది. తరువాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లను భారత్ ఆడనుంది.

అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు

అప్ఘానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టింది. దొంగతనాలతో పాటు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా కాందహార్‌లో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మందికి కఠిన శిక్షను అమలు చేసింది.

415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు

FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు.

తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి

తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు.

జనవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఆనంద్ రావ్ పాత్రలో అడ్వంచర్స్ చేయడానికి రెడీ అవుతున్న కలర్ ఫోటో హీరో సుహాస్

కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్, వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అటు హీరోగా సినిమాలు ఒప్పుకుంటూనే, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు సుహాస్.

బ్రేకింగ్ న్యూస్: ఉక్రెయిన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్, మంత్రి సహ 16మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. కిండర్ గార్టెన్ సమీపంలో ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ మంత్రితో పాటు మొత్తం 16మంది మృతి చెందారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్

UPI చెల్లింపులు ఎక్కువగా చేసేది భారతీయులే. ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం ఒక్కోసారి వ్యాపారులకు కష్టంగా మారుతుంది. సౌండ్‌బాక్స్, వాయిస్ అలర్ట్ ద్వారా పూర్తయిన చెల్లింపు గురించి వ్యాపారులకు తెలియజేసే ఈ డివైజ్ లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా

భారతీయులకు వీసాలను ఎక్కువ సంఖ్యలో, వేగంగా జారీ చేసేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దౌత్య కార్యాలయాల్లో నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. అది కూడా భార్య భర్తలను నియమించాలని అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

మూడో రౌండ్‌కు అర్హత సాధించిన స్వియాటెక్, సక్కరి

2023 ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇగా స్వియాటెక్, సక్కరి చక్కటి ప్రదర్శన చేయడంతో మూడో రౌండ్‌కు అర్హత సాధించారు. టెన్నిస్‌లో మహిళల సింగిల్స్ ప్రపంచ నంబర్ వన్ స్వియాటెక్, కమిలా ఒసోరియాను వరుస సెట్లలో ఓడించింది. అనంతరం డయానా ష్నైడర్‌పై గ్రీకు సంచలనం మారియా సక్కరి విజయం సాధించింది.

2023 ఆస్ట్రేలియన్ ఓపెన్లో రాఫెల్ నాదల్ ఓటమి

ఆస్ట్రేలియా ఓపెన్ నుండి రాఫెల్ నాదల్ నిష్క్రమించాడు. రెండో రౌండ్ లో అమెరికన్ మెకెంజీ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుండి బయటికొచ్చాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నా బరిలోకి దిగిన నాదల్ ఒక సెట్ వెనుకబడ్డాడు. నాదల్ రెండో సెట్ చివరిలో మెడికల్ టైమ్ తీసుకున్నా.. చివరికి పరాజయం పాలయ్యాడు.

బంధం: మీ స్నేహితులు మిమ్మల్ని వేధిస్తున్నారా? అక్కడి నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు

ప్రతీ స్నేహమూ ఆనందాన్ని ఇస్తుందనుకుంటే పొరపాటే. కొంతమంది స్నేహితులు మీ పక్కనే ఉంటూ ప్రతీసారీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. పదిమందిలో మీ గురించి చులకనగా మాట్లాడుతూ మీ గౌరవానికి భంగం కలిగిస్తారు.

Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశంలో ఈసీ షెడ్యూల్‌ను వెల్లడించనుంది.

రికార్డులను వేటాడేందుకు సై అంటున్న కింగ్ కోహ్లీ

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చరిత్రను తిరగరాశాడు. స్వదేశంలో వన్డే ఫార్మాట్‌లో 21 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.

ఒంటరిగా డ్యాన్స్ చేసే అలవాటు మీకుందా? అది ఆరోగ్యానికే చేసే మేలు తెలుసుకోండి

మీ గదిలో ఒంటరిగా డ్యాన్స్ చేస్తున్నారా? కంగారు పడకండి, అదేమీ తప్పు విషయం కాదు. లోకాన్నే మర్చిపోతూ చేసే డ్యాన్స్ వల్ల మీరు ప్రశాంతంగా మారతారు. ఒంటరిగా డ్యాన్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థులను కొట్టడంతో పాటు అసభ్యకర పదజాలంతో తిట్టిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వెస్టిండిస్ టెస్టు జట్టులో సీనియర్ పేసర్ రీ ఎంట్రీ

జింబాబ్వేతో జరిగే రెండు టెస్టుల మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్‌గా బ్రాత్‌వైట్ ఎంపికయ్యాడు. వెటరన్ పేసర్ షానన్ గాబ్రియెల్, గుడాకేష్ మోటీ, జోమెల్ వారికన్‌ తిరిగి టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నారు.

ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్

తమిళ హీరో ధనుష్, "సార్" సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం

కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది.

టాప్ 4లోకి విరాట్ కోహ్లీ, టాప్ 3లోకి సిరాజ్

ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు సాధించారు. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల గ్యాప్‌లో మూడు సెంచరీలతో దుమ్మురేపాడు.

విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక ఘటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం

టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ రేసర్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఈ కారులో ఆకర్షణీయమైన డిజైన్‌ తో పాటు విశాలమైన ఫీచర్-లోడెడ్ క్యాబిన్, శక్తివంతమైన 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది.

రెండో రౌండ్‌కు చేరుకున్న అలెగ్జాండర్ జ్వెరవ్

జర్మనీ స్టార్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. జువాన్ పాబ్లో వరిల్లాస్‌ను ఐదు సెట్లలో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగు గంటల ఆరు నిమిషాల్లో ప్రపంచ 103వ ర్యాంకర్‌ను 4-6, 6-1, 5-7, 7-6(3), 6-4తో అధిగమించాడు. జ్వెరెవ్ ఈ సీజన్‌లో తన మొదటి టూర్-లెవల్ విజయాన్ని సాధించాడు. జ్వెరవ్ గాయం నుండి కోలుకొని యునైటెడ్ కప్‌లోకి తిరిగొచ్చి సత్తా చాటాడు.

కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన జ్యూస్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి

మారుతున్న కాలంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కళ్ళకు మేలు చేసే కొన్ని పానీయాలు తాగండి.

సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ప్రముఖ ఫ్రెంచ్ నన్ లూసిల్ రాండన్ మంగళవారం కన్నుమూశారు. ఫ్రాన్స్‌లోని టౌలాన్ నగరంలో 118 సంవత్సరాల వయస్సులో వయసు సంబంధిత సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు రాండన్ కుటుంబ సభ్యులు తెలిపారు.

2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) 2022లో కక్ష్యలో ఉన్న దాని ఇంజిన్‌లను దూరంగా తరలించడానికి దగ్గరగా వస్తున్న శిధిలాలకు దూరంగా ఉండటానికి కాల్పులు జరుపుతుంది. ISS భూమి చుట్టూ సగటున 402కి.మీ ఎత్తులో తిరుగుతుంది. ప్రతి 90 నిమిషాలకు ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది.

మళ్లీ సెంచరీ, తగ్గేదేలా అంటున్న సర్ఫరాజ్ ఖాన్

గత కొన్నెళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న భారత్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో త్వరలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంతో సర్ఫరాజ్‌ఖాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

వాల్తేరు వీరయ్య థియేటర్లలో ఉండగానే సెట్స్ పైకి వెళ్తున్న చిరంజీవి చిత్రం

మెగాస్టార్ చిరంజీవి నుండి సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రేక్షకుల పాజిటివ్ స్పందనతో దూసుకుపోతుంది. మొదటిరోజు వచ్చిన మిశ్రమ స్పందన, ఆ తర్వాత రోజుల్లో వచ్చిన పాజిటివ్ టాక్ లో కొట్టుకుపోయింది.