LOADING...

26 Jan 2023


గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక

74వ గణతంత్ర వేడుకల వేళ ప్రధాని మోదీ తలపాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి స్వాతంత్య్ర, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయన వస్త్రాధారణ హైలెట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మోదీ ధరించే తలపాగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.

74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు

దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్య‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్య‌పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.

తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి.

25 Jan 2023


padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు

ఎస్పీ వ్యవస్థాపకులు, దివంగత ములాయం సింగ్ యాదవ్, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్, ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు దివంగత దిలీప్ మహలనాబిస్‌, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది.

కంటికురుపు ఎందుకు వస్తుంది? రాకుండా నిరోధించే మార్గాలు తెలుసుకోండి

కనురెప్ప మీద చిన్నపాటి మొటిమ మాదిరిగా ఏర్పడటాన్ని కంటికురుపు అంటారు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఈ కంటి కురుపు కొన్నిసార్లు కనురెప్ప లోపలి భాగంలో కూడా అవుతుంది.

గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఎనిమిది రాష్ట్రాలు గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావాను దాఖలు చేశాయి. కంపెనీ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.ఈ దావాలో DOJతో చేరిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, వర్జీనియా ఉన్నాయి.

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రపతి పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను గెలుచుకుంది.

లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్

బైక్ తయారీ సంస్థ KTM గ్లోబల్ మార్కెట్‌ల కోసం RC 125, RC 390 2024 అప్డేట్ ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. అప్‌డేట్ అయిన మోటార్‌సైకిళ్లు టెస్ట్ రన్ లో ఉన్నాయి. కస్టమర్‌ల నుండి పలు అభ్యర్థనలు అందుకున్న తర్వాత సూపర్‌స్పోర్ట్ ఆఫర్‌లను అప్‌డేట్ చేయాలని ఈ బ్రాండ్ నిర్ణయించుకుంది.

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా సంచలన రికార్డును సృష్టించాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో మహ్మద్ సిరాజ్ టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ హైదరాబాద్ పేసర్ సంచలన బౌలింగ్‌తో ఈ మధ్య కాలంలో రికార్డును తిరిగరాస్తున్న విషయం తెలిసిందే.

ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు

జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.

అనుష్క అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ 51లక్షలకు టోపీ వేసిన దుండగుడు

ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడ మోసం ఉంటుందనేది అక్షరాలా నిజం. ఇండస్ట్రీ మీద అవగాహన లేక సినిమా పరిశ్రమలో వెలుగు వెలగాలని ఎంతో ఆశతో వచ్చిన వాళ్ళు, మోసగాళ్ల చేతుల్లో పడి అన్నీ కోల్పోతుంటారు.

రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం

కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ పింఛ్ అద్భుత ఘనత

బిగ్‌బిష్ లీగ్‌లో ఆరోన్ ఫించ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 54 బంతుల్లో 63 పరుగులతో ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. దీంతో రెనెగేడ్స్‌కు ఆరు వికెట్ల విజయాన్ని అందించింది.

రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో, ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ఎలక్ట్రాన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రాకెట్ ల్యాబ్

కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్ రాకెట్ ల్యాబ్, తన ఎలక్ట్రాన్ బూస్టర్‌ తొలి ప్రయోగాన్నిఅమెరికా నుండి విజయవంతంగా నిర్వహించింది.

రంజీ ట్రోఫీలో దుమ్ములేపుతున్న కేదార్ జాదవ్

మహారాష్ట్ర ఆటగాడు కేదార్ జాదవ్ రంజీ ట్రోఫీలో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్ లో 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేసి విరుచుకుపడిన విషయం తెలిసిందే

ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది

ఛత్తీస్‌గఢ్‌‌లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్‌‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్‌‌ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు.

ఆస్కార్ 2023: ఉత్తమ చిత్రానికి నామినేట్ అయిన సినిమాలు లభించే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ నిన్న రాత్రి బయటకు వచ్చాయి. 95వ ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో ఉత్తమ చిత్రం విభాగంలో 10సినిమాలు నామినేషన్లలో నిలిచాయి. నామినేట్ అయిన సినిమాలు ఓటీటీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి.

కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పార్టీకి రాజీనామా చేశారు.

నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం

మైక్రోసాఫ్ట్ 2022 చివరి మూడు నెలల ఆదాయాల నివేదికను ప్రకటించింది. ఈ త్రైమాసిక ఆదాయం గత 6 సంవత్సరాల కాలంలో అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి భారీగా ఉద్యోగులను తొలగించింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ దుమ్మురేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన డర్బన్స్ సూపర్ జెయింట్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.

పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS

బి ఎం డబ్ల్యూ 2024 M3 CS మోడల్‌ ను తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కార్లను ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. ఇది ప్రత్యేక సిగ్నల్ గ్రీన్ పెయింట్ తో వస్తుంది.

న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం

లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో క్రిస్ హిప్కిన్స్‌కు అవకాశం వచ్చింది.

సచిన్, అజయ్ జడేజా, సిద్దూని సెడ్జింగ్ చేయమని పాక్ మేనేజ్‌మెంట్ చెప్పింది

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కోట్లాది మంది అభిమానులు అతృతగా ఎదురుచూస్తారు. ఇక దాయాది దేశాలుగా ముద్ర‌ప‌డ్డ భార‌త్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ జరిగితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ ల‌వ‌ర్స్ టీవీల‌కు అతుక్కుపోతారు. ముఖ్యంగా భారత్, పాక్ మ్యాచ్‌లో సెడ్జింగ్ ఒక్కోసారి హై ఓల్టేజిగా పెంచేస్తుంది. ఒకరిపై ఒకరు సెడ్జింగ్ చేసుకుంటూ ఆటపై మక్కువను మరింత పెంచేస్తారు.

వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ నుండి గ్లింప్స్ విడుదల

విక్టరీ వెంకటేష్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దొరికింది. వెంకటేష్, తన 75వ చిత్ర టైటిల్ ని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ కూడా విడుదలైంది.

జనవరి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

2-0 తేడాతో న్యూజిలాండ్‌పై బెల్జియం విజయం

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం విజయం సాధించింది. భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు బెల్జియం దూసుకెళ్లింది.

National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ

యువ ఓటర్లు భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్ అని, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

విరాట్ కంటే నేనే బెటర్ : పాకిస్తాన్ ప్లేయర్

వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. దాదాపుగా రెండు శతాబ్దాల క్రికెట్ ఆటగాళ్లలో డాన్ బ్రాడ్ మన్, వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, సచిన్, షేన్ వార్న్ లాంటి దిగ్గజాలను ప్రపంచం చూసింది. ప్రస్తుతం ఆ దిశగా విరాట్ కోహ్లీ ప్రయాణిస్తున్నారు. ఎందకంటే అతడు నమోదు చేసిన గణాంకాలను చూస్తేనే కోహ్లీ ప్రతిభ ఎంటో తెలుసుకోవచ్చు.

భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో

రిలయన్స్ జియో తన 5G సేవలను 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మరో 50 నగరాల్లో ప్రారంభించింది, దీనితో భారతదేశంలో 5G మొత్తం 184 నగరాలో అందుబాటులో ఉంది.

శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి 6,629 పేజీల ఛార్జ్‌షీట్ ను దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో దాఖలు చేశారు. శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, పూర్వాపరాలను ఛార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు.

బాబర్ అజమ్ రికార్డును సమం చేసిన గిల్

శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై మొదటి డబుల్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ చేసి మెరుగ్గా రాణిస్తున్నారు. ఇండోర్‌లో కేవలం 78 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ 21 మ్యాచ్‌లు ఆడి 73.8 సగటుతో 1254 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

టీవీల్లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్ కొత్త సినిమా

ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మినహా మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.

ఇకపై వాట్సాప్ లో View once సందేశాలను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు

'View once' సందేశాలను స్క్రీన్‌షాట్‌ తీయడాన్ని బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ లాంచ్ చేసింది. అక్టోబర్ 2022లో వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా బీటా ఛానెల్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!

రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన భారీ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికా, జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం రష్యాతో యుద్ధాన్ని పునర్మిస్తుందని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన

జపనీస్ వాహన తయారీ సంస్థ Nissan తన స్వదేశంలో కిక్స్ 327 ఎడిషన్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ప్రదర్శనలో ఉంటుంది. న్యూ బ్యాలెన్స్ 327 Sneakers నుండి ప్రేరణ పొందిన ఈ వాహనం లేస్‌లు, ప్రత్యేక డీకాల్స్‌తో షూ లాంటి డిజైన్‌ తో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 3-0తో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్‌కి పంపారు.

వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి

ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వసంత పంచమి జరుపుకుంటున్నారు.ఈ రోజు సరస్వతీ దేవికి పూజ చేస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతుంటారు.

జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ సినిమా ఆశలు ఫలించాయి. ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కింది. ప్రతీ సినిమా కళాకారుడు కలలు గనే ఆస్కార్ అవార్డు గుమ్మం ముందు ఆర్ఆర్ఆర్ నిల్చుంది.

వన్డే, టీ20ల్లో టీమిండియాదే ఆగ్రస్థానం

టీమిండియా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. స్వదేశంలో మళ్లీ మరోసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, శ్రీలంక‌పై వరుసగా వన్డే సిరీస్‌లను గెలుచుకొని సత్తా చాటింది.