25 Jan 2023

padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు

ఎస్పీ వ్యవస్థాపకులు, దివంగత ములాయం సింగ్ యాదవ్, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్, ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు దివంగత దిలీప్ మహలనాబిస్‌, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది.

కంటికురుపు ఎందుకు వస్తుంది? రాకుండా నిరోధించే మార్గాలు తెలుసుకోండి

కనురెప్ప మీద చిన్నపాటి మొటిమ మాదిరిగా ఏర్పడటాన్ని కంటికురుపు అంటారు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఈ కంటి కురుపు కొన్నిసార్లు కనురెప్ప లోపలి భాగంలో కూడా అవుతుంది.

గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఎనిమిది రాష్ట్రాలు గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావాను దాఖలు చేశాయి. కంపెనీ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.ఈ దావాలో DOJతో చేరిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, వర్జీనియా ఉన్నాయి.

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రపతి పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను గెలుచుకుంది.

లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్

బైక్ తయారీ సంస్థ KTM గ్లోబల్ మార్కెట్‌ల కోసం RC 125, RC 390 2024 అప్డేట్ ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. అప్‌డేట్ అయిన మోటార్‌సైకిళ్లు టెస్ట్ రన్ లో ఉన్నాయి. కస్టమర్‌ల నుండి పలు అభ్యర్థనలు అందుకున్న తర్వాత సూపర్‌స్పోర్ట్ ఆఫర్‌లను అప్‌డేట్ చేయాలని ఈ బ్రాండ్ నిర్ణయించుకుంది.

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా సంచలన రికార్డును సృష్టించాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో మహ్మద్ సిరాజ్ టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ హైదరాబాద్ పేసర్ సంచలన బౌలింగ్‌తో ఈ మధ్య కాలంలో రికార్డును తిరిగరాస్తున్న విషయం తెలిసిందే.

ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు

జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.

అనుష్క అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ 51లక్షలకు టోపీ వేసిన దుండగుడు

ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడ మోసం ఉంటుందనేది అక్షరాలా నిజం. ఇండస్ట్రీ మీద అవగాహన లేక సినిమా పరిశ్రమలో వెలుగు వెలగాలని ఎంతో ఆశతో వచ్చిన వాళ్ళు, మోసగాళ్ల చేతుల్లో పడి అన్నీ కోల్పోతుంటారు.

రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం

కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ పింఛ్ అద్భుత ఘనత

బిగ్‌బిష్ లీగ్‌లో ఆరోన్ ఫించ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 54 బంతుల్లో 63 పరుగులతో ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. దీంతో రెనెగేడ్స్‌కు ఆరు వికెట్ల విజయాన్ని అందించింది.

రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో, ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ఎలక్ట్రాన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రాకెట్ ల్యాబ్

కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్ రాకెట్ ల్యాబ్, తన ఎలక్ట్రాన్ బూస్టర్‌ తొలి ప్రయోగాన్నిఅమెరికా నుండి విజయవంతంగా నిర్వహించింది.

రంజీ ట్రోఫీలో దుమ్ములేపుతున్న కేదార్ జాదవ్

మహారాష్ట్ర ఆటగాడు కేదార్ జాదవ్ రంజీ ట్రోఫీలో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్ లో 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేసి విరుచుకుపడిన విషయం తెలిసిందే

ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది

ఛత్తీస్‌గఢ్‌‌లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్‌‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్‌‌ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు.

ఆస్కార్ 2023: ఉత్తమ చిత్రానికి నామినేట్ అయిన సినిమాలు లభించే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ నిన్న రాత్రి బయటకు వచ్చాయి. 95వ ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో ఉత్తమ చిత్రం విభాగంలో 10సినిమాలు నామినేషన్లలో నిలిచాయి. నామినేట్ అయిన సినిమాలు ఓటీటీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి.

కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పార్టీకి రాజీనామా చేశారు.

నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం

మైక్రోసాఫ్ట్ 2022 చివరి మూడు నెలల ఆదాయాల నివేదికను ప్రకటించింది. ఈ త్రైమాసిక ఆదాయం గత 6 సంవత్సరాల కాలంలో అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి భారీగా ఉద్యోగులను తొలగించింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ దుమ్మురేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన డర్బన్స్ సూపర్ జెయింట్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.

పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS

బి ఎం డబ్ల్యూ 2024 M3 CS మోడల్‌ ను తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కార్లను ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. ఇది ప్రత్యేక సిగ్నల్ గ్రీన్ పెయింట్ తో వస్తుంది.

న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం

లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో క్రిస్ హిప్కిన్స్‌కు అవకాశం వచ్చింది.

సచిన్, అజయ్ జడేజా, సిద్దూని సెడ్జింగ్ చేయమని పాక్ మేనేజ్‌మెంట్ చెప్పింది

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కోట్లాది మంది అభిమానులు అతృతగా ఎదురుచూస్తారు. ఇక దాయాది దేశాలుగా ముద్ర‌ప‌డ్డ భార‌త్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ జరిగితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ ల‌వ‌ర్స్ టీవీల‌కు అతుక్కుపోతారు. ముఖ్యంగా భారత్, పాక్ మ్యాచ్‌లో సెడ్జింగ్ ఒక్కోసారి హై ఓల్టేజిగా పెంచేస్తుంది. ఒకరిపై ఒకరు సెడ్జింగ్ చేసుకుంటూ ఆటపై మక్కువను మరింత పెంచేస్తారు.

వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ నుండి గ్లింప్స్ విడుదల

విక్టరీ వెంకటేష్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దొరికింది. వెంకటేష్, తన 75వ చిత్ర టైటిల్ ని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ కూడా విడుదలైంది.

జనవరి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

2-0 తేడాతో న్యూజిలాండ్‌పై బెల్జియం విజయం

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం విజయం సాధించింది. భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు బెల్జియం దూసుకెళ్లింది.

National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ

యువ ఓటర్లు భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్ అని, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

విరాట్ కంటే నేనే బెటర్ : పాకిస్తాన్ ప్లేయర్

వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. దాదాపుగా రెండు శతాబ్దాల క్రికెట్ ఆటగాళ్లలో డాన్ బ్రాడ్ మన్, వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, సచిన్, షేన్ వార్న్ లాంటి దిగ్గజాలను ప్రపంచం చూసింది. ప్రస్తుతం ఆ దిశగా విరాట్ కోహ్లీ ప్రయాణిస్తున్నారు. ఎందకంటే అతడు నమోదు చేసిన గణాంకాలను చూస్తేనే కోహ్లీ ప్రతిభ ఎంటో తెలుసుకోవచ్చు.

భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో

రిలయన్స్ జియో తన 5G సేవలను 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మరో 50 నగరాల్లో ప్రారంభించింది, దీనితో భారతదేశంలో 5G మొత్తం 184 నగరాలో అందుబాటులో ఉంది.

శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి 6,629 పేజీల ఛార్జ్‌షీట్ ను దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో దాఖలు చేశారు. శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, పూర్వాపరాలను ఛార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు.

బాబర్ అజమ్ రికార్డును సమం చేసిన గిల్

శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై మొదటి డబుల్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ చేసి మెరుగ్గా రాణిస్తున్నారు. ఇండోర్‌లో కేవలం 78 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ 21 మ్యాచ్‌లు ఆడి 73.8 సగటుతో 1254 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

టీవీల్లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్ కొత్త సినిమా

ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మినహా మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.

ఇకపై వాట్సాప్ లో View once సందేశాలను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు

'View once' సందేశాలను స్క్రీన్‌షాట్‌ తీయడాన్ని బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ లాంచ్ చేసింది. అక్టోబర్ 2022లో వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా బీటా ఛానెల్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!

రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన భారీ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికా, జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం రష్యాతో యుద్ధాన్ని పునర్మిస్తుందని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన

జపనీస్ వాహన తయారీ సంస్థ Nissan తన స్వదేశంలో కిక్స్ 327 ఎడిషన్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ప్రదర్శనలో ఉంటుంది. న్యూ బ్యాలెన్స్ 327 Sneakers నుండి ప్రేరణ పొందిన ఈ వాహనం లేస్‌లు, ప్రత్యేక డీకాల్స్‌తో షూ లాంటి డిజైన్‌ తో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 3-0తో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్‌కి పంపారు.

వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి

ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వసంత పంచమి జరుపుకుంటున్నారు.ఈ రోజు సరస్వతీ దేవికి పూజ చేస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతుంటారు.

జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ సినిమా ఆశలు ఫలించాయి. ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కింది. ప్రతీ సినిమా కళాకారుడు కలలు గనే ఆస్కార్ అవార్డు గుమ్మం ముందు ఆర్ఆర్ఆర్ నిల్చుంది.

వన్డే, టీ20ల్లో టీమిండియాదే ఆగ్రస్థానం

టీమిండియా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. స్వదేశంలో మళ్లీ మరోసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, శ్రీలంక‌పై వరుసగా వన్డే సిరీస్‌లను గెలుచుకొని సత్తా చాటింది.

24 Jan 2023

భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్)

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్చి 2023 నాటికి భారతదేశంలో విడుదల చేయనుంది.సరికొత్త సాంకేతిక-ఆధారిత ఫీచర్లతో కొన్ని మార్పులతో అందుబాటులోకి వస్తుంది. డీజిల్ ఇంజిన్ నిలిపివేసి పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డీజీసీఏ మరోసారి షాక్ ఇచ్చింది. న్యూయార్క్-దిల్లీ వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ, తాజాగా అలాంటి సంఘటనలో రూ. 10లక్షల ఫైన్ విధించింది. వారం లోపలే ఎయిర్ ఇండియాకు ఈ రెండు ఫైన్లు విధించడం గమనార్హం.

మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మూడో హిట్ గా కళ్యాణ్ రామ్ చిత్రం నిలవనుందా?

మైత్రీ మూవీ మేకర్స్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి విజయం అందుకుంది.

10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ ChatGPT యజమాని OpenAIతో తన భాగస్వామ్యాన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా విస్తరించాలని నిర్ణయించుకుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ లో OpenAI టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్‌లో ChatGPT పెట్టాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గూగుల్ వంటి వాటికి గట్టి పోటీనివ్వచ్చు.

అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలు: స్పందించిన అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్

ఇటీవల వీరసింహారెడ్డి విజయోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అఖండ తర్వాత బాలయ్య ఖాతాలో మరో హిట్ పడిందని అభిమానులు అందరూ సంబరాలు చేసుకున్నారు.

ఇండోర్‌లో రోహిత్ విశ్వరూపం, రికి పాంటింగ్ రికార్డు సమం చేసిన హిట్ మ్యాన్

భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వన్డేల్లో అరుదైన రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి వన్డేల్లో 30వ సెంచరీని నమోదు చేశాడు. 2020 తర్వాత వన్డేలో సెంచరీ చేసి తన ఫామ్‌ని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వన్డేలో శతకాల పరంగా ఆస్ట్రేలియా లెజెండ్ ప్లేయర్ రికి పాంటింగ్ రికార్డును సమం చేశాడు.

డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్

పెరోల్‌‌పై జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా మరో వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. తను బెయిల్‌పై విడుదలైన సందర్భంగా అనుచరులతో కలిసి బర్నావా ఆశ్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు డేరా బాబా.

ఐదు గోల్స్‌తో రికార్డు బద్దులు కొట్టిన ఎంబప్పే

ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఎంబెప్పా ఐదు గోల్స్ చేసి పారిస్ ఫ్రెంచ్ కప్‌లో ఆరవ-స్థాయి క్లబ్ పేస్ డి కాసెల్‌ను మట్టికరిపించాడు. ఈ విజయంతో PSG ఫ్రెంచ్ కప్‌లో 16వ స్థానానికి చేరుకున్నాడు. నేమార్, కార్లోస్ సోలెర్ ఒక్కో గోల్ సాధించారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు

మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ Spotify మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం 6% సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.

దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మ్యూఛువల్ ఫండ్స్: సిప్ లో తొందరగా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలో తెలుసుకోండి

మ్యూఛువల్ ఫండ్లలో ఎంత తొందరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్టుబడి పెట్టడానికి డబ్బుండాలి కదా అంటారు.

'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్

2016లో భారత దళాల 'సర్జికల్ స్ట్రైక్', 2019 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి దిగ్వజయ్ వ్యక్తిగత అభిప్రాయాలని రాహుల్ పేర్కొన్నారు. వాటితో తాము ఏకీభవించడం లేదని, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు.

ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ

ఓలా S1 Pro భద్రత, నాణ్యత ప్రమాణాలపై మరిన్ని భయాలు పెరిగాయి. జనవరి 21న, ఒక మహిళ స్కూటర్ నడుపుతుండగా ముందు సస్పెన్షన్ విడిపోయి ముందు చక్రం విడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యి ఐసియూలో చికిత్స పొందుతుంది.

టీ20ల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మేగాన్ షట్ అద్భుత రికార్డు

పాకిస్థాన్ మహిళలతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20ల తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షుట్ అద్భుత రికార్డును సాధించింది. మంగళవారం 5/15తో రాణించి కెరీయర్లో అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది. దీంతో పాకిస్తాన్ 118 పరుగులకే ఆలౌటైంది. చివరికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఆన్ లైన్ డేటింగ్: మీ పార్ట్ నర్ ని కలవాలనుకుంటున్నారా? ముందు ఈ ప్రశ్నలు అడగండి

టిండర్, బంబుల్ లాంటి ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ సాయంతో పార్ట్ నర్ ని ఆన్ లైన్ లో కలవడం చాలా చిన్న విషయం. అదే పార్ట్ నర్ తో మంచి బంధం ఏర్పర్చుకోవడం అనేది పెద్ద విషయం.

ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం

తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు రూ. 700 కోట్లతో నిర్మించిన కొత్త ఐకానిక్ భవనాన్ని ఆ రోజు ఉదయం 11:30గంటలకు ప్రారంభించనున్నారు.

ఆస్ట్రేలియా ఓపెన్స్‌లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఎలెనా రైబాకినా

ఆస్ట్రేలియా ఓపెన్స్ లో ఎలెనా రైబాకినా సత్తా చాటుతోంది. ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రైబాకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో జెలెనా ఒస్టాపెంకోను మట్టి కరిపించింది. ప్రస్తుతం నాలుగో దశకు చేరుకొని అత్యత్తుమ ప్రదర్శన చేస్తోంది.

బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల

ఆపిల్ ఎట్టకేలకు iOS 16.3 అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది ఐఫోన్ ల భద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఫిజికల్ కీని ఉపయోగించి ఆపిల్ IDని రక్షించుకునే సామర్థ్యాన్ని ఈ అప్‌డేట్ అందిస్తుంది.

ముక్కొణపు సిరీస్‌లో అదరగొట్టిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. స్టార్ బ్యాట్ మెన్స్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ భారత్‌ అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో టీమిండియా మహిళల జట్టు 20 ఓవర్లలో 167/5 స్కోరు సాధించింది.

హెచ్‌సీయూలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన, యూనివర్సిటీ అధికారులకు ఏబీవీవీ ఫిర్యాదు

ప్రధాని మోదీ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజాగా ఈ వివాదాస్పద విషయం హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి చేరుకుంది.

ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం?

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై, పది నెలలు అవుతున్నా కూడా ఆ ఫీవర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వరుసగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

బీబీసీ డాక్యుమెంటరీ: 'భారత్- అమెరికా భాగస్వామ్య విలువలు గురించి మాత్రమే తెలుసు'

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయం ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనిపై యూకే స్పందించగా, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించారు.

వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహిళలు 20 ఓవర్లలో 167/2 స్కోర్ చేశారు.

జనవరి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను రీడీమ్ చేయడానికి, తప్పనిసరిగా అనుసరించాల్సినవి .

రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్

టాల్కమ్ పౌడర్ ప్రతీ ఇంట్లోనూ ఉంటుంది. మేకప్ కిట్ లో మేజర్ పొజిషన్ టాల్కమ్ పౌడర్ దే అయ్యుంటుంది. ఈ టాల్కమ్ పౌడర్ ని అందంగా రెడీ అవ్వడానికే కాదు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు

న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం భారత్ సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక విషయాలను చెప్పారు.

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది. 2022లో కలుషితమైన దగ్గు సిరప్‌లు తాగి అనేక మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం

ఫిబ్రవరి 5 న పౌర్ణమి వస్తుంది. దీనికి ఒక ఆసక్తికరమైన పేరుంది అదే స్నో మూన్. Earthsky.org ప్రకారం, ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఉండే లియో రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రం అయిన రెగ్యులస్ సమీపంలో ఈ పౌర్ణమి కనిపిస్తుంది.

మోడలింగ్ పేరుతో మోసం చేసి 15లక్షలు కాజేసిన బాలీవుడ్ భార్యాభర్తలు

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అపూర్వా అశ్విన్ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్, ఇంకా అతని భార్య నటాషా కపూర్ అలియాస్ నజీష్ మీమన్ హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు.

అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి

తుపాకీ గర్జనలతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే మరో మూడు ప్రాంతాల్లో తుపాకుల మోత మోగింది.

ఫుల్‌హామ్‌ను ఓడించడంలో హ్యారీకేన్ సాయం

హ్యారీ కేన్ ప్రస్తుతం టోటెన్‌హామ్‌కు ఉమ్మడి ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మంగళవారం ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో ఫుల్‌హామ్‌ను జట్టు అధిగమించడంతో అతను 266వ గోల్ చేశాడు. టోటెన్‌హామ్ 1-0తో లండన్ క్లబ్ ఫుల్‌హామ్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో స్పర్స్ స్టాండింగ్స్‌లో 5వ స్థానానికి చేరుకుంది.

స్పైస్‌జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు

విమానాల్లో కొందరు ప్రయాణికులు సిబ్బంది పట్ల , తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల సంఘటనలు మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య

2022 ఏడాదికి గానూ పురుషుల టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకి అవకాశం లభించింది. ఇండియా నుంచి విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు చోటిచ్చారు. ఇంగ్లాండ్‌ను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది.

పెట్: మీ పెంపుడు పిల్లి మీ దగ్గరకు రావడం లేదా? కారణం తెలుసుకోండి

పిల్లులను, కుక్కలను పెంచుకునే వారు అవి చేసే పనులను అనుక్షణం గమనిస్తుండాలి. అవి ఏ టైమ్ లో ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడం ద్వారా వాటికి కలిగే ఇబ్బందులను దూరం చేయవచ్చు.

భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్‌

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సంస్థ 2023 AURA సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది E, S, SX, SX(O) వేరియంట్లలో లభిస్తుంది. విశాలమైన టెక్-లోడెడ్ క్యాబిన్‌ తో పాటు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఇది పెట్రోల్, CNG రెండిటిలో 1.2-లీటర్ ఇంజన్ తో నడుస్తుంది. ఇది ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.

ట్రోలింగ్ వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న రష్మిక మందన్న

హీరోయిన్ రష్మికపై సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. అప్పుడెప్పుడో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పటి నుండి మొదలైన ట్రోలింగ్ ఇప్పటికీ ఏదో ఒక విషయంలో నడుస్తూనే ఉంది.

ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ 11 మంది మహిళల టీ20 జట్టును ఎంపిక చేసింది. ఈ లిస్టులో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లకు అవకాశం దక్కింది.