23 Jan 2023

భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా

హోండా తన యాక్టివా స్కూటర్‌లో స్మార్ట్ కీ వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ కు కారు లాంటి స్మార్ట్ కీ ఉంటుంది, ఇది మల్టీ ఫంక్షనల్ బటన్‌తో వస్తుంది. ఇందులో 5.3 లీటర్ల పెట్రోల్ స్టోర్ చేసుకోవచ్చు, ఇది 105 కిలోల బరువు ఉంటుంది.

'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు

భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన సర్జికల్ దాడుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

జువెంటస్ అటలాంటాయాను 3-3తో పరాజయం

ఆతిథ్య జువెంటస్ అట్లాంటాను రివర్టింగ్ సీరీ A 2022-23 మ్యాచ్‌లో 3-3 డ్రాగా ముగించింది. ఏంజెల్ డి మారియా జువ్‌కు పెనాల్టీగా మార్చడంతో జువెంటస్ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. 65వ నిమిషంలో ఈక్వలైజర్ జువ్ ఈ మ్యాచ్ నుండి ఒక పాయింట్‌ను పొందేందుకు సహాయపడ్డారు.

భారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్

డెలివరీలను వేగవంతం చేసే ప్రయత్నంలో అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఎయిర్ అని ప్రత్యేక ఎయిర్ కార్గో ఫ్లీట్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం తొలుత బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుంది.

విషాదం: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ సూసైడ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఎంతో ప్రతిభ ఉన్న యంగ్ యాక్టర్ సుధీర్ వర్మ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని గంటల క్రితమే తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కస్టమర్లకు వేగంగా బుకింగ్ డెలివరీలను చేరవేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో ఎయిర్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఎయిర్ సర్వీసులకు ప్రారంభించారు.

సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన రుబ్లెవ్

ఐదోవ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సత్తా చాటాడు. పురుషుల సింగల్స్ లో క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించాడు. తొమ్మిదో-సీడ్ హోల్గర్ రూన్‌పై 6-3, 3-6, 6-3, 4-6, 7-6(9)తో రుబ్లెవ్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. రుబ్లెవ్ తన కెరీర్‌లో ఏడవ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం.

టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఈ ప్లాట్‌ఫారమ్ లో అనేక కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తోంది, వీటిని త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈ ఫీచర్లలో కొన్ని బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి, మరికొన్ని ఇంకా అభివృద్ధిలో ఉన్నాయి.

సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డి డిప్యూటీ తహశీల్దార్‌ సస్పెండ్

సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్‌ చొరబడ్డ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పోలీసులు డిప్యూటీ తహశీల్దార్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయగా, తాజాగా ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది.

చర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు

మీ నిజమైన వయసు కన్నా మీ చర్మం వయసు ఎక్కువగా కనిపిస్తుంటే మీరు పాటిస్తున్న అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చర్మం వయసు పెరిగిపోయి మీలో ఉత్సాహం తగ్గిపోతుంది.

జనవరి 26న రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi జనవరి 26న సరికొత్త యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్ కారును విడుదల చేయనుంది. "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో భాగంగా ప్రదర్శించబడుతుంది. ఇది గ్రాండ్‌స్పియర్, అర్బన్‌స్పియర్ మోడల్‌ లాగానే PPE ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

ఉద్యోగులు చేసిన తప్పిదం వల్లే విమానాలు నిలిచిపోయాయి: ఎఫ్ఏఏ

జనవరి 11న అమెరికా వ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోవడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తీవ్ర విమర్శలను ఎందుర్కొంది. ఈ పరిణామంపై విచారణ చేపట్టిన ఎఫ్ఏఏ, ఆరోజు మిమానాలు నిలిచిపోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది.

ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సౌమ్య తివారీ టీమిండియా తరుపున అద్భుతంగా రాణించింది. భారత్ స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు.

బాలయ్య 125 దాటేసాడు, చిరంజీవి 200 చేరుకోబోతున్నాడు

సంక్రాంతి సందర్భంగా వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. రిలీజై రెండు వారాలు అవుతున్నా కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను తెచ్చుకుంటున్నాయి.

బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు

భారత ప్రభుత్వం మార్చి 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 16 ట్రిలియన్ రూపాయలు ($198 బిలియన్లు) అప్పుగా తీసుకుంటుంది.

గాయం నుంచి కోలుకున్న జడేజా, కెప్టెన్‌గా రీ ఎంట్రీ

టీమిండియా ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం జడేజా మళ్లీ మైదానంలో మళ్లీ అడుగు పెట్టబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా సౌరాష్ట్ర తరుపున రంజీ ఆడటానికి సిద్ధమయ్యాడు.

మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. పైగా వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.

రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి

కొంతమందికి ఆహారం వండుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం రెస్టారెంట్ల మీదే ఆధారపడతారు.

జనవరి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ

ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన హౌసింగ్, అర్బన్ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ మెట్రో రైలు సందర్శించింది. రాయదుర్గ్ నుంచి అమీర్‌పేట్ స్టేషన్ వరకు ప్రయాణించారు.

క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లిన కరోలియా ప్లిస్కోవా

ప్రపంచ మాజీ నంబర్ వన్, కరోలినా ప్లిస్కోవా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సత్తా చాటింది. చైనాకు చెందిన 23వ ర్యాంకర్ జాంగ్ షువాయ్‌ను మట్టి కరిపించింది. తన ప్రత్యర్థిని వరుస సెట్లలో (6-0, 6-4) ఓడించి కరోలియా ప్లిస్కోవా నాలుగో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

మైఖేల్ ట్రైలర్ టాక్: ఈ భూమ్మీద అమ్మాయే కోసమే బతకాలంటున్న సందీప్ కిషన్

సందీప్ కిషన్, దివ్యాన్ష కౌషిక్ హీరో హీరోయిన్లుగా నటించిన మైఖేల్ ట్రైలర్ విడుదలైంది. 2నిమిషాల 11సెకన్ల ట్రైలర్ లో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి.

21 అండ‌మాన్ దీవుల‌కు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

అండ‌మాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది వీరుల పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి 23) సందర్భంగా నిర్వహించిన 'పరాక్రమ దివస్'లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ ఈ పేర్లను ప్రకటించారు.

గాయం నుంచి కోలుకున్న జడేజా రీ ఎంట్రీ

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు దూరమై చాలా నెలలు అవుతోంది. సెప్టెంబర్ 2022లో ఆసియా కప్ భాగంగా జడేజా మోకాలికి గాయమైంది. దీంతో భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు టెస్టులకు భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈలోపు రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర తరుపున ఆడటానికి జడేజా చైన్నై వచ్చాడు.

కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW

పాల్ లెఫెవ్రే అనే ఫ్రెంచ్ సర్ఫ్‌బోర్డ్ షేపర్, బిల్డర్ చేతితో చెక్కిన కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లతో ఒక రకమైన రెస్టో-మోడెడ్ 1969 BMW 1602 కారును ప్రదర్శించారు. తేలికైన పదార్ధాల ఉపయోగం క్లాసిక్ సెడాన్ మొత్తం బరువును 816kgలకు తగ్గించింది. అదే సమయంలో వాహనం నిర్మాణ కూడా ధృడంగా ఉంది.

జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

జనవరి 23.. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వాంతంత్ర్యాన్ని ఇస్తాను అని ఎలుగెత్తి చాటిన యోధుడు పుట్టిన పవిత్ర దినం.

విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించిన కున్లావుట్ విటిడ్ సర్న్

థాయ్ లాండ్ కు చెందిన కున్లావుట్ విటిడ్ సర్న్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన డెన్నార్క్కు చెందిన విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించి సత్తా చాటాడు.

భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం, నౌకాదళంలోకి ప్రవేశించిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ 'వగిర్'

భారత నౌకాదళం మరో ప్రధాన అస్త్రాన్ని తన అమ్ములపొదిలో చేర్చుకుంది. సముద్రగర్భంలో శత్రువు పాలిట మారణాస్త్రంగా భావిస్తున్న సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ 'వగిర్'ను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఆధ్వర్యంలో సోమవారం నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.

హరిహర వీరమల్లు: పండగ పూట పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ

ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానుల చూపులన్నీ హరిహర వీరమల్లు సినిమా మీదే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రయత్నించని జోనర్ లో సినిమా వస్తుండడంతో ఆసక్తి బాగా పెరిగింది.

ఐపీఎల్ మహిళ టీం కొనుగోలుపై బడా ఫ్రాంచైసీలు ఆసక్తి..!

ఐపీఎల్ మహిళను టీం కొనుగోలు చేయడానికి బడా ఫ్రాంచైసీలు ఆసక్తిని చూపుతున్నాయి. ఎలాగైనా టీంను కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేడు ఏ ఫ్రాంచైసీలు ముందుకు రానున్నాయో ఓ కొలక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు ఎంత మొత్తం పెట్టుబడి పెడుతున్నారు, ఎవరు ఆసక్తి చూపుతున్నారో నేడు తెలిసే అవకాశం ఉంటుంది.

బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోకు సబంధించిన యూట్యూబ్ లింకులను కేంద్రం భ్యాన్ చేయడంపై జాతీయస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీసుకున్న చర్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో పనితీరు బాగోలేదంటూ 452 మందిని ఇంటికి పంపిన విప్రో సంస్థ

భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కార్పొరేట్ పేలవమైన పనితీరును పేర్కొంటూ 452 మంది కొత్త ఉద్యోగులను తొలగించింది. ఇటీవల జరిపిన ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో తక్కువ స్కోర్లు ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నట్లు విప్రో తెలియజేసింది. మొదట విప్రో 800 మందిని తొలగించాలని అనుకున్నా, ఇప్పుడు తొలగించిన ఉద్యోగుల సంఖ్య అంతకంటే తక్కువే అని బిజినెస్ టుడే పేర్కొంది.

మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి

జుట్టు ఊడిపోవడానికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందకపోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే జుట్టుకు సమస్య అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మాంచెస్టర్ యునైటెడ్‌పై ఆర్సెనల్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23లో ఆదివారం ఎమిరేట్స్‌లో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్‌ను ఆర్సెనల్ అధిగమించింది. మాంచెస్టర్ యునైటెడ్ పై 3-2 తేడాతో ఆర్సెనల్ విజయం సాధించింది.

గ్రూప్ ఇంటరాక్షన్‌ల కోసం ఐఫోన్ లో కొత్త ఫీచర్‌ను విడుదల చేసిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది గ్రూప్ అడ్మిన్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంస్థ ఈ ఫీచర్ ద్వారా అనేక షార్ట్‌కట్‌లను అందిస్తుంది, వీటిని ఉపయోగించి అడ్మిన్‌లు గ్రూప్ లో ఉన్నవారి పై త్వరగా చర్యలు తీసుకోగలరు. యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయగల అప్డేట్ వెర్షన్ 23.1.75లో అందుబాటులో ఉంది.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఓనర్ల తీరుపై హరీష్ శంకర్ ఘాటు వ్యాఖ్యలు

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏ విషయం మీదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హెడ్స్ మీద ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

హాకీ వరల్డ్ కప్ టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా వరల్డ్‌కప్ నుంచి ఇంటిదారి పట్టింది.

కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో తుపాకీ మోత, 10 మంది మృతి

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌ మాంటెరీ పార్క్‌లో జరిగిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో ఓ 72 ఏళ్ల వృద్ధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో 10మంది అక్కడిక్కకడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

21 Jan 2023

చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం

చికెన్‌పాక్స్ అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే ఒక సాధారణ ఇన్‌ఫెక్షన్, ఇది అంటువ్యాధి, ముఖ్యంగా ఇంతకు ముందు ఈ వ్యాధి రాని లేదా పూర్తిగా టీకాలు వేయని వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుకు ఈ వైరస్ వల్ల హాని ఉంది. ఈ పిల్లలకు చికెన్ పాక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా

సీటు బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించినందుకు ప్రధానమంత్రి రిషి సునక్‌కి యునైటెడ్ కింగ్‌డమ్ పోలీసులు జరిమానా విధించినట్లు బీబీసీ తెలిపింది. కదులుతున్న కారులో సీటుబెల్టు ధరించనందుకు అతనికి 50ఫౌండ్ల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రిషి సునక్‌కు క్షమాపణలు చెప్పారు. జరిమానా చెల్లిస్తానని పేర్కొన్నారు.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం

ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. భారత ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. తాజాగా డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ ప్రసారం చేసింది. అయితే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లింక్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి.

Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు

ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పెచ్చరిల్లుతున్నాయి. కొడలికి పిల్లలు పుట్టడం లేదని దారుణానికి ఒడిగట్టారు ఓ మహిళ అత్తమామలు. తాంత్రికుడు చెప్పిన మాటలు విని కొడలితో శ్మశానంలోని ఎముకలు, వాటి పొడిని తినిపించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ దారుణం జరిగింది.

రాయపూర్ వన్డేలో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు, కివీస్ 108 ఆలౌట్

రాయపూర్ వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ ఆటగాళ్లకు ఇండియన్ పేసర్లు చెమటలు పుట్టించడంతో తక్కువ స్కోర్ కే కివీస్‌ను కుప్పకూల్చారు

'వీరమల్లు' నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తన కెరీర్ లో పీరియాడిక్ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫుల్ ఫోకస్ తో యాక్షన్ ఎపిసోడ్ లను తెరకెక్కిస్తున్నాడు. హరిహర వీరమల్లు చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. 15 నివిషాల వ్వవధిలోనే ఈ పేలుళ్లు జరగ్గా, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నర్వాల్ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని యార్డ్ నంబర్ 7లో ఈ పేలుళ్లు సంభవించాయి.

40వ వార్షికోత్సవం సందర్భంగా Outlander స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన Mitsubishi

Mitsubishi తన Outlander మోడల్ 40వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్‌ను USలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర $41,340 (సుమారు రూ. 33.47 లక్షలు). ఈ ఆఫ్-రోడర్ నలుపు, బ్రాంజ్ పెయింట్ తో వస్తుంది. దీనికి లోపలా, బయటా 40వ వార్షికోత్సవ బ్యాడ్జ్‌లు ఉంటాయి. ప్రస్తుతానికి బుకింగ్స్ తెరుచుకున్నాయి.

Altered mental status: ఈ లక్షణాలు ఉన్నాయా? తేలికగా తీసుకోకండి, అది మానసిక అనారోగ్యం కావొచ్చు

మానవ శరీరానికి మెదడు సీపీయూ లాంటిది. మనిషి ఆలోచనలు, కదలికలు, అనుభూతులను మెదడు నియంత్రిస్తుంది. అయితే మెదడు పనితీరు బలహీనమైనప్పుడు మన ప్రవర్తనలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ రకమైన స్థితినే 'ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్(ఏఎంఎస్)' అని అంటారు.

పాకిస్తాన్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

సిడ్నీలోని నార్త్ సిడ్నీ ఓవల్‌లో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు, పాకిస్తాన్ మహిళల జట్టును ఓడించారు. బెత్ మూనీ 133 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 336/9 స్కోరు చేసింది. చేధనకు దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు బ్యాటింగ్‌లో తడబడటంతో 235/7 స్కోర్ చేసి ఓటమి పాలైంది.

ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

ట్విట్టర్ ఐఫోన్ వినియోగదారులు ట్వీట్‌లను సులభంగా బుక్‌మార్క్ చేసేలా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులు ట్వీట్ వివరాల క్రింద ఉన్న బుక్‌మార్క్ బటన్‌పై నొక్కాలి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల విషయానికొస్తే, ఫ్లాగ్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఫోల్డర్‌లలో తమకు నచ్చిన ట్వీట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్

మెటాపై జరిమానాల వర్షం కొనసాగుతూనే ఉంది. యూరప్ ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు మెటాపై భారీ €390 మిలియన్ పెనాల్టీని విధించిన రెండు వారాల తర్వాత, ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) మెటాకు అదనంగా €5.5 మిలియన్ జరిమానా విధించింది. అయితే ఈసారి, వాట్సాప్ EU డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.

సెట్స్ పైకి కన్నడ సంచలన మూవీ కాంతార-2

కాంతార కన్నడలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కలెక్షన్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ స్థాయిలో కాంతార మూవీ సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్లు వసూలు చేసింది.

టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena

Xiaomi మంగోలియాలో తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు Modenaను టెస్టింగ్ దశకు తీసుకువచ్చింది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ వాహనంలో ఆటోనోమస్ డ్రైవింగ్ సామర్థ్యం ఉంది.

ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?

విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.

ఫర్నిచర్ వేలం నుండి తగ్గుతున్న ఆదాయం వరకు అసలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది

శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో మిగులు వస్తువులను వేలం వేసి కొంత డబ్బును సేకరించే పనిలో ఉంది ట్విట్టర్. మిగులు కార్యాలయ వస్తువులను విక్రయించడం వలన ట్విట్టర్ ఆదాయం పెరగొచ్చు.

జనవరి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

మరియా సక్కరిపై విక్టోరియా సంచలన విజయం

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో విక్టోరియా అజరెంకా అద్భుతంగా రాణించింది. 10వ సీడ్ మాడిసన్ కిస్‌పై అధిపత్యం చెలాయించింది. తర్వాత జులిన్ ఆరో సీడ్ మరియా సక్కరిపై 7-6, 1-6, 6-4 తేడాతో విక్టోరియా అజరెంకా సంచలన విజయం సాధించింది.

కోర్డా మెద్వెదేవ్‌ను మట్టికరిపించిన సెబాస్టియన్ కోర్డా

శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో సెబాస్టియన్ కోర్డా మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. రష్యన్ ఏస్ డేనియల్ మెద్వెదేవ్‌ను సెబాస్టియన్ మట్టి కరిపించాడు. కోర్డా వరుస సెట్లలో విజయం సాధించి ముందుకెళ్లాడు.

బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో షాక్‌కు గురైన అధికారులు విమానాన్ని అత్యవరస ల్యాండింగ్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. శనివారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటనతో అధికారులు హడలెత్తిపోయారు.

భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ Bentley భారతదేశంలో Bentayga EWB Azure మోడల్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన ఈ Azure వేరియంట్‌లో వెనుక ఎయిర్‌లైన్ సీట్లు, ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజింగ్ డోర్లు, మొత్తం ఫ్లోర్‌ను కవర్ చేసే 'డీప్ పైల్ ఓవర్' మ్యాట్‌లు, ప్రీమియం నైమ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUV 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

వివి వినాయక్‌కు ఆఫర్ ఇచ్చిన గాడ్ ఫాదర్..!

ఎస్ఎస్ రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా చిరంజీవి-వివి వినాయక్ కాంబినేషన్ను ఏ అభిమాని కాదని చెప్పడు.

డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

న్యూజిలాండ్ కొత్త ప్రధాని: జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ప్రస్తుతం ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్న క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోటీలో హిప్‌కిన్స్ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ఎంపిక దాదాపు ఖరారైనట్లే. అధికార లేబర్ పార్టీ సమావేశంలో హిప్‌కిన్స్‌ను అధికారంగా ప్రకటించనున్నారు.

చిట్టిబాబుతో వార్‌కు సిద్ధమైన పుష్పరాజ్..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నందున సోషల్ మీడియాలో ఎదో ఒక విషయంలో రామ్ చరణ్ పేరు ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం క్రియేటివ్ డైరక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC 15 సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి

సామ్ సంగ్ Galaxy Buds Live ఇప్పుడు అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ. 3,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల సేపు యాక్టివ్ గా ఉంటాయి. దీనికి ఛార్జింగ్ కేస్ 472mAh బ్యాటరీ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌ కూడా సపోర్ట్ చేస్తుంది.

గ్రీక్స్‌పూర్‌పై సిట్సిపాస్ విజయం

ప్రపంచ 63వ ర్యాంకర్ టాలోన్ గ్రీక్స్ పూర్ ను స్టెఫానోస్ సిట్సిపాస్ ఓడించారు. 6-2, 7-6(5), 6-3తేడాతో గ్రీక్స్ పూర్పై సిట్సిపాస్ విజయం సాధించి నాలుగో రౌండ్ కు అర్హత సాధించారు. ఇప్పటివరకూ ఒక సెట్ కూడా వదలకుండా సిట్సిపాస్ అరుదైన ఘనత సాధించాడు.

డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి వరకు రెజ్లర్లతో అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛతేశ్వర్ పుజారా మరో ఘనత

టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్‌లో భారత్ తరుపున 12 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నప్పుడు పుజారా ఈ మైలురాయిని అందుకున్నాడు. సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 91 పరుగులు చేసి సత్తా చాటాడు.

గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్

టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు సీజన్ నడుస్తుంది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ ఇంక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ సుమారు 12,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.