13 Jan 2023

పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ

బెంగుళూరుకు చెందిన రైడ్-షేరింగ్ కంపెనీ ఓలా ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీ కొన్ని విభాగాల నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సిబ్బంది సంఖ్యను ఓలా ఇంకా నిర్ధారించలేదు.

ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి

పాఠశాలల్లో పాఠాలు బోధించే గురువును సంబంధించే అంశంపై కేరళ బాలల హక్కల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో ఉపాధ్యాయుడిని 'సార్' అని, ఉపాధ్యాయురాలినిని మేడమ్ అని సంభోదించవద్దని పేర్కొంది. పాఠశాలల్లో ఈ రెండు పదాలకు బదులుగా ఇద్దరినీ 'టీచర్' అని సంబోధించాలని సూచించింది.

ఆరోగ్యం: ముక్కుదిబ్బడ వల్ల గాలి పీల్చుకోలేక పోతున్నారా? ఈ చిట్కాలు చూడండి

ముక్కు దిబ్బడ వల్ల శ్వాస తీసుకోవడం కూడా కొన్ని సార్లు కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. ముక్కుదిబ్బడ వల్ల ముక్కు గట్టిగా మారుతుంది.

మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 12.68% పెరిగి డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,586 కోట్లు వచ్చాయి. కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో రూ.39,087 కోట్లు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 39,087 కోట్లు, ఇందులో రూ. 38,318 కోట్ల నికర అమ్మకాలు, రూ. 769 కోట్లు ఇతర ఆదాయాల ద్వారా వచ్చాయి.

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ ఇద్దరు రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ ఉన్నారు.

క్రెజ్‌సికోవాపై కసత్కినా 6-2, 7-5తో విజయం

అడిలైడ్ ఇంటర్నేషనల్ 2లో శనివారం జరిగే మహిళల సింగిల్స్ మ్యాచ్ ఫైనల్‌లో ఐదో సీడ్ డారియా కసత్కినా, ఎనిమిదో సీడ్ బెలిండా బెన్సిక్‌తో పోరాడింది.

వీరసింహారెడ్డి డైలాగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు??

సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపే అవకాశముందని తెలుస్తోంది.

5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ

భారతదేశంలో Lenovo Tab P11 5G ప్రారంభమైంది. 6GB/128GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ. 29,999. ఈ టాబ్లెట్ బ్రాండ్ ఇ-స్టోర్ తో పాటు అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.

ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది'

ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తాను ఆ మహిళపై మూత్ర విసర్జన చేయలేదని, ఆమెపై ఆమెనే చేసుకుందని కోర్టులో శంకర్ మిశ్రా తరఫు లాయర్ కోర్టులో వాదించారు.

IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 2023కి IMOTY లేదా ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ గెలుచుకుంది. ఈ మోటార్‌సైకిల్ తనతో పోటీ పడిన మరో తొమ్మిది బ్రాండ్లను ఓడించి కిరీటాన్ని గెలుచుకుంది. 15 మంది సీనియర్ మోటార్‌సైకిల్ జర్నలిస్టుల బృందం ఈ బైక్‌ను అగ్రస్థానానికి ఎంపిక చేసింది. TVS రోనిన్, సుజుకి V-Strom SX మొదటి, రెండవ రన్నరప్‌గా నిలిచాయి.

రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి ఎంటరైన కళ్యాణం కమనీయం?

సంక్రాంతి పండక్కి బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాల హవా నడుస్తుంటుంది. అందుకే చిన్న సినిమాలు ఆ టైమ్ లో దాదాపుగా రిలీజ్ అవ్వవు. కానీ శతమానం భవతి లాంటి సినిమాలు పెద్ద సినిమాల నడుమ రిలీజై దుమ్ము దులిపాయి.

రాహుల్ ద్రవిడ్‌కు అనారోగ్యం, చికత్స కోసం బెంగళూరు

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే తర్వాత ద్రవిడ్ వైద్య పరీక్షల కోసం బెంగళూరు వెళ్లాడు.

బాక్సింగ్ నుంచి మేరీ కోమ్ అవుట్..!

ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీకోమ్ 2023 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నుండి వైదొలిగింది. ఈ ఏడాది బాక్సింగ్ మహిళల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడం లేదని మేరీ కోమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ

దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మంది పోలీసులను సస్పెండ్ చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.

సంక్రాంతి: కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకునే ముక్కనుమ గురించి తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల భోగి, సంక్రాంతి, కనుమ అని మూడురోజులు జరుపుకుంటే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముక్కనుమ అని నాలుగవ రోజు కూడా జరుపుకుంటారు.

రాహుల్ ఐదో స్థానానికి ఫర్‌ఫెక్ట్..!

ఇండియా, శ్రీలంక మధ్య గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెఎల్ రాహుల్ ఆచితూచి ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. గతంలో టీమిండియా ఓపెనర్ గా వచ్చిన రాహుల్ గత రెండు సిరీస్ ల్లో తన స్థానాన్ని మార్చుకున్నాడు.

#DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే

నథింగ్ ఫోన్ కి సంబంధించిన హైప్ కొంతవరకు తగ్గింది అయితే భారతదేశంలో ఇది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన విజువల్ ఎలిమెంట్స్‌తో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ఆఫర్‌లతో, ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకు పొందవచ్చు.

నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి

మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

సంక్రాంతి: పండగ విశిష్టత, ప్రాముఖ్యత, జరుపుకునే విధానాలు

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారని మనకు తెలుసు. ఈ రోజు నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథున రాశులలో ఈ కాలం ఉంటుంది.

చెల్సియాపై 2-1 తో ఫుల్‌హామ్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 మ్యాచ్ లో ఫుల్ హామ్ 2-1తో చెల్సియాపై విజయం సాధించింది. ఫుల్‌హామ్‌కు పెనాల్టీని తోసిపుచ్చిన తర్వాత VAR, విల్లియన్‌ను అధిగమించాడు. మ్యాచ్ హాఫ్ టైం తర్వాత చెల్సియా, ఫుల్ హామ్ ను సమం చేసింది. కార్లోస్ వినిసియస్ 2006 తర్వాత మొదటిసారిగా చెల్సియాను ఓడించడంలో ఫుల్‌హామ్ సక్సస్ అయింది.

జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

భారత్‌తో టీ20 సిరీస్‌ జట్టును ప్రకటించిన కివిస్, కొత్త కెప్టెన్ ఇతడే

టీమిండియాతో టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను మిచెల్ సాంట్నర్‌కు అప్పగించారు. భారత్‌తో తలపడే జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

జనవరి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో Free Fire MAXని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి

రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్‌‌లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.

సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్‌లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్‌లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.

ది వాల్ బ్యాటింగ్ సీక్రెట్ ఇదే.. మాజీ ప్లేయర్ వెల్లడి

టీమిండియా లెజెండరీ ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.. ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్ జట్టుకు విజయాలను అందించాడు. క్రీజ్ లో పాతుకుపోయి రాహుల్ ద్రవిడ్ ది వాల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలర్లు ద్రవిడ్ ను ఔట్ చేయాలంటే పెద్ద సాహసమే చేసేవాళ్లు..జనవరి 11, 2023నాటికి రాహుల్ ద్రవిడ్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

మానసిక ఆరోగ్యం: మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ ఉండాలంటే ఇలా చేయండి

మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో మీరు కూడా అలాగే ఉంటారు. ఇది పాత సామెత కావచ్చు గానీ పచ్చినిజం. అందుకే మీ చుట్టూ ఎల్లప్పుడూ పాజిటివ్ పర్సన్స్ ఉండేలా చూసుకోవాలి.

ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్‌'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటున్న మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాల్లో నటిస్తూ టెలివిజన్ మీద టాక్ షోలు చేస్తూ తెలుగు వారందరికీ పరిచయమైంది మంచులక్ష్మీ.

భారత్ 48 ఏళ్ల కల నెరవేరేనా..?

హాకీ జట్టు అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలో పైనల్లో పాకిస్తాన్ ను ఓడించి 1975లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు సాధ్యం కాలేదు. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన జట్టు కనీసం సెమీఫైన్‌ల్‌కి కూడా చేరుకోలేదు.

సుడిగాలుల బీభత్సం: అమెరికాలో ఆరుగురు, జార్జియాలో ఒకరు దుర్మరణం

అమెరికాకు ఆగ్నేయం వైపు ఉన్న రాష్ట్రాలు, దేశాల్లో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు సుడిగాలల ధాటికి ఏడుగురు చనిపోయగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందల ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్

బ్రిటిష్ సంస్థ MG మోటార్ దాని పూర్తి-పరిమాణ MPV Euniq 7ను ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేసింది. ఇది వివిధ గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న హైడ్రోజన్-శక్తితో పనిచేసే Maxus Euniq 7 వ్యాన్ రీ-బ్యాడ్జ్ వెర్షన్. ఇది పర్యావరణ అనుకూల వాహనం. MG 2019లో భారతీయ మార్కెట్లో హెక్టర్‌తో ప్రారంభించింది. ఇది ఫీచర్-ప్యాక్డ్ మిడ్-సైజ్ SUV ఆఫర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది.

మిస్ యూనివర్స్ 2023: బంగారు పక్షి కాస్ట్యూమ్ లో దివితా రాయ్

71వ మిస్ యూనివర్స్ ఈవెంట్ లో భారతదేశం తరపున దివితా రాయ్ పాల్గొంటుంది. ఈ ఈవెంట్ లో భాగంగా జాతీయ విభాగంలో బంగారు పక్షి కాస్ట్యూమ్ లో దర్శనమిచ్చింది దివితా రాయ్.

NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (NOTAM) అనే వ్యవస్థ వలన అంతరాయం ఏర్పడి వేలాది విమానాలు ఆగిపోయాయి. అంతరాయం ఫలితంగా 9,700 విమానాలు ఆలస్యం అయ్యాయి, అంతేకాకుండా 2,800 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి.

హాఫ్ సెంచరీతో టీమిండియాను గట్టెక్కించిన కేఎల్ రాహుల్

టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ గెలుపులో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ ప్రముఖ పాత్ర పోషించాడు. భారత్ కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో రాహుల్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కేఎల్ రాహుల్ హార్ధిక్ పాండ్యాతో కలిసి 75 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ: చిరంజీవి అభిమానులకు పూనకాలు

సంక్రాంతి సంబరాన్ని తీసుకొస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆల్రెడీ అమెరికా నుండి సినిమా మీద రిపోర్టులు వస్తున్నాయి. ఆ రిపోర్టులు సినిమా గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం.

వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి, 43 ఓవర్లకు టీమిండియా చేధించింది. కేఎల్ రాహుల్ చివర వరకు నిలబడి భారత్‌కు గెలుపును అందించారు. అంతకుముందు సిరాజ్, కుల్దీప్ లు చక్కటి బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

సోషలిస్టు నేత, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.