LOADING...

22 Dec 2022


నాపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది : మాజీ టెన్నిస్ స్టార్

జర్మన్ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, వింబుల్డన్ విజేత బోరిస్ బెకర్ ఎనిమిదిమాసాల కారాగారవాసం తరువాత విడుదలయ్యాడు. రూ. 5 కోట్ల పౌండ్లు ఎగ్గొట్టి దివాళా ప్రకటించిన నేరానికి లండన్ కోర్టు దోషిగా ప్రకటించడంతో బెకర్‌కు జైలుశిక్ష పడింది.

3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌

జియో అనుబంధ సంస్థ ముంబై రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ మొబైల్ టవర్, ఫైబర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్‌బిఐ ఎస్క్రో ఖాతాలో రూ. 3,720 కోట్లు జమ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నవంబర్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలుపై జియోకు ఆమోదం తెలిపింది.

మీ డైట్ ని మరింత ఆరోగ్యంగా మార్చే ఆయుర్వేద ఆహారాలు

మీరు ఆరోగ్యంగా ఉన్నారని మీకెలా అర్థమవుతుందో మీరెప్పుడైనా గమనించారా? రోజువారి జీవితంలో ఉరుకుల పరుగుల ఉద్యోగాల్లో ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెక్ చేసుకునే సమయం కూడా లేకుండా పోయింది.

భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్

భారత్ జూడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తన పాదయాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోందని రాహుల్ అన్నారు. బీజేపీ పాలకులు సత్యానికి భయపడుతున్నారని చెప్పారు.

12 ఏళ్ల తరువాత టెస్టులోకి జయదేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ

భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్ లో జరిగే రెండో టెస్టులో చోటు సంపాదించుకున్నాడు. రెండు టెస్టుల మధ్య భారత క్రికెటర్‌గా అత్యధిక గ్యాప్‌ను నమోదు చేసిన ఘనత జయదేవ్ ఉనద్కత్‌కు దక్కింది.

మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా?

2022 క్రిప్టో కరెన్సీకు పెద్దగా కలిసిరాలేదు, కాకపోతే క్రిప్టో చరిత్రలో నిలిచిపోయే LUNA క్రాష్, FTX పతనం పాటు మార్కెట్లో అనేక ఇతర నష్టాలు సంభవించాయి. అయితే సరైన నిర్ణయాలతో లాభం పొందే అవకాశాలు ఇంకా ఉన్నాయి.

'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు

దేశంలోని కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఉభయ సభల్లో కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుటుందని చెప్పారు. రానున్నవి పండగ రోజులని, ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ తొలగింపు

ఇంగ్లాడ్ తో జరిగిన టెస్టు సీరిస్ ను పాక్ 3-0 తో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే నాజామ్ సేథీ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించింది.

PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు

ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తూ, పీఎఫ్‌ జీతంలో కట్ అవుతున్నవారికి ఇది శుభవార్త.

సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట!

సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం‌కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నరహంతకుడిని ఎలా విడదుల చేస్తారంటూ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ దేశ చట్టం ప్రకారమే చార్లెస్ శోభరాజ్‌ విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మంచి ప్రవర్తనతో 75శాతం జైలు శిక్షను పూర్తి చేసిన ఖైదీలను విడుదల చేయొచ్చని ఆ దేశ చట్టం చెబుతోంది.

మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..?

ఐపీఎల్‌ వేలానికి టైమ్‌ దగ్గర పడింది. రేపు ఈ మినీ వేలం జరగనుంది. 16వ ఎడిషన్‌ ఐపీఎల్‌ కోసం ఈసారి మినీ వేలం జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు వేలంలోపాల్గొనున్నాయి. ఆటగాళ్ల వేలం కోసం జట్లు కొచ్చిలోని పిట్‌స్టాప్‌లో సమావేశమవుతాయి.

మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త

అతను అనుకుంటే విలాసవంతమైన జీవితం తన కాళ్ల ముందుకు వస్తుంది. చుట్టూ పదిమంది పనివాళ్లతో దర్జాగా బతికే అవకాశం ఉన్నా.. అతనికి ఆ జీవితం సంతృప్తిని ఇవ్వలేదు. రూ.కోట్లలో జీతం.. అతి పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి జైన సన్యాసిగా మారాడానికి ముందుకొచ్చాడు మధ్యప్రదేశ్ కు చెందిన ప్రన్సుఖ్ కాతేడ్(28).

రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం

నటనకు నిర్వచనమైన మన మెగాస్టార్ చిరంజీవి, నటుడిని నిర్వచించే పాత్రలు ఎన్నో చేసారు. కానీ మొదటిసారిగా నటుడిని నిర్వచిస్తూ షాయరీని వినిపించారు.

7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్

BMW జనవరి 7న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరిగే "జాయ్‌టౌన్" ఈవెంట్‌లో 7 సిరీస్, సరికొత్త i7ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2022 ఏప్రిల్‌లో వివిధ గ్లోబల్ మార్కెట్లలో ఈ సంస్థ ప్రీమియం కార్లను విడుదల చేసింది.

ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట..

కరోనా కేసులతో చైనా అల్లాడిపోతంది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓ చైనీస్ సింగర్ మాత్రం కరోనా పట్ల వింతగా ప్రవర్తించింది. అందరూ కరోనాకు దూరంగా ఉంటుంటే.. చైనాకు చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత జేన్ జాంగ్ మాత్రం కరోనాను కావాలనే అంటించుకుంది.

నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు

ఈ కాలంలోనే కాదు ఏ కాలంలో అయినా అన్నింటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. డబ్బు లేకపోతే ఎలాగోలా బతుకు బండిని నడిపించవచ్చు కానీ ఆరోగ్యం లేకపోతే బతుకు బండి ముందుకు నడవదు.

కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌

జాతీయ జట్టులో స్థానం కోల్పోవడం పెద్ద సవాల్.. మళ్లీ జట్టులో స్థానం సంపాదించడం అంత తేలికమైన విషయం కాదు.. భారత్ క్రికెట్ జట్టులో ఇది మరింత కష్టమని చెప్పొచ్చు. అయితే రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు.

'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు

ఏపీ సీఎం జగన్‌పై సంచనల ఆరోపణలు చేశారు కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా అందులో అవినీతి కోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బైజూస్ తో ఒప్పందం విషయంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని, ఫలితంగా రూ. 1400 కోట్లు వృథా అవుతోందని సంచలన ఆరోపణపు చేశారు.

4 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్న సంవత్సరాంతపు కార్ల ధర తగ్గింపులు

కొత్త కారు కొనాలని అనుకుంటే దానికి ఇదే సరైన సమయం. మెరుగైన ఉత్పత్తి నేపథ్యంలో పెండింగ్‌-అప్ డిమాండ్ తగ్గిపోవడం వలన కార్ల తయారీదారుల నుండి ఈ తగ్గింపులు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. డీలర్‌షిప్‌లు 25,000 నుండి 1,00,000 వరకు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..!

గుజరాత్ టైటాన్స్ జట్టులో అద్భుతంగా రాణించిన హర్థిక్ పాండ్యాకు అరుదైన అవకాశం లభించనుంది. కెప్టెన్సీ బాధ్యత నుంచి రోహిత్ శర్మను తప్పించి, టీ20 అల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు టీ20 సారథిగా నియమించే అవకాశం ఉంది. T20 WCలో పేలవప్రదర్శన చేసిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో హార్థిక్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని BCCI భావిస్తోందని సమాచారం.

అవతార్ 2: ఈ పాయింట్స్ ఉండుంటే అదిరిపోయేదేమో

2009లో వచ్చిన అవతార్ సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. విజువల్స్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే సహా ఈ సినిమాలో ప్రతీదీ ప్రేక్షకుడి మతి పోగొట్టింది.

దేశంలో 37.16 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్లాక్

భారతదేశంలో నవంబర్‌లో 37.16 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ బుధవారం తెలిపింది. గత నెలలో నిషేధించిన ఖాతాల కంటే 60 శాతం ఎక్కువని సంస్థ తెలిపింది. దీంతో దేశంలో నిషేధించబడిన వాట్సాప్ ఖాతాలు 9.9 లక్షలకు చేరాయి.

ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారుల ఫోన్ చార్జీలు పెరుగుదలకు కంపెనీల రాబడిపై ఒత్తిడి పెరగడం కారణం. సెప్టెంబర్ త్రైమాసికంలో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, జియోలు ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయంలో లాభాలను పొందాయి.

'మేం సీ టీమ్‌ల‌తోనే ఆడతాం.. మా వల్ల కాదు' పాక్ మాజీ అటగాడు

ఇంగ్లాడ్ చేతిలో టెస్టు సిరీస్ ను 3-0 తేడాతో పాక్ ఓడిపోయింది. ప్రస్తుతం బాబార్ అజామ్ నాయకత్వంపై విమర్శలు వర్షం కురిస్తోంది. ఓటమికి బాబరే కారణంగా పాక్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో..

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల మహోత్సవం మరో మూడు నెలల్లో ఉండనుంది. ఈ మూడు నెలల ముందు నుండే ఆస్కార్ సందడి మొదలైంది.

చలికాలంలో చల్లగా హిమక్రిములు లాగించేద్దాం

చలికాలంలో ఐస్ క్రీం తినాలని అనిపించడం సహజమే, అలా తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

శీతాకాలంలో దొరికే పండ్లు వాటి ఆరోగ్య ప్రయోజనాలు

ఏ రుతువులో దొరికే పండ్లు ఆ రుతువులో తినాలని చెబుతారు. ప్రస్తుతం చలికాలం నడుస్తోంది కాబట్టి ఏయే పండ్లు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్యం లభిస్తుందో చూద్దాం

గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్‌లకు ఐసీసీ చెత్త రేటింగ్

గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్ లకు ఐసీసీ చెత్త రేటింగ్ ఇచ్చింది. ఈ పిచ్ లు టెస్టుకు అనుకూలంగా లేనట్లు పేలవమైన రేటింగ్ ఇచ్చింది. గబ్బాలో ఆస్ట్రేలియాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓడిపోయింది.

భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే..

చైనాలో కరోనా విజృంభించడానికి కారణమైన BF.7 వేరియంట్‌.. భారత్‌ను సైతం వణికిస్తోంది. దేశంలో నాలుగు కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే నిపుణులు మాత్రం భారత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. భారత్‌లో నమోదైన నాలుగు కేసులు కూడా.. తాజాగా వచ్చినవి కావని, జూలై, సెప్టెంబర్, నవంబర్‌లో కనుగొనబడినట్లు చెబుతున్నారు.

2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం

2022 కృతిమ మేధస్సుకు ఒక మైలురాయి లాంటి సంవత్సరం. OpenAI, Meta, DeepMind, Google, Baidu వంటి సంస్థలు తమ ప్రత్యుర్ధులకు ధీటుగా సరికొత్తగా AI మోడల్స్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం టాప్ ఐదు AI మోడల్స్ గురించి తెలుసుకుందాం OpenAI సంస్థ వారి ChatGPT, అత్యంత శక్తివంతమైన లాంగ్వేజ్ ప్రొసెసింగ్ టూల్స్ లో ఒకటి. సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడం, వ్యాసాలు రాయడం, వ్యాపార ఆలోచనలను రూపొందించడం అనేక అంశాలలో సహాయం చేయగలదు.ఇది సంభాషణ సమాధానాలను, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు.

రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే

ప్రపంచ గణిత మేధావుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకునే శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును (డిసెంబర్ 22) జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో

తెలుగు టెలివిజన్ లో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో మార్పులు రానున్నాయి. గత నాలుగు సీజన్ ల నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున, బిగ్ బాస్ నుండి తప్పుకుంటున్నాడని అంటున్నారు.

సోషల్ మీడియాతో విసిగిపోయారా? ఆన్ లైన్ లో ఈ పనులు మొదలు పెట్టండి

కొన్ని కొన్నిసార్లు టైమ్ ఎంతకీ గడవదు. ఏదో తెలియని బోరింగ్ ఫీలింగ్ మనల్ని ఆక్రమించుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంటుంది.

'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్

ఐఫోన్ ను క్యారియర్ అన్ లాక్ చేసి, PS3ని బ్రేక్ చేసిన మొదటి వ్యక్తి హట్జ్.. మంగళవారం ట్విట్టర్ ఇంటర్న్ షిప్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ

భారతదేశంలో వీడియో కంటెంట్ మార్కెట్ అభివృద్ధిచెందుతోంది. 2022లో OTT ఆదాయం $2 బిలియన్లు వచ్చాయి, రాబోయే మూడేళ్లలో $18 బిలియన్ల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, OTT ప్రొడక్షన్ హౌస్‌ల పెరుగుదలకు ఇది కూడా కారణం అయింది. ఈ నేపథ్యంలో వీడియో పరికరాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

హ్యాకింగ్‌కు గురైన చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'నియో'

చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం నియో కంపెనీ సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్ బారిన పడింది. తమ సంస్థకు చెందిన కంప్యూటర్లలోని వినియోగదారులు, వాహనాల అమ్మకాల డేటాను హ్యాకర్లు చోరీ చేసినట్లు నియో యాజమాన్యం ప్రకటించింది.

21 Dec 2022


మణిపూర్ లో ఘోర విషాదం.. టూరిస్టు బస్సు ఢీకొని..

మణిపూర్ ఘోర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న రెండు టూరిస్టు బస్సులు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన మణిపూర్‌లోని నోనీ జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రభాస్ సినిమా నుండి పక్కకు తప్పుకున్న ఇస్మార్ట్ హీరోయిన్?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్, సాహో, రాధేశ్యామ్ సినిమాల ద్వారా డిజాస్టర్లు మూటకట్టుకున్నాడు.

'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ

'భారత్ జోడో యాత్ర'లో కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాసిన లేఖపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శాలను జారీ చేసింది.

ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

రెండు వారాల పాటు టమోటాలను అధికంగా ఆహారంలో చేర్చడం వలన ప్రేగులలో అనుకూలమైన బ్యాక్టీరియాను పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాండవీయ స్పష్టం చేశారు.

డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు

పాకిస్థాన్ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా దిగుమతి అవుతున్న డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫోకస్ పెట్టింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని డ్రగ్స్ సరఫరాకు సంబంధమున్నట్లు అనుమానిస్తున్న గ్యాంగ్ స్టర్ల ఇళ్లు, వారికి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సన్నిహితులను టార్గెట్ చేశారు అధికారులు.

ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు

గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో భాగంగా ఇండియాకి వచ్చిన సుందర్ పిచాయ్, టెక్నాలజీ పరంగా ఎన్నో అవకాశాలున్న దేశంగా ఇండియా ఉందని పేర్కొన్నాడు.

ట్రంప్ కు ఎదురుదెబ్బ... మద్దతుగా US ప్యానల్

మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పన్ను రిటర్న్‌లను రక్షించుకోవడానికి తీవ్రంగా పోరాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. US అధ్యక్షులు దశాబ్దాలుగా తమ పన్ను రిటర్న్‌లను విడుదల చేయడం లేదు.

దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు

దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లోనూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరుతో పాటు దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్లు ఉన్నాయి. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి పేర్లను కూడా ఈడీ చేర్చింది.

రికార్డుల సునామి సృష్టించిన కాంతారా

కాంతారా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రం, KGF: చాప్టర్ 2 కంటే రాష్ట్రంలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

కంటి సంరక్షణ కోసం 6 చిట్కాలు పాటించండి

శరీరంలో కళ్ళు చాలా ముఖ్యం వాటిని సంరక్షించుకోవడానికి ఇవి పాటించండి

సపోటా లాంటి ఈ పండు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్

అబియూ ఫ్రూట్, దక్షిణ అమెరికా, పెరూ, కొలంబియా, బ్రెజిల్, వెనిజులా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండును ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తారు.

తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే

2022లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సూపర్ హిట్ అయ్యిన మూవీస్ ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి బరిలో థియేటర్లలో తెలుగు సినిమాలు మాత్రమే

ఇప్పుడు సినిమా పరిశ్రమ దృష్టి అంతా వచ్చే సంక్రాంతి పండగ మీద ఉంది.

'క్రిస్మస్ క్రాక్' వైరల్ అవుతున్న సరికొత్త వంటకం

పండగ సందర్భంగా కొత్తగా వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ క్రాక్ ను ప్రయతించచ్చు. #ChristmasCracks అనే వంటకం మేరీ సోమర్ అనే ఫుడ్ క్రియేటర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 60 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

యోగసనాలతో ముడతలు దూరం

ఈ యోగాసనాలు చేస్తే చర్మం ముడతలు పడకుండా అందంగా తయారవుతుంది

విదేశాల్లో సేవా కార్యక్రమాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానులు చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ క్యాడర్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

మూడు రాజధానులు V/S ఒక రాజధాని..!

ఏపీలో అప్పుడే రాజకీయ వేడీ మొదలైంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపైనే వైసీపీ, టీడీపీ, జనసేన దృష్టి సారించాయి.

ప్రభాస్ కంటే బాలయ్య చాలా ఎక్కువ.. నయనతార

ఈ మధ్య పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించని నయనతార, తమిళ అనువాద చిత్రం కనెక్ట్ తో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవనుంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మెదడులో సెరెటోనిన్ స్థాయిలను పెంచుకోండిలా

మీ మెదడులో సెరెటోనిన్ అనే రసాయనం కావాల్సినంత మోతాదులో విడుదల కాకపోతే మీకు నిద్ర సరిగ్గా పట్టదు, ఊరికే అలసిపోతారు. కోపం పెరుగుతుంది. జీర్ణసమస్యలు తలెత్తుతాయి. ఆకలి తగ్గిపోతుంది.

వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు

నూతన సంవత్సరం సమీస్తున్న వేళ ప్రపంచమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం భారత్‌కు ఆర్థిక మాంధ్య భయాలు ఇప్పటికి తొలిగిపోలేదు. ప్రస్తుతం విమానాయాన సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు, రిటైల్ దుకాణాలు నష్టాల్లో నడుస్తున్నాయి.

మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

చైనాతో పలు దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల నమూలనాలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం వారానికి 1,200 కేసులు నమోదవుతున్నాయి.

పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా

2005లో 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది తమన్నా. ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ డేస్' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత 'కాళీదాసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2006లో 'కేడి' సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన తమన్నా అక్కడ కార్తీ లాంటి హీరోలతో చేసిన సినిమాలతో హిట్స్ సంపాదించారు.

జీవిత కాల కష్టాల్లో ఫేస్ బుక్.. ఉద్యోగుల ఉద్వాసన ఫేస్ బుక్ ని ముంచేయనుందా?

మెటాగా పేరు మార్చుకుని మెటావర్స్ సృష్టించడంలో బిజీగా ఉన్న ఫేస్ బుక్, ప్రస్తుతం తన జీవిత కాలంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటుంది. ఈ మేరకు సంస్థ సీటీవో (ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) ఆండ్రూ బాస్ వర్త్ తెలిపారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ

టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీ వివరాలను జైశంకర్ ట్విటర్ వేదికగా తెలిపారు. పిచాయ్‌తో అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాలు, డిజిటలైజేషన్ గురించి చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.