ఐసీసీ ర్యాకింగ్స్ మెన్: వార్తలు

టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ గా సూర్యకుమార్ యాదవ్

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను ఆప్డేట్ చేసింది. కాగా టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

వరుస డకౌట్లు.. అయినా అగ్రస్థానంలో సూర్య

ఇటీవల చెత్త ప్రదర్శనతో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు.

ఐసీసీ నెంబర్.1 టెస్టు బౌలర్‌గా అశ్విన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. గతవారం ఐసీసీ నెంబర్ వన్ 1 టెస్టు బౌలర్ గా అవతరించిన జేమ్స్ అండర్సన్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రాణించలేకపోయాడు. దీంతో రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ సత్తా

హసరంగా టీ20 ఫార్మాట్‌లో సంచలనం సృష్టించాడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ సత్తా చాటాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను హసరంగ వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఇదే విషయాన్ని ప్రకటించింది.