ఫీచర్: వార్తలు
మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV
మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త కూపే SUV ఫ్రాంక్స్‌ను విడుదల చేసింది. ఇందులో బాలెనో RS మోడల్‌లో చివరిగా కనిపించిన అత్యంత ప్రశంసలు పొందిన 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా రకాల్లో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది
హ్యుందాయ్ తన ఎంట్రీ-లెవల్ వాహనం గ్రాండ్ i10 NIOS 2023 వెర్షన్ లాంచ్ చేసింది. ప్రస్తుతం బుకింగ్స్ తెరిచారు. అప్‌డేట్ చేసిన ఈ మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్‌కి పోటీగా ఉంటుంది.
ఆటో ఎక్స్‌పో 2023లో EV9తో పాటు ఇతర కార్లని ప్రదర్శించిన కియా సంస్థ
ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశంలో వివిధ మోడళ్లను కియా మోటార్స్ ప్రదర్శించింది. బ్రాండ్ EV9 కాన్సెప్ట్, KA4 (కార్నివాల్)తో పాటుగా భారతదేశంలో ఇప్పటికే ఉన్న EV6, సెల్టోస్, సోనెట్ వంటి కొన్ని కార్లను విడుదల చేసింది. కియా మోటార్స్ తన సెల్టోస్ SUV 2019లో 44,000 కంటే ఎక్కువ అమ్మకాలతో భారతీయ మార్కెట్లో ప్రభంజనం సృష్టించింది.
ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం IONIQ 5 ను భారతీయ మార్కెట్ కోసం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో ఈ బ్రాండ్ జనవరి 13నుండి 18 వరకు సాధారణ ప్రజలకు కోసం ప్రదర్శిస్తోంది. దీనికి ప్రత్యేకమైన డిజైన్ తో పాటు ఫీచర్-రిచ్ క్యాబిన్ ఉంది.
ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్
ముంబైకి చెందిన లిగర్ మొబిలిటీ తన స్కూటర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. వాటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి.
టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో తన Ace EV మినీ ట్రక్కు డెలివరీలను ప్రారంభించింది. ఇది మే 2022లో ఇక్కడ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక బాక్స్ లాగా ఉంటుంది, 600 కిలోల వరకు పేలోడ్‌ను మోయగల తేలికపాటి కంటైనర్ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జీకి 154కిమీల వరకు నడుస్తుంది.
Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక
భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ మార్కెట్లో పోటీపడుతున్న Realme, Redmi వంటి బ్రాండ్‌లు అనేక రకాల ఆఫర్‌లతో కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన Redmi Note 12కు పోటీగా Realme భారతదేశంలో Realme 10ని ప్రకటించింది.
భారతదేశంలో 2023 BMW 3 సిరీస్ గ్రాన్-లిమౌసిన్ ధర రూ. 58 లక్షలు
జర్మన్ వాహన తయారీ సంస్థ BMW తన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కారు 2023 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 330Li M స్పోర్ట్, 320Ld M స్పోర్ట్. అప్‌డేట్ చేయబడిన డిజైన్, విలాసవంతమైన క్యాబిన్ టెక్-ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్ తో అందుబాటులో ఉంది.
2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా
హోండా తన SUVని మే 2023 నాటికి భారతదేశంలో లాంచ్ పండుగ సీజన్‌లో అమ్మకాలు మొదలుపెట్టే అవకాశముంది. తాజా అప్డేట్ లో , ఈ బ్రాండ్ వాహనం టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది.
ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం
ప్రపంచవ్యాప్త డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) కంటే ముందుగా అందరూ ఎదురుచూస్తున్న మిశ్రమ-రియాలిటీ హెడ్‌సెట్‌ను ఆపిల్ ఆవిష్కరించవచ్చు. ఈ AR/VR హెడ్‌సెట్ దాదాపు $3,000 (దాదాపు రూ. 2.47 లక్షలు) ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) అనుభవాలను అందించడానికి ఆపిల్ కొత్త xrOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.
మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు
మహీంద్రా తన Thar SUV 2WD వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. మహీంద్రా ఇండియా లైనప్‌లో Thar ఒక సమర్థవంతమైన ఆఫ్-రోడర్. దీన్ని మరింత సరసమైనదిగా చేయడానికి, బ్రాండ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 2WD వెర్షన్‌ను పరిచయం చేసింది.
భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారతీయ మార్కెట్ కోసం మిడ్-సైజ్ ప్రీమియం SUV, 2023 GLCను డిసెంబర్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ వెర్షన్ లో SUVలో ఫ్రంట్ ఫాసియా ఉంది. వీల్‌బేస్‌ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, ఫోర్-వీలర్ మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది.
టాప్ లో ఉండాల్సింది ఏది? BMW 7 సిరీస్ v/s మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్
BMW భారతీయ మార్కెట్లో 7 సిరీస్ ధర రూ. 1.7 కోట్లగా నిర్ణయించింది. జర్మన్ మార్క్ ప్రీమియం సెడాన్ విభాగంలో అగ్రస్థానం కోసం స్వదేశీ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్‌తో పోటీపడుతుంది.
18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14
ASUS సంస్థ ప్రోడక్ట్ Vivobook సిరీస్ ఆధునిక డిజైన్ తో, మంచి పనితీరుతో, యువ కస్టమర్లు కోరుకునే ఫీచర్స్ తో వస్తుంది. ASUS Vivobook 14 గేమింగ్ కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.
మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు
స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి SUV సరికొత్త S-CNG వెర్షన్ గ్రాండ్ విటారాను భారతదేశంలో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆధారంగా, CNG-శక్తితో పనిచేసే SUV డెల్టా, జీటా వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ఈ ప్రీమియం మిడ్-సైజ్ SUVకి 26.6km/kg ఇంధన సామర్ధ్యం ఉందని పేర్కొంది.
Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు
CES 2023లో, సరికొత్త టెక్నాలజీ వినియోగదారుల ముందుకు వచ్చింది. వివిధ ప్రసిద్ధ బ్రాండ్‌ల నుండి ల్యాప్‌టాప్స్ అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. కొత్త తరం ఫీచర్‌లు, తాజా హార్డ్‌వేర్, అత్యుత్తమ-నాణ్యత డిస్‌ప్లే ల్యాప్‌టాప్‌ల కోసం వెతుకుతున్న కొనుగోలుదారులని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ప్రపంచ ప్రసిద్ధ టెక్ ఈవెంట్‌లో Acer, Razer, MSI, ASUS నుండి లాంచ్ అయిన కొత్త ల్యాప్‌టాప్స్ గురించి తెలుసుకుందాం.
లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్
లాస్ వెగాస్‌లోని CES 2023లో Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శించింది దాని తయారీసంస్థ. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ఫాస్ట్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కేవలం ఐదు నిమిషాల్లో 150కిమీల వరకు వెళ్లగలదు. ఇందులో వీడియో గేమ్స్ లో ఉన్నట్టు దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్‌ను ఉపయోగించే హైపర్‌స్క్వేర్ స్టీర్-బై-వైర్ కంట్రోల్ సిస్టమ్‌తో వచ్చే ఐ-కాక్‌పిట్ కూడా ఉంది.
ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్
Keeway సంస్థ Moto Bologna Passione (MBP) త్వరలో అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI) ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. క్రూయిజర్‌తో పాటు, వాహన తయారీ సంస్థ M502N స్ట్రీట్‌ఫైటర్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది, గ్లోబల్ తయారీ సంస్థలు ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.
ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్
ఫోన్‌లను మార్చినప్పుడు వాట్సాప్ చాట్ హిస్టరీని బదిలీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. గత సంవత్సరం, ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ చాట్‌లను సులభంగా తరలించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ఈ కంపెనీ ఇప్పుడు చాట్ చరిత్రను కొత్త Android డివైజ్ కు సులభంగా ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్‌పై పని చేస్తోంది.
మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మారుతీ-సుజుకి NEXA బ్లాక్ ఎడిషన్ మోడల్స్
భారతదేశంలో 40 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి గుర్తుగా, స్వదేశీ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి NEXA సిరీస్ లో ప్రత్యేక బ్లాక్ ఎడిషన్ మోడల్స్ ను విడుదల చేసింది. అన్ని కార్లు ప్రత్యేక 'పెరల్ మిడ్‌నైట్ బ్లాక్' పెయింట్ స్కీమ్‌తో వస్తున్నాయి.
సబ్-బ్రాండ్ AFEELAని ప్రకటించిన సోనీ హోండా మొబిలిటీ
CES 2023లో టెక్నాలజీ దిగ్గజం సోనీ, జపనీస్ ఆటోమేకర్ హోండా మధ్య జాయింట్ వెంచర్ అయిన AFEELA అనే EV సబ్-బ్రాండ్‌ను ప్రకటించారు.
Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం బ్లాగ్ పోస్ట్‌లో OpenAI, DALL-E 2 నుండి ఇమేజ్-జెనరేషన్ సాఫ్ట్‌వేర్‌ను Bingకి అనుసంధానించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది.
ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023 MG 4ని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయింది.
CES 2023లో సరికొత్త Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ ప్రారంభం
CES 2023లో గేమింగ్ పరిశ్రమ కోసం Govee మొట్టమొదటిసారిగా AI-ఆధారిత లైటింగ్ సొల్యూషన్‌ను పరిచయం చేయబోతుంది. దీనిని Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ అని అంటారు. ఇది ఆన్-స్క్రీన్ గేమింగ్ కంటెంట్ నుండి కీలక విషయాలను విశ్లేషించడానికి, వాటిని సాంకేతికత ఉపయోగించి మళ్ళీ సరికొత్త లైటింగ్ ఎఫెక్ట్స్ తో చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇది 2023లో లాంచ్ అవుతుందని ప్రకటించారు కానీ ధర ఇంకా వెల్లడించలేదు.
కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఈరోజే విడుదల చేసింది. Poco C50 పెద్ద 6.5-అంగుళాల డిస్ప్లేతో, 5000mAh బ్యాటరీ, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఫోన్‌లను విడుదల చేయడం లేదు. భారతదేశంలో రూ. 10,000 లోపు ఉన్న ఫోన్‌ను పొందడం కొనుగోలుదారులకు కష్టమవుతోంది. అయితే, Poco C50తో ఇప్పుడు పరిస్థితి మారబోతుంది.
ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!
సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్
ఆపిల్ చౌకైన ఎయిర్‌పాడ్స్ ఇయర్‌బడ్‌లపై పనిచేస్తోంది, వాటినే "AirPods Lite" అంటారు. AirPods డిమాండ్ 2022లో 73 మిలియన్ యూనిట్ల నుండి 2023లో 63 మిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కంపెనీ సరసమైన ఇయర్‌బడ్‌లపై పని చేస్తోందని విశ్లేషకులు సృష్టం చేసారు.
భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు
కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం.
2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో వినియోగదారులు ఆశిస్తున్న మార్పులు
2022 స్మార్ట్‌ఫోన్ తయారీలో పెద్దగా మార్పులు రాలేదు. అన్నీ బ్రాండ్లు పెద్దగా మార్పులు లేని విభిన్న వెర్షన్ స్మార్ట్ ఫోన్లు అందించాయి. అయితే 2023లో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు నుండి వినియోగదారులు కోరుకునే మార్పులు ఏంటో చూద్దాం.
జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి
భారతదేశంలో POCO C50 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జనవరి 3న విడుదల కాబోతుంది. ఇందులో MediaTek లేదా JLQ నుండి ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. JLQ మార్కెట్లో కొత్త, Android ఆధారిత హ్యాండ్‌సెట్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం SoCల తయారీపై దృష్టి పెడుతుంది.
2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి
టాటా ఫ్లాగ్‌షిప్ SUV, సఫారి, 2023లో అప్‌డేట్ వస్తుంది. SUV గత సంవత్సరం అప్డేట్ లాంచ్ అయినప్పటి నుండి మంచి అమ్మకాలను సాధిస్తోంది. అయితే, మహీంద్రా XUV700, స్కార్పియో N రాక 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగింది. ఈ రెండు మోడల్స్ సఫారి కంటే మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి.
చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్
Redmi K60 సిరీస్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో Redmi K60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు ప్రస్తుతం తెలియదు కానీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E మోడల్స్ ఉన్నాయి.
2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N
keeway యాజమాన్యం నుండి వస్తున్న Moto Bologna Passione లేదా MBP త్వరలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో తన మొదటి M502Nని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది ఈ సంస్థ.
వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme
240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మొట్టమొదటి ఫోన్ రాబోతుంది. అదే Realme సంస్థ విడుదల చేయనున్న GT Neo 5. టెక్నాలజీ కమ్యూనికేషన్ సమావేశంలో జనవరి 5, 2023న తన ఫ్లాష్-చార్జింగ్ ఆవిష్కరణను ఆవిష్కరించబోతుంది.
మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్
స్వదేశీ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో-ఎన్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ నుండి మిడ్-స్పెక్ వరకు ఐదు కొత్త వేరియంట్‌లను విడుదల చేయనుంది. SUVలో ఇప్పుడు ఇంజిన్ (పెట్రోల్/డీజిల్), ట్రాన్స్‌మిషన్ (మాన్యువల్/ఆటోమేటిక్), సీటింగ్ (ఆరు/ఏడు) ఆప్షన్స్ బట్టి 30 రకాల వేరియంట్‌లు ఉన్నాయి.
టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్
టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుండగా, టాటా మోటార్స్ దానికి బదులుగా SUVలో మరొక ఎడిషన్ వెర్షన్‌ను తీసుకురావడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల టాటా హారియర్ డార్క్ ఎడిషన్ కొన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. ఇందులో రెడ్-థీమ్ హైలైట్
HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర
HONOR తన తాజా స్మార్ట్‌ఫోన్ HONOR 80 GTని, కొత్త టాబ్లెట్ Pad V8 Proని విడుదల చేసింది. ఆసియా మార్కెట్లలో Honor జోరందుకుంది. మాతృ సంస్థ నుండి విడిపోయిన తరువాత తన ఖ్యాతిని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది.
అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు
2022లో మెరుగైన, ఉపయోగకరమైన ఫీచర్స్ తో వినియోగదారులను మెప్పించిన టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే
సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్
ప్రముఖ బ్రాండ్ boAT మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ అనుకూలమైన ధరతో లాంచ్ అయినప్పటికీ, ఇది బ్లూటూత్ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఇటువంటి ఫీచర్ ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లకు మాత్రమే పరిమితం అయ్యివుండేది.
7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్
BMW జనవరి 7న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరిగే "జాయ్‌టౌన్" ఈవెంట్‌లో 7 సిరీస్, సరికొత్త i7ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2022 ఏప్రిల్‌లో వివిధ గ్లోబల్ మార్కెట్లలో ఈ సంస్థ ప్రీమియం కార్లను విడుదల చేసింది.