ఫీచర్: వార్తలు

భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో 2023 ALCAZAR SUV కోసం బుకింగ్‌లు ప్రారంభించింది. రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఇది MG హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700, టాటా సఫారి, టయోటా ఇన్నోవా హైక్రాస్‌లకు పోటీగా ఉంటుంది.

డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 SUVని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది HSE, X అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 3.0-లీటర్, ఆరు-సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో వస్తుంది.

మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో

బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి బెంగళూరుకు చెందిన Yulu, మిరాకిల్ GR, DeX GR అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రదర్శించారు. బజాజ్ కు Yulu తన రెండవ తరం ఈ-స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడింది, దానితో పాటు కొన్ని భాగాలను ఉత్పత్తి చేసింది.

ChatGPT లాంటిదే అభివృద్ధి చేయడానికి టీంను నియమించనున్న ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్, బాబుష్కిన్ AI పరిశోధనను కొనసాగించడానికి ఒక టీంను నియమించుకోనున్నారు. అయితే ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది అభివృద్ధి చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక లేదు అయితే మస్క్ ఈ ప్రణాళికపై అధికారికంగా సంతకం చేయలేదని బాబుష్కిన్ తెలిపారు.

బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు, సంబంధిత టెక్నాలజీల రంగంలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించే వేదిక. ఈ సంవత్సరం వేడుకలో సుమారు 200+ దేశాల నుండి 80,000 మంది పాల్గొంటారని అంచనా. సామ్ సంగ్, HONOR, Huawei వంటి బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను అందించడానికి సిద్ధమయ్యాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌

మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో మామూలే, హానికరమైన వాయువుల వలన ఈ పని చేసే వారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. భారతదేశంలో 2017 నుండి సుమారు 400 మంది ఈ మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో మరణించారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం మ్యాన్‌హోల్స్‌లోని మురుగునీటిని శుభ్రపరిచే బాండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో ఈ రోబో మ్యాన్‌హోల్ శుభ్రం చేసే కార్మికులకు విశ్రాంతిని అందిస్తోంది.

2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం

జర్మన్ లగ్జరీ మార్క్ బి ఎం డబ్ల్యూ గ్లోబల్ మార్కెట్లలో 2023 XM లేబుల్ రెడ్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ హైబ్రిడ్ SUV 2,000 యూనిట్ల కంటే తక్కువ ఉత్పత్తితో 2023 చివరినాటికి మార్కెట్లో వస్తుంది.

2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో సఫారీ 2023 అప్డేట్ ప్రారంభించింది, మార్కెట్లో ఏడు సీట్ల SUV విభాగంలో మహీంద్రా XUV700కి పోటీగా ఉంటుంది. సఫారీ ఈమధ్య కాలంలో టాటా మోటార్స్ నుండి అత్యంత సమర్థవంతమైన కార్లలో ఒకటి. అయితే, XUV700లో లెవెల్ 2 ADAS ఫంక్షన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ వంటి ఇతర ప్రీమియం ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా సెవెన్-సీటర్ SUV కేటగిరీలో మహీంద్రా దూకుడు పెంచింది.

25 Feb 2023

ఆపిల్

ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్

ఐఫోన్ 14 కోసం డిమాండ్ ఆపిల్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది, బహుశా దాని ముందూ మోడల్ కన్నా పెద్దగా తేడా లేని ఫీచర్స్ వలన కావచ్చు. ఇప్పుడు బ్రాండ్ ఐఫోన్ 15 సిరీస్ కోసం ఆపిల్ సిద్ధమవుతుంది.

2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్

US ఆధారిత కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ గ్లోబల్ మార్కెట్ల కోసం Edge L 2024 వెర్షన్ ను ప్రకటించింది. అప్డేట్ అయిన ఈ వెర్షన్ ప్రస్తుత అవుట్గోయింగ్ మోడల్ కు భిన్నంగా కనిపిస్తుంది. 2006 లో క్రాస్ఓవర్ SUVగా పరిచయం అయిన, ఫోర్డ్ గ్లోబల్ సిరీస్ లో ఎస్కేప్, ఎక్స్‌ప్లోరర్ మోడళ్ల మధ్యలో ఉంది.

IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG

LG హౌస్‌హోల్డ్ & హెల్త్ కేర్ IMPRINTU అనే పోర్టబుల్ తాత్కాలిక టాటూ ప్రింటర్‌ను ప్రకటించింది. ఈ ప్రింటింగ్ మెషీన్ చర్మం, దుస్తులపై ముద్రించడానికి "సురక్షితమైన, కాస్మెటిక్-గ్రేడ్" టాటూ ఇంక్‌ను ఉపయోగిస్తుంది. ఈ టాటూలు సుమారు ఒక రోజు వరకు ఉంటాయి.

25 Feb 2023

గూగుల్

మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు

గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ రహస్య X మూన్‌షాట్ ల్యాబ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన ఒక సంవత్సరం తర్వాత దాని అతి చిన్న అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎవ్రీడే రోబోట్‌లను తొలగించాలని నిర్ణయించుకుంది. డిపార్ట్‌మెంట్‌లో అనేక ప్రయోజనాత్మక ప్రాజెక్టులలో పనిచేసే 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు.

భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2

బి ఎం డబ్ల్యూ గత ఏడాది అక్టోబర్‌లో గ్లోబల్ మార్కెట్ల కోసం M2 2023 వెర్షన్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఈ వెర్షన్ మే లో భారతదేశానికి వస్తుందని వెల్లడించింది. ఇది M3, M4 మోడల్‌ల లాగానే కొత్త గ్రిల్ డిజైన్‌ తో వస్తుంది.

24 Feb 2023

గూగుల్

తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్

డాక్స్, షీట్‌లతో సహా గూగుల్ తన వర్క్‌స్పేస్ అప్లికేషన్‌ల కోసం కొత్త ఫీచర్‌లను కొన్ని డిజైన్ మార్పులను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌లలో స్మార్ట్ కాన్వాస్, క్యాలెండర్ ఆహ్వాన టెంప్లేట్‌లు, వేరియబుల్స్, ఎమోజి ఓటింగ్ చిప్‌లు ఉన్నాయి. కొత్త యాడ్-ఆన్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.

2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది

వివిధ ప్రపంచ మార్కెట్ల కోసం ఈ నెలలో X5 SUV 2024 వెర్షన్ ను బి ఎం డబ్ల్యూ ప్రకటించింది. ఇది ఆగస్టు నాటికి భారతదేశంలోకి వస్తుందని తెలిపింది. అయితే మార్కెట్లో ఇది 2024 మెర్సిడెజ్-బెంజ్ GLEకి పోటీగా ఉంటుంది.

Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు

Spotify అత్యుత్తమ ఆడియో నాణ్యతతో సంగీతాన్ని అందించకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన సంగీతాన్ని అందించడంలో ముందుంటుంది. ఈ ఆడియో స్ట్రీమింగ్ వేదిక ఇప్పుడు తన కొత్త AIతో పనిచేసే DJతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ChatGPT విజయవంతమైన తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు జనాదరణ విపరీతంగా పెరుగుతుండటంతో, టెక్ కంపెనీలు AI-ఆధారిత ప్రోడక్ట్ తో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. OpenAI జూక్‌బాక్స్ నుండి రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatovan.ai వరకు ఇటువంటి ఉత్పత్తులు కొత్తేమి కాదు. ఇప్పుడు, Spotify కూడా ఆ లిస్ట్ లో చేరింది.

రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనం స్టార్ట్-అప్ రివర్ భారతదేశంలో తన మొట్టమొదటి ఈ-స్కూటర్, Indieని విడుదల చేసింది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ S1 Proతో పోటీ పడుతుంది. పెద్ద అండర్-సీట్ స్టోరేజ్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో ఓలాతో పోటీ పడుతున్న Indie గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765

బ్రిటీష్ తయారీ సంస్థ Triumph మోటార్‌సైకిల్స్ గత ఏడాది నవంబర్‌లో స్ట్రీట్ ట్రిపుల్ 765 R, RS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. రెండు మోడల్‌లు ఇప్పుడు భారతదేశంలోని బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ట్విన్-పాడ్ LED హెడ్‌లైట్, అప్డేట్ అయిన బాడీ ప్యానెల్‌ల కోసం పదునైన డిజైన్‌తో, మిడిల్‌వెయిట్ స్ట్రీట్‌ఫైటర్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌

నథింగ్ స్మార్ట్ ఫోన్ కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో OS 1.5 వెర్షన్ బగ్ పరిష్కారాలు, ప్రైవసీ అప్‌గ్రేడ్‌లు, సిస్టమ్ పనితీరులో మెరుగుదల, వాతావరణ యాప్‌తో సహా కొత్త ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫైల్ సైజ్ 157MB.

భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ SUVలలో మెర్సిడెజ్ ఒకటి. మెర్సిడెజ్-AMG G 63 భారతదేశంలో ధర రూ. 75 లక్షలు పెరిగింది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 ఇంజన్ తో నడుస్తుంది.

23 Feb 2023

టాటా

నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్

స్వదేశీ SUV స్పెషలిస్ట్ టాటా మోటార్స్ భారతదేశంలో నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. అవి డార్క్ ఎడిషన్ ట్రిమ్‌పై ఆధారపడి ఉంటాయి ధర రూ. 12.35 లక్షలు, రూ. 21.77 లక్షలు, రూ. వరుసగా 22.61 లక్షలు.

వచ్చే వారం ట్విట్టర్ అల్గోరిథం సోర్స్ ఓపెన్ చేయనున్న ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ అల్గోరిథం ఓపెన్ సోర్సింగ్ చేయనున్నారు. ట్విట్టర్ రికమెండేడ్ అల్గోరిథంను వచ్చే వారం ప్రారంభంలో చూడవచ్చు. ఓపెన్ సోర్సింగ్ ట్విట్టర్ అల్గోరిథం గురించి నిర్ణయం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కోసం అనేక అవకాశాలను ఇస్తుంది. మస్క్ తన సొంత ట్వీట్లను పెంచే తీసుకున్న నిర్ణయం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి కావచ్చు.

త్వరలో ప్రైవేట్ న్యూస్ లెటర్ టూల్ ను ప్రారంభించనున్న వాట్సాప్

WABetaInfo ప్రకారం, వాట్సాప్ "న్యూస్‌లెటర్" అనే కోడ్‌నేమ్‌తో ఉన్న కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. న్యూస్‌లెటర్ పరిశ్రమ చిన్నది కానీ అభివృద్ధి చెందుతున్నది. అయితే, COVID-19 మహమ్మారి వలన దాని వృద్ధి మందగించింది.

22 Feb 2023

గూగుల్

గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు

గూగుల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ ఫోల్డ్ పూర్తి వివరాలను I/O 2023లో తెలియజేయచ్చు లేదా అక్టోబర్ లో పూర్తి వివరాలు ప్రకటించచ్చు. 9to5Google తాజా నివేదిక ఇప్పుడు ఫోన్ కు సంబంధించిన కొత్త సమాచారాన్ని అందించింది.

భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల

బౌన్స్ తన ఇన్ఫినిటీ E1 స్కూటర్ 'లిమిటెడ్ ఎడిషన్' వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది టాప్-ఎండ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

20 Feb 2023

స్కూటర్

Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లో భాగమైన Ampere ఎలక్ట్రిక్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Primus ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ లో Ola S1తో ఇది పోటీ పడుతుంది. ఈమధ్య కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ బాగా పెరిగింది. స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు Ampere, అధిక-స్పీడ్ ఈ-స్కూటర్‌లను సామాన్యులకు అనుకూలమైన ధరకే అందించడం ద్వారా మిగిలిన వాటి కంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు

బైక్‌ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఇంటర్‌సెప్టర్ 650 కోసం ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్ల కోసం విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు లైట్నింగ్.

భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్

స్వదేశీ బైక్‌తయారీ సంస్థ బజాజ్ త్వరలో భారతదేశంలో లెజెండరీ పల్సర్ 220F మోడల్‌ బైక్ ను తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. అప్డేట్ అయిన ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభించింది. డెలివరీలు ఒకటి లేదా రెండు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

17 Feb 2023

ఐఫోన్

ఆపిల్ ఏడాది చివరిలో విడుదల చేయనున్న ఐఫోన్ 15 Pro ఫోటో లీకైంది

ఆపిల్ ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది, ఇక లీకైన ఫోటోలో ఐఫోన్ 15 Pro ఫోన్ లో సన్నని బెజెల్స్, కెపాసిటివ్ బటన్లు, కొంచెం మందంగా ఉండే కెమెరా లేఅవుట్, టైప్-సి పోర్ట్ ఉంటాయి.

యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం

యూట్యూబ్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్న నీల్ మోహన్ అంతకుముందు ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు, అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్ (GPA పరంగా టాప్ 10 శాతం విద్యార్థులు). తరువాత 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA పట్టా పొందారు.

భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్

iQOO భారతదేశంలో iQOO Neo 7 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.ఇందులో 120Hz AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్, 64MP ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి.

2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల

జపనీస్ బైక్ తయారీ సంస్థ యమహా భారతదేశంలో R15M 2023 అప్డేట్ ను ప్రారంభించింది. అప్‌డేట్‌లో భాగంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు క్విక్‌షిఫ్టర్‌ ఉన్నాయి.

IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది

భారతీయ టెలికాం పరిశ్రమ అప్‌గ్రేడ్‌ను కు సిద్ధంగా ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి, నావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ టెక్నాలజీ (ToT) ట్రాన్స్ఫర్ ని పూర్తి చేసింది.

16 Feb 2023

పేటియం

UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్

తక్కువ-విలువ UPI లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా ఆటంకం లేకుండా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) భారతదేశంలో UPI LITEని ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ ఫీచర్‌ను అందించే దేశంలోనే మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటియం.

టెలిగ్రామ్ vs వాట్సాప్ వీటి మధ్య ఏం జరుగుతోంది

గత వారం, వాట్సాప్ అధిపతి విల్ క్యాత్‌కార్ట్ తన ఎన్‌క్రిప్షన్ విధానాలపై మాట్లాడుతూ టెలిగ్రామ్‌ను డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయలేదని విమర్శించారు. వాట్సాప్ ఇతర యాప్‌ల భద్రతా పద్ధతులపై ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరులో, నిర్దిష్ట భద్రతా ఫీచర్లు లేవని ఆపిల్ Message సేవను విమర్శించింది. వాట్సాప్ గోప్యతా విధానాలపైనా, ప్రైవేట్ సందేశాలను స్నూపింగ్ చేస్తుందనే దానిపై ఆరోపణలను ఎదుర్కుంటుంది.

15 Feb 2023

విమానం

IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి

జర్మనీకి చెందిన Lufthansa సంస్థ విమానాలు బుధవారం IT అంతరాయం కారణంగా ఆలస్యం లేదా రద్దు అయ్యాయి.

2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ

రాబోయే 2023 ఫార్ములా 1 (F1) సీజన్‌కు ముందు, ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫెరారీ తన SF-23 రేస్ కారును ప్రకటించింది. గత సంవత్సరం మోడల్ కంటే చిన్న మార్పులు చేసారు. ఇది 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, V6 ఇంజన్‌తో నడుస్తుంది.

మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి

2023 అప్‌డేట్‌లలో భాగంగా మారుతి సుజుకి తన ప్రసిద్ధ సెడాన్ మోడల్, సియాజ్ మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్‌లను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ కంట్రోల్‌ కూడా ఉంది.

భారతదేశంలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్న Xiaomi TV Stick 4K అమ్మకాలు

Xiaomi భారతదేశంలో TV Stick 4Kని ప్రకటించింది. ఇది డాల్బీ టెక్నాలజీ, 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ ప్యాచ్‌వాల్ సాఫ్ట్‌వేర్ తో పాటు Wi-Fi 5, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీలతో వస్తుంది.

మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్

AMR23 అప్డేటెడ్ డిజైన్‌ను ఆస్టన్ మార్టిన్ ఆవిష్కరించింది. మార్చి 5 నుండి ప్రారంభమయ్యే సీజన్‌లో పాల్గొంటుంది. ఆస్టన్ మార్టిన్ టెక్నికల్ డైరెక్టర్ డాన్ ఫాలోస్, AMR23 AMR22 కంటే 95% భిన్నంగా ఉంటుందని తెలిపారు.