ఫీచర్: వార్తలు

వాట్సాప్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ యాక్సెస్ చేయండిలా

ప్రత్యేక వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌లు వాట్సాప్‌లో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌ 2018 అక్టోబర్‌లో స్టిక్కర్ల ఫీచర్‌ను విడుదల చేసింది. స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసే విధానం గురించి ఇక్కడ చదవండి

భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది

బెంగళూరుకు చెందిన సోషల్ మీడియా యాప్ Slick పాఠశాలకు వెళ్లే పిల్లలతో సహా తన వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసింది. కంపెనీ తన వినియోగదారుల పూర్తి పేర్లు, పుట్టినరోజులు, మొబైల్ నంబర్‌లు, పాస్‌వర్డ్ లేకుండా ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ చిత్రాలతో ఉన్న డేటాబేస్‌ను బహిర్గతం చేసింది.

భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2

2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మరిన్నిఫీచర్స్ తో భారతదేశంలో ప్రారంభమైంది.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్

Acer Nitro 5 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. ఇది మంచి గేమింగ్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్ కార్ట్ లో చాలా చౌకగా లభిస్తుంది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ

ప్రసిద్ద US తయారీ సంస్థ డాడ్జ్ చికాగో ఆటో షోలో "లాస్ట్ కాల్" స్పెషల్-ఎడిషన్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయనున్నారు. ముందు మోడల్ '426 HEMI' V8 ఇంజిన్‌ను ఉపయోగించి గాడ్‌ఫ్రే క్వాల్స్ 1970 డాడ్జ్ ఛాలెంజర్ R/T SE మోడల్‌ లాగా ఉంది ఈ కారు.

మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌

స్వదేశీ బ్రాండ్ లావా భారతదేశంలో తన Blaze 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM వేరియంట్‌ను విడుదల చేసింది. గతేడాది 4GB RAMతో మార్కెట్లోకి వచ్చింది.

ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్ లో వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి కెమెరా మోడ్‌ తో పాటు, ఒకేసారి 100 వరకు మీడియా ఫైల్స్ ను షేర్ చేయచ్చు.

11 Feb 2023

బైక్

భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్

చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.

ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

Realme భారతదేశంలో కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి కోకా-కోలాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మౌత్‌ఫుల్ పేరుతో, Realme 10 Pro 5G కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ దీని ధర రూ. 20,999. Realme ఈ ఎడిషన్ లో కేవలం 1,000 ఫోన్లను మాత్రమే అమ్ముతుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, Realme కోకా కోలా రెండింటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది కానీ ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మాత్రమే విడుదలైంది.

10 Feb 2023

స్కూటర్

3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో దాని అత్యంత సరసమైన ఆఫర్ S1 ఎయిర్ కోసం మూడు కొత్త ట్రిమ్ స్థాయిలను ప్రవేశపెట్టింది. స్కూటర్ బేస్ వేరియంట్ ఇప్పుడు చిన్న 2kWh బ్యాటరీ ప్యాక్‌తో , మిడ్-లెవల్ మోడల్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ తో, రేంజ్-టాపింగ్ వెర్షన్ 4kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది.

10 Feb 2023

మెటా

ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా

గత నవంబర్‌లో, క్రియేటర్‌లు డబ్బు సంపాదించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'గిఫ్ట్‌లను' మెటా పరిచయం చేసింది. ఇప్పుడు మరింత మంది క్రియేటర్‌లకు ఈ ఫీచర్ యాక్సెస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ

చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా AI రంగంలోకి ప్రవేశించబోతుంది. ChatGPT లాంటి టూల్‌ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్

జపాన్ తయారీ సంస్థ టయోటా గ్లోబల్ మార్కెట్ లో గ్రాండ్ హైలాండర్ 2024 వెర్షన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న జరగబోయే 2023 చికాగో ఆటో షోలో దీనిని ప్రదర్శిస్తారు.

భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్

జపనీస్ తయారీ సంస్థ సుజుకి భారతదేశంలో తన Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 బైకుల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా కొత్త రంగు ఆప్షన్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. సింగిల్-సిలిండర్ 155cc, 249cc ఇంజిన్‌లతో నడుస్తాయి. .

09 Feb 2023

గూగుల్

అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్

ChatGPTతో ఉన్న కొత్త Bing గురించి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన గురించి ఇంకా అందరు చర్చిస్తుండగానే గూగుల్ తన AI-సెంట్రిక్ "లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ఈవెంట్ ను పారిస్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో Bard-గూగుల్ గురించి ప్రివ్యూతో పాటు గూగుల్ లెన్స్ గురించి కొన్ని అప్‌డేట్‌లు ఉన్నాయి.

త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA

కొత్త తరం హ్యుందాయ్ VERNA ఈ మార్చిలో భారతదేశంలో ఉత్పత్తికి వెళ్లనుంది. ఏటా 70,000 యూనిట్లను తయారు చేయాలని హ్యుందాయ్ సంస్థ ఆలోచిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతాయి. పెట్రోల్-ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (SID) గుర్తుగా, ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ Tinder వినియోగదారులు సులభంగా నియంత్రించడానికి అనేక భద్రతా ఫీచర్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్లలో 'Incognito Mode', 'Block Profile' వంటి భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault, జపాన్ తయారీ సంస్థ Nissan భారతీయ మార్కెట్ కోసం మూడు మోడళ్లపై పని చేస్తున్నాయి. ఇందులో 3 rd gen Renault Duster, Renault Triber ఆధారంగా ఒక నిస్సాన్ MPV, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనం ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ప్లాన్‌ను విజయవంతం చేసేందుకు రెండు కంపెనీలు దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.

భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi త్వరలో భారతదేశంలో తన Q3 స్పోర్ట్‌బ్యాక్ ను విడుదల చేయనుంది. రూ.2 లక్షలు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో ఇది బి ఎం డబ్ల్యూ X1, వోల్వో XC40, మెర్సిడెజ్-బెంజ్ GLA తో పోటీ పడుతుంది.

07 Feb 2023

గూగుల్

AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్

గూగుల్ ఒక ప్రయోగాత్మక Bard AI సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే గూగుల్ కు గట్టి పోటీనిచ్చే మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడి పెట్టిన Open AI చాట్‌బాట్ ChatGPT సంచలనం సృష్టించింది.

06 Feb 2023

గూగుల్

భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్

సామ్ సంగ్ Galaxy S23 ప్రభావంతో గూగుల్ Pixel 7 Pro భారతదేశంలో అత్యధిక తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది.

06 Feb 2023

కార్

మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది

మారుతి సుజుకి Fronx SUVని గత నెలలో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఇందులో ఫీచర్-లోడెడ్ క్యాబిన్ తో పాటు రెండు పెట్రోల్ ఇంజన్‌ల ఆప్షన్ ఉంది భారతీయ మార్కెట్ లో ఈ SUV కియా Sonetతో పోటీపడుతోంది.

06 Feb 2023

గూగుల్

ఆండ్రాయిడ్‌ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్

ఆండ్రాయిడ్ chromeలో 'quick delete' ఫీచర్‌ను ప్రారంభించే పనిలో గూగుల్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ యాప్‌లో చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల చేసారు. ఈ సంవత్సరం, గూగుల్ ఈ ఫీచర్ ను బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం విడుదల చేయబోతుంది.

06 Feb 2023

కార్

టెస్ట్ రన్ లో ఉన్న Citroen C3- MPV కార్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Citroen సంస్థ యూరోపియన్ ప్రాంతంలో C3-ఆధారిత మూడు-వరుసల MPV కార్ టెస్ట్ రన్ చేస్తుంది. ఈ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 2023లో భారతీయ మార్కెట్ లో మూడు వరుసల MPV మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

04 Feb 2023

కార్

భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త -SUV, Fronxని మార్కెట్ లో విడుదల చేయబోతుంది. కాంపాక్ట్ SUV కోసం బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు ఇప్పటికే 5,000 ప్రీ-ఆర్డర్‌లు కూడా వచ్చాయి. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.

04 Feb 2023

కార్

భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఈ ఏడాది మధ్యలో భారతదేశంలో సెల్టోస్ 2023 అప్డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్టెడ్ SUV ఇప్పటికే దక్షిణ కొరియాతో పాటు USలో అందుబాటులో ఉంది

ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం

గత ఏడాది నవంబర్‌లో, ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేయడానికి వీలు కల్పించే 'Go Live Together' ఫీచర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో వచ్చింది.

RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault భారతదేశంలోని మొత్తం సిరీస్ ను RDE భద్రతా నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. KWID, Kiger, Triber ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఆప్షన్స్ తో అప్డేట్ అయ్యాయి.

399cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో రాబోతున్న 2023 Kawasaki Ninja ZX-4RR 399cc

Kawasaki ట్రాక్-ఫోకస్డ్ 2023 Kawasaki Ninja ZX-4RRని గ్లోబల్ మార్కెట్‌ల లో $9,699 (సుమారు రూ. 8 లక్షలు) ధరతో విడుదల చేయనుంది. సూపర్‌స్పోర్ట్ ఎంట్రీ-లెవల్ ZX-25R మరియు మిడ్-కెపాసిటీ ZX-6R మధ్య ఉంటుంది.

03 Feb 2023

బైక్

మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa

జపనీస్ తయారీ సంస్థ సుజుకి Hayabusa 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. ఈ సూపర్‌బైక్ మూడు డ్యూయల్-టోన్ రంగుల్లో అంటే పెర్ల్ వైగర్ బ్లూ/పెర్ల్ బ్రిలియంట్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ థండర్ గ్రే/క్యాండీ డేరింగ్ రెడ్ లో లభిస్తుంది. స్పోర్టి టూరర్ అవుట్‌గోయింగ్ మోడల్ మొత్తం డిజైన్‌ తో, 1,340cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది.

ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్

Realme ఫిబ్రవరి 10న భారతదేశంలో కోకా-కోలా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ Realme మిడిల్ సిరీస్ 10 Pro 5G లాగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్

వాట్సాప్‌లో కాల్‌లు చేయడం మరింత సులభంగా మారబోతోంది. WABetaInfo ప్రకారం, కాలింగ్ షార్ట్‌కట్‌ ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా అభివృద్ధిలో ఉంది. యాప్ తర్వాతి అప్డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారతదేశంలో విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Venue

హ్యుందాయ్ తన VENUE SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రాబోయే నెలల్లో భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది E, S, S+, S(O), SX, SX(O) ఆరు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం

OPPO ఫిబ్రవరిలో Find X6 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. Find X6 సిరీస్‌లో Find X6 pro మోడల్‌లతో సహా మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. OPPO Find X6 సిరీస్ గురించి గత ఏడాది చివర్లో వార్తలు వినిపించాయి అయితే ఆ తర్వాత Find N2, N2 ఫ్లిప్ మోడల్‌ల వైపు అందరి దృష్టి మారిపోయింది.

31 Jan 2023

కార్

భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు

భారతదేశంలో కారును కొనే ముందు ముఖ్యంగా పరిగణలోకి తీసుకునేవి మైలేజ్ ఒకటి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, హోండా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి బ్రాండ్‌లు మైలేజ్ ఎక్కువ అందించే వాహనాలను భారతదేశంలో ప్రవేశపెట్టాయి.

అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విటర్‌ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ సోషల్ మీడియా సంస్థ పేమెంట్ టూల్స్ పై పనిచేయడం ప్రారంభించింది.

భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV

PURE EV భారతదేశంలో తన ఎకోడ్రైఫ్ట్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ పూర్తి-LED లైటింగ్ సెటప్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కిమీల వరకు నడుస్తుంది.

31 Jan 2023

కార్

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా

జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారులో CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది S, G వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer

Acer భారతదేశంలో అనేక అప్‌గ్రేడ్‌లతో Aspire 3 ల్యాప్‌టాప్ రిఫ్రెష్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ Acer Aspire 3 భారతదేశంలో Ryzen 5 7000 సిరీస్ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ల్యాప్‌టాప్‌.

భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ ఎట్టకేలకు భారతదేశంలో తన X1 SUV యొక్క 2023 వెర్షన్‌ను విడుదల చేసింది. కారు సరికొత్త డిజైన్ తో పాటు విలాసవంతమైన టెక్-లోడెడ్ క్యాబిన్‌ తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్ లో లగ్జరీ SUV విభాగంలో వోల్వో XC40కి పోటీగా ఉంటుంది.