ఫీచర్: వార్తలు
ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi బెర్లిన్‌లో జరిగిన "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. EV లాంటి క్రాస్‌ఓవర్ డిజైన్ తో పాటు వర్చువల్ ఇంటర్‌ఫేస్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌లు, ట్రాన్స్‌ఫార్మింగ్ రియర్ సెక్షన్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit
Fire-Bolt కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌వాచ్, Ninja-Fit, ఇప్పుడు భారతదేశంలో ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్-సపోర్ట్ మోడ్‌లతో పాటు "అప్‌గ్రేడెడ్ హెల్త్ సూట్" ఇందులో వస్తుంది. దీనికి 1.69-అంగుళాల స్క్రీన్, IP67-రేటెడ్ సేఫ్టీ, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్
మారుతి సుజుకి తన Alto k10 ప్రత్యేక ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు సాధారణ మోడల్ లాగానే ఉన్నా బయట, లోపల కొన్ని అప్డేట్లతో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎడిషన్ K10లో స్కిడ్ ప్లేట్లు, ORVMలు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌పై కాంట్రాస్ట్-కలర్ పాప్రికా ఆరెంజ్ హైలైట్‌లను కలిగి ఉంది. ఇది 1.0-లీటర్, K-సిరీస్ ఇంజిన్ తో నడుస్తుంది.
75వ వార్షికోత్సవం సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerieను లాంచ్ చేయనున్నMaserati
ఇటాలియన్ లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గ్లోబల్ మార్కెట్ల కోసం లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerie మోడల్‌ను ప్రకటించింది, కేవలం 75 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ విభిన్నమైన గ్రిజియో లామిరా కాంట్రాస్టింగ్ బ్రైట్ రెడ్ యాక్సెంట్, నీరో కామెటా సబ్టిల్ పుదీనా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది
S23 అల్ట్రా నుండి కోకా-కోలా ఫోన్ వరకు భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు
2023 సంవత్సరం మొదలుకాగానే భారతదేశంలో iQOO 11, TECNO PHANTOM X2 సిరీస్, Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యాయి. సామ్ సంగ్, OnePlus వంటి బ్రాండ్‌లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, అయితే Realme ప్రత్యేకమైన Coca-Cola బ్రాండెడ్ ఫోన్ ని కూడా లాంచ్ చేస్తుంది.
అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16
ASUS ROG Zephyrus M16 (2022) ల్యాప్‌టాప్, అత్యుత్తమ-నాణ్యమైన స్క్రీన్, సమర్థవంతమైన CPU/GPU కాన్ఫిగరేషన్ తో పాటు దీర్ఘకాలం ఉండే బ్యాటరీతో వస్తుంది. తక్కువ CPU లోడ్‌లు, సమర్థవంతమైన GPUతో శక్తివంతమైన గేమింగ్ మెషీన్ కావలనుకుంటే, ఈ అమెజాన్ డీల్ గురించి తెలుసుకోండి.
పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS
బి ఎం డబ్ల్యూ 2024 M3 CS మోడల్ ను తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కార్లను ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. ఇది ప్రత్యేక సిగ్నల్ గ్రీన్ పెయింట్ తో వస్తుంది.
ఇకపై వాట్సాప్ లో View once సందేశాలను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు
'View once' సందేశాలను స్క్రీన్‌షాట్ తీయడాన్ని బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ లాంచ్ చేసింది. అక్టోబర్ 2022లో వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా బీటా ఛానెల్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.
బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల
ఆపిల్ ఎట్టకేలకు iOS 16.3 అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది ఐఫోన్ ల భద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఫిజికల్ కీని ఉపయోగించి ఆపిల్ IDని రక్షించుకునే సామర్థ్యాన్ని ఈ అప్‌డేట్ అందిస్తుంది.
భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సంస్థ 2023 AURA సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది E, S, SX, SX(O) వేరియంట్లలో లభిస్తుంది. విశాలమైన టెక్-లోడెడ్ క్యాబిన్ తో పాటు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఇది పెట్రోల్, CNG రెండిటిలో 1.2-లీటర్ ఇంజన్ తో నడుస్తుంది. ఇది ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.
భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా
హోండా తన యాక్టివా స్కూటర్‌లో స్మార్ట్ కీ వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ కు కారు లాంటి స్మార్ట్ కీ ఉంటుంది, ఇది మల్టీ ఫంక్షనల్ బటన్‌తో వస్తుంది. ఇందులో 5.3 లీటర్ల పెట్రోల్ స్టోర్ చేసుకోవచ్చు, ఇది 105 కిలోల బరువు ఉంటుంది.
టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం
వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఈ ప్లాట్‌ఫారమ్ లో అనేక కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తోంది, వీటిని త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈ ఫీచర్లలో కొన్ని బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి, మరికొన్ని ఇంకా అభివృద్ధిలో ఉన్నాయి.
జనవరి 26న రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi జనవరి 26న సరికొత్త యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్ కారును విడుదల చేయనుంది. "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో భాగంగా ప్రదర్శించబడుతుంది. ఇది గ్రాండ్‌స్పియర్, అర్బన్‌స్పియర్ మోడల్ లాగానే PPE ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.
గ్రూప్ ఇంటరాక్షన్‌ల కోసం ఐఫోన్ లో కొత్త ఫీచర్‌ను విడుదల చేసిన వాట్సాప్
వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది గ్రూప్ అడ్మిన్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంస్థ ఈ ఫీచర్ ద్వారా అనేక షార్ట్‌కట్‌లను అందిస్తుంది, వీటిని ఉపయోగించి అడ్మిన్‌లు గ్రూప్ లో ఉన్నవారి పై త్వరగా చర్యలు తీసుకోగలరు. యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయగల అప్డేట్ వెర్షన్ 23.1.75లో అందుబాటులో ఉంది.
భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం
లగ్జరీ కార్ల తయారీ సంస్థ Bentley భారతదేశంలో Bentayga EWB Azure మోడల్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన ఈ Azure వేరియంట్‌లో వెనుక ఎయిర్‌లైన్ సీట్లు, ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజింగ్ డోర్లు, మొత్తం ఫ్లోర్‌ను కవర్ చేసే 'డీప్ పైల్ ఓవర్' మ్యాట్‌లు, ప్రీమియం నైమ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUV 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.
ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి
సామ్ సంగ్ Galaxy Buds Live ఇప్పుడు అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ. 3,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల సేపు యాక్టివ్ గా ఉంటాయి. దీనికి ఛార్జింగ్ కేస్ 472mAh బ్యాటరీ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis
టెక్నాలజీ దిగ్గజం Qualcomm USలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో Snapdragon Digital Chassis కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కారుతో ఆటోమేకర్లు దాని టెక్నాలజీ, సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రదర్శించింది. ఇది మొదటి ఆటోమోటివ్ సూపర్-కంప్యూట్ క్లాస్ సొల్యూషన్ గా ప్రచారం అవుతుంది.
గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన 2023 యమహా గ్రాండ్ ఫిలానో
టూ-వీలర్ తయారీ సంస్థ యమహా గ్లోబల్ మార్కెట్‌లలో గ్రాండ్ ఫిలానో 2023 వెర్షన్ ను విడుదల చేసింది.ఇప్పుడు ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇది భారతదేశంలో అమ్ముతున్న Fascino 125 Fi హైబ్రిడ్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతానికి, ఈ బ్రాండ్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఆ సంస్థ ఇంకా తెలియజేయలేదు.
ఉష్ణోగ్రతను, తేమను చెక్ చేసే సరికొత్త ఆపిల్ స్మార్ట్ స్పీకర్
ఆపిల్ రెండవ తరం Homepod స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. సంగీతాన్ని ప్లే చేయడంతో పాటు, ఇది ఇప్పుడు గది ఉష్ణోగ్రత, తేమను చెక్ చేస్తుంది. రెండు Homepods కనెక్ట్ చేసి స్టీరియో లాగా మార్చచ్చు. స్టీరియోగా మార్చడానికి వినియోగదారులు అదే మోడల్‌లోని Homepodను ఉపయోగించాల్సి ఉంటుంది.
విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం
స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో లియో ఈ-స్కూటర్ హై-స్పీడ్ వెర్షన్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 81,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీల వరకు నడుస్తుంది. ఈ నెల నుండి ఆ బ్రాండ్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది.
సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 బైక్ మార్కెట్లో విడుదల
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సూపర్ మీటోర్ 650 బైక్‌ను సోమవారం భారతదేశంలో విడుదల చేసింది. ఇది నవంబర్ 2022లో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయింది. క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్, సెలెస్టియల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
DBS 770 అల్టిమేట్ కార్ లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ స్టన్-మార్టిన్
బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన DBS 770 అల్టిమేట్ కారును లాంచ్ చేసింది. దీని ఉత్పత్తి 499 యూనిట్లకు పరిమితం అయింది. ఈ కారులో వివిధ టెక్నాలజీ ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్ ఉంది. ఇది 5.2-లీటర్ V12 ఇంజన్‌తో నడుస్తుంది.
త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్
వాయిస్ సందేశాన్నిస్టేటస్‌గా పోస్ట్ చేసుకునే అవకాశం త్వరలో వాట్సాప్ తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌తో, టెక్స్ట్‌కు బదులుగా వాయిస్ క్లిప్‌లను రికార్డ్ చేసి పోస్ట్ చెయ్యచ్చు. పేరెంట్ సంస్థ మెటా ఆండ్రాయిడ్ ఛానెల్‌లోని కొంతమంది బీటా వినియోగదారులకు ఈ అప్‌డేట్ వెర్షన్ 2.23.2.8ను విడుదల చేసింది.
ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్
స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త మ్యాజిక్ EVని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రధానంగా పాఠశాలలు, స్టేజ్ క్యారేజ్, అంబులెన్స్‌లు వంటి డెలివరీ సేవలను లక్ష్యంగా చేసుకుంది.
2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ
ఆపిల్ తన 2023 వెర్షన్ MacBook Pro, Mac miniలను పరిచయం చేసింది. MacBook Pro 14-అంగుళాల, 16-అంగుళాల సైజులో అందుబాటులో ఉంది. Mac mini దాని ముందూ మోడల్స్ లాగానే కనిపిస్తుంది. MacBook Pro ప్రారంభ ధర రూ. 2 లక్షలు, Mac mini ధర రూ.59,900.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం
టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ రేసర్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఈ కారులో ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు విశాలమైన ఫీచర్-లోడెడ్ క్యాబిన్, శక్తివంతమైన 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది.
X7 SUV 2023వెర్షన్ ను 1.2కోట్లకు లాంచ్ చేసిన BMW సంస్థ
జర్మన్ వాహన తయారీ సంస్థ BMW X7 SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది xDrive40i M Sport, xDrive40d M Sport వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కంపెనీ యొక్క కొత్త డిజైన్ తో పాటు సరికొత్త టెక్నాలజీతో ఉన్న ట్వీక్డ్ క్యాబిన్ తో వస్తుంది. రెండూ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.
ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన గూగుల్
ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ మాదిరిగానే బ్లూటూత్ ట్రాకర్‌పై గూగుల్ పనిచేస్తోందని టెక్నాలజీ జర్నలిస్ట్ మిషాల్ రెహమాన్ పేర్కొన్నారు. డెవలపర్ ఈ ప్రోడక్ట్ కి "Grogu" అనే పేరు పెట్టారు.
కంటెంట్ క్రియేటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai
కంటెంట్ క్రియేటర్లు కంటెంట్‌ను ఆకర్షణీయంగా చేయడానికి సంగీతంపై ఎక్కువగా ఆధారపడతారు. కానీ అటువంటి సంగీతానికి కాపీరైట్ సమస్యలను ఎదుర్కుంటున్నారు. Beatoven.ai, భారతదేశంలో మొట్టమొదటి AI-సపోర్ట్ చేసే మ్యూజిక్ ను అందిస్తుంది.
XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహానాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. సరికొత్త కార్ టెక్నాలజీతో విశాలమైన క్యాబిన్ తో వస్తుంది. మహీంద్రా XUV400 గురించి గత సంవత్సరం సెప్టెంబరులో ప్రకటించారు. ఈ బ్రాండ్ కు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV. మార్కెట్‌లో, MG ZS EV, టాటా నెక్సాన్ EV వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది.
ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆపిల్ సంస్థ
ఎట్టకేలకు ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్యను ఆపిల్ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ ఆన్ చేసినప్పుడు స్క్రీన్‌పై సమాంతర రేఖల సమస్య ఎదుర్కుంటున్న వినియోగదారులకు ఇది శుభవార్తే.
స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.
ఆటో ఎక్స్‌పో 2023లో ప్రవైగ్ వీర్ EVను లాంచ్ చేసిన ప్రవైగ్ డైనమిక్స్
స్వదేశీ స్టార్టప్ ప్రవైగ్ డైనమిక్స్ ఆటో ఎక్స్‌పో 2023లో వీర్ EVని ప్రదర్శించింది. ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ కారు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కోసం రూపొందించబడింది.
iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్
వాట్సాప్ iOS వినియోగదారులకు కెమెరా మోడ్ అందించడం కోసం పని చేస్తోంది. ఇది త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే, WABetaInfo ద్వారా, రాబోయే ఫీచర్ ఎలా పని చేస్తుందో కొంత సమాచారం బయటికి వచ్చింది. కెమెరా మోడ్ iOS వినియోగదారులకు వేగంగా 'ఫోటో' నుండి 'వీడియో' మోడ్‌కి మార్చడం సులభమవుతుంది.
2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది
2023 హోండా CB500X త్వరలో భారతదేశంలో కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఇదివరకే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెనెల్లీ TRK 502కి పోటీగా వస్తుంది. అయితే రెండింటిలో ఏది మంచిది అనేది తెలుసుకుందాం.
5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ
భారతదేశంలో Lenovo Tab P11 5G ప్రారంభమైంది. 6GB/128GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ. 29,999. ఈ టాబ్లెట్ బ్రాండ్ ఇ-స్టోర్ తో పాటు అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.
IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 2023కి IMOTY లేదా ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ గెలుచుకుంది. ఈ మోటార్‌సైకిల్ తనతో పోటీ పడిన మరో తొమ్మిది బ్రాండ్లను ఓడించి కిరీటాన్ని గెలుచుకుంది. 15 మంది సీనియర్ మోటార్‌సైకిల్ జర్నలిస్టుల బృందం ఈ బైక్‌ను అగ్రస్థానానికి ఎంపిక చేసింది. TVS రోనిన్, సుజుకి V-Strom SX మొదటి, రెండవ రన్నరప్‌గా నిలిచాయి.
#DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే
నథింగ్ ఫోన్ కి సంబంధించిన హైప్ కొంతవరకు తగ్గింది అయితే భారతదేశంలో ఇది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన విజువల్ ఎలిమెంట్స్‌తో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ఆఫర్‌లతో, ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకు పొందవచ్చు.
ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్
బ్రిటిష్ సంస్థ MG మోటార్ దాని పూర్తి-పరిమాణ MPV Euniq 7ను ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేసింది. ఇది వివిధ గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న హైడ్రోజన్-శక్తితో పనిచేసే Maxus Euniq 7 వ్యాన్ రీ-బ్యాడ్జ్ వెర్షన్. ఇది పర్యావరణ అనుకూల వాహనం. MG 2019లో భారతీయ మార్కెట్లో హెక్టర్‌తో ప్రారంభించింది. ఇది ఫీచర్-ప్యాక్డ్ మిడ్-సైజ్ SUV ఆఫర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది.
భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్
ఫిబ్రవరి 1న జరిగే Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ సిరీస్‌ను ప్రారంభించనున్నట్లు సామ్ సంగ్ సృష్టం చేసింది. భారతదేశంలో లాంచ్ కి ముందే ప్రీ-బుకింగ్‌లకు మొదలయ్యాయి. ఈ సిరీస్ లో S23, S23 ప్లస్, S23 అల్ట్రా మోడల్‌లు ఉంటాయి. హ్యాండ్‌సెట్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారికి రూ. 5,000 విలువైన ఇ-వోచర్ తో పాటు అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.