ప్రేరణ: వార్తలు

18 Apr 2023

జీవితం

ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్ 

నీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాని కోసమే నువ్వు రోజూ పనిచేయాలి. నువ్వు చేసే పని నీ లక్ష్యానికి నిన్ను దగ్గర చేయాలి. అలా కాని పక్షంలో ఈరోజు నువ్వు చేస్తున్న పనిని మానేయడమే మంచిది.

ప్రేరణ: గడిచిన నిన్న గురించి ఆలోచించడం కన్నా రాబోయే రేపు గురించి పనిచేయడం ఉత్తమం 

గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. అయినా కూడా పదే పదే అప్పడు అలా చేసుండకపోతే బాగుండేది, ఇప్పుడిలా ఉండేవాడిని కాదు అనుకుంటూ ఫీలవుతారు.

14 Apr 2023

జీవితం

ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు 

చాలామంది ఎంతో ఇష్టంగా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. దానికోసం పనిచేస్తుంటారు. ఆ లక్ష్యాన్ని తొందరగా చేరుకోలేరని వాళ్లకు అర్థమైతే లక్ష్యాన్నే మార్చేసుకుంటారు. వందకు 99మంది ఇదే తప్పు చేస్తుంటారు.

13 Apr 2023

జీవితం

ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు 

జీవితంలో కష్టాలు కామన్. వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని కొన్నిసార్లు కష్టాలనేవి అసలు పోవేమో అనిపిస్తుంటుంది.

ప్రేరణ: గొప్ప పనులు చేయడానికే కాదు గొప్పగా ఆలోచించడానికి కూడా ధైర్యం కావాలి 

మీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే గొప్పవాళ్ళున్నారు. మిగిలిన జనాలంతా సామాన్యులే. సామాన్యులు గొప్పగా ఎందుకు కాలేకపోతున్నారో తెలుసా? గొప్పగా ఆలోచించలేకపోవడం వలన.

ప్రేరణ: ఇతరులను దాటేయాలని పనిచేసే వాళ్ళకు అశాంతే మిగులుతుంది 

నువ్వు పనిచేసేది అవతలి వాళ్ళను దాటేయడానికే అయితే నీకెప్పటికీ సుఖం ఉండదు. ఎందుకంటే నువ్వు ఇతరులను దాటుతున్న కొద్దీ నిన్ను ఇతరులు దాటేస్తూ ఉంటారు.

ప్రేరణ: ఆనందం అతిధిగా మారితే జీవితం కష్టాల్లో ఉందని అర్థం

ఆనందం కోసం వెతుకుతూ కూర్చుంటే ఎంతో విలువైన క్షణాలను అనుభవించడం మిస్సవుతారన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. దానికి కారణం ఏంటంటే, ఆనందం అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించే అతిథి అని అందరూ అనుకుంటారు.

ప్రేరణ: నీకు ఎదురయ్యే అనుభవాలపై నువ్వెలా స్పందిస్తావన్న దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది

నువ్వు జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నావ్, నీకొక ఐడియా ఉందా? నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో.

ప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోగలనా లేదా అన్న అనుమానం రాకపోతే అది గొప్ప లక్ష్యం కాదన్నమాట

మీ జీవిత లక్ష్యం ఏమిటి? రోజూ దానికోసమే పనిచేస్తున్నారా? ఆ లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం మీలో ఉందా? ఒకవేళ మీరు నిజంగా చేరగలనని అనుకుంటే అది పెద్ద లక్ష్యం కాదన్నమాట.

ప్రేరణ: నువ్వు చేసిన మంచి, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది

స్వార్థం లేకుండా అవతలి వారికి మంచి చేసినపుడు అదెలా అయినా మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. అందుకే వీలైనంత మటుకు అవతలి వారికి చెడు చేయకుండా ఉండండి.

ప్రేరణ: అసాధ్యమని పక్కన పడేసే ముందు అవుతుందేమోనని ఒకసారి ఆలోచించేవాళ్ళే ఈతరం విజేతలు

అసాధ్యం అన్న పదం ఇంకొన్ని రోజుల్లో డిక్షనరీలోంచి మాయమైపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత తరంలో సాధ్యం కానిదేది లేదన్నట్టుగా ప్రపంచం పరుగెడుతోంది.

ప్రేరణ: మీకోసం ఒకరు సమయం ఇస్తున్నారంటే వాళ్ళ జీవితంలోని కొంత భాగాన్ని మీకిస్తున్నట్టే

టైమ్... ప్రస్తుత కాలంలో చాలామంది దగ్గర లేనిదిదే. అవును, రోజును 24గంటలు అయినా కూడా ఎవ్వరి దగ్గర కూడా టైమ్ లేదు.

ప్రేరణ: అవకాశం కోసం చూడడం కన్నా దానికోసం వెతకడమే మంచిది

మీ దగ్గర టాలెంట్ ఉంది. మీరెంతో పని చేయగలరు, కానీ మీ పనిని, టాలెంట్ ని చూపిద్దామనుకుంటే మాత్రం అవకాశం దొరకట్లేదు కదా!

ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు

కొందరుంటారు. తమకు ఎదురైన ప్రతీ అనుభవాన్ని డైరీలో నోట్ చేసుకుంటారు. ఒకరోజులో మన జీవితంలో చాలా జరుగుతుంటాయి. అందులో కొన్ని అత్యంత ముఖ్యమైనవి ఉంటాయి. మరికొన్ని అంత ప్రాముఖ్యం లేనివి ఉంటాయి.

ప్రేరణ: నువ్వున్న ప్లేస్ లో ఆనందం లేకపోతే, అది బంగారు భవంతి అయినా బయటకు వచ్చెయ్

నీకెన్ని బంగ్లాలున్నా, కార్లున్నా, గాల్లో ఎగిరే విమానాలున్నా మనసులో కొంచెం ఆనందం లేకపోతే అవన్నీ ఉన్నా లేనట్టే లెక్క. మనిషిగా ఏం సంపాదించాలనే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.

ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే, నీవు దాన్నెప్పటికీ పూర్తి చేయలేవు

మీరో పని చేయాలనుకున్నారు. ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు ఐపోయింది. రెండు రోజులు గడిచాయి. మూడు రోజు కూడా ఆ పనిని ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు.

ప్రేరణ: జీవితంలో కష్టం ఉందని తెలుసుకున్నప్పుడే సుఖాన్ని ఎంజాయ్ చేయగలవు

జీవితంలో కష్టాలు రాకుడదని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. దేవుడికి మొక్కుకుంటారు. కానీ మీకి తెలుసా? మీ జీవితంలో అసలు కష్టాలే లేకపోతే సుఖం గురించి మీకెప్పటికీ తెలియదు.

ప్రేరణ: నిన్ను చూసి నవ్వే వాళ్లే నిన్ను ఎదిగేలా చేసేది

నువ్వొక పని మొదలు పెట్టావ్, ఆ పని గురించి నీకేమీ తెలియదు. అయినా సరే ప్రారంభించావ్. పనిమీద అవగాహన లేకపోవడం వల్ల నువ్వు ఆ పనిని సరిగ్గా చేయట్లేదు.

25 Mar 2023

విజయం

విజయం వచ్చాక జాగ్రత్తగా ఉండకపోతే అపజయమే మిగులుతుంది

విజయం వచ్చాక నీ చుట్టూ చాలామంది చేరతారు. నిన్ను ఆకాశానికెత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతారు. నీకన్నా తీస్ మార్ ఖాన్ ఎవ్వరూ లేరని, రారని అంటుంటారు.

ప్రేరణ: ఏం ఆలోచిస్తావో అదే అవుతావ్, అందుకే బీ పాజిటివ్

మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా తయారవుతారు. అందుకే మనసుకు ఎప్పుడూ మంచి ఆలోచనల్నే ఇవ్వాలి. ఆశావాదాన్నే అలవాటు చెయ్యాలి.

ప్రేరణ: గతాన్ని గుర్తు తెచ్చుకుని మరీ బాధపడేవారి భవిష్యత్తులో ఆనందం కనిపించదు

తెలుగులో ఒక సామెత ఉంటుంది. గతమెప్పుడూ అందంగానే ఉంటుందీ అని. ఇది అందరికీ కాదు, కొంతమందికి గతమంతా చేదు జ్ఞాపకాలే ఉంటాయి.

21 Mar 2023

విజయం

ప్రేరణ: మనసు పడ్డ ప్రతీదీ మన దరికి రావాలని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే

మన మనసు చాలా అల్లరి చేస్తుంటుంది. దానికి ఊహలెక్కువ. ఆశలెక్కువ. ఆకాశంలో ఎగరాలని చూస్తుంది, దారం లేకపోయినా. నీళ్ళలో తడవాలని చూస్తుంది, ఈత రాకపోయినా.

ప్రేరణ: పదేళ్ల తర్వాత నువ్వేమవుతావ్ అనేదానికి సమాధానం మీ దగ్గరుందా? అసలేంటి నీ లక్ష్యం?

ఈరోజు జీవిస్తున్నామంటే దానికి కారణం రేపటి మీద ఆశ. ఆ ఆశే లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఆ ఆశ పేరే లక్ష్యం. మీకంటూ ఒక లక్ష్యం ఉందా? ఒక్కసారైనా ఆలోచించారా?

ప్రేరణ: ఒంటరిగా ఉండడం కన్నా ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి

ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఎక్కువశాతం జనాలు ఒంటరితనాన్నే ఏకాంతం అనుకుని భ్రమపడుతుంటారు. ఈ రెండింటి మధ్య తేడాని ఒక్కమాటలో ఇలా చ్చెప్పవచ్చు.

ప్రేరణ: అనుకున్నది సాధించాలంటే చదువు, తెలివి కన్నా ముందు ధైర్యం సంపాదించాలి

మీరో బిజినెస్ మొదలెట్టాలనుకున్నారు, మీ దగ్గర 10లక్షల రూపాయలున్నాయి. ఏ బిజినెస్ పెట్టాలో డిసైడ్ అయ్యారు. కానీ బిజినెస్ లో నష్టం వస్తుందేమోనన్న భయం మిమ్మల్ని బిజినెస్ పెట్టకుండా ఆపేస్తుంది.

ప్రేరణ: ఒడిపోయారా? ఐతే మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది

పరీక్షలో ఫెయిల్ అయ్యారా? బాధపడకండి, బిజినెస్ చేయాలనుకుంటే మొదటి అడుగులోనే పట్టుతప్పి కిందపడ్డారా? చింతించకండి, సినిమా తీద్దామని ముందుకెళ్తుంటే ఒక్కరు కూడా మీ కథను ఒప్పుకోవట్లేదా? ఆందోళన పడకండి.

ప్రేరణ: చిన్న పనులను పెద్దగా చూసినపుడే పెద్ద స్థానం అందుకోగలం

చిన్న చిన్న పనులను చిన్నచూపు చూడకుండా ముందుకు సాగినపుడే పెద్ద విజయం మీ సొంతమవుతుంది. అవును, చిన్నది నీ జేబులోకి రాకముందు పెద్దదాన్ని నువ్వు అందుకోలేవు.

ప్రేరణ: ఇతరులకు సహాయం చెయ్యడమే అసలైన విజయం

ఇవ్వడానికి చాలా పెద్ద మనసుండాలి. అది ప్రేమైనా, ఒక వస్తువైనా లేదా డబ్బులైనా సరే, మన దగ్గరున్న ఒక వస్తువును అవతలి వాళ్ళకు ఇవ్వడం అంత తేలిక కాదు.

ప్రేరణ: ఆకాశం అందదని ఆలోచించడం మానేస్తే అంతరిక్షమనే విజయం చేరుకోలేం

ఒక పని మొదలు పెట్టే ముందు కొన్ని వందల ఆలోచనలు వస్తాయి. ఆ పని పూర్తవుతుందా లేదా? నా వల్ల అవుతుందా కాదా? నేను చేయగలనా లేదా అని అనిపిస్తుంటుంది.

ప్రేరణ: అన్నీ తెలుసనుకునే వాళ్ళు ఇతరుల మాట వినరు, అదొక్కటే వాళ్ళ కొంప ముంచుతుంది

మనుషులు రకరకాలుగా ఉంటారు. అందులో అన్నీ తమకే తెలుసనుకునేవారు కూడా ఉంటారు. వీరితో చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే వీళ్ళసలు అవతలి వాళ్ళ మాటలు వినరు.

ప్రేరణ: నిన్ను పైకి లేపాల్సింది వేరే వాళ్ళు కాదు, నీ చేతులే

రోజులు మారిపోతున్నాయ్, ప్రపంచమే మారిపోతోంది. ఈ సమయంలో అవతలి వారికి సాయం చేయాలన్న ఆలోచన తగ్గిపోతోంది. పక్కనున్న వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కరువైపోతున్నారు.

ప్రేరణ: అందమైన అబద్ధం జీవితాన్ని అందంగా మార్చలేదు

అబద్ధం.. ఇది చాలా అందంగా ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు రావనుకునే అబద్ధం ఎంతో హాయినిస్తుంది. ప్రపంచంలోని ధనమంతా రేపు తెల్లారేసరికి నీ కాళ్ళముందుకు వచ్చేస్తుందనే అబద్ధపు నమ్మకం నిన్ను ఉత్సాహంగా ఉంచుతుంది.

ప్రేరణ: అవకాశం రావట్లేదని బాధపడే వారు విజయాన్ని ఎప్పటికీ పొందలేరు

మీలో చాలా టాలెంట్ ఉంది. మీరు చాలా బాగా పాడగలరు, మీరు చాలా బాగా రాయగలరు. కానీ మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఎవ్వరూ కూడా మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. ఇక్కడ తప్పంతా మీది, ఎందుకంటే ఎవ్వరూ ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వరు.

తాత్కాలిక సుఖం కోరితే శాశ్వత ఆనందం దూరమవుతుంది

రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు బాగా నిద్రొస్తుంది, ఇంటర్వ్యూ గురించి మీకేమీ తెలియదు, కనీసం మీ గురించి చెప్పమన్నా మీరు చెప్పలేరు. ఇలాంటి టైమ్ లో రాత్రి కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుందని మీ మెదడు చెబుతుంది.

ప్రేరణ: ప్రయత్నిస్తే పదిరోజుల్లో రాని విజయం వందరోజుల్లో వచ్చే అవకాశం

లావుగా ఉన్నారని, సన్నగా మారాలని ఈరోజు వ్యాయామం మొదలెట్టారనుకుందాం. ఎన్ని రోజుల్లో సన్నగా మారతారు? కరెక్టుగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది వారివారి శరీర తత్వాల్ని బట్టి ఉంటుంది.

ప్రేరణ: సాధించాలన్న సంకల్పం ఉంటే విశ్వం కూడా సాయం చేస్తుంది

ఏ పని చేయడానికైనా సంకల్పం కావాలి. అది లేకపోతే మీరు చేయాలనుకున్న పనులు ఆలోచనల దగ్గరే ఆగిపోతాయి. ఆలోచనలు ఎవ్వరైనా చేస్తారు. వాటిని ముందుకు తీసుకెళ్ళేందుకే సంకల్పం కావాలి.

ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం

మనుషులకు కోరికలెక్కువ. ఆ కోరిక తీరితే ఆనందం వస్తుంది. కానీ అది తీరాలంటే ముందుకు అడుగు వేయాలి. కోరికలు తీరని వారందరూ అడుగు వేయకుండా ఆగిపోయిన వారే. అలా ఆగిపోవడానికి కారణం భయం.

మీకు స్వార్థం ఉందా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మంచిదో తెలుసుకోండి

మారుతున్న ప్రపంచంలో స్వార్థంగా ఉన్నవారే మంచి జీవితాన్ని పొందుతారన్న మాటను ఎక్కువ మంది నమ్ముతున్నారు.