ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వార్తలు
30 Mar 2023
ఎలోన్ మస్క్అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది ఆధునిక సాంకేతిక విప్లవం. సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా పరిమితంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విచ్చవిడి తనం పెరిగితే మానవాళికే పెనుముప్పుగా పరిణమించొచ్చు. ప్రస్తుతం AI విషయంలో కూడా అలాంటి ఊహాగానాలే వెలువడుతున్నాయి.
30 Mar 2023
గూగుల్గూగుల్ బార్డ్ Plagiarism కుంభకోణం గురించి మీకు తెలుసా?
గూగుల్ బార్డ్ AI చాట్‌బాట్ మొదటి నుండి పెద్దగా ఆకర్షించలేదు. డెమో సమయంలో ఒక వాస్తవిక లోపం వలన కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో $100 బిలియన్ల నష్టం వచ్చింది. ఇప్పుడు బార్డ్ కంటెంట్ ను కనీస అనుమతి లేకుండా దొంగలించిందనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటుంది. గూగుల్ ChatGPTకి పోటీగా బార్డ్‌ని పరిచయం చేసింది.
28 Mar 2023
ప్రకటనAI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్
ChatGPT విప్లవం వివిధ రంగాలలో ప్రభావం చూపిస్తుంది. AI సామర్థ్యాలను చూసి ఆనందించినా , ఇది లేబర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
23 Mar 2023
గూగుల్ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera
బ్రౌజర్ల ప్రపంచంలో Opera గూగుల్ Chromeకు ఎప్పుడూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. దీన్ని మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
22 Mar 2023
గూగుల్Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్‌బాట్లలో ఏది ఉత్తమం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI). ఇదొక సాంకేతిక విప్లవం. ఏఐ విషయంలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య వార్ నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన OpenAI సంస్థ ChatGPTని తీసుకురాగా, దీనికి పోటీగా గూగుల్ 'Bard'ను రెడీ చేస్తోంది. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
21 Mar 2023
ఇంస్టాగ్రామ్AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిన చిత్రాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఒక కళాకారుడు ఈ టెక్నాలజీని గతంలో ఉన్నవారితో సెల్ఫీలను సృష్టించడానికి ఉపయోగించారు.
18 Mar 2023
సంస్థOpenAI ChatGPT వెనుక ఉన్నటెక్నాలజీ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సంవత్సరం సంచలనం సృష్టించింది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత డేటా నుండి ఎలా చర్యలు తీసుకోవాలో నేర్చుకుంటుంది.
17 Mar 2023
భారతదేశంభారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్
OpenAI ఫిబ్రవరిలో, కంపెనీ అనేక ప్రయోజనాలతో చాట్‌బాట్ ప్రీమియం వెర్షన్, ChatGPT ప్లస్‌ను పరిచయం చేసింది.
17 Mar 2023
మైక్రోసాఫ్ట్వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ 365 యాప్‌ల సేవల కోసం కోపైలట్‌ను పరిచయం చేసింది, GPT-4 సపోర్ట్ చేసే కోపైలట్ అనేది ఒక సహాయకుడి లాంటిది, ఇది వినియోగదారులకు వివిధ పనులను చేయడంలో సహాయపడుతుంది.
17 Mar 2023
ప్రకటనErnie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు
చైనా సంస్థ బైడు ఎర్నీ బాట్ అనే కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్‌బాట్‌ను గురువారం ఆవిష్కరించింది, అయితే ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను ఉపయోగించడం, పబ్లిక్ లాంచ్ లేకపోవడంతో పెట్టుబడిదారులను నిరాశపరిచింది, వెంటనే ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి.
16 Mar 2023
సంస్థGPT-4 సృష్టి, దాని పరిమితులు గురించి తెలుసుకుందాం
GPT-4, దాని ముందూ వెర్షన్ GPT, GPT-2, GPT-3 వంటివి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి శిక్షణ పొందాయి. డేటా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారం OpenAI ద్వారా లైసెన్స్ పొందిన డేటా ఇందులో ఉంటుంది.
15 Mar 2023
మైక్రోసాఫ్ట్ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు
OpenAI తన కొత్త పెద్ద భాషా మోడల్ (LLM), GPT-4ను పరిచయం చేసింది. BAR, LSAT, GRE వంటి పరీక్షలలో GPT-4 రాణించింది. OpenAI అందించిన డేటా ప్రకారం, LLM యూనిఫాం బార్ పరీక్షలో 298/400 (అంచనా 90వ పర్సంటైల్), LSATలో 88వ పర్సంటైల్, GRE వెర్బల్‌లో 99వ పర్సంటైల్ స్కోర్ చేసింది. ఇది GPT-3.5 పనితీరు కంటే ముందుంది.
15 Mar 2023
మైక్రోసాఫ్ట్OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్
OpenAI సరికొత్త శక్తివంతమైన GPT-4 మల్టీమోడల్ LLMలో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇది టెక్స్ట్‌లు, ఇమేజ్‌లు రెండింటికీ సమాధానాన్ని ఇవ్వగలదు.
02 Mar 2023
సంస్థOpenAI డెవలపర్ chat GPT కోసం API ని ప్రకటించింది
మరిన్ని అప్లికేషన్స్, సేవల్లో chat GPT రానుంది. OpenAI తన AI చాట్‌బాట్‌కు మూడవ పార్టీ డెవలపర్‌లకు API ద్వారా యాక్సస్ తెరిచింది. వారు ఇప్పుడు వారి అప్లికేషన్స్, సేవల్లో CHATGPT ని వినియోగించగలుగుతారు. ఈ కంపెనీ Whisper సంస్థ కోసం API ని కూడా ప్రారంభించింది, దాని AI- శక్తితో కూడిన ఓపెన్-సోర్స్ స్పీచ్-టు-టెక్స్ట్ మోడల్ ప్రారంభించింది.
28 Feb 2023
ఎలోన్ మస్క్ChatGPT లాంటిదే అభివృద్ధి చేయడానికి టీంను నియమించనున్న ఎలోన్ మస్క్
ఎలోన్ మస్క్, బాబుష్కిన్ AI పరిశోధనను కొనసాగించడానికి ఒక టీంను నియమించుకోనున్నారు. అయితే ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది అభివృద్ధి చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక లేదు అయితే మస్క్ ఈ ప్రణాళికపై అధికారికంగా సంతకం చేయలేదని బాబుష్కిన్ తెలిపారు.
24 Feb 2023
కెనడాSpotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు
Spotify అత్యుత్తమ ఆడియో నాణ్యతతో సంగీతాన్ని అందించకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన సంగీతాన్ని అందించడంలో ముందుంటుంది. ఈ ఆడియో స్ట్రీమింగ్ వేదిక ఇప్పుడు తన కొత్త AIతో పనిచేసే DJతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ChatGPT విజయవంతమైన తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు జనాదరణ విపరీతంగా పెరుగుతుండటంతో, టెక్ కంపెనీలు AI-ఆధారిత ప్రోడక్ట్ తో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. OpenAI జూక్‌బాక్స్ నుండి రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatovan.ai వరకు ఇటువంటి ఉత్పత్తులు కొత్తేమి కాదు. ఇప్పుడు, Spotify కూడా ఆ లిస్ట్ లో చేరింది.
23 Feb 2023
అమెజాన్200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు
కొన్ని కష్టమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిడమే కాదు ChatGPT ఇప్పుడు రచయితగా మారింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే, టెక్ పరిశ్రమలో భారీ ప్రకంపనలు సృష్టించింది. AI చాట్‌బాట్, దాని మానవ-వంటి సంభాషణా సామర్థ్యాలతో, కొంతమందితో తమ ఉద్యోగాల కోసం కూడా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.
21 Feb 2023
మైక్రోసాఫ్ట్నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్
మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ తో సంభాషణ వివాదాస్పదంగా మారింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సేలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన టోబీ ఆర్డ్ ఈ సంబాషణను పంచుకున్నారు. ఇందులో AI చాట్‌బాట్ వినియోగదారుడు తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన తర్వాత వినియోగదారుని బెదిరించడం చూడచ్చు.
15 Feb 2023
ఆదాయంఇంటర్నెట్ సంచలనం ChatGPT వెనుక ఉన్న సామ్ ఆల్ట్‌మాన్ గురించి తెలుసుకుందాం
గత కొన్ని నెలలుగా ChatGPT ఎన్నో చర్చలకు దారితీసింది. అయితే అందరూ ఈ చాట్ బాట్ గురించి మాట్లాడారు గాని OpenAI సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ గురించి ఎవరూ మాట్లాడలేదు. 37 సంవత్సరాల ఆల్ట్‌మాన్, చికాగో, ఇల్లినాయిస్‌లో 1985లో జన్మించాడు. అతను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో పెరిగాడు.
09 Feb 2023
సంస్థChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ
చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా AI రంగంలోకి ప్రవేశించబోతుంది. ChatGPT లాంటి టూల్‌ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
09 Feb 2023
గూగుల్అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్
ChatGPTతో ఉన్న కొత్త Bing గురించి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన గురించి ఇంకా అందరు చర్చిస్తుండగానే గూగుల్ తన AI-సెంట్రిక్ "లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ఈవెంట్ ను పారిస్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో Bard-గూగుల్ గురించి ప్రివ్యూతో పాటు గూగుల్ లెన్స్ గురించి కొన్ని అప్‌డేట్‌లు ఉన్నాయి.
08 Feb 2023
మైక్రోసాఫ్ట్ChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లోని ప్రధాన కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ జర్నలిస్టులు, క్రియేటర్ల సమక్షంలో కొత్త Bing గురించి ప్రకటించింది.
07 Feb 2023
రైల్వే శాఖ మంత్రిప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్
వినియోగదారుల సౌకర్యార్థం రైళ్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చింది భారతీయ రైల్వే. తాజాగా రైళ్లలో ప్రయాణికులు భోజన్ ఆర్డర్ చేసుకున్న పద్ధతిని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే సేవలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
07 Feb 2023
ఇస్రోభారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో
IIT మద్రాస్, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (IHSP) కోసం వ్యోమగామి శిక్షణా మాడ్యూల్‌పై పని చేయడానికి సహకరించనున్నాయి. ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్‌డ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించబోతుంది.
07 Feb 2023
గూగుల్AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్
గూగుల్ ఒక ప్రయోగాత్మక Bard AI సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే గూగుల్ కు గట్టి పోటీనిచ్చే మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడి పెట్టిన Open AI చాట్‌బాట్ ChatGPT సంచలనం సృష్టించింది.
03 Feb 2023
మైక్రోసాఫ్ట్GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ChatGPT కనెక్ట్ చేసే ఆలోచనను ఇటీవలే ప్రకటించింది.
02 Feb 2023
ప్లాన్నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్
OpenAI సంస్థ ChatGPT చుట్టూ ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించి, మనుషుల లాగే మాట్లాడే సామర్థ్యం ఉన్న చాట్‌బాట్ కోసం కంపెనీ కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. దీనికి ChatGPT ప్లస్ అని పేరుపెట్టింది, అయితే ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వలన ఉచిత సేవకు ఎటువంటి ఆటంకం ఉండదని ఆ సంస్థ తెలిపింది.
28 Jan 2023
గూగుల్త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT
OpenAI ChatGPTకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో గుబులు పుట్టిస్తుంది. Gmail సృష్టికర్త పాల్ బుచ్‌హీట్ ఈ ChatGPT మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను మించిపోవచ్చని పేర్కొన్నారు. Yellow Pagesకు గూగుల్ ఎలా చెక్ పెట్టిందో అలాగే సెర్చ్ ఇంజన్‌లకు ఈ AI చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
27 Jan 2023
టెక్నాలజీఉద్యోగ కోతలు మొదలుపెట్టిన మరో కంపెనీ, 3,900 ఉద్యోగులను తొలగించనున్న IBM
ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM)కూడా ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాల జాబితాలో చేరింది. 3,900 మంది సిబ్బందిని అంటే ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 1.5% మందిని తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ తొలగింపులు asset divestmentలో అంటే కొన్ని రంగాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయడంలో భాగమని అంతేకాని పనితీరు అంచనాల ఆధారంగా కాదని సృష్టం చేసింది.
24 Jan 2023
మైక్రోసాఫ్ట్10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ChatGPT యజమాని OpenAIతో తన భాగస్వామ్యాన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా విస్తరించాలని నిర్ణయించుకుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ లో OpenAI టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్‌లో ChatGPT పెట్టాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గూగుల్ వంటి వాటికి గట్టి పోటీనివ్వచ్చు.
20 Jan 2023
ఆటో మొబైల్ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis
టెక్నాలజీ దిగ్గజం Qualcomm USలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో Snapdragon Digital Chassis కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కారుతో ఆటోమేకర్లు దాని టెక్నాలజీ, సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రదర్శించింది. ఇది మొదటి ఆటోమోటివ్ సూపర్-కంప్యూట్ క్లాస్ సొల్యూషన్ గా ప్రచారం అవుతుంది.
17 Jan 2023
గూగుల్ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన గూగుల్
ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ మాదిరిగానే బ్లూటూత్ ట్రాకర్‌పై గూగుల్ పనిచేస్తోందని టెక్నాలజీ జర్నలిస్ట్ మిషాల్ రెహమాన్ పేర్కొన్నారు. డెవలపర్ ఈ ప్రోడక్ట్ కి "Grogu" అనే పేరు పెట్టారు.
17 Jan 2023
టెక్నాలజీకంటెంట్ క్రియేటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai
కంటెంట్ క్రియేటర్లు కంటెంట్‌ను ఆకర్షణీయంగా చేయడానికి సంగీతంపై ఎక్కువగా ఆధారపడతారు. కానీ అటువంటి సంగీతానికి కాపీరైట్ సమస్యలను ఎదుర్కుంటున్నారు. Beatoven.ai, భారతదేశంలో మొట్టమొదటి AI-సపోర్ట్ చేసే మ్యూజిక్ ను అందిస్తుంది.
10 Jan 2023
మెటావివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత
తమ ప్రకటనలు వివక్షతతో ఉన్నాయనే ఆందోళనలను పరిష్కరించే ప్రయత్నంలో, మెటా కొన్ని మార్పులను రూపొందించింది.
09 Jan 2023
ఆపిల్ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం
ప్రపంచవ్యాప్త డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) కంటే ముందుగా అందరూ ఎదురుచూస్తున్న మిశ్రమ-రియాలిటీ హెడ్‌సెట్‌ను ఆపిల్ ఆవిష్కరించవచ్చు. ఈ AR/VR హెడ్‌సెట్ దాదాపు $3,000 (దాదాపు రూ. 2.47 లక్షలు) ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) అనుభవాలను అందించడానికి ఆపిల్ కొత్త xrOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.
05 Jan 2023
గూగుల్Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం బ్లాగ్ పోస్ట్‌లో OpenAI, DALL-E 2 నుండి ఇమేజ్-జెనరేషన్ సాఫ్ట్‌వేర్‌ను Bingకి అనుసంధానించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది.
02 Jan 2023
ట్విట్టర్ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్
ట్విటర్ చీఫ్ ఎలోన్ మస్క్ జనవరి 2023లో ట్విట్టర్‌లో నావిగేషన్ రాబోతున్నట్లు ప్రకటించారు. కొత్త ట్విట్టర్ నావిగేషన్ సిస్టమ్ వినియోగదారులను పక్కకు స్వైప్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. రికమెండెడ్ ట్వీట్‌లు, ట్రెండ్‌లు, అంశాలకు వారిని తీసుకువెళుతుంది. కొత్త నావిగేషన్ సిస్టమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలోన్ మస్క్ సృష్టంగా వెల్లడించనప్పటికీ, జనవరిలో రావచ్చని భావిస్తున్నారు.
29 Dec 2022
టెక్నాలజీ2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు
టెక్నాలజీ కంపెనీలు 2022 లో ఎప్పటిలాగే ఎన్నో ఆవిష్కరణల గురించి హామీ ఇచ్చారు కానీ వాస్తవానికి, హామీకి చాలా దూరంలో ఆగిపోయారు.
27 Dec 2022
టెక్నాలజీఅంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు
ఒక బహుళజాతి శాస్త్రవేత్తల బృందం ఒక మంచు ఫలకం అస్థిరత, దిగువన ఉన్నమిగతావాటిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.
26 Dec 2022
టెక్నాలజీNEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA
US అంతరిక్ష సంస్థ NASA ఎట్టకేలకు గ్రహశకలాల నుండి రక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ప్లానెటరీ సొసైటీ NEO సర్వేయర్ ప్రాజెక్ట్‌ను 2028లో ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తుంది. NEO సర్వేయర్ అనేది భూమితో ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలో ఉన్న గ్రహశకలాలు, ఇతర చిన్న వస్తువుల కోసం వెతికే ఉపగ్రహం.