ట్విట్టర్: వార్తలు

ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు

ట్విట్టర్ SMS టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) పద్ధతి నుండి మారడానికి ఈరోజే చివరి రోజు. మార్చి 20వ తేదీ నుండి ట్విట్టర్ దాని SMS ఆధారిత 2FAని నెలకు $8 బ్లూ సబ్స్క్రిప్షన్ తో అందిస్తుంది.

ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది

ప్రజాభిప్రాయాన్ని గుర్తించి హైలైట్ చేయడానికి కృతిమ మేధస్సును ఉపయోగించనుందని ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్ శనివారం తన ట్వీట్ ద్వారా ప్రకటించారు.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను ట్విట్టర్‌లో మంత్రిత్వ శాఖ పంచుకుంది. ఫిబ్రవరి 28, 2023 నాటికి మొత్తం పురోగతి 26.33శాతం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర మొత్తం పనిలో 13.72శాతం, గుజరాత్ సివిల్ వర్క్‌లో 52శాతానికి పైగా పూర్తి చేశాయి. ప్రస్తుతం 36.93శాతం పూర్తయింది.

14 Mar 2023

సంస్థ

భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు సిఈఓ శ్రీధర్ వెంబు, $4.5 బిలియన్ల విలువైన వ్యాపార సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ (ఫోర్బ్స్ ప్రకారం), తన మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్‌తో విడాకుల పోరాటంలో ఉన్నారు.

14 Mar 2023

ఫీచర్

ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్, వార్తలను అందించే వనరులలో ఒకటి. కాబట్టి, ప్లాట్‌ఫారమ్ ద్వారా వచ్చిన సమాచారం వాస్తవికతను నిర్ధారించడం చాలా అవసరం. అందుకే ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్‌ను ప్రవేశపెట్టింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్

శుక్రవారం, US రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు, దాని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. SVB దాని స్టాక్ ధర 60% క్షీణించిన రోజు తర్వాత US రెగ్యులేటర్ల నుండి మూసివేత ప్రకటన వచ్చింది.

డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు

''డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్' సోషల్ మీడియా బిలియనీర్లను ఆకట్టుకుంటుంది. ఈ లిస్ట్ లో జాక్ డోర్సే, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇటువంటి సామాజిక నెట్‌వర్క్‌లు కొత్త కాదు. ఇటువంటి మొదటి సామాజిక నెట్‌వర్క్‌ డయాస్పోరా, 2010లో ప్రారంభమైంది.

10 Mar 2023

ఓలా

ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం

భారతదేశంలో హోలీ పండుగ కోసం ప్రత్యేక తగ్గింపులను ప్రవేశపెట్టిన తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదుగురు నెటిజన్లకు ప్రత్యేకమైన S1 హోలీ ఎడిషన్ ఈ-స్కూటర్‌లను అందిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్

ట్విట్టర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయితే ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలోన్ మస్క్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఈ వేదికకు కొన్ని కొత్త ఫీచర్లను సిఈఓ ప్రకటించారు.

నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్‌ చిత్రాలు లీక్

నథింగ్ నుండి ఇయర్ ఫోన్స్, ఇయర్ స్టిక్ తర్వాత బ్రాండ్ నుండి నాల్గవ ఉత్పత్తిగా స్పీకర్‌ వస్తుంది. నథింగ్ కంపెనీ ఇప్పుడు తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మొబైల్, ఇయర్‌బడ్‌ల తో పాటు స్పీకర్‌ ను చేర్చింది.

హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ స్టాక్ రూట్‌కు కారణమైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కొనసాగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గురువారం స్వాగతించారు.

01 Mar 2023

ఫీచర్

ట్విట్టర్ కు పోటీగా మాజీ సిఈఓ జాక్ డోర్సే లాంచ్ చేయనున్న బ్లూస్కై

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ CEO జాక్ డోర్సే రూపొందించిన బ్లూస్కీ పబ్లిక్ లాంచ్‌కు చేరువలో ఉంది. ఆపిల్ స్టోర్ లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ ఎలోన్ మస్క్ అధీనంలోకి రావడంతో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ చాలా ఒడిదుడుకులకు లోనైంది. అది ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే యాప్‌లకు మరిన్ని అవకాశాలు సృష్టించింది.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్

టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 2022లో టెస్లా షేర్లు క్షీణించడంతో మొదటి స్థానాన్ని కోల్పోయారు.

'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం హ్యాక్ అయ్యింది. పార్టీ ఖాతా పేరు మార్పు, లోగోను హ్యాకర్లు మార్చారు.

ChatGPT లాంటిదే అభివృద్ధి చేయడానికి టీంను నియమించనున్న ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్, బాబుష్కిన్ AI పరిశోధనను కొనసాగించడానికి ఒక టీంను నియమించుకోనున్నారు. అయితే ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది అభివృద్ధి చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక లేదు అయితే మస్క్ ఈ ప్రణాళికపై అధికారికంగా సంతకం చేయలేదని బాబుష్కిన్ తెలిపారు.

ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం

ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.

27 Feb 2023

సినిమా

దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

తెలుగు దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణించి నెల కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయలక్ష్మి మరణించే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

25 Feb 2023

సినిమా

'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది

ధనుష్ తాజా సినిమా సార్ (తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతి/సార్, రూ. 75కోట్లు కలెక్షన్స్ సాధించి విజయవంతంగా విదేశాలలో కూడా ఆడుతుంది.

వచ్చే వారం ట్విట్టర్ అల్గోరిథం సోర్స్ ఓపెన్ చేయనున్న ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ అల్గోరిథం ఓపెన్ సోర్సింగ్ చేయనున్నారు. ట్విట్టర్ రికమెండేడ్ అల్గోరిథంను వచ్చే వారం ప్రారంభంలో చూడవచ్చు. ఓపెన్ సోర్సింగ్ ట్విట్టర్ అల్గోరిథం గురించి నిర్ణయం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కోసం అనేక అవకాశాలను ఇస్తుంది. మస్క్ తన సొంత ట్వీట్లను పెంచే తీసుకున్న నిర్ణయం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి కావచ్చు.

నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్

మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ తో సంభాషణ వివాదాస్పదంగా మారింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సేలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన టోబీ ఆర్డ్ ఈ సంబాషణను పంచుకున్నారు. ఇందులో AI చాట్‌బాట్ వినియోగదారుడు తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన తర్వాత వినియోగదారుని బెదిరించడం చూడచ్చు.

18 Feb 2023

ప్రపంచం

యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ మరోసారి యూజర్లకు ఝలక్ ఇచ్చింది. ఎస్ఎమ్ఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(2ఎఫ్ఏ) భద్రతా సదుపాయాన్ని ఇకపై ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లే ఇస్తామంటూ శుక్రవారం వెల్లడించింది. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూజర్లకు మరోమారు షాక్ తగిలినట్లు అయింది.

భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ వస్తువులను విక్రయించడం, కార్యాలయాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్విట్టర్ శుక్రవారం ఉదయం భారతదేశంలోని దాని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది, ఆ కార్యాలయాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని కోరింది.

09 Feb 2023

ప్లాన్

ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో ప్రారంభమైంది. ఇది ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం, వెబ్ ద్వారా HD రిజల్యూషన్‌లో వీడియోలను పోస్ట్ చేయడం, కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు

గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ బ్రాండ్‌ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు.

ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.

అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విటర్‌ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ సోషల్ మీడియా సంస్థ పేమెంట్ టూల్స్ పై పనిచేయడం ప్రారంభించింది.

ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

ట్విట్టర్ ఐఫోన్ వినియోగదారులు ట్వీట్‌లను సులభంగా బుక్‌మార్క్ చేసేలా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులు ట్వీట్ వివరాల క్రింద ఉన్న బుక్‌మార్క్ బటన్‌పై నొక్కాలి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల విషయానికొస్తే, ఫ్లాగ్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఫోల్డర్‌లలో తమకు నచ్చిన ట్వీట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

ఫర్నిచర్ వేలం నుండి తగ్గుతున్న ఆదాయం వరకు అసలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది

శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో మిగులు వస్తువులను వేలం వేసి కొంత డబ్బును సేకరించే పనిలో ఉంది ట్విట్టర్. మిగులు కార్యాలయ వస్తువులను విక్రయించడం వలన ట్విట్టర్ ఆదాయం పెరగొచ్చు.

ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం

ట్విట్టర్ ఆర్థికంగా కష్టాల్లో పడింది. దాని కొత్త సిఈఓ ఎలోన్ మస్క్ కంపెనీ ఆ కష్టాలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అందులో విజయం సాధించలేకపోతున్నారు. ట్విట్టర్ రీలింగ్ ప్రకటన వ్యాపార ప్రభావం ఆ సంస్థ ఆర్ధిక స్థితి మీద పడుతోంది. ఈ సంస్థను మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి 500 మంది ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు పెట్టడం మానేశారు.

18 Jan 2023

బీజేపీ

విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక ఘటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

జనవరి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్‌లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్‌లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.

ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం

ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఆదాయాన్ని పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఆదాయాన్ని సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో యూజర్ నేమ్స్ ను విక్రయించాలని ఆలోచిస్తుంది.

03 Jan 2023

ప్రపంచం

శని గ్రహం చుట్టూ ఉండే వలయాల గుట్టు విప్పిన NASA

NASA హబుల్ స్పేస్ టెలిస్కోప్ చాలా సంవత్సరాలుగా శనిగ్రహాన్ని పర్యవేక్షిస్తుంది, ఎందుకంటే ఈ గ్రహం సూర్యుని చుట్టూ 29 సంవత్సరాల సుదీర్ఘ కక్ష్యలో తిరుగుతుంది.

భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం

అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య భారతదేశంలో పిల్లలపై లైంగిక దోపిడీ, బలవంతపు నగ్నత్వాన్ని ప్రోత్సహించినందుకు 45,589 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. దేశంలో తమ వేదికపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలగించింది. మొత్తంగా, భారతదేశంలో ఈ విషయంపై ట్విట్టర్ 48,624 ఖాతాలను నిషేధించింది.

సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.

ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్

ట్విటర్ చీఫ్ ఎలోన్ మస్క్ జనవరి 2023లో ట్విట్టర్‌లో నావిగేషన్ రాబోతున్నట్లు ప్రకటించారు. కొత్త ట్విట్టర్ నావిగేషన్ సిస్టమ్ వినియోగదారులను పక్కకు స్వైప్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. రికమెండెడ్ ట్వీట్‌లు, ట్రెండ్‌లు, అంశాలకు వారిని తీసుకువెళుతుంది. కొత్త నావిగేషన్ సిస్టమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలోన్ మస్క్ సృష్టంగా వెల్లడించనప్పటికీ, జనవరిలో రావచ్చని భావిస్తున్నారు.

వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ట్విట్టర్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఎదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నటి వరకు ఖాతాలు నిలుపుదల, ఇతర సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులు... ఇప్పుడు వెబ్ నుండి సైన్ ఇన్ చేయడంలో సమస్యను ఎదుర్కుంటున్నారు. కొందరు వారి ట్విట్టర్ నోటిఫికేషన్‌లు కూడా పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం

సీఈఓ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ తాను టెస్లాలో 18 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి షేర్లను విక్రయించనని అన్నారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి స్టాక్ దాని విలువలో దాదాపు సగం కోల్పోయింది.

"ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్

ఎలోన్ మస్క్ ప్రస్తుతం ట్విటర్ సీఈఓ పదవికి సరిపోయే వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఇటీవలి ట్వీట్‌లో, తన స్థానంలో మరొకరు వచ్చాక అధిపతిగా పదవీవిరమణ చేస్తానని ప్రకటించారు.