బైక్: వార్తలు

20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's

బెంగళూరులోని 170కి పైగా డొమినోస్ అవుట్‌లెట్‌లు ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తాయని డొమినోస్‌పేరెంట్ సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. పిజ్జా బ్రాండ్, డొమినోస్ సోమవారం బెంగళూరులో తమ 20 నిమిషాల పిజ్జా డెలివరీ సేవను ప్రారంభించింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అని పేర్కొంది. అంతకుముందు 30 నిమిషాల వ్యవధిలో పిజ్జా డెలివరీతో కంపెనీ పేరు సంపాదించింది.

త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350

US బైక్‌ తయారీసంస్థ హార్లే-డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం X350 బైక్ ని లాంచ్ చేయనుంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందు, మోటార్‌సైకిల్ US డీలర్‌షిప్‌లో కనిపించింది. ప్రస్తుతం మార్కెట్ మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిళ్ల వైపు వేగంగా అభివృద్ధి చెందుతుంది, వాహన తయారీ సంస్థ తన రాబోయే X350 మోడల్‌తో ఈ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలనుకుంటుంది.

ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో

స్వదేశీ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల అభివృద్ధి కోసం అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌మేకర్‌లలో ఒకటైన TVS మోటార్ కంపెనీ తన నియో-రెట్రో ఆధారంగా నాలుగు ప్రత్యేకమైన, అనుకూల-నిర్మిత మోటార్‌సైకిళ్లను గోవాలో జరిగిన TVS MotoSoul 2023 ఈవెంట్ లో ప్రదర్శించింది. బైక్‌లను TVS డిజైన్ టీమ్, JvB మోటో, స్మోక్డ్ గ్యారేజ్, రాజ్‌పుతానా కస్టమ్స్ రూపొందించాయి.

మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది

మ్యాటర్ ఎనర్జీ తన మొట్టమొదటి ఉత్పత్తి Aeraను భారతదేశంలో ప్రారంభించింది. ఈ-బైక్ Aera 4000, Aera 5000, Aera 6000 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. పూర్తి ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ, Aera 5000 ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మార్కెట్లో ఈ సెగ్మెంట్లో టోర్క్ Kratos Rతో పోటీపడుతుంది.

E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ లో ఒక విభాగం. ఇప్పుడు ఈ విభాగం ముంబై, దాని శివారు ప్రాంతాలలో ఆటోరిక్షా స్టాండ్‌లు, ఆటో డ్రైవర్ హోమ్ క్లస్టర్‌లు, జంక్షన్‌ల దగ్గర అనేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.

భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765

బ్రిటీష్ తయారీ సంస్థ Triumph మోటార్‌సైకిల్స్ గత ఏడాది నవంబర్‌లో స్ట్రీట్ ట్రిపుల్ 765 R, RS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. రెండు మోడల్‌లు ఇప్పుడు భారతదేశంలోని బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ట్విన్-పాడ్ LED హెడ్‌లైట్, అప్డేట్ అయిన బాడీ ప్యానెల్‌ల కోసం పదునైన డిజైన్‌తో, మిడిల్‌వెయిట్ స్ట్రీట్‌ఫైటర్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ మోటారోడ్ తన 'R 18 100 ఇయర్స్' బైక్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ లో క్లాసిక్ క్రోమ్ పెయింట్‌వర్క్‌తో, హీటెడ్ గ్రిప్స్, అక్రాపోవిక్ ఎగ్జాస్ట్‌తో సహా అనేక నడుస్తుంది.

కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా భారతదేశంలో తన Fascino 125 Fi హైబ్రిడ్, Ray ZR 125 Fi హైబ్రిడ్ స్కూటర్ల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. రెండు వాహనాలు కొత్త రంగు ఆప్షన్స్ తో, OBD-II సెన్సార్‌తో వస్తున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు

బైక్‌ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఇంటర్‌సెప్టర్ 650 కోసం ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్ల కోసం విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు లైట్నింగ్.

భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్

స్వదేశీ బైక్‌తయారీ సంస్థ బజాజ్ త్వరలో భారతదేశంలో లెజెండరీ పల్సర్ 220F మోడల్‌ బైక్ ను తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. అప్డేట్ అయిన ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభించింది. డెలివరీలు ఒకటి లేదా రెండు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల

జపనీస్ బైక్ తయారీ సంస్థ యమహా భారతదేశంలో R15M 2023 అప్డేట్ ను ప్రారంభించింది. అప్‌డేట్‌లో భాగంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు క్విక్‌షిఫ్టర్‌ ఉన్నాయి.

భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2

2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మరిన్నిఫీచర్స్ తో భారతదేశంలో ప్రారంభమైంది.

భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్

చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.

భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP

స్వదేశీ స్టార్ట్-అప్ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో OXO మోడల్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్‌సైకిల్ బేస్, ప్రో మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. తయారీ సంస్థ ఈ బైక్‌ను ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించింది. ప్రో ప్యాకేజీ కింద మొత్తం-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఐదు రంగులలో ఆర్డర్ చేసుకోవచ్చు.

భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్

జపనీస్ తయారీ సంస్థ సుజుకి భారతదేశంలో తన Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 బైకుల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా కొత్త రంగు ఆప్షన్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. సింగిల్-సిలిండర్ 155cc, 249cc ఇంజిన్‌లతో నడుస్తాయి. .

399cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో రాబోతున్న 2023 Kawasaki Ninja ZX-4RR 399cc

Kawasaki ట్రాక్-ఫోకస్డ్ 2023 Kawasaki Ninja ZX-4RRని గ్లోబల్ మార్కెట్‌ల లో $9,699 (సుమారు రూ. 8 లక్షలు) ధరతో విడుదల చేయనుంది. సూపర్‌స్పోర్ట్ ఎంట్రీ-లెవల్ ZX-25R మరియు మిడ్-కెపాసిటీ ZX-6R మధ్య ఉంటుంది.

మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa

జపనీస్ తయారీ సంస్థ సుజుకి Hayabusa 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. ఈ సూపర్‌బైక్ మూడు డ్యూయల్-టోన్ రంగుల్లో అంటే పెర్ల్ వైగర్ బ్లూ/పెర్ల్ బ్రిలియంట్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ థండర్ గ్రే/క్యాండీ డేరింగ్ రెడ్ లో లభిస్తుంది. స్పోర్టి టూరర్ అవుట్‌గోయింగ్ మోడల్ మొత్తం డిజైన్‌ తో, 1,340cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది.

బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు

మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు.

భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV

PURE EV భారతదేశంలో తన ఎకోడ్రైఫ్ట్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ పూర్తి-LED లైటింగ్ సెటప్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కిమీల వరకు నడుస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్

JAWA మోటార్‌సైకిల్స్ ఇటీవల భారతదేశంలో 42 మోడల్‌కు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త మెటాలిక్ కాస్మిక్ కార్బన్ కలర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెట్రో బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు సబ్-400cc కేటగిరీలో పోటీగా ఉంటుంది.

25 Jan 2023

ధర

లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్

బైక్ తయారీ సంస్థ KTM గ్లోబల్ మార్కెట్‌ల కోసం RC 125, RC 390 2024 అప్డేట్ ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. అప్‌డేట్ అయిన మోటార్‌సైకిళ్లు టెస్ట్ రన్ లో ఉన్నాయి. కస్టమర్‌ల నుండి పలు అభ్యర్థనలు అందుకున్న తర్వాత సూపర్‌స్పోర్ట్ ఆఫర్‌లను అప్‌డేట్ చేయాలని ఈ బ్రాండ్ నిర్ణయించుకుంది.

ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ

ఓలా S1 Pro భద్రత, నాణ్యత ప్రమాణాలపై మరిన్ని భయాలు పెరిగాయి. జనవరి 21న, ఒక మహిళ స్కూటర్ నడుపుతుండగా ముందు సస్పెన్షన్ విడిపోయి ముందు చక్రం విడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యి ఐసియూలో చికిత్స పొందుతుంది.

భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా

హోండా తన యాక్టివా స్కూటర్‌లో స్మార్ట్ కీ వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ కు కారు లాంటి స్మార్ట్ కీ ఉంటుంది, ఇది మల్టీ ఫంక్షనల్ బటన్‌తో వస్తుంది. ఇందులో 5.3 లీటర్ల పెట్రోల్ స్టోర్ చేసుకోవచ్చు, ఇది 105 కిలోల బరువు ఉంటుంది.

గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన 2023 యమహా గ్రాండ్ ఫిలానో

టూ-వీలర్ తయారీ సంస్థ యమహా గ్లోబల్ మార్కెట్‌లలో గ్రాండ్ ఫిలానో 2023 వెర్షన్ ను విడుదల చేసింది.ఇప్పుడు ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇది భారతదేశంలో అమ్ముతున్న Fascino 125 Fi హైబ్రిడ్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతానికి, ఈ బ్రాండ్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఆ సంస్థ ఇంకా తెలియజేయలేదు.

విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం

స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో లియో ఈ-స్కూటర్ హై-స్పీడ్ వెర్షన్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 81,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీల వరకు నడుస్తుంది. ఈ నెల నుండి ఆ బ్రాండ్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది.

సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 బైక్ మార్కెట్లో విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సూపర్ మీటోర్ 650 బైక్‌ను సోమవారం భారతదేశంలో విడుదల చేసింది. ఇది నవంబర్ 2022లో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయింది. క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్, సెలెస్టియల్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది

2023 హోండా CB500X త్వరలో భారతదేశంలో కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఇదివరకే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెనెల్లీ TRK 502కి పోటీగా వస్తుంది. అయితే రెండింటిలో ఏది మంచిది అనేది తెలుసుకుందాం.

IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 2023కి IMOTY లేదా ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ గెలుచుకుంది. ఈ మోటార్‌సైకిల్ తనతో పోటీ పడిన మరో తొమ్మిది బ్రాండ్లను ఓడించి కిరీటాన్ని గెలుచుకుంది. 15 మంది సీనియర్ మోటార్‌సైకిల్ జర్నలిస్టుల బృందం ఈ బైక్‌ను అగ్రస్థానానికి ఎంపిక చేసింది. TVS రోనిన్, సుజుకి V-Strom SX మొదటి, రెండవ రన్నరప్‌గా నిలిచాయి.

ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్

ముంబైకి చెందిన లిగర్ మొబిలిటీ తన స్కూటర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. వాటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి.

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్

Keeway సంస్థ Moto Bologna Passione (MBP) త్వరలో అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI) ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. క్రూయిజర్‌తో పాటు, వాహన తయారీ సంస్థ M502N స్ట్రీట్‌ఫైటర్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది, గ్లోబల్ తయారీ సంస్థలు ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.

2022లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల్లో రికార్డ్

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అమ్మకాలు 2022 సంవత్సరంలో భీభత్సంగా పెరిగాయి. కానీ అదే టైమ్ లో 2022 డిసెంబర్ లో మాత్రం తగ్గాయి. 2021 డిసెంబర్ లోని అమ్మకాలతో పోల్చితే 2022లో అమ్మకాలు తగ్గినట్లు కనిపిస్తోంది.

VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ VIDA V1 కస్టమర్ డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ వాహనం బెంగళూరులో డెలివరీ చేశారు. జైపూర్, ఢిల్లీలో డెలివరీలు జరుగుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి

భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.

పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు

ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన నెంబర్ తో ఉన్న పరిమిత ఎడిషన్ పనిగేల్ V4 బగ్నాయా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా, పానిగేల్ V4 బౌటిస్టా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా అమ్ముడయ్యాయని Ducati సంస్థ ప్రకటించింది. ఈ సీజన్‌లో MotoGP, WorldSBKలో డుకాటీ విజయాన్ని పురస్కరించుకుని ఈ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది.

2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ

భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N

keeway యాజమాన్యం నుండి వస్తున్న Moto Bologna Passione లేదా MBP త్వరలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో తన మొదటి M502Nని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది ఈ సంస్థ.

శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్

చైనీస్ బ్రాండ్ MBP C650V క్రూయిజర్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. 2023 ప్రారంభం నుండి అందుబాటులో ఉంటుంది. అయితే ధర గురించి తయారీ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా

మార్గదర్శకంగా నిలిచిన లైఫ్ ఫర్ కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి మోపెడ్ "లూనా" సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అవతారంలో సోదర సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ & పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా లాంచ్ కాబోతుంది.

వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థ OLA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, మోటార్‌బైక్‌లు, స్కూటర్‌లు, వంటి వాణిజ్య వాహనాలను కూడా తయారు చేయనుందని రాబోయే 12 నెలల్లో ఈ ఉత్పత్తులపై మరిన్ని ప్రకటనలను వింటారని ఆ సంస్థ సహా వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

మునుపటి
తరువాత