సంస్థ: వార్తలు

OpenAI డెవలపర్‌ chat GPT కోసం API ని ప్రకటించింది

మరిన్ని అప్లికేషన్స్, సేవల్లో chat GPT రానుంది. OpenAI తన AI చాట్‌బాట్‌కు మూడవ పార్టీ డెవలపర్‌లకు API ద్వారా యాక్సస్ తెరిచింది. వారు ఇప్పుడు వారి అప్లికేషన్స్, సేవల్లో CHATGPT ని వినియోగించగలుగుతారు. ఈ కంపెనీ Whisper సంస్థ కోసం API ని కూడా ప్రారంభించింది, దాని AI- శక్తితో కూడిన ఓపెన్-సోర్స్ స్పీచ్-టు-టెక్స్ట్ మోడల్ ప్రారంభించింది.

భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు

భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఈ నెలలో కొత్త కార్లు రావడంతో సందడిగా మారింది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి పూర్తి-పరిమాణ SUVలు హైబ్రిడ్ MPV వరకు, చాలానే వస్తున్నాయి.

28 Feb 2023

టాటా

మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ ఈరోజు తన తొలి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF), Recycle with Respectని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించారు.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల

అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (GDP) 4.4 శాతం వృద్ధి చెందిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2022-23లో GDP వృద్ధి 2021-22లో 9.1 శాతంతో పోలిస్తే 7.0 శాతంగా అంచనా వేయబడింది.

మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో

బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి బెంగళూరుకు చెందిన Yulu, మిరాకిల్ GR, DeX GR అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రదర్శించారు. బజాజ్ కు Yulu తన రెండవ తరం ఈ-స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడింది, దానితో పాటు కొన్ని భాగాలను ఉత్పత్తి చేసింది.

జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి

కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.

బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు, సంబంధిత టెక్నాలజీల రంగంలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించే వేదిక. ఈ సంవత్సరం వేడుకలో సుమారు 200+ దేశాల నుండి 80,000 మంది పాల్గొంటారని అంచనా. సామ్ సంగ్, HONOR, Huawei వంటి బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను అందించడానికి సిద్ధమయ్యాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌

మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో మామూలే, హానికరమైన వాయువుల వలన ఈ పని చేసే వారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. భారతదేశంలో 2017 నుండి సుమారు 400 మంది ఈ మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో మరణించారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం మ్యాన్‌హోల్స్‌లోని మురుగునీటిని శుభ్రపరిచే బాండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో ఈ రోబో మ్యాన్‌హోల్ శుభ్రం చేసే కార్మికులకు విశ్రాంతిని అందిస్తోంది.

ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం

ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.

25 Feb 2023

గూగుల్

మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు

గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ రహస్య X మూన్‌షాట్ ల్యాబ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన ఒక సంవత్సరం తర్వాత దాని అతి చిన్న అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎవ్రీడే రోబోట్‌లను తొలగించాలని నిర్ణయించుకుంది. డిపార్ట్‌మెంట్‌లో అనేక ప్రయోజనాత్మక ప్రాజెక్టులలో పనిచేసే 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు.

జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.

24 Feb 2023

గూగుల్

తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్

డాక్స్, షీట్‌లతో సహా గూగుల్ తన వర్క్‌స్పేస్ అప్లికేషన్‌ల కోసం కొత్త ఫీచర్‌లను కొన్ని డిజైన్ మార్పులను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌లలో స్మార్ట్ కాన్వాస్, క్యాలెండర్ ఆహ్వాన టెంప్లేట్‌లు, వేరియబుల్స్, ఎమోజి ఓటింగ్ చిప్‌లు ఉన్నాయి. కొత్త యాడ్-ఆన్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.

Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు

Spotify అత్యుత్తమ ఆడియో నాణ్యతతో సంగీతాన్ని అందించకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన సంగీతాన్ని అందించడంలో ముందుంటుంది. ఈ ఆడియో స్ట్రీమింగ్ వేదిక ఇప్పుడు తన కొత్త AIతో పనిచేసే DJతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ChatGPT విజయవంతమైన తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు జనాదరణ విపరీతంగా పెరుగుతుండటంతో, టెక్ కంపెనీలు AI-ఆధారిత ప్రోడక్ట్ తో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. OpenAI జూక్‌బాక్స్ నుండి రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatovan.ai వరకు ఇటువంటి ఉత్పత్తులు కొత్తేమి కాదు. ఇప్పుడు, Spotify కూడా ఆ లిస్ట్ లో చేరింది.

BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత

Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది.

23 Feb 2023

మెటా

మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం

వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, మెటాలో నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈసారి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. గత సంవత్సరం, మెటా తన ఖర్చులను తగ్గించుకోవడానికి,ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి 13% మంది ఉద్యోగులను అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.

ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది.

ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

నిన్న విమానాశ్రయం నుండి వచ్చాక చాలా కార్లు, మోటారుబైక్‌లు రెడ్ లైట్ సిగ్నల్‌ను దాటి వెళ్లాయని, డబ్బు ఉంటే గాని ఒక నిమిషం ఉండటానికి కూడా ఇక్కడ ప్రజల దగ్గర సమయం లేదని అన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి.

వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్

జూన్-డిసెంబర్ 2022 మధ్య UK లో 61 కంపెనీలు పాల్గొన్న నాలుగు రోజుల వర్క్‌వీక్ ట్రయల్ లో,తగ్గిన గంటలతో చాలా సంస్థలు సంతృప్తికరంమైన ఫలితాలను అందుకున్నాయని తేలింది.

త్వరలో ప్రైవేట్ న్యూస్ లెటర్ టూల్ ను ప్రారంభించనున్న వాట్సాప్

WABetaInfo ప్రకారం, వాట్సాప్ "న్యూస్‌లెటర్" అనే కోడ్‌నేమ్‌తో ఉన్న కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. న్యూస్‌లెటర్ పరిశ్రమ చిన్నది కానీ అభివృద్ధి చెందుతున్నది. అయితే, COVID-19 మహమ్మారి వలన దాని వృద్ధి మందగించింది.

నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్

మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ తో సంభాషణ వివాదాస్పదంగా మారింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సేలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన టోబీ ఆర్డ్ ఈ సంబాషణను పంచుకున్నారు. ఇందులో AI చాట్‌బాట్ వినియోగదారుడు తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన తర్వాత వినియోగదారుని బెదిరించడం చూడచ్చు.

21 Feb 2023

మెటా

మరిన్ని ఉద్యోగ కోతలకు ప్రణాళిక వేస్తున్న మెటా 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్స్

మెటాలో ఉద్యోగ కోతల సీజన్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ముగిసిన పనితీరు సమీక్షలలో సుమారు 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్‌లు ఇవ్వడం ద్వారా కంపెనీ ఇటువంటి సంకేతాలను అందించింది. గత ఏడాది నవంబర్‌లో మెటా దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.

యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం

యూట్యూబ్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్న నీల్ మోహన్ అంతకుముందు ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు, అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్ (GPA పరంగా టాప్ 10 శాతం విద్యార్థులు). తరువాత 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA పట్టా పొందారు.

యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ లో తొమ్మిదేళ్ల అధికారం తర్వాత తానూ వైదొలుగుతున్నట్లు యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుసాన్ వోజికి ప్రకటించారు. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, కుటుంబం, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు.

భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి

భారతదేశంలో 2022 సంవత్సరంలో 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభం అయ్యాయి, మొత్తం టెక్ స్టార్టప్‌ల సంఖ్య 25,000-27,000కి చేరుకుందని Nasscom and Zinnov కొత్త నివేదిక పేర్కొంది.

IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది

భారతీయ టెలికాం పరిశ్రమ అప్‌గ్రేడ్‌ను కు సిద్ధంగా ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి, నావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ టెక్నాలజీ (ToT) ట్రాన్స్ఫర్ ని పూర్తి చేసింది.

15 Feb 2023

విమానం

IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి

జర్మనీకి చెందిన Lufthansa సంస్థ విమానాలు బుధవారం IT అంతరాయం కారణంగా ఆలస్యం లేదా రద్దు అయ్యాయి.

ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్

వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 ఉద్యోగాలను తగ్గించాలని అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఇంజన్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండడంతో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. ఫోర్డ్ లో ప్రస్తుతం ఐరోపాలో 34,000 ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికి ఐరోపాలో తన విమానాలను పూర్తిగా విద్యుదీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిపై $50 బిలియన్లను ఖర్చు చేస్తోంది.

2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ

రాబోయే 2023 ఫార్ములా 1 (F1) సీజన్‌కు ముందు, ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫెరారీ తన SF-23 రేస్ కారును ప్రకటించింది. గత సంవత్సరం మోడల్ కంటే చిన్న మార్పులు చేసారు. ఇది 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, V6 ఇంజన్‌తో నడుస్తుంది.

14 Feb 2023

మెటా

ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్

మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్, 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది చివర్లో కంపెనీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలలుగా కంపెనీ నుండి వైదొలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆమె కూడా ఒకరు.

అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్

అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లో అందించే వివిధ రకాల ఉత్పత్తులు అందించే డిస్కౌంట్‌ల కారణంగా కొనుగోలుదారులకు చాలా ఇష్టమైన ఈ-కామర్స్ వేదిక. ఇందులో మిలియన్ల కొద్ది అమ్మేవారు ఉన్నారు. మార్కెట్‌ప్లేస్ పల్స్ అధ్యయనం ఆధారంగా, 2022లో మొదటిసారిగా అమెజాన్ ప్రతి సేల్‌లో కోత 50% దాటింది.

Internet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా Windows 10లో Internet Explorerను డిసేబుల్ చేసింది. ఇది ఫిబ్రవరి 14 నుండి అమలు అవుతుంది. గత సంవత్సరం యాప్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ను కంపెనీ నిలిపివేసినప్పటికీ, బ్రౌజర్ ఇప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ముందు వెర్షన్‌లో నడుస్తుంది.

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది

బెంగళూరుకు చెందిన సోషల్ మీడియా యాప్ Slick పాఠశాలకు వెళ్లే పిల్లలతో సహా తన వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసింది. కంపెనీ తన వినియోగదారుల పూర్తి పేర్లు, పుట్టినరోజులు, మొబైల్ నంబర్‌లు, పాస్‌వర్డ్ లేకుండా ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ చిత్రాలతో ఉన్న డేటాబేస్‌ను బహిర్గతం చేసింది.

ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు

మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్‌ తో పాటు Xbox గేమింగ్ డివిజన్‌ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.

భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్

2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది.

1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ

యాహూ తన మొత్తం సిబ్బందిలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది, దాదాపు 50% యాడ్ టెక్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుంది రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు మాంద్యం భయంతో కంపెనీలు టెక్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ కోతలను ప్రకటిస్తున్నాయి.

ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ

చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా AI రంగంలోకి ప్రవేశించబోతుంది. ChatGPT లాంటి టూల్‌ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒరాకిల్ మాజీ సిఈఓ మార్క్ హార్డ్ మాజీ భార్య పౌలా హర్డ్‌తో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కనిపించారు.

7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ

డిస్నీ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి 7,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించింది.