ఆటో మొబైల్: వార్తలు

17 Feb 2023

ఇటలీ

ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ

ఫెరారీ తన మొట్టమొదటి SUV, Purosangueను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇప్పుడు. US మార్కెట్లో ఈ SUV ధరను ప్రకటించింది. స్పోర్టీ ఆఫ్-రోడర్ శక్తివంతమైన 6.5-లీటర్, V12 ఇంజన్‌తో నడుస్తుంది.

17 Feb 2023

స్కూటర్

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్

బజాజ్ చేతక్, ఒకప్పుడు ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఉండేది. అయితే కైనెటిక్ జూమ్‌లు, హోండా యాక్టివా వంటి బ్రాండ్ల రాకతో అమ్మకాలలో వెనకపడింది. 2006లో చివరిగా చేతక్ విడుదలైంది. మళ్ళీ 16 సంవత్సరాల తరవాత ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో మార్కెట్లోకి రాబోతుంది.

16 Feb 2023

టాటా

ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలోని సామర్థ్యం గల హారియర్, సఫారీ 2023 వెర్షన్ విడుదల చేసింది. భారతదేశంలో రెండు వాహనాల కోసం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI

దిగ్గజ కార్ల తయారీ సంస్థ MINI గ్లోబల్ మార్కెట్ల కోసం SE కన్వర్టిబుల్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం కేవలం 999 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తి చేయబడుతుంది. కారు బ్రాండ్ ఆధునిక డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది, స్టాండర్డ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ నుండి చాలా డిజైన్ ఎలిమెంట్‌లతో వస్తుంది. ఇది 181hp ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది.

16 Feb 2023

బైక్

2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల

జపనీస్ బైక్ తయారీ సంస్థ యమహా భారతదేశంలో R15M 2023 అప్డేట్ ను ప్రారంభించింది. అప్‌డేట్‌లో భాగంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు క్విక్‌షిఫ్టర్‌ ఉన్నాయి.

Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది

జర్మన్ తయారీ సంస్థ Audi భారతదేశంలో Q3 స్పోర్ట్‌బ్యాక్‌ను ప్రారంభించింది. ఈ కారులో స్టైలిష్ డిజైన్, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్ తో పాటు శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది మార్కెట్లో స్వదేశీ బి ఎం డబ్ల్యూ X1తో పోటీపడుతుంది.

ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం

USలో వాహన దొంగతనం అనేది ఒక పెద్ద సమస్య, కొన్ని బీమా కంపెనీలు సులభంగా దొంగిలించగల మోడల్‌లకు ఇన్సూరెన్స్ కి నిరాకరిస్తాయి. హ్యుందాయ్, కియా మోటార్స్ దాదాపు 8.3 మిలియన్ వాహనాల కోసం ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి, అది వాటిని దొంగిలించడం కష్టం చేస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే తన కార్లపై ఫర్మ్‌వేర్‌ను అందించడం ప్రారంభించింది.

15 Feb 2023

సంస్థ

ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్

వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 ఉద్యోగాలను తగ్గించాలని అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఇంజన్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండడంతో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. ఫోర్డ్ లో ప్రస్తుతం ఐరోపాలో 34,000 ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికి ఐరోపాలో తన విమానాలను పూర్తిగా విద్యుదీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిపై $50 బిలియన్లను ఖర్చు చేస్తోంది.

2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ

రాబోయే 2023 ఫార్ములా 1 (F1) సీజన్‌కు ముందు, ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫెరారీ తన SF-23 రేస్ కారును ప్రకటించింది. గత సంవత్సరం మోడల్ కంటే చిన్న మార్పులు చేసారు. ఇది 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, V6 ఇంజన్‌తో నడుస్తుంది.

15 Feb 2023

కార్

మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి

2023 అప్‌డేట్‌లలో భాగంగా మారుతి సుజుకి తన ప్రసిద్ధ సెడాన్ మోడల్, సియాజ్ మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్‌లను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ కంట్రోల్‌ కూడా ఉంది.

14 Feb 2023

కొచ్చి

కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus

Lexus GECలు అతిథి దేవో భవ అనే భారతీయ స్ఫూర్తితో అసాధారణమైన ఆతిథ్యం, అతిథుల అవసరాలను తీరుస్తూ అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి జపనీస్ తత్వశాస్త్రమైన 'ఒమోటేనాషి'ని ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

14 Feb 2023

కార్

మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్

AMR23 అప్డేటెడ్ డిజైన్‌ను ఆస్టన్ మార్టిన్ ఆవిష్కరించింది. మార్చి 5 నుండి ప్రారంభమయ్యే సీజన్‌లో పాల్గొంటుంది. ఆస్టన్ మార్టిన్ టెక్నికల్ డైరెక్టర్ డాన్ ఫాలోస్, AMR23 AMR22 కంటే 95% భిన్నంగా ఉంటుందని తెలిపారు.

20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు

భారతదేశంలో MPV డిమాండ్ పెరుగుతోంది. ఈ వాహనాలు SUV లాగానే విశాలంగా ఉంటాయి. ప్రయాణీకుల సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని Renault, మారుతి సుజుకీ, కియా మోటార్స్, మహీంద్రా, టయోటా వంటి బ్రాండ్‌లు తమ సరికొత్త మోడళ్లను పరిచయం చేశాయి.

14 Feb 2023

కార్

మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల

దక్షిణ కొరియా తయారీ సంస్థ హ్యుందాయ్ 2023 VERNA సెడాన్ మే నాటికి భారతదేశంలో విడుదల చేస్తుందని ప్రకటించింది. ఇప్పుడు ఈ సెడాన్ ను రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. రాబోయే కారు టీజర్ చిత్రాలను కూడా షేర్ చేసింది హ్యుందాయ్.

13 Feb 2023

కార్

భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi తన Q3 స్పోర్ట్‌బ్యాక్ కూపే SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఒకే ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. కారు స్టైలిష్ రూపంతో పాటు టెక్నాలజీ సపోర్ట్ తో సంపన్నమైన క్యాబిన్‌ తో వస్తుంది. ఇది 2.0-లీటర్ TFSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది.

13 Feb 2023

బైక్

భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2

2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మరిన్నిఫీచర్స్ తో భారతదేశంలో ప్రారంభమైంది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ

ప్రసిద్ద US తయారీ సంస్థ డాడ్జ్ చికాగో ఆటో షోలో "లాస్ట్ కాల్" స్పెషల్-ఎడిషన్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయనున్నారు. ముందు మోడల్ '426 HEMI' V8 ఇంజిన్‌ను ఉపయోగించి గాడ్‌ఫ్రే క్వాల్స్ 1970 డాడ్జ్ ఛాలెంజర్ R/T SE మోడల్‌ లాగా ఉంది ఈ కారు.

11 Feb 2023

టాటా

ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్

రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా, టాటా కమ్యూనికేషన్స్ ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారిక ప్రసార పంపిణీ హక్కులు చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది.

ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు

మెర్సిడెస్-మేబ్యాక్ ఆసియా, యూరోపియన్ మార్కెట్‌ల కోసం S 580e ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లిమోసిన్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన కారు జర్మన్ తయారీ సంస్థ మేబ్యాక్ నుండి మొదటి ఎలక్ట్రిఫైడ్ వాహనం.

హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా హైదరాబాద్ E-Prixలో XUV400 వన్-ఆఫ్ ఫార్ములా E ఎడిషన్‌ను ప్రదర్శించింది. మహీంద్రా ఫార్ములా ఈ-టీమ్ తో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) ద్వారా ప్రత్యేక లివరీని రూపొందించారు.

11 Feb 2023

బైక్

భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్

చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.

10 Feb 2023

స్కూటర్

3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో దాని అత్యంత సరసమైన ఆఫర్ S1 ఎయిర్ కోసం మూడు కొత్త ట్రిమ్ స్థాయిలను ప్రవేశపెట్టింది. స్కూటర్ బేస్ వేరియంట్ ఇప్పుడు చిన్న 2kWh బ్యాటరీ ప్యాక్‌తో , మిడ్-లెవల్ మోడల్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ తో, రేంజ్-టాపింగ్ వెర్షన్ 4kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది.

భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్

ఇటాలియన్ ఆటోమోటివ్ సంస్థ పియాజియో ఈ సంవత్సరం భారతదేశంలో వెస్పా, అప్రిలియా సబ్-బ్రాండ్‌ల క్రింద కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP

స్వదేశీ స్టార్ట్-అప్ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో OXO మోడల్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్‌సైకిల్ బేస్, ప్రో మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. తయారీ సంస్థ ఈ బైక్‌ను ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించింది. ప్రో ప్యాకేజీ కింద మొత్తం-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఐదు రంగులలో ఆర్డర్ చేసుకోవచ్చు.

09 Feb 2023

కార్

హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్

జపాన్ తయారీ సంస్థ టయోటా గ్లోబల్ మార్కెట్ లో గ్రాండ్ హైలాండర్ 2024 వెర్షన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న జరగబోయే 2023 చికాగో ఆటో షోలో దీనిని ప్రదర్శిస్తారు.

09 Feb 2023

బైక్

భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్

జపనీస్ తయారీ సంస్థ సుజుకి భారతదేశంలో తన Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 బైకుల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా కొత్త రంగు ఆప్షన్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. సింగిల్-సిలిండర్ 155cc, 249cc ఇంజిన్‌లతో నడుస్తాయి. .

త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA

కొత్త తరం హ్యుందాయ్ VERNA ఈ మార్చిలో భారతదేశంలో ఉత్పత్తికి వెళ్లనుంది. ఏటా 70,000 యూనిట్లను తయారు చేయాలని హ్యుందాయ్ సంస్థ ఆలోచిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతాయి. పెట్రోల్-ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా

స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఈ ఫిబ్రవరిలో భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపుతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. తగ్గింపు ఉన్న కార్లలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 ఉన్నాయి. రూ.70,000 వరకు ఆఫర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి.

హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ తన X5, X6 SUVల 2024 వెర్షన్‌లను వెల్లడించింది. ఈ ఏప్రిల్‌లో ఉత్పత్తికి వెళ్లనున్నాయి. కార్లు డ్రైవర్ కు సహాయపడే అనేక ఫీచర్లతో , విశాలమైన క్యాబిన్‌లతో వస్తుంది. వివిధ హైబ్రిడ్ ఇంజిన్‌ల ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. కేవలం 4.2 సెకన్లలో 0-96కిమీ/గం వేగంతో వెళ్లగలదు.

మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి

మహీంద్రా సంస్థ ఇటీవల భారతదేశంలో Thar RWDని విడుదల చేసింది. SUV పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ లో మూడు విభిన్న వేరియంట్లలో రాబోతుంది. Thar RWD డీజిల్‌ బుక్ చేస్తే మాత్రం డెలివరీకి సమయం పడుతుంది.

అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు

అశోక్ లేలాండ్ తో కలిసి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (H2-ICE)తో నడిచే భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ ట్రక్కును ఆవిష్కరించాయి. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని జెండా ఊపి ప్రారంభించారు. 2022 ఆగస్టు నుంచి ఇది టెస్టింగ్‌లో ఉంది. దానితో, అశోక్ లేలాండ్ 'ఆత్మనిర్భర్ భారత్' ప్రచారంలో భాగం కావాలనుకుంటుంది.

భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault, జపాన్ తయారీ సంస్థ Nissan భారతీయ మార్కెట్ కోసం మూడు మోడళ్లపై పని చేస్తున్నాయి. ఇందులో 3 rd gen Renault Duster, Renault Triber ఆధారంగా ఒక నిస్సాన్ MPV, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనం ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ప్లాన్‌ను విజయవంతం చేసేందుకు రెండు కంపెనీలు దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.

07 Feb 2023

కార్

భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi త్వరలో భారతదేశంలో తన Q3 స్పోర్ట్‌బ్యాక్ ను విడుదల చేయనుంది. రూ.2 లక్షలు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో ఇది బి ఎం డబ్ల్యూ X1, వోల్వో XC40, మెర్సిడెజ్-బెంజ్ GLA తో పోటీ పడుతుంది.

06 Feb 2023

కార్

మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది

మారుతి సుజుకి Fronx SUVని గత నెలలో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఇందులో ఫీచర్-లోడెడ్ క్యాబిన్ తో పాటు రెండు పెట్రోల్ ఇంజన్‌ల ఆప్షన్ ఉంది భారతీయ మార్కెట్ లో ఈ SUV కియా Sonetతో పోటీపడుతోంది.

06 Feb 2023

స్కూటర్

హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది

హీరో MotoCorp భారతదేశంలో సరికొత్త Xoom మోడల్‌ను ప్రారంభించింది. స్పోర్టీ స్కూటర్ భారతదేశంలో 110సీసీ విభాగంలో హోండా Dioతో పోటీపడుతుంది. హీరో Xoom సెగ్మెంట్-ఫస్ట్ 'కార్నర్ బెండింగ్ లైట్స్'తో వస్తే, హోండా Dio 109.5cc ఇంజిన్‌ పై నడుస్తుంది.

06 Feb 2023

కార్

టెస్ట్ రన్ లో ఉన్న Citroen C3- MPV కార్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Citroen సంస్థ యూరోపియన్ ప్రాంతంలో C3-ఆధారిత మూడు-వరుసల MPV కార్ టెస్ట్ రన్ చేస్తుంది. ఈ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 2023లో భారతీయ మార్కెట్ లో మూడు వరుసల MPV మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

04 Feb 2023

కార్

భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త -SUV, Fronxని మార్కెట్ లో విడుదల చేయబోతుంది. కాంపాక్ట్ SUV కోసం బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు ఇప్పటికే 5,000 ప్రీ-ఆర్డర్‌లు కూడా వచ్చాయి. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.

04 Feb 2023

కార్

భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఈ ఏడాది మధ్యలో భారతదేశంలో సెల్టోస్ 2023 అప్డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్టెడ్ SUV ఇప్పటికే దక్షిణ కొరియాతో పాటు USలో అందుబాటులో ఉంది

మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్‌ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది.

03 Feb 2023

కార్

RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault భారతదేశంలోని మొత్తం సిరీస్ ను RDE భద్రతా నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. KWID, Kiger, Triber ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఆప్షన్స్ తో అప్డేట్ అయ్యాయి.