ఆటో మొబైల్: వార్తలు

03 Feb 2023

బైక్

399cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో రాబోతున్న 2023 Kawasaki Ninja ZX-4RR 399cc

Kawasaki ట్రాక్-ఫోకస్డ్ 2023 Kawasaki Ninja ZX-4RRని గ్లోబల్ మార్కెట్‌ల లో $9,699 (సుమారు రూ. 8 లక్షలు) ధరతో విడుదల చేయనుంది. సూపర్‌స్పోర్ట్ ఎంట్రీ-లెవల్ ZX-25R మరియు మిడ్-కెపాసిటీ ZX-6R మధ్య ఉంటుంది.

03 Feb 2023

బైక్

మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa

జపనీస్ తయారీ సంస్థ సుజుకి Hayabusa 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. ఈ సూపర్‌బైక్ మూడు డ్యూయల్-టోన్ రంగుల్లో అంటే పెర్ల్ వైగర్ బ్లూ/పెర్ల్ బ్రిలియంట్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ థండర్ గ్రే/క్యాండీ డేరింగ్ రెడ్ లో లభిస్తుంది. స్పోర్టి టూరర్ అవుట్‌గోయింగ్ మోడల్ మొత్తం డిజైన్‌ తో, 1,340cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది.

02 Feb 2023

కార్

భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో VENUE 2023 అప్‌డేట్ ను లాంచ్ చేసింది. ఈ వెర్షన్ ఇప్పుడు RDE-కంప్లైంట్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పాటు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. ఇది ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది: E, S, S(O), SX, SX(O).

బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు

మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు.

బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ 2023ని సమర్పించారు ఇందులో ఆటోమొబైల్ పరిశ్రమకు అనేక రాయితీలను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, ప్రభుత్వ వాహనాలను రద్దు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా తయారు చేయడం వరకు ఆటోమొబైల్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు.

01 Feb 2023

కార్

భారతదేశంలో విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Venue

హ్యుందాయ్ తన VENUE SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రాబోయే నెలల్లో భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది E, S, S+, S(O), SX, SX(O) ఆరు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

31 Jan 2023

కార్

భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు

భారతదేశంలో కారును కొనే ముందు ముఖ్యంగా పరిగణలోకి తీసుకునేవి మైలేజ్ ఒకటి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, హోండా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి బ్రాండ్‌లు మైలేజ్ ఎక్కువ అందించే వాహనాలను భారతదేశంలో ప్రవేశపెట్టాయి.

భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV

PURE EV భారతదేశంలో తన ఎకోడ్రైఫ్ట్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ పూర్తి-LED లైటింగ్ సెటప్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కిమీల వరకు నడుస్తుంది.

31 Jan 2023

కార్

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా

జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారులో CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది S, G వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ ఎట్టకేలకు భారతదేశంలో తన X1 SUV యొక్క 2023 వెర్షన్‌ను విడుదల చేసింది. కారు సరికొత్త డిజైన్ తో పాటు విలాసవంతమైన టెక్-లోడెడ్ క్యాబిన్‌ తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్ లో లగ్జరీ SUV విభాగంలో వోల్వో XC40కి పోటీగా ఉంటుంది.

30 Jan 2023

జర్మనీ

ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi బెర్లిన్‌లో జరిగిన "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. EV లాంటి క్రాస్‌ఓవర్ డిజైన్‌ తో పాటు వర్చువల్ ఇంటర్‌ఫేస్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌లు, ట్రాన్స్‌ఫార్మింగ్ రియర్ సెక్షన్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

30 Jan 2023

బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్

JAWA మోటార్‌సైకిల్స్ ఇటీవల భారతదేశంలో 42 మోడల్‌కు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త మెటాలిక్ కాస్మిక్ కార్బన్ కలర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెట్రో బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు సబ్-400cc కేటగిరీలో పోటీగా ఉంటుంది.

28 Jan 2023

కార్

అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్

మారుతి సుజుకి తన Alto k10 ప్రత్యేక ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు సాధారణ మోడల్‌ లాగానే ఉన్నా బయట, లోపల కొన్ని అప్డేట్లతో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎడిషన్ K10లో స్కిడ్ ప్లేట్లు, ORVMలు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌పై కాంట్రాస్ట్-కలర్ పాప్రికా ఆరెంజ్ హైలైట్‌లను కలిగి ఉంది. ఇది 1.0-లీటర్, K-సిరీస్ ఇంజిన్ తో నడుస్తుంది.

75వ వార్షికోత్సవం సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerieను లాంచ్ చేయనున్నMaserati

ఇటాలియన్ లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గ్లోబల్ మార్కెట్ల కోసం లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerie మోడల్‌ను ప్రకటించింది, కేవలం 75 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ విభిన్నమైన గ్రిజియో లామిరా కాంట్రాస్టింగ్ బ్రైట్ రెడ్ యాక్సెంట్‌, నీరో కామెటా సబ్టిల్ పుదీనా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది

28 Jan 2023

కార్

Maserati MC20 Cielo v/s Ferrari Portofino M, ఏది మంచిది

Maserati భారతదేశంలో సరికొత్త MC20 Cielo కోసం బుకింగ్ ప్రారంభించింది. ఓపెన్-టాప్ స్పోర్ట్స్ కారు, హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ కార్ సెగ్మెంట్‌లో Ferrari Portofino Mకు పోటీగా ఉంటుంది. లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గత ఏడాది మేలో MC20 కన్వర్టిబుల్ వెర్షన్‌ను ప్రకటించింది.

27 Jan 2023

కార్

భారతదేశంలో డీజిల్ ఇంజిన్ తో ఉన్న ఇన్నోవా Crysta అమ్మకాలు ప్రారంభించిన టయోటా సంస్థ

ఒక చిన్న విరామం తర్వాత, టయోటా ఇన్నోవా Crysta భారత మార్కెట్లో తిరిగి వచ్చింది. అయితే ఈ సారి కేవలం డీజిల్ తో మాత్రమే నడిచే మోడల్ వినియోగదారుల ముందుకు వచ్చింది. జనాదరణ పొందిన MPVని ఇప్పుడు రూ. 50,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ టయోటా మొదట నిలిపేసినా, దాని డిమాండ్ కారణంగా మళ్ళీ తిరిగి తీసుకువచ్చింది.

27 Jan 2023

కార్

మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది

మారుతి సుజుకి ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త SUV Fronxను విడుదల చేసింది. ఈ సంస్థ భారతదేశంలో కాంపాక్ట్ SUV కేటగిరీలో ఫీచర్-లోడెడ్ హ్యుందాయ్ VENUEకి పోటీగా దీనిని పరిచయం చేసింది.

భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్

భారతదేశానికి చెందిన SUV స్పెషలిస్ట్ మహీంద్రా XUV400 కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో XUV400ను బుక్ చేసుకోవచ్చు. ఇవి మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రాకు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV

25 Jan 2023

బైక్

లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్

బైక్ తయారీ సంస్థ KTM గ్లోబల్ మార్కెట్‌ల కోసం RC 125, RC 390 2024 అప్డేట్ ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. అప్‌డేట్ అయిన మోటార్‌సైకిళ్లు టెస్ట్ రన్ లో ఉన్నాయి. కస్టమర్‌ల నుండి పలు అభ్యర్థనలు అందుకున్న తర్వాత సూపర్‌స్పోర్ట్ ఆఫర్‌లను అప్‌డేట్ చేయాలని ఈ బ్రాండ్ నిర్ణయించుకుంది.

25 Jan 2023

ధర

పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS

బి ఎం డబ్ల్యూ 2024 M3 CS మోడల్‌ ను తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కార్లను ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. ఇది ప్రత్యేక సిగ్నల్ గ్రీన్ పెయింట్ తో వస్తుంది.

25 Jan 2023

జపాన్

జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన

జపనీస్ వాహన తయారీ సంస్థ Nissan తన స్వదేశంలో కిక్స్ 327 ఎడిషన్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ప్రదర్శనలో ఉంటుంది. న్యూ బ్యాలెన్స్ 327 Sneakers నుండి ప్రేరణ పొందిన ఈ వాహనం లేస్‌లు, ప్రత్యేక డీకాల్స్‌తో షూ లాంటి డిజైన్‌ తో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.

24 Jan 2023

కార్

భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్)

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్చి 2023 నాటికి భారతదేశంలో విడుదల చేయనుంది.సరికొత్త సాంకేతిక-ఆధారిత ఫీచర్లతో కొన్ని మార్పులతో అందుబాటులోకి వస్తుంది. డీజిల్ ఇంజిన్ నిలిపివేసి పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ

ఓలా S1 Pro భద్రత, నాణ్యత ప్రమాణాలపై మరిన్ని భయాలు పెరిగాయి. జనవరి 21న, ఒక మహిళ స్కూటర్ నడుపుతుండగా ముందు సస్పెన్షన్ విడిపోయి ముందు చక్రం విడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యి ఐసియూలో చికిత్స పొందుతుంది.

24 Jan 2023

కార్

భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్‌

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సంస్థ 2023 AURA సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది E, S, SX, SX(O) వేరియంట్లలో లభిస్తుంది. విశాలమైన టెక్-లోడెడ్ క్యాబిన్‌ తో పాటు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఇది పెట్రోల్, CNG రెండిటిలో 1.2-లీటర్ ఇంజన్ తో నడుస్తుంది. ఇది ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.

23 Jan 2023

కార్

జనవరి 26న రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi జనవరి 26న సరికొత్త యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్ కారును విడుదల చేయనుంది. "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో భాగంగా ప్రదర్శించబడుతుంది. ఇది గ్రాండ్‌స్పియర్, అర్బన్‌స్పియర్ మోడల్‌ లాగానే PPE ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

23 Jan 2023

కార్

కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW

పాల్ లెఫెవ్రే అనే ఫ్రెంచ్ సర్ఫ్‌బోర్డ్ షేపర్, బిల్డర్ చేతితో చెక్కిన కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లతో ఒక రకమైన రెస్టో-మోడెడ్ 1969 BMW 1602 కారును ప్రదర్శించారు. తేలికైన పదార్ధాల ఉపయోగం క్లాసిక్ సెడాన్ మొత్తం బరువును 816kgలకు తగ్గించింది. అదే సమయంలో వాహనం నిర్మాణ కూడా ధృడంగా ఉంది.

40వ వార్షికోత్సవం సందర్భంగా Outlander స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన Mitsubishi

Mitsubishi తన Outlander మోడల్ 40వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్‌ను USలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర $41,340 (సుమారు రూ. 33.47 లక్షలు). ఈ ఆఫ్-రోడర్ నలుపు, బ్రాంజ్ పెయింట్ తో వస్తుంది. దీనికి లోపలా, బయటా 40వ వార్షికోత్సవ బ్యాడ్జ్‌లు ఉంటాయి. ప్రస్తుతానికి బుకింగ్స్ తెరుచుకున్నాయి.

21 Jan 2023

కార్

భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ Bentley భారతదేశంలో Bentayga EWB Azure మోడల్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన ఈ Azure వేరియంట్‌లో వెనుక ఎయిర్‌లైన్ సీట్లు, ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజింగ్ డోర్లు, మొత్తం ఫ్లోర్‌ను కవర్ చేసే 'డీప్ పైల్ ఓవర్' మ్యాట్‌లు, ప్రీమియం నైమ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUV 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

20 Jan 2023

కార్

ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis

టెక్నాలజీ దిగ్గజం Qualcomm USలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో Snapdragon Digital Chassis కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కారుతో ఆటోమేకర్లు దాని టెక్నాలజీ, సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రదర్శించింది. ఇది మొదటి ఆటోమోటివ్ సూపర్-కంప్యూట్ క్లాస్ సొల్యూషన్ గా ప్రచారం అవుతుంది.

20 Jan 2023

విమానం

తొలి ప్రయోగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ విమానం

ZeroAvia, ఒక బ్రిటిష్-అమెరికన్ హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలపర్, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

20 Jan 2023

కార్

భారతదేశంలో విడుదలైన 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS

హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన హ్యుందాయ్‌ గ్రాండ్ i10 NIOS భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా మారింది.

20 Jan 2023

బైక్

గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన 2023 యమహా గ్రాండ్ ఫిలానో

టూ-వీలర్ తయారీ సంస్థ యమహా గ్లోబల్ మార్కెట్‌లలో గ్రాండ్ ఫిలానో 2023 వెర్షన్ ను విడుదల చేసింది.ఇప్పుడు ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇది భారతదేశంలో అమ్ముతున్న Fascino 125 Fi హైబ్రిడ్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతానికి, ఈ బ్రాండ్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఆ సంస్థ ఇంకా తెలియజేయలేదు.

19 Jan 2023

బైక్

విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం

స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో లియో ఈ-స్కూటర్ హై-స్పీడ్ వెర్షన్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 81,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీల వరకు నడుస్తుంది. ఈ నెల నుండి ఆ బ్రాండ్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది.

19 Jan 2023

బైక్

సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 బైక్ మార్కెట్లో విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సూపర్ మీటోర్ 650 బైక్‌ను సోమవారం భారతదేశంలో విడుదల చేసింది. ఇది నవంబర్ 2022లో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయింది. క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్, సెలెస్టియల్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

19 Jan 2023

కార్

DBS 770 అల్టిమేట్ కార్ లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ స్టన్-మార్టిన్

బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన DBS 770 అల్టిమేట్ కారును లాంచ్ చేసింది. దీని ఉత్పత్తి 499 యూనిట్లకు పరిమితం అయింది. ఈ కారులో వివిధ టెక్నాలజీ ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్‌ ఉంది. ఇది 5.2-లీటర్ V12 ఇంజన్‌తో నడుస్తుంది.

18 Jan 2023

టాటా

ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త మ్యాజిక్ EVని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రధానంగా పాఠశాలలు, స్టేజ్ క్యారేజ్, అంబులెన్స్‌లు వంటి డెలివరీ సేవలను లక్ష్యంగా చేసుకుంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం

టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ రేసర్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఈ కారులో ఆకర్షణీయమైన డిజైన్‌ తో పాటు విశాలమైన ఫీచర్-లోడెడ్ క్యాబిన్, శక్తివంతమైన 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది.

X7 SUV 2023వెర్షన్ ను 1.2కోట్లకు లాంచ్ చేసిన BMW సంస్థ

జర్మన్ వాహన తయారీ సంస్థ BMW X7 SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది xDrive40i M Sport, xDrive40d M Sport వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కంపెనీ యొక్క కొత్త డిజైన్ తో పాటు సరికొత్త టెక్నాలజీతో ఉన్న ట్వీక్డ్ క్యాబిన్‌ తో వస్తుంది. రెండూ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.

XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహానాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. సరికొత్త కార్ టెక్నాలజీతో విశాలమైన క్యాబిన్‌ తో వస్తుంది. మహీంద్రా XUV400 గురించి గత సంవత్సరం సెప్టెంబరులో ప్రకటించారు. ఈ బ్రాండ్ కు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV. మార్కెట్‌లో, MG ZS EV, టాటా నెక్సాన్ EV వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది.

స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.