బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Gold,Silver ETF: బంగారం,వెండి రికవరీ… సిల్వర్, గోల్డ్ ETFsలో 12% వరకు దూకుడు.. అస్థిరతకు తెరపడినట్టేనా?
బంగారం,వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల తర్వాత సోమవారం మార్కెట్‌లో బలమైన రికవరీ కనిపించింది.
HRA tax relief : మెట్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త మెట్రో నగరాలకు 50% HRA మినహాయింపు?
మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు త్వరలో పెద్ద ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dhruv Sharma: '32 అవెన్యూ' కేంద్రంగా రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం.. ఎవరీ ధ్రువ్ శర్మ..?
గురుగ్రామ్‌లోని పేరుగాంచిన లగ్జరీ కమర్షియల్ డెస్టినేషన్ '32 అవెన్యూ' ఇప్పుడు భారీ స్థాయి రియల్ ఎస్టేట్ కుంభకోణానికి కేంద్రమైంది.
Study : ఎన్‌ఆర్‌ఐలకంటే దేశీయ స్టార్టప్ వ్యవస్థాపకులే ముందంజ: అధ్యయనం
భారత స్టార్టప్ రంగంలో జరిగిన తాజా అధ్యయనం ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టింది.
Gold & Silver Rates:స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి .. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
గత వారం భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం,వెండి ధరలు గత రెండు-మూడు రోజులుగా పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.
Stock Market: అమెరికా డీల్, జపాన్ ఎన్నికల ప్రభావం.. భారీ లాభాల్లో సూచీలు
అమెరికాతో భారత్ మధ్య జరిగిన కీలక ఒప్పందం ఒకవైపు, జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్‌కు బలంగా తోడైంది.
Piyush Goyal: అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల దిగుమతులు.. భారత్‌కి పెద్ద సమస్య కాదు : పీయూష్ గోయల్
భారత్-అమెరికా మధ్య కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.45 లక్షల కోట్ల) విలువైన వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
SIP: రూ.34 వేల జీతం ఉంటే నెలకు ఎంత ఎస్ఐపీ పెట్టాలి? ఎన్నేళ్లు కొనసాగిస్తే లాభం?
ఒక సామాన్య వ్యక్తి నెలకు సగటున రూ.34 వేల ఆదాయం సంపాదిస్తున్నాడనుకుందాం.
Bank Of Baroda Jobs 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రూ.లక్షన్నర జీతం.. నో ఎగ్జామ్!
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) దేశవ్యాప్తంగా ఉన్న తన పలు శాఖల్లో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Karur Vysya Bank: కరూర్ వైశ్యా బ్యాంక్‌కు మరో మైలురాయి.. చెన్నైలో 900వ శాఖ ప్రారంభం
దేశవ్యాప్తంగా తన శాఖల విస్తరణలో మరో కీలక మైలురాయిని కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) సాధించింది. చెన్నైలోని తొండియార్‌పేట్ ప్రాంతంలో బ్యాంకు 900వ శాఖను ప్రారంభించింది.
Financial Planning: 40 ఏళ్ల వయసులో డబ్బు పొదుపు, ఇన్సూరెన్స్, పెట్టుబడులు ఇలా చేయండి!
40 ఏళ్లు చేరడం అంటే జీవనశైలి, ఆర్థిక బాధ్యతలలో ముఖ్యమైన దశాబ్దం ప్రారంభమవడం. ఇంతకు ముందు కంటే ఎక్కువగా సంపాదన ఉంటే, ఖర్చులు కూడా పెరుగుతాయి.
EPF vs VPF: ఉద్యోగి పొదుపులో ఉన్న ప్రధాన తేడాలు, విశేషాలివే!
సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం నుంచి EPF (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) కట్ అవుతూనే ఉంటుంది.
SBI Q3 Results: ఎస్‌బీఐ త్రైమాసిక ఫలితాల్లో రికార్డు లాభం.. రూ.21,317 కోట్లు నికర లాభం
ప్రభుత్వ రంగపు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించింది.
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు.. స్వీడిష్ అందగత్తె సంభాషణపై దేశవ్యాప్తంగా చర్చ!
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.
Trade deal: అమెరికా ట్రేడ్‌డీల్‌తో రైతులకు ఎలాంటి నష్టం లేదు : పీయూష్ గోయల్
అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు.
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మరో షాక్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం మరోసారి షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి.
FASTag: ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు భారీ స్పందన.. ఆరు నెలల్లోనే 50 లక్షలు
ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల సంఖ్య 50 లక్షల మార్కును దాటింది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 26,693
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత ఉదయం నష్టాల నుండి సూచీలు మరికొద్దిగా లాభపడ్డాయి.
Digital gold sales: జనవరిలో 4,000 కోట్లు దాటిన డిజిటల్ గోల్డ్ అమ్మకాలు
రికార్డ్ బ్రేకింగ్ ధరలున్నా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చెయ్యడం వినియోగదార్లను ఆపట్లేదు.
Drivers strike: 7న ఓలా-ఉబర్-ర్యాపిడో డ్రైవర్ల దేశవ్యాప్తంగా సమ్మె: కనీస ఛార్జీలు, పని పరిస్థితుల కోసం ఆందోళన
కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై, ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఫిబ్రవరి 7 (శనివారం) దేశవ్యాప్తంగా సమ్మెకి వెళ్లనున్నారు.
RBI: డిజిటల్ మోసాల్లో రూ.25వేల వరకు పరిహారం.. ఆర్‌బీఐ ప్రతిపాదనలు
డిజిటల్ మోసాల కారణంగా బాధితులలో కలిగే ఆందోళనను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కొత్త ప్రకటన చేసింది.
Gold-Silver Rates: మహిళలకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన వెండి,బంగారం ధరలు
హమ్మయ్య! బంగారం,వెండి ధరలు దిగొస్తున్నాయి. నిన్నమొన్నటివరకు రాకెట్‌లా దూసుకెళ్తున్న ధరలు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నాయి.
ACC: 2040 నాటికి 700 గిగావాట్లకు ఏసీసీ బ్యాటరీల డిమాండ్
దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీల అవసరం 2040 నాటికి 700 గిగావాట్ల స్థాయికి చేరనుంది.
Silver: వెండి ధరలకు భారీ షాక్.. దేశీయ మార్కెట్లో భారీ క్షీణత
వరుసగా రెండు రోజుల పాటు పెరుగుదల నమోదు చేసిన విలువైన లోహాల ధరలు గురువారం ఒక్కసారిగా భారీగా క్షీణించాయి.
Bitcoin: ఒక్కరోజే 12% పతనమైన బిట్‌కాయిన్
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) ధరలో ఒక్కరోజే భారీ పతనం నమోదైంది. ధర 12% పైగా పడిపోయి 63,295 డాలర్లకు చేరింది.
RBI: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తన కీలక వడ్డీ రేట్లను ఎటువంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
Bharat Taxi: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవం.. భారత్ ట్యాక్సీని లాంచ్ చేసిన అమిత్‌షా..
ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ 'భారత్ ట్యాక్సీ'ను ప్రారంభించింది.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా లోహ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.
Gold & Silver: భారీగా పతనమైన బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయి? ఎంత వరకు తగ్గాయి?
మంగళవారం, బుధవారం వరుసగా పెరిగిన బంగారం,వెండి ధరలు గురువారం ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి.
Stock Market: లాభాల స్వీకరణతో నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావంతో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటలో సాగిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల వైపు మళ్లాయి.
Bengaluru: బెంగళూరులో గూగుల్ భారీ క్యాంపస్.. మరో 20,000 మందికి అవకాశాలు
అంతర్జాతీయ టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
Anthropic AI Tool: కృత్రిమ మేధ 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' విడుదల.. షాక్'లో ఐటీ మార్కెట్
కృత్రిమ మేధ (AI) రంగంపై ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఆసక్తి పెంచుతున్న సమయంలో, 'ఆంత్రోపిక్' సంస్థ తన కొత్త AI టూల్‌ను పరిచయం చేసి సంచలనం సృష్టించింది.
Stock Market: ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు.. ఐటీ షేర్లు కుదేలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగియగా, ఈరోజు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
NVIDIA : US భద్రతా సమీక్ష.. చైనాకు NVIDIA AI చిప్ అమ్మకాలను నిలిపివేత
అమెరికా కమర్స్ డిపార్ట్మెంట్ ఎగుమతి పరిమితులను సడలించినప్పటికీ, NVIDIA H200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌ల చైనాకు విక్రయాలు ఇప్పటికీ ఆగి ఉన్నాయి.
Stock Market: ఇన్ఫోసిస్, టీసీఎస్ దాదాపు 6% పడిపోయాయి: ఈరోజు ఐటీ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి?
కృత్రిమ మేధ (AI) రంగంలో ఇటీవల వచ్చిన ప్రగతి భారత ఐటీ షేర్లపై ప్రభావాన్ని చూపించింది.
India-Venezuela Oil: వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు.. భారత్‌కు ఏటా 3 బిలియన్ డాలర్ల ఆదా: ఎస్‌బీఐ రిపోర్టు
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై అవగాహనకు వచ్చిన భారత్ తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
Gold & Silver prices:లాభాల స్వీకరణ తర్వాత స్వల్పంగా కోలుకున్న బంగారం.. మరింత తగ్గిన వెండి..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
గత నాలుగు-ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ ర్యాలీ.. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పైకి
చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
Adani Group: 'మేకిన్ ఇండియా'కు ఊతం.. హెలికాప్టర్ తయారీకి అదానీ-లియోనార్డో ఒప్పందం
దేశీయ పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఇప్పుడు హెలికాప్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది.
India-US trade deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. మార్కెట్ సెంటిమెంట్ పై ఊరట..
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కారణంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారుల మనోభావలలో సానుకూల మార్పు వచ్చే అవకాశం ఉందని Antique Stock Broking ఒక రిపోర్ట్ లో వెల్లడించింది.