క్రీడలు వార్తలు | పేజీ 13

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

ఎమ్మా రాడుకానుపై కోకో గౌఫ్ విజయం

2023 ఆస్ట్రేలియా ఓపెన్లో టెన్నిస్ స్టార్ కోకో గౌఫ్ అద్భుతంగా ఆడింది. ఎమ్మా రాడుకాను కోకో గౌఫ్ ఓడించింది. మ్యాచ్ టైబ్రేకర్‌కు ముందు గౌఫ్ తొలి సెట్‌లో 6-3తేడాతో గౌఫ్ ముందుకెళ్లింది.

శుభ్‌మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు

శుభ్‌మాన్‌ గిల్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ చేసి సత్తా చాటాడు. కేవలం 87 బంతుల్లో వంద పరుగులు చేశాడు.

వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..?

భారత్ 267 పాయింట్లతో టీ20లో ప్రస్తుతం ఆగ్రస్థానంలో నిలిచింది. అలాగే వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. త్వరలోనే టీ20 సిరీస్ కూడా ఉంది. తరువాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లను భారత్ ఆడనుంది.

మూడో రౌండ్‌కు అర్హత సాధించిన స్వియాటెక్, సక్కరి

2023 ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇగా స్వియాటెక్, సక్కరి చక్కటి ప్రదర్శన చేయడంతో మూడో రౌండ్‌కు అర్హత సాధించారు. టెన్నిస్‌లో మహిళల సింగిల్స్ ప్రపంచ నంబర్ వన్ స్వియాటెక్, కమిలా ఒసోరియాను వరుస సెట్లలో ఓడించింది. అనంతరం డయానా ష్నైడర్‌పై గ్రీకు సంచలనం మారియా సక్కరి విజయం సాధించింది.

2023 ఆస్ట్రేలియన్ ఓపెన్లో రాఫెల్ నాదల్ ఓటమి

ఆస్ట్రేలియా ఓపెన్ నుండి రాఫెల్ నాదల్ నిష్క్రమించాడు. రెండో రౌండ్ లో అమెరికన్ మెకెంజీ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుండి బయటికొచ్చాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నా బరిలోకి దిగిన నాదల్ ఒక సెట్ వెనుకబడ్డాడు. నాదల్ రెండో సెట్ చివరిలో మెడికల్ టైమ్ తీసుకున్నా.. చివరికి పరాజయం పాలయ్యాడు.

రికార్డులను వేటాడేందుకు సై అంటున్న కింగ్ కోహ్లీ

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చరిత్రను తిరగరాశాడు. స్వదేశంలో వన్డే ఫార్మాట్‌లో 21 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.

వెస్టిండిస్ టెస్టు జట్టులో సీనియర్ పేసర్ రీ ఎంట్రీ

జింబాబ్వేతో జరిగే రెండు టెస్టుల మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్‌గా బ్రాత్‌వైట్ ఎంపికయ్యాడు. వెటరన్ పేసర్ షానన్ గాబ్రియెల్, గుడాకేష్ మోటీ, జోమెల్ వారికన్‌ తిరిగి టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నారు.

టాప్ 4లోకి విరాట్ కోహ్లీ, టాప్ 3లోకి సిరాజ్

ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు సాధించారు. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల గ్యాప్‌లో మూడు సెంచరీలతో దుమ్మురేపాడు.

రెండో రౌండ్‌కు చేరుకున్న అలెగ్జాండర్ జ్వెరవ్

జర్మనీ స్టార్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. జువాన్ పాబ్లో వరిల్లాస్‌ను ఐదు సెట్లలో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగు గంటల ఆరు నిమిషాల్లో ప్రపంచ 103వ ర్యాంకర్‌ను 4-6, 6-1, 5-7, 7-6(3), 6-4తో అధిగమించాడు. జ్వెరెవ్ ఈ సీజన్‌లో తన మొదటి టూర్-లెవల్ విజయాన్ని సాధించాడు. జ్వెరవ్ గాయం నుండి కోలుకొని యునైటెడ్ కప్‌లోకి తిరిగొచ్చి సత్తా చాటాడు.

మళ్లీ సెంచరీ, తగ్గేదేలా అంటున్న సర్ఫరాజ్ ఖాన్

గత కొన్నెళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న భారత్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో త్వరలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంతో సర్ఫరాజ్‌ఖాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

ఐర్లాండ్‌తో సిరీస్‌పై కన్నేసిన జింబాబ్వే

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి ఐర్లాండ్, జింబాబ్వే మధ్య ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌కు అతిథ్యమివ్వడానికి జింబాబ్వే సిద్ధమైంది. ఇప్పటికే టీ 20 లీగ్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న జింబాబ్వే జట్టు ఆత్మ విశ్వాసంలో ఉంది. ఎలాగైనా ఐర్లాండ్ పై నెగ్గి ఈ సిరీస్‌ను సాధించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఐర్లాండ్ ఈ సిరీస్‌ను నెగ్గి సత్తా చాటాలని భావిస్తోంది.

రోనాల్డ్ కంటే విరాట్ తక్కువేం కాదు : పాక్ మాజీ కెప్టెన్

విరాట్ కోహ్లీ 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎన్నో తిరుగులేని రికార్డులను సాధించాడు. ప్రస్తుతం ఈ తరంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ గా టాప్ లో ఉన్నాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు.

హోరాహోరీ పోరులో మాటియో బెరెట్టినిపై ఆండ్రీ ముర్రే విజయం

మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, ఆండీ ముర్రే తొలి రౌండ్‌ను అతి కష్టం మీద అధిగమించాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభ రౌండ్‌లో (13వ సీడ్) మాటియో బెరెట్టినిని ఓడించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-5) తేడాతో ఓడించి సత్తా చాటాడు. దాదాపు మ్యాచ్ 4 గంటల 49 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగింది.

టీమిండియాకి భారీ షాక్, కీలక ఆటగాడు దూరం

టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ ఎదురైంది. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్‌కు కీలక ఆటగాడు దూరమయ్యాడు. వెన్నుముక గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆ స్థానాన్ని రజత్ పాటిదార్‌తో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

భారత్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత

భారత్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత సాధించాడు. 2023 రంజీ ట్రోఫీలో రాజ్ కోట్‌లో సౌరాష్ట్ర తరుపున 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఆడాడు. ఇటీవల ఢిల్లీపై సౌరాష్ట్ర విజయం సాధించడంతో ఈ లెఫ్టార్మ్ సీమర్ హ్యాట్రిక్ సాధించాడు.

భారత్‌తో వన్డే సిరీస్‌కు సై అంటున్న న్యూజిలాండ్

భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్ సాధించిన టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది. భారత్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా పైచేయిగా నిలిచింది.

పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్

పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సహచర క్రికెటర్ తో సెక్స్ చాట్ చేసినట్లు వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాబర్ అజామ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు.

17 Jan 2023

ఐపీఎల్

పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్

భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఈ ఏడాది ఐపీఎల్ టీ20 టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. అతను గతంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించారు.

రెండో రౌండ్‌కు చేరుకున్న రష్యా స్టార్ మెద్వెదేవ్

ఆస్ట్రేలియా ఓపెన్లో సోమవారం జరిగిన ఓపెనింగ్ రౌండ్లో రష్యా స్టార్ డేనియల్ మెద్వెదేవ్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మార్కోస్ గిరోన్‌పై మెద్వెదేవ్ పోటిపడి గెలిచాడు. మెల్‌బోర్న్‌లో రెండో రౌండ్‌కు వెళ్లేందుకు 6-0, 6-1, 6-2 తేడాతో గెలుపొంది సత్తా చాటాడు.

కుల్దీప్, చాహల్ ఎంపికపై కసరత్తు..!

ప్రస్తుతం టీమిండియాలో స్పిన్ కోటా బౌలర్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో భారత్ 3-0 తో విజయం సాధించడంతో ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడు. భారత్ మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు.

విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్

శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.

షఫాలి వర్మ సూపర్ బ్యాటింగ్

ఐసీపీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా మహిళా కెప్టెన్ షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో 34 బంతుల్లో 78 పరుగులు చేసి సంచలనం సృష్టించింది.

పురుషుల సింగల్స్‌లో సత్తా చాటిన నాదల్

22సార్లు గ్రాండ్ స్లామ్ విజేత రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 పురుషుల సింగల్స్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. తొలి రౌండ్‌లో అరంగ్రేటం చేసిన జాక్ డ్రేవర్‌ను ఓడించారు. అయితే జాక్ డ్రేపర్‌తో జరిగిన ఫిట్ నెస్ పోరులో 7-5, 2-6, 6-4తో తిరుగులేని విజయాన్ని అందించాడు. దీంతో నాదల్ రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.

16 Jan 2023

ఐపీఎల్

ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు

ఉమెన్స్ ఐపీఎల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి జరగనున్న ఈ లీగ్ హక్కులు ఏకంగా రూ.951 కోట్లకు అమ్ముపోయామంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..!

శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్ లను భారత్ కైవసం చేసుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ పై భారత్ కన్ను పడింది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగంలో రాణిస్తున్న టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగే పోరుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న కిర్గియోస్

నిక్ కిర్గయోస్ ఆస్రేలియా ఓపెన్ నుండి తప్పుకున్నాడు. గాయం కారణంగా తన సొంత గ్రౌండ్ లో స్లామ్‌ ఆడకపోవడం చాలా దారుణమైన విషయమని కిర్గియోస్ చెప్పారు. టైటిల్ గెలవడానికి అవకాశంగా భావించిన ఈ ఆస్ట్రేలియన్ చీలిమండ సమస్య కారణంగా మొత్తం టోర్నికి దూరమయ్యాడు.

క్రిస్టల్ ప్యాలెస్‌పై 1-0తేడాతో చెల్సియా విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 లో క్రిస్టల్ ప్యాలెస్ పై చెల్సియా ఘన విజయం సాధించింది. 1-0తేడాతో చెల్సియా అద్భుతంగా రాణించింది. నార్త్ లండన్ డెర్బీలో టోటెన్ హామ్ పై 2-0 తేడాతో ఆర్సెనల్ గెలిచింది. హావర్ట్జ్ చెల్సియాకు 1-0 తేడాతో స్వల్ప విజయాన్ని సాధించాడు

శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన మహ్మద్ సిరాజ్

హైదరాబాద్ ఫేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత్ బౌలింగ్ అదరగొడుతున్నాడు. తన స్పీడ్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ భారత్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. మొన్న శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లోనూ మెరుగ్గా రాణించాడు.

రికార్డుల మోత మోగించిన కింగ్ విరాట్ కోహ్లీ

శ్రీలంకతో జరిగిన 50వ వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీని నమోదు చేశాడు. శ్రీలంక జట్టుపై 10 వన్డే సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా కోహ్లీకి ఇది 74 ఇంటర్నేషనల్ సెంచరీ. సచిన్ 100 సెంచరీలతో ఈ జాబితాలో ముందున్నాడు.

మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ అతిపెద్ద విజయాన్న నమోదు చేసింది. 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ సెంచరీలు సాధించడంతో భారత్ 390/5 భారీ స్కోరు చేసింది.

క్రెజ్‌సికోవాపై కసత్కినా 6-2, 7-5తో విజయం

అడిలైడ్ ఇంటర్నేషనల్ 2లో శనివారం జరిగే మహిళల సింగిల్స్ మ్యాచ్ ఫైనల్‌లో ఐదో సీడ్ డారియా కసత్కినా, ఎనిమిదో సీడ్ బెలిండా బెన్సిక్‌తో పోరాడింది.

రాహుల్ ద్రవిడ్‌కు అనారోగ్యం, చికత్స కోసం బెంగళూరు

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే తర్వాత ద్రవిడ్ వైద్య పరీక్షల కోసం బెంగళూరు వెళ్లాడు.

బాక్సింగ్ నుంచి మేరీ కోమ్ అవుట్..!

ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీకోమ్ 2023 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నుండి వైదొలిగింది. ఈ ఏడాది బాక్సింగ్ మహిళల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడం లేదని మేరీ కోమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

రాహుల్ ఐదో స్థానానికి ఫర్‌ఫెక్ట్..!

ఇండియా, శ్రీలంక మధ్య గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెఎల్ రాహుల్ ఆచితూచి ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. గతంలో టీమిండియా ఓపెనర్ గా వచ్చిన రాహుల్ గత రెండు సిరీస్ ల్లో తన స్థానాన్ని మార్చుకున్నాడు.

చెల్సియాపై 2-1 తో ఫుల్‌హామ్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 మ్యాచ్ లో ఫుల్ హామ్ 2-1తో చెల్సియాపై విజయం సాధించింది. ఫుల్‌హామ్‌కు పెనాల్టీని తోసిపుచ్చిన తర్వాత VAR, విల్లియన్‌ను అధిగమించాడు. మ్యాచ్ హాఫ్ టైం తర్వాత చెల్సియా, ఫుల్ హామ్ ను సమం చేసింది. కార్లోస్ వినిసియస్ 2006 తర్వాత మొదటిసారిగా చెల్సియాను ఓడించడంలో ఫుల్‌హామ్ సక్సస్ అయింది.

భారత్‌తో టీ20 సిరీస్‌ జట్టును ప్రకటించిన కివిస్, కొత్త కెప్టెన్ ఇతడే

టీమిండియాతో టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను మిచెల్ సాంట్నర్‌కు అప్పగించారు. భారత్‌తో తలపడే జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ది వాల్ బ్యాటింగ్ సీక్రెట్ ఇదే.. మాజీ ప్లేయర్ వెల్లడి

టీమిండియా లెజెండరీ ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.. ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్ జట్టుకు విజయాలను అందించాడు. క్రీజ్ లో పాతుకుపోయి రాహుల్ ద్రవిడ్ ది వాల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలర్లు ద్రవిడ్ ను ఔట్ చేయాలంటే పెద్ద సాహసమే చేసేవాళ్లు..జనవరి 11, 2023నాటికి రాహుల్ ద్రవిడ్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

భారత్ 48 ఏళ్ల కల నెరవేరేనా..?

హాకీ జట్టు అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలో పైనల్లో పాకిస్తాన్ ను ఓడించి 1975లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు సాధ్యం కాలేదు. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన జట్టు కనీసం సెమీఫైన్‌ల్‌కి కూడా చేరుకోలేదు.

హాఫ్ సెంచరీతో టీమిండియాను గట్టెక్కించిన కేఎల్ రాహుల్

టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ గెలుపులో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ ప్రముఖ పాత్ర పోషించాడు. భారత్ కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో రాహుల్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కేఎల్ రాహుల్ హార్ధిక్ పాండ్యాతో కలిసి 75 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి, 43 ఓవర్లకు టీమిండియా చేధించింది. కేఎల్ రాహుల్ చివర వరకు నిలబడి భారత్‌కు గెలుపును అందించారు. అంతకుముందు సిరాజ్, కుల్దీప్ లు చక్కటి బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు.