క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు

న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం భారత్ సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక విషయాలను చెప్పారు.

ఫుల్‌హామ్‌ను ఓడించడంలో హ్యారీకేన్ సాయం

హ్యారీ కేన్ ప్రస్తుతం టోటెన్‌హామ్‌కు ఉమ్మడి ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మంగళవారం ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో ఫుల్‌హామ్‌ను జట్టు అధిగమించడంతో అతను 266వ గోల్ చేశాడు. టోటెన్‌హామ్ 1-0తో లండన్ క్లబ్ ఫుల్‌హామ్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో స్పర్స్ స్టాండింగ్స్‌లో 5వ స్థానానికి చేరుకుంది.

24 Jan 2023

ఐసీసీ

ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య

2022 ఏడాదికి గానూ పురుషుల టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకి అవకాశం లభించింది. ఇండియా నుంచి విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు చోటిచ్చారు. ఇంగ్లాండ్‌ను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది.

ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ 11 మంది మహిళల టీ20 జట్టును ఎంపిక చేసింది. ఈ లిస్టులో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లకు అవకాశం దక్కింది.

జువెంటస్ అటలాంటాయాను 3-3తో పరాజయం

ఆతిథ్య జువెంటస్ అట్లాంటాను రివర్టింగ్ సీరీ A 2022-23 మ్యాచ్‌లో 3-3 డ్రాగా ముగించింది. ఏంజెల్ డి మారియా జువ్‌కు పెనాల్టీగా మార్చడంతో జువెంటస్ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. 65వ నిమిషంలో ఈక్వలైజర్ జువ్ ఈ మ్యాచ్ నుండి ఒక పాయింట్‌ను పొందేందుకు సహాయపడ్డారు.

సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన రుబ్లెవ్

ఐదోవ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సత్తా చాటాడు. పురుషుల సింగల్స్ లో క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించాడు. తొమ్మిదో-సీడ్ హోల్గర్ రూన్‌పై 6-3, 3-6, 6-3, 4-6, 7-6(9)తో రుబ్లెవ్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. రుబ్లెవ్ తన కెరీర్‌లో ఏడవ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం.

ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సౌమ్య తివారీ టీమిండియా తరుపున అద్భుతంగా రాణించింది. భారత్ స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు.

గాయం నుంచి కోలుకున్న జడేజా, కెప్టెన్‌గా రీ ఎంట్రీ

టీమిండియా ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం జడేజా మళ్లీ మైదానంలో మళ్లీ అడుగు పెట్టబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా సౌరాష్ట్ర తరుపున రంజీ ఆడటానికి సిద్ధమయ్యాడు.

క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లిన కరోలియా ప్లిస్కోవా

ప్రపంచ మాజీ నంబర్ వన్, కరోలినా ప్లిస్కోవా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సత్తా చాటింది. చైనాకు చెందిన 23వ ర్యాంకర్ జాంగ్ షువాయ్‌ను మట్టి కరిపించింది. తన ప్రత్యర్థిని వరుస సెట్లలో (6-0, 6-4) ఓడించి కరోలియా ప్లిస్కోవా నాలుగో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

గాయం నుంచి కోలుకున్న జడేజా రీ ఎంట్రీ

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు దూరమై చాలా నెలలు అవుతోంది. సెప్టెంబర్ 2022లో ఆసియా కప్ భాగంగా జడేజా మోకాలికి గాయమైంది. దీంతో భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు టెస్టులకు భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈలోపు రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర తరుపున ఆడటానికి జడేజా చైన్నై వచ్చాడు.

విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించిన కున్లావుట్ విటిడ్ సర్న్

థాయ్ లాండ్ కు చెందిన కున్లావుట్ విటిడ్ సర్న్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన డెన్నార్క్కు చెందిన విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించి సత్తా చాటాడు.

ఐపీఎల్ మహిళ టీం కొనుగోలుపై బడా ఫ్రాంచైసీలు ఆసక్తి..!

ఐపీఎల్ మహిళను టీం కొనుగోలు చేయడానికి బడా ఫ్రాంచైసీలు ఆసక్తిని చూపుతున్నాయి. ఎలాగైనా టీంను కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేడు ఏ ఫ్రాంచైసీలు ముందుకు రానున్నాయో ఓ కొలక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు ఎంత మొత్తం పెట్టుబడి పెడుతున్నారు, ఎవరు ఆసక్తి చూపుతున్నారో నేడు తెలిసే అవకాశం ఉంటుంది.

మాంచెస్టర్ యునైటెడ్‌పై ఆర్సెనల్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23లో ఆదివారం ఎమిరేట్స్‌లో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్‌ను ఆర్సెనల్ అధిగమించింది. మాంచెస్టర్ యునైటెడ్ పై 3-2 తేడాతో ఆర్సెనల్ విజయం సాధించింది.

హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

హాకీ వరల్డ్ కప్ టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా వరల్డ్‌కప్ నుంచి ఇంటిదారి పట్టింది.

రాయపూర్ వన్డేలో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు, కివీస్ 108 ఆలౌట్

రాయపూర్ వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ ఆటగాళ్లకు ఇండియన్ పేసర్లు చెమటలు పుట్టించడంతో తక్కువ స్కోర్ కే కివీస్‌ను కుప్పకూల్చారు

పాకిస్తాన్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

సిడ్నీలోని నార్త్ సిడ్నీ ఓవల్‌లో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు, పాకిస్తాన్ మహిళల జట్టును ఓడించారు. బెత్ మూనీ 133 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 336/9 స్కోరు చేసింది. చేధనకు దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు బ్యాటింగ్‌లో తడబడటంతో 235/7 స్కోర్ చేసి ఓటమి పాలైంది.

మరియా సక్కరిపై విక్టోరియా సంచలన విజయం

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో విక్టోరియా అజరెంకా అద్భుతంగా రాణించింది. 10వ సీడ్ మాడిసన్ కిస్‌పై అధిపత్యం చెలాయించింది. తర్వాత జులిన్ ఆరో సీడ్ మరియా సక్కరిపై 7-6, 1-6, 6-4 తేడాతో విక్టోరియా అజరెంకా సంచలన విజయం సాధించింది.

కోర్డా మెద్వెదేవ్‌ను మట్టికరిపించిన సెబాస్టియన్ కోర్డా

శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో సెబాస్టియన్ కోర్డా మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. రష్యన్ ఏస్ డేనియల్ మెద్వెదేవ్‌ను సెబాస్టియన్ మట్టి కరిపించాడు. కోర్డా వరుస సెట్లలో విజయం సాధించి ముందుకెళ్లాడు.

గ్రీక్స్‌పూర్‌పై సిట్సిపాస్ విజయం

ప్రపంచ 63వ ర్యాంకర్ టాలోన్ గ్రీక్స్ పూర్ ను స్టెఫానోస్ సిట్సిపాస్ ఓడించారు. 6-2, 7-6(5), 6-3తేడాతో గ్రీక్స్ పూర్పై సిట్సిపాస్ విజయం సాధించి నాలుగో రౌండ్ కు అర్హత సాధించారు. ఇప్పటివరకూ ఒక సెట్ కూడా వదలకుండా సిట్సిపాస్ అరుదైన ఘనత సాధించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛతేశ్వర్ పుజారా మరో ఘనత

టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్‌లో భారత్ తరుపున 12 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నప్పుడు పుజారా ఈ మైలురాయిని అందుకున్నాడు. సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 91 పరుగులు చేసి సత్తా చాటాడు.

రెండో వన్డేకు ముందు టీమిండియాకు భారీ జరిమానా

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియాకు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధిస్తున్నట్లు ఐసీపీ ప్రకటించింది.

ముక్కోణపు సిరీస్‌లో అదరగొట్టిన భారత్ అమ్మాయిలు

టీ20 ట్రై సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మహిళలపై భారత్ మహిళలు అదరగొట్టారు. ఈస్ట్ లండన్ లో గురువారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్ లో భారత్ 27 పరుగుల తేడాతో ధక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.

పారిస్ సెంయిట్- జెర్మెయిన్ జట్టు థ్రిలింగ్ విక్టరీ

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా రోనాల్డ్, మెస్సీ తలపడ్డారు. రియాజ్ సీజన్, పారిస్ సెంయిట్- జెర్మెయిన్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఔట్

సొంత గడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగల్స్ లో డిఫెండింగ్ చాంఫియన్ లక్ష్యసేన్, మహిళల సింగల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు.

ఫ్యాషన్ షోకి వెళ్లితే స్లిమ్‌గా ఉన్నవారు దొరుకుతారు, సెలెక్టర్లపై సన్నీ ఆగ్రహం

సెలెక్టర్లు క్రికెటర్ల ఆకారాన్ని బట్టి కాకుండా వారి టాలెంట్‌ను చూసి ఎంపిక చేయాలని సెలక్టర్లకు టీమిండియా మాజీ ప్లేయర్ గవస్కర్ సూచించారు. సన్నగా ఉన్నవారిని మాత్రమే కావాలనుకుంటే సెలెక్టర్లు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకొని వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి చేర్చుకోవాలని ఆయన హితువు పలికారు.

20 Jan 2023

బీసీసీఐ

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ ఎడిషన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనుమతిచ్చింది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చిలో జరిగే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా.. చివరి రెండేళ్లలో ఆరు జట్లకు అవకాశం కల్పించారు.

తానాసి కొక్కినకిస్‌పై ఆండీ ముర్రే అద్భుత విజయం

మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఆండీ ముర్రే ఆస్ట్రేలియా ఓపెన్లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో థానాసి కొక్కినాకిస్‌‌ను మట్టికరిపించాడు.

4-2 తేడాతో వేల్స్‌పై భారత్ ఘన విజయం

కళింగ స్టేడియంలో గురువారం జరిగిన హాకీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత పురుషుల జట్టు 4-2తో వేల్స్‌ను ఓడించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, వేల్స్‌కు చెందిన ఫర్లాంగ్ గారెత్, డ్రేపర్ జాకబ్ గోల్స్ చేశారు.

ఓన్స్‌ జబీర్‌ను మట్టికరిపించిన మార్కెటా వొండ్రోసోవా

చెక్ స్టార్ మార్కెటా వొండ్రూసోవా ఆస్ట్రేలియా ఓపెన్లో సత్తా చాటింది. రెండవ సీడ్ ఒన్స్ జబీర్‌ను వొండ్రూసోవా ఓడించింది. దీంతో వోండ్రోసోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జబీర్ 2022లో వింబుల్డన్, US ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇండియా ఓపెన్స్ నుండి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అవుట్

భారత్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి గురువారం ఇండియా ఓపెన్ నుంచి తప్పుకున్నారు. స్వాతిక్, చిరాగ్ లు సూపర్ 750 ఈవెంట్ నుండి నిష్క్రమించారు. న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ రెండో రౌండ్‌లో వీరిద్దరూ చైనాకు చెందిన యు చెన్ లియు, జువాన్ యి ఓయుతో తలపడాల్సి ఉంది.

సీడ్ కాస్పర్ రూడ్ పై జెన్సన్ బ్రూక్స్ బీ విజయం

ఆస్ట్రేలియా ఓపెన్ లో అన్ సీడెడ్ అమెరికన్, జెన్సన్ బ్రూక్ బీ సత్తా చాటింది. రెండో రౌండ్ లో సీడ్ కాస్పర్ రూడ్ ను ఓడించాడు. మూడు గంటల 55 నిమిషాల తర్వాత బ్రూక్స్‌బీ 6-3, 7-5, 6-7(4), 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేశాడు. రూడ్ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని 2-5తో తిరిగి వచ్చినా ఫలితం లేకుండా పోయింది.

రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్

టీమిండియాలో స్థానం కోల్పోయిన మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కర్నాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 208 పరుగులు చేసి సత్తా చాటాడు. అగర్వాల్ మూడో వికెట్‌కు నికిన్ జోస్‌తో కలిసి 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఎనిమిది వారాలు పాటు రాఫెల్ నాదల్ ఆటకు దూరం

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ తప్పుకున్నాడు. అమెరికా ఆటగాడు మెకంజీ మెక్ డోనాల్డ్ రెండోరౌండ్‌లో నాదల్ 4-6, 4-6, 5-7తో పరాజయం పొంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు .

AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ మిలస్ విజయం

AC మిలన్‌పై ఇంటర్ మిలస్ విజయం సాధించింది. AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో సూపర్ కోప్పా ఇటాలియానా ట్రోఫిని ఇంటర్ కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్‌తో రెండో వన్డేకి టీమిండియా రెడీ

హైదరాబాద్‌లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే అభిమానులకు మంచి కిక్‌ను ఇచ్చింది. ఇటు శుభ్‌మన్ గిల్, అటు బ్రాస్‌వెల్ ఉప్పల్ స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. దీంతో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కివిస్‌పై భారత్ పైచేయి సాధించింది.

రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్

హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు. వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డును సృష్టించాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో 208 పరుగులు చేసి అరుదైన ఘనతను కైవసం చేసుకున్నాడు.

వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెస్‌వెల్ అరుదైన రికార్డు

హైదరాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే భారత్ అభిమానులకు మాజాను ఇచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఒకానొక దశలో టీమిండియాకు న్యూజిలాండ్ బ్యాటర్ మైఖేల్ బ్రెస్‌వేల్ చెమటలు పట్టించాడు. కేవలం 78 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు చేశారు.

మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు

కోచ్‌ల వేధింపులు తాళలేక 30మంది మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నాకు దిగారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేష్ పొగట్, సాక్షి మాలిక్ లైగింక వేధింపుల ఆరోపణలను చేశారు.

బ్రాస్‌వెల్ భయపెట్టినా, భారత్ థ్రిలింగ్ విక్టరీ

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంతో భారత్ 349 పరుగులు చేసింది. ఒకానొక దశలో భారత్ ఓడేలా కనిపించేలా శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన యార్కర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!

2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 కి సంబంధించి అమెరికా క్రికెట్‌ అధ్యక్షుడు అతుల్‌ రాయ్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఓక్లాండ్, ఫ్లోరిడా, లాస్ ఏంజెల్స్ లోని వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.