క్రీడలు వార్తలు | పేజీ 10

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

ఆరోన్ ఫించ్ క్రికెట్లో సాధించిన రికార్డులపై ఓ కన్నేయండి..!

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. 12 ఏళ్ల సుదీర్ఘమైన తన క్రికెట్ కెరీర్‌కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్‌మెన్ ఆరోన్‌ఫించ్ ఫుల్‌స్టాప్ పెట్టాడు.గత సెప్టెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో తొలి T20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు ఫించ్ అందించాడు. టీ20ల్లో రెండుసార్లు 150-ప్లస్ స్కోర్‌ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్

ఆసియాకప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పా‌కిస్తాన్ వేదికగా ఆసియా కప్‌ను నిర్వహిస్తే.. పాక్‌లో ఆడేదిలేదని టీమిండియా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఆడాలని భావిస్తే మాత్రం వేదికను మార్చాలని సూచించింది. పాకిస్తాన్‌లో టీమిండియా ఆసియాకప్ ఆడకపోతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాక్ ఆడదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి.

క్రికెట్ లీగ్స్‌పై సౌరబ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు

క్రికెట్ లీగ్స్ ఆడటానికి క్రికెటర్లు ఇష్టపడుతుంటారు. ఇండియన్ ఐపీఎల్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్స్ వేలంలో ప్రస్తుతం పోటీ కనిపిస్తోంది. ఏదో ఒక లీగ్‌లో ఆడాలని ప్రస్తుత క్రికెటర్లు ఆరాటపడుతున్నారు. అందుకే ఈ లీగ్స్‌కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఏర్పడింది.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచ కప్‌ను అందించడంలో ఫించ్ కీలక పాత్ర పోషించి ఆ జట్టుకు ట్రోఫీని అందించాడు.

టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు

ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో ఈనెల 10న ప్రారంభ కానుంది.

మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి 26వ తేదీ వరకూ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడీయం, డివై పాటిల్ స్టేడియాలు ఈ లీగ్ కు అతిథ్యమివ్వనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది.

సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్

వెస్టిండీస్‌ బ్యాటర్‌ టాగెనరైన్‌ చందర్‌పాల్‌ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా వెస్టిండీస్ యువ ఆటగాడు చందర్‌పాల్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ బ్రాత్‌వైట్, చందర్ పాల్ సెంచరీలతో రాణించారు. బ్రాత్‌వైట్ టెస్టులో తన 12వ సెంచరీని నమోదు చేశారు.

అశ్విన్‌కు వార్నర్ చెక్ పెట్టేనా..?

టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటి పడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్ మంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌తో తలపడనున్నాడు.

సంచలన రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్

ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. స్మిత్ టీమిండియాతోనే మ్యాచ్ అంటేనే చెలరేగిపోతాడు.

సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్

జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్ శతకంతో అదరగొట్టాడు. తన కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీ చేసి సత్తా చాటాడు. బ్రాత్‌వైట్‌తో పాటు టాగెనరైన్ చందర్‌పాల్ తన తొలి టెస్టు శతకాన్నిసాధించాడు. వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది.

ఏసీ మిలన్ పై ఇంటర్ అద్భుత విజయం

శాన్ సిరోలో ఆదివారం జరిగిన తాజా సిరీస్ A మ్యాచ్‌లో AC మిలన్‌పై ఇంటర్ 1-0తో విజయం సాధించింది. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ మొదటి అర్ధ భాగంలో అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంటర్ విజయానికి పునాది పడింది.

సెవిల్లాపై 3-0 తేడాతో బార్సిలోనా విజయం

లాలిగా 2022-23లో లీగ్ లీడర్లు ఐదవ వరుస గేమ్‌లో విజయం సాధించగా.. బార్సిలోనా 3-0తో సెవిల్లాను ఓడించింది. జోర్డి ఆల్బా 58వ నిమిషంలో బార్సిలోనాను అగ్రస్థానంలో నిలిపాడు.

రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్, టీమిండియా-ఆస్ట్రేలియా జట్టులో ఎంట్రీ

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా 6నెలలు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 9నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఆడనున్నాడు.

వోల్ఫ్స్‌బర్గ్‌ను -2తో ఓడించింన ఎఫ్‌సి బేయర్న్

బుండెస్లిగా 2022-23 మ్యాచ్‌లో ఎఫ్‌సి బేయర్న్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 4-2తో వోల్ఫ్స్‌బర్గ్‌ను ఓడించి సత్తా చాటింది. దీంతో 2022-23 బుండెస్లిగాలో బేయర్న్ 11వ విజయాన్ని సాధించింది. కింగ్స్లీ కోమన్ 14 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గోల్ కొట్టి రికార్డును క్రియేట్ చేశారు.

ఆసియా కప్ 2023 నిర్వహణపై స్పష్టత రానట్లేనా..?

ఆసియాకప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఎందుకంటే ఆసియా కప్ మీటింగ్‌లో 'ప్రభుత్వ క్లియరెన్స్' చర్చలను పాకిస్తాన్ బోర్డు తిరస్కరించింది

తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే మొదటి, రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ నాగ్ పూర్ టెస్టుకు దూరమయ్యాడు. తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోని మొదటి టెస్టుకు దూరమవుతున్నట్లు హేజిల్ వుడ్ స్వయంగా ప్రకటించారు.

మాంచెస్టర్ సిటీని 1-0తో ఓడించిన టోటెన్‌హామ్

ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఆదివారం మంచెస్టర్ సిటీ, టోటెన్ హామ్ తలపడ్డాయి. ఈ కీలక పోరులో మంచెస్టర్ సిటీని టోటెన్ హామ్ 1-0తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో హ్యారికేన్ అరుదైన ఘనతను సాధించాడు.

ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ అద్భుత రికార్డు

ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ సంచలన రికార్డును నమోదు చేశారు. 200వ ప్రీమియర్ లీగ్ గోల్ ను సాధించి అద్భుత రికార్డును తన పేరిట రాసుకున్నారు. ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కారు.

సెమీస్‌లో సమరానికి సిద్ధమైన బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్నాటక

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ దశ పూర్తి అయింది. బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు ప్రస్తుతం సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్నాయి. అయితే ఇంతవరకు వేదికలు నిర్ణయించకపోవడం గమనార్హం.

కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే అంత సులభమేమీ కాదు, ప్రస్తుతం అందరి చూపు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో కింగ్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.

రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరిన సౌరాష్ట్ర

రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్‌పై 71 పరుగుల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించి, సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లింది.

భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారత స్టార్ జమ్మాస్ట్ దీపా కర్మాకర్‌ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించింది. నిషేధిత పదార్థాన్ని తీసుకున్నందుకు కర్మాకర్‌ను ఇంటర్నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది.

స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ అపగలడా..?

ఫిబ్రవరి 9నుంచి నాగ్ పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్‌లో చెడటోడుస్తోంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం కోసం వ్యూహాలను రచిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్, టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవించంద్రన్ అశ్విన్ మధ్య పోరు జరగనుంది.

ప్రీమియర్ లీగ్‌లో డ్రాగా ముగిసిన ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్

ప్రీమియర్ లీగ్ 2022-23 మ్యాచ్‌లో ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్ డ్రాగా ముగిసింది. చెల్సియా అటాకింగ్ థర్డ్‌లో ఎటువంటి గోల్‌ను సాధించలేదు. గోల్-స్కోరింగ్ అవకాశాలు ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనంతరం మిడ్‌ఫీల్డ్‌లో అరంగేట్రం చేసిన ఎంజో ఫెర్నాండెజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది

టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం

భారత్‌తో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నాడు.బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10న ధక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మళ్లీ టైటిల్ పై కన్నేసింది.

మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికలపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ మొత్తాన్ని ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు యోచిస్తోందని క్రిక్‌బజ్ తెలిపింది. డివై పాటిల్, సీసీఐ స్టేడీయాలు వేదిక కానున్నాయి.

కోహ్లీని దూషించిన పాక్ పేసర్ సోహైల్ ఖాన్..!

2015 ఫిబ్రవరిలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్‌- పాకిస్తాన్‌ తలపడింది. ఈ చిరకాల ప్రత్యర్థి పోరులో ఎప్పటిలాగే టీమిండియానే గెలుపొందింది. ఈ విజయంలో కింగ్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే.

గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్‌తో కొత్త ఒప్పందం

ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్‌తో గాబ్రియేల్ మార్టినెల్లి కొత్త ఒప్పందంపై సంతకం చేశాడు. 21 ఏళ్ల బ్రెజిలియన్ మార్టినెల్లి మునుపటి ఒప్పందం వచ్చే సీజన్ చివరిలో ముగియనుంది. అయితే, అతను అదనపు సంవత్సరం కోసం ఎంపికతో, నూతనంగా నాలుగున్నర సంవత్సరాల ఒప్పందాన్ని అంగీకరించాడు.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జింబాబ్వే సై

ఫిబ్రవరి 4 నుంచి జింబాబ్వేతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. జింబాబ్వే‌‌కు కీలకమైన ఆటగాళ్లు దూరం కావడంతో జట్టు బలహీనంగా కనిపిస్తోంది. క్రెయిగ్ ఎర్విన్ జింబాబ్వే టెస్టు పగ్గాలను చేపట్టనున్నారు. మరోవైపు, కరీబియన్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్

రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్ ఆంధ్రపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. రికీభుయ్, కరణ్ షిండేల సెంచరీలతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. అయితే 2వ ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 93 ​​పరుగులకే ఆలౌటైంది.

ఒంటిచేత్తో విహారి బ్యాటింగ్, స్పందించిన దినేష్ కార్తీక్

టీమిండియా ప్లేయర్ హనుమాన్ విహారికి క్రికెట్ పట్ల ఎంతో నిబద్ధత ఉందని మనకు తెలుసు. ఈ మధ్య ఆస్ట్రేలియా టూరులో ఆ టీమ్ బౌలర్లు విసురుతున్న బంతులకు తన శరీరాన్ని అడ్డుగా పెట్టి అప్పట్లో విరోచితంగా పోరాడిన విషయం తెలిసిందే.

రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్‌ హీరో

టీమిండియా బౌలర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మంట్ ప్రకటించారు. ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ లో జోగిందర్ చివరి ఓవర్ వేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ ఫైనల్ చివరి ఓవర్లో మిస్బాను ఔట్ చేసి అప్పట్లో వార్తల్లోకెక్కాడు.

ఝార్ఖండ్ పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన బెంగాల్

2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్‌పై ఘన విజయం సాధించి బెంగాల్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.ఝార్ఖండ్ పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్లు పడగొట్టడంతో, 9 వికెట్ల తేడాతో బెంగాల్ గెలుపొందింది.

ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన కర్ణాటక

2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్‌పై సంచనల విజయంతో కర్ణాటక సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కర్ణాటక విజయంలో శ్రేయాస్ గోపాల్, మురళీధర్ వెంకటేష్, కీలక పాత్ర పోషించారు.

మాజీ ప్రియురాలిపై ఆసీస్ టెన్నిస్ స్టార్ దాడి

మాజీ ప్రియురాలిపై టెన్నిస్ స్టార్ ఆటగాడు నిక్ కిర్గియోస్ దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణం వల్లే దాడికి పాల్పడినట్లు కిర్గియోస్ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో నేరారోపణ నుండి కెర్గియోస్ తప్పించుకున్నాడు.

టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ

ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 16న స్వదేశంలో న్యూజిలాండ్ రెండు టెస్టులను ఆడనుంది. ఇందుకోసం 14మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. టిమ్ సౌతీ న్యూజిలాండ్ టెస్టుకు సారథిగా నియమితులయ్యారు.

ఫైనల్‌కు చేరుకున్న బ్రిస్బేన్ హీట్

బిగ్‌బాష్ లీగ్ ఫైనల్‌కు బ్రిస్బేన్ హీట్ చేరుకుంది, సిడ్నీ సిక్సర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్ నిర్ణీత 20 ఓవర్ల కు 9 వికెట్ల నష్టానికి 116 పరుగులను మాత్రమే చేసింది.

స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కింగ్ కోహ్లీకి కష్టమే..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పాటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.