క్రీడలు వార్తలు | పేజీ 13

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

జర్మనీదే హాకీ ప్రపంచ కప్

పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 విజేతగా జర్మనీ నిలిచింది. ఆదివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియంను జర్మనీ ఓడించింది. జర్మనీ 5-4 తేడాతో బెల్జియంను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి హార్ధిక్ సేన ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 99 పరుగుల టార్గెట్ ను భారత్ కష్టంగా చేధించింది.

రెండో వన్డేలో సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమైన ఇంగ్లండ్

తొలి వన్డేలో ఇంగ్లండ్ పై విజయం సాధించిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో పరాజయం పాలైన ఇంగ్లండ్, రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. రోహిత్‌‌శర్మ, విరాట్‌ లేకుండా హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ టీమిండియా దారుణంగా విఫలమైంది.

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 ఫైనల్‌లో సిట్పిపాస్ వర్సస్ నోవాక్ జకోవిచ్

ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో మూడో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్, నాలుగో సీడ్ నోవాక్ జకోవిచ్‌తో తలపడనున్నాడు.

28 Jan 2023

ఐసీసీ

ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం

స్కై స్పోర్ట్స్ ఎనిమిదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నుండి 2031 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లో జరిగే అన్ని ప్రపంచకప్‌లను ఈ సంస్థ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ ధ్రువీకరించింది.

సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్

ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా జరిగిన మొదటి వన్డేలో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. మొత్తం మీద రాయ్ వన్డేల్లో 11వ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా జాసన్ రాయ్ చరిత్రకెక్కాడు.

ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ

మాంచెస్టర్ సిటీ చేతిలో ఆర్సెనల్ జట్టు పరాజయం పాలైంది. నాల్గవ రౌండ్ లో 1-0తో ఆర్సెనల్ ను మాంచెస్టర్ సిటీ ఓడించింది. సిటీ తరుపున నాథన్ అకే ఒకే ఒక గోల్ చేయడం గమనార్హం.

ధోని చూస్తుండగా వారెవ్వా అనిపించిన ఇషాన్ కిషన్

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ లో మెరిశాడు.

27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సౌతాఫ్రికా 50 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్ 117 బంతుల్లో 111 పరుగులు, డేవిడ్ మిల్లర్ 53 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 44.2 ఓవర్లకు 271 పరుగులు చేసి ఆలౌటైంది.

ఫైనల్‌లో తలపడనున్న బెల్జియం, జర్మనీ

పురుషుల హాకీ వరల్డ్‌కప్ ఫైనల్స్ లో బెల్జియం, జర్మనీ ప్రవేశించాయి. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై జర్మనీ విజయం సాధించి, ఫైనల్స్ కి చేరకుంది.

బాగా అలసిపోయాను, కొంచె రెస్ట్ కావాలి: డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య విశ్రాంతి లేకుండా మ్యాచ్ లు ఆడుతున్నాడు. జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లతో జరిగిన వన్డే సిరీస్ లలో బిజిగా గడిపాడు. టీ20, టెస్టు సిరీస్‌లోనూ విరామం లేకుండా ఆస్ట్రేలియా తరుపున బరిలోకి దిగాడు.

వాషింగ్టన్ సుందర్ మెరిసినా, టీమిండియా పరాజయం

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

Women's Under 19 T20 World Cup ఫైనల్లో ఇండియా

అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ చేరుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్తును ఇండియా ఖరారు చేసుకుంది.

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం

మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో మహిళా అధికారులను నియమిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఎనిమిదో ఎడిషన్ ప్రతిష్టాత్మక పోటీలో 13 మంది మహిళా అధికారులు ప్రస్తుతం పనిచేయనున్నారు.

టీమిండియా గొప్ప జట్టు : పాక్ ప్లేయర్

టీమిండియాపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టును తక్కువ చేయాల్సిన పనిలేదని, దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా భారత్ గొప్ప జట్టేనని తెలిపాడు.

27 Jan 2023

నేపాల్

ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్

నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ మైదానంలో గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటుకోవడంతో అరుదైన గౌరవం లభించింది. ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌కి చెందిన బ్యాటర్ ఆండీ మెక్‌బ్రైన్ పరుగు తీసే క్రమంలో మధ్యలో పడిపోయాడు. అతడ్ని రనౌట్ చేసే అవకాశం ఉన్నా ఆసిఫ్ చేయలేదు.

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌ను అక్షర్ గురువారం పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య వడోదరలో వైభవంగా జరిగింది. పెళ్లికి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం అక్షర్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెస్టిండీస్ మెంటర్‌గా బ్రియన్ లారా

వెస్టిండీస్ జట్టులో ఒకప్పుడు హడలెత్తించే బ్యాటర్లు, బౌలర్లు ఉండేవారు. క్రమంగా వెస్టిండీస్ తమ ప్రభావాన్ని కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆటగాళ్లు కరువయ్యే పరిస్థితి వచ్చింది.

టీమిండియా విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉంది: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్

టెస్టులో ఆల్ టైం సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీతో విభేదాలు కారణంగా 2022 జనవరిలో అర్ధాంతరంగా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా మాజీ ప్లేయర్

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలర్ అని, టీ20 సిరీస్‌లో మె‌రుగ్గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ నేడు రాంచిలో తలపడనున్నాయి.

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో సానియా పరాజయం

సానియా మీర్జా తన కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను ఓటమితో ముగించింది. బ్రెజిల్ జోడి లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో సానియా-బోపన్న జోడి ఓడిపోయింది. మ్యాచ్‌ తర్వాత సానియా మిర్జా భావోద్వేగానికి గురైంది. 18 ఏళ్ల గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావించిన సానియాకు నిరాశే ఎదురైంది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సై

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. నేడు టీ20 సమరానికి సిద్ధమైంది. రోహిత్‌శర్మ, కోహ్లీ, కెఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా.. హర్ధిక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్‌ ఉంది.

27 Jan 2023

జడేజా

సూపర్ ఫామ్‌లో రవీంద్ర జడేజా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్‌లో దుమ్ములేపుతున్నాడు. తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు జడేజా ఫామ్‌లోకి రావడం శుభ సూచకమే అని చెప్పొచ్చు.

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా సంచలన రికార్డును సృష్టించాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో మహ్మద్ సిరాజ్ టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ హైదరాబాద్ పేసర్ సంచలన బౌలింగ్‌తో ఈ మధ్య కాలంలో రికార్డును తిరిగరాస్తున్న విషయం తెలిసిందే.

బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ పింఛ్ అద్భుత ఘనత

బిగ్‌బిష్ లీగ్‌లో ఆరోన్ ఫించ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 54 బంతుల్లో 63 పరుగులతో ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. దీంతో రెనెగేడ్స్‌కు ఆరు వికెట్ల విజయాన్ని అందించింది.

రంజీ ట్రోఫీలో దుమ్ములేపుతున్న కేదార్ జాదవ్

మహారాష్ట్ర ఆటగాడు కేదార్ జాదవ్ రంజీ ట్రోఫీలో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్ లో 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేసి విరుచుకుపడిన విషయం తెలిసిందే

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ దుమ్మురేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన డర్బన్స్ సూపర్ జెయింట్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.

సచిన్, అజయ్ జడేజా, సిద్దూని సెడ్జింగ్ చేయమని పాక్ మేనేజ్‌మెంట్ చెప్పింది

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కోట్లాది మంది అభిమానులు అతృతగా ఎదురుచూస్తారు. ఇక దాయాది దేశాలుగా ముద్ర‌ప‌డ్డ భార‌త్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ జరిగితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ ల‌వ‌ర్స్ టీవీల‌కు అతుక్కుపోతారు. ముఖ్యంగా భారత్, పాక్ మ్యాచ్‌లో సెడ్జింగ్ ఒక్కోసారి హై ఓల్టేజిగా పెంచేస్తుంది. ఒకరిపై ఒకరు సెడ్జింగ్ చేసుకుంటూ ఆటపై మక్కువను మరింత పెంచేస్తారు.

2-0 తేడాతో న్యూజిలాండ్‌పై బెల్జియం విజయం

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం విజయం సాధించింది. భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు బెల్జియం దూసుకెళ్లింది.

విరాట్ కంటే నేనే బెటర్ : పాకిస్తాన్ ప్లేయర్

వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. దాదాపుగా రెండు శతాబ్దాల క్రికెట్ ఆటగాళ్లలో డాన్ బ్రాడ్ మన్, వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, సచిన్, షేన్ వార్న్ లాంటి దిగ్గజాలను ప్రపంచం చూసింది. ప్రస్తుతం ఆ దిశగా విరాట్ కోహ్లీ ప్రయాణిస్తున్నారు. ఎందకంటే అతడు నమోదు చేసిన గణాంకాలను చూస్తేనే కోహ్లీ ప్రతిభ ఎంటో తెలుసుకోవచ్చు.

బాబర్ అజమ్ రికార్డును సమం చేసిన గిల్

శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై మొదటి డబుల్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ చేసి మెరుగ్గా రాణిస్తున్నారు. ఇండోర్‌లో కేవలం 78 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ 21 మ్యాచ్‌లు ఆడి 73.8 సగటుతో 1254 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 3-0తో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్‌కి పంపారు.

వన్డే, టీ20ల్లో టీమిండియాదే ఆగ్రస్థానం

టీమిండియా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. స్వదేశంలో మళ్లీ మరోసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, శ్రీలంక‌పై వరుసగా వన్డే సిరీస్‌లను గెలుచుకొని సత్తా చాటింది.

ఇండోర్‌లో రోహిత్ విశ్వరూపం, రికి పాంటింగ్ రికార్డు సమం చేసిన హిట్ మ్యాన్

భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వన్డేల్లో అరుదైన రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి వన్డేల్లో 30వ సెంచరీని నమోదు చేశాడు. 2020 తర్వాత వన్డేలో సెంచరీ చేసి తన ఫామ్‌ని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వన్డేలో శతకాల పరంగా ఆస్ట్రేలియా లెజెండ్ ప్లేయర్ రికి పాంటింగ్ రికార్డును సమం చేశాడు.

ఐదు గోల్స్‌తో రికార్డు బద్దులు కొట్టిన ఎంబప్పే

ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఎంబెప్పా ఐదు గోల్స్ చేసి పారిస్ ఫ్రెంచ్ కప్‌లో ఆరవ-స్థాయి క్లబ్ పేస్ డి కాసెల్‌ను మట్టికరిపించాడు. ఈ విజయంతో PSG ఫ్రెంచ్ కప్‌లో 16వ స్థానానికి చేరుకున్నాడు. నేమార్, కార్లోస్ సోలెర్ ఒక్కో గోల్ సాధించారు.

టీ20ల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మేగాన్ షట్ అద్భుత రికార్డు

పాకిస్థాన్ మహిళలతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20ల తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షుట్ అద్భుత రికార్డును సాధించింది. మంగళవారం 5/15తో రాణించి కెరీయర్లో అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది. దీంతో పాకిస్తాన్ 118 పరుగులకే ఆలౌటైంది. చివరికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఆస్ట్రేలియా ఓపెన్స్‌లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఎలెనా రైబాకినా

ఆస్ట్రేలియా ఓపెన్స్ లో ఎలెనా రైబాకినా సత్తా చాటుతోంది. ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రైబాకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో జెలెనా ఒస్టాపెంకోను మట్టి కరిపించింది. ప్రస్తుతం నాలుగో దశకు చేరుకొని అత్యత్తుమ ప్రదర్శన చేస్తోంది.

ముక్కొణపు సిరీస్‌లో అదరగొట్టిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. స్టార్ బ్యాట్ మెన్స్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ భారత్‌ అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో టీమిండియా మహిళల జట్టు 20 ఓవర్లలో 167/5 స్కోరు సాధించింది.

వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహిళలు 20 ఓవర్లలో 167/2 స్కోర్ చేశారు.