క్రీడలు వార్తలు | పేజీ 15

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో భారత్ రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ భారత్ బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక 215 పరుగలకు అలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లు ఫెర్నాండ్ (50), మెండిస్ (32) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్ మెన్స్ విఫలం కావడంతో శ్రీలంక తక్కువ స్కోర్ కే పరిమితమైంది.

స్పానిష్ సూపర్ కప్ ఫైనల్‌కు రియల్ మాడ్రిడ్

స్పానిష్ సూపర్ కప్ ఫైనల్‌కు రియల్ మాడ్రిడ్ చేరుకొని సత్తా చాటింది. వాలెన్సియాను 4-3తో ఓడించడంతో మ్యాచ్ 1-1తో ముగిసింది. అదనపు సమయం తర్వాత మ్యాచ్ 1-1తో టైగా ఉండడంతో కరీమ్ బెంజెమా 39వ నిమిషంలో పెనాల్టీని శామ్యూల్ లినో రద్దు చేశాడు.

12 Jan 2023

శ్రీలంక

వన్డేలోకి అరంగ్రేటం చేసిన శ్రీలంక ఆటగాడు ఫెర్నాండో

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ సువానీడు ఫెర్నాండో తన తొలి అంతర్జాతీయ క్యాప్‌ను అందుకున్నారు. కుడిచేతి వాటం కలిగిన ఈ ఓపెనర్ తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక వెన్నుముక గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఫెర్నాండో రెండో వన్డేలో ఎంపికయ్యాడు.

రంజీ ట్రోఫీలో దుమ్ములేపిన పృథ్వీషాను జాతీయ జట్టులోకి తీసుకోవాలి

రంజీట్రోఫిలో ముంబై తరుపున పృథ్వీ షా 379 పరుగులు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టాడు. పృథ్వీషా బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్నా జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు.

తాలిబన్ల ఎఫెక్టుతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా

యూఏఈలో మార్చిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ నుంచి ఆస్ట్రేలియా తప్పుకుంది. బాలికలు, మహిళల విద్య, ఉపాధిపై తాలిబన్ల ఆంక్షల నేపథ్యంలో సిరీస్ నుంచి వైదొలిగిన ఆసీస్ జట్టు స్పష్టం చేసింది.

అంపైర్‌ని కొట్టిన పాక్ క్రికెటర్..!

కరాచీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాడ్ చేతిలో టెస్టు సిరీస్ ను కూడా పాకిస్తాన్ కోల్పోయింది.

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంపై నవోమి ఒసాకా క్లారిటీ

జపాన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ నవోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 2019, 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నవోమి ఒసాకా నిలిచింది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్ని ప్రారంభం కానున్న నేథప్యంలో ఓసాకా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై నిర్వాహకులను షాక్ గురి చేసింది.

ఆస్ట్రేలియాలో మీడియా హక్కుల వేలం ప్రారంభం

గతేడాది నిలిచిపోయిన మీడియా హక్కుల వేలాన్ని ఆస్ట్రేలియాలో ఐసీసీ పున:ప్రారంభించనుంది. 2022 సెప్టెంబర్‌లో టెండర్ జారీ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను నిలిపివేశారు.

న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచిన నవాజ్, నసీమ్

కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో పాక్ బౌలర్లు కివిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. న్యూజిలాండ్ (49.5) ఓవర్లకు 262 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. స్పిన్నర్లు మహ్మద్ నవాజ్, పేసర్ నసీమ్ షా ఇద్దరు కలిపి ఏడు వికెట్లు తీయడంతో కివీస్ బ్యాటింగ్ కుప్పకూలింది. షా మూడు కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో 41వ హాఫ్ సెంచరీని నమోదు చేశారు.

శ్రీలంక రెండో వన్డేలో పుంజుకునేనా..?

శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఎలాగైనా రెండో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన శ్రీలంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.

పృథ్వీషా ఆల్ టైం రికార్డు

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఆల్ టైం రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరుపున బరిలోకి దిగన పృథ్వీషా (383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్ లతో 379) పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ ఇన్నింగ్స్‌లో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు.

నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన

గౌహతి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన సెంచరీని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 73 సెంచరీలు చేసిన పరుగుల వీరుడు..ఈ క్రమంలో పలు రికార్డులను అధిగమించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత తన సెంచరీపై కోహ్లీ స్పందించాడు.

3-0 తేడాతో మంచెస్టర్ యునైటెడ్ విజయం

కరాబావో కప్ 2022-23, మాంచెస్టర్ యునైటెడ్ క్వార్టర్స్‌లో చార్ల్టన్‌ను అధిగమించింది. 2022-23 కారబావో కప్ లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. చార్ట్లన్ అథ్లెటిక్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్స్ లో మంచెస్టర్ యునైటెడ్ అర్హత సాధించింది.

ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం.. సౌరబ్ గంగూలీ క్లారిటీ

భారత్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి 12 నెలలు పట్టచ్చు. అయితే మెగా ఐపీఎల్ టోర్నికి రిషబ్‌పంత్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా టెస్టు జట్టులో టాడ్ మర్ఫీకి చోటు

వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇండియాతో నాలుగు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆడనున్న ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన టీమ్ ను ప్రకటించింది. ఇందులో స్పిన్నర్లకు అవకాశం కల్పించింది.

దటీజ్ రోహిత్ శర్మ.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్న కెప్టెన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి క్రీడాస్ఫూర్తిని చాటుకొని అందరి మనసులను గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 'మన్కడింగ్ రనౌట్' కు భారత బౌలర్ షమీ ప్రయత్నించగా.. వెంటనే కెప్టెన్ రోహిత్ నిరాకరించాడు. షమీచేత అప్పిల్ ను వెనక్కు తీసుకునేలా చేసి శబాష్ అనిపించుకున్నాడు.

భారత ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్

శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేలో ఏ బౌలర్‌కు సాధ్యంకాని రికార్డును ఉమ్రాన్ మాలిక్ క్రియేట్ చేశారు. వన్డేలో అత్యంత వేగవంతమైన భారత్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఏకంగా 156కి.మీ వేగంతో బంతిని విసిరి ఈ ఘనతను సాధించాడు.

దసున్ శనక సెంచరీ వృథా

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేసింది.

రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు

గౌహతిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. శుభ్ మన్ గిల్ తో కలిసి మొదటి వికెట్ కు 143 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓపెనర్ గా వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడోస్థానంలో నిలిచాడు.

ప్రపంచ కప్‌లో జార్జియా వేర్‌హామ్‌కు అవకాశం

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ జట్టులో జార్జియా వేరేహామ్ కు చోటు లభించింది. గతంలో గాయం భారీన పడిన ఈ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే.

10 Jan 2023

శ్రీలంక

వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం

శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక భారత్ తో జరిగిన వన్డేలో శ్రీలంక తరుపున అరంగ్రేటం చేశారు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ తన T20I కెరీర్‌లో మంచి ప్రారంభాన్ని ప్రారంభించాడు.

టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం

టీమిండియా యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రాను ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు బుమ్రా తప్పుకున్నాడు. ఈ పేసర్‌కు మరో మూడు వారాల విశ్రాంతి పొడిగించినట్లు సమాచారం.

సూర్యకుమార్ పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే కష్టమే: పాక్ మాజీ కెప్టెన్

సూర్యకుమార్ యాదవ్ లేటు ఎంట్రీ ఇచ్చినా టీమిండియా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్ మెన్స్ కొనసాగుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.

ఫుట్‌బాల్‌కు ప్రముఖ ప్లేయర్ వీడ్కోలు

వేల్స్ కు చెందిన అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకరైన గారెత్ బేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించారు.

జనవరి 13న హాకీ ప్రపంచ కప్

పురుషుల హాకీ ప్రపంచ కప్ 15వ ఎడిషన్ జనవరి 13-29 వరకు ఇండియాలో జరగనుంది. ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చివరిసారిగా 1975లో భారత్ ట్రోఫిని గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ నుంచి భారత జట్టులో అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.

పాకిస్తాన్‌కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ అజేయంగా 77 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మళ్లీ పునరాగమనం చేసిన స్టీవనేజ్

FA కప్ 2022-23 మూడవ రౌండ్‌లో ఆస్టన్ విల్లాను తొలగించేందుకు స్టీవనేజ్ తిరిగి పునరాగమనం చేశాడు. మోర్గాన్ సాన్సన్ విల్లాకు 33వ నిమిషంలో ఆధిక్యాన్ని అందించి సత్తా చాటాడు. స్టీవెనేజ్ అదృష్టవశాత్తూ పెనాల్టీని పొందడంతో క్యాంప్‌బెల్ 90వ నిమిషంలో జామీ రీడ్ ఈక్వలైజర్‌ను సాధించాడు.

రిషబ్ పంత్ కి ఫుల్ సాలరీ ఇస్తూ ప్రకటన

రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. తాజాగా పంత్ విషయంలో బీసీసీఐ పెద్ద మనసు చాటుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వీడ్కోలు

సౌతాఫ్రికా ఆటగాడు ఆల్ రౌండర్ డ్వైన్ పెట్రోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై టీ20 ఫార్మాట్ పైనే దృష్టి సారిస్తానని పెట్రోరియస్ ప్రకటించాడు. ఇది తన కెరియర్లో అత్యంత కఠిన నిర్ణయమని పెట్రోరియస్ చెప్పారు.

వన్డే సిరీస్ ముందే టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం

శ్రీలంకతో టీ20 సిరీస్ సాధించి, మంచి ఫామ్ లో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా అనివార్య కారణాలతో ఈ సిరీస్ దూరమయ్యాడు. బూమ్రా రీఎంట్రీ విషయంలో బిసీసీఐ యూటర్న్ తీసుకుంది. భవిష్యత్ టోర్నిల నేపథ్యంలో బుమ్రాను పక్కకు పెట్టినట్లు సమాచారం. గాయం కారణంగా సీనియర్ పేసర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే.

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కన్నుమూత

మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంఫియన్ షిప్ విక్టోరియా లీ మరణవార్త యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. హవాయ్‌లో పుట్టిన ఈ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

నాలుగో స్థానంలో సూర్యానా.. అయ్యారా..?

2023 వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీమిండియా ప్లేయర్ల ఎంపిక ప్రస్తుతం బీసీసీఐకి పెను సవాల్‌గా మారింది. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటోంది.

భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే

శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి ఈ ఏడాదిని టీమిండియా ఘనంగా బోణి కొట్టింది. రేపటి నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ను గౌహతి వేదికగా ఆడనుంది. టీ20 సిరీస్ కు రెస్టు తీసుకున్న సీనియర్ ప్లేయర్లు రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో టీమిండియా మరింత పటిష్టంగా తయారైంది.

శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో అదే ఫామ్ కొనసాగేనా..!

భారత్, శ్రీలంక మధ్య జనవరి 10న గౌహతిలో తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

చెల్సియాను 4-0తో ఓడించిన మాంచెస్టర్ సిటీ

FA కప్ 2022-23 సీజన్‌లో చెల్సియాను 4-0తో మాంచెస్టర్ సిటీ ఓడించి 4వ రౌండ్‌కు అర్హత సాధించింది. మాంచెస్టర్ సిటీలో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి లభించినప్పటికీ చెల్సియా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

రికార్డు బద్దలు కొట్టిన కోకో గౌఫ్

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ASB క్లాసిక్ టైటిల్‌ను అమెరికా స్టార్ కోకో గౌఫ్ సాధించింది. ఫైనల్లో 6-1, 6-1 తేడాతో స్పానిస్ క్వాలిఫైయర్ రెబికా మసరోవాను ఓడించి రికార్డు బద్దలు కొట్టింది.

టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ

న్యూజిలాండ్ లో జరుగుతన్న టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ సెంచరీ చేశారు. టెస్టులో తిరిగి వచ్చాక సర్ఫరాజ్ 4 సెంచరీలు చేసాడు. ఐదో వికెట్ కు సౌద్ షకీల్ తో కలిసి 123 పరుగులు జోడించారు.

బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. బీసీసీఐ కార్యదర్శ జై షా పై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు తెలియకుండా ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.