క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
06 Jan 2023
ఫుట్ బాల్చెల్సియాపై మంచెస్టర్ సిటీ విజయం
ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్‌తో చెల్సియాను 1-0తో మాంచెస్టర్ సిటీ ఓడించింది. 63వ నిమిషంలో రియాద్ మహ్రెజ్ సిటీ తరఫున గోల్ చేశాడు. మొదటి అర్ధభాగంలో చెల్సియా జట్టు గాయాల కారణంగా రహీం స్టెర్లింగ్, క్రిస్టియన్ పులిసిక్ ఇద్దరినీ కోల్పోయింది. ప్రస్తుతం సిటీ రెండో స్థానంలో, చెల్సియా 10వ స్థానంలో ఉంది.
06 Jan 2023
క్రికెట్సెలక్షన్ కమిటీని తొలగించిన DDCA చీఫ్
సీనియర్ రాష్ట్ర సెలక్షన్ కమిటీని ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తొలగించారు. ప్యానల్‌లో అంతర్గత పోరు, ఎంపికల కారణంగా తప్పించినట్లు సమాచారం. సెలక్షన్ కమిటీ తన విధులను నిర్వర్తిస్తున్న తీరుపై గతంలో జైట్లీ ప్రశ్నించారు.
06 Jan 2023
క్రికెట్అర్ష్దీప్పై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ అర్ష్ దీప్ నోబాల్స్ పై టీమిండియా మాజీ ప్లేయర్ గవాస్కర్ సీరియస్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్షదీప్ 5 నోబాల్స్ వేసి ఓ చెత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే.
06 Jan 2023
భారత జట్టుటీ20 సిరీస్‌పై భారత్ కన్ను
పూణేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. శ్రీలంక 16 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టన్ షనక 56 పరుగులు చేసి శ్రీలంక విజయంలో భాగస్వామ్యం అయ్యాడు.
06 Jan 2023
టెన్నిస్స్వియాటెక్ పై జెస్సికా పెగులా విజయం
ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ పై 6-2, 6-2 తేడాతో జెస్సిగా పెగులా విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓపెనింగ్ సింగిల్స్ రబ్బర్‌లో జెస్సిగా పెగులా యూనైటెడ్ స్టేట్ కు మంచి అరంభాన్ని అందించింది.
06 Jan 2023
క్రికెట్10 బంతుల్లో 5 నో బాల్స్.. అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పేసర్ అర్షదీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. కేవలం 10 బంతుల్లో 5 నోబాల్స్ వేశాడు. దీంతో ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక నోబాల్స్ వేసిన భారత్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
06 Jan 2023
క్రికెట్అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా
పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత పోరాటం చేసింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ (31బంతుల్లో 65; 3ఫోర్లు, 6 సిక్సర్లు) కొట్టి అందరి మనసులను దోచుకున్నారు. శ్రీలంక కెప్టెన్ షనక, అక్షర్‌ను ఛాతిపై తట్టి అభినందించాడు.
05 Jan 2023
ఫుట్ బాల్మాంచెస్టర్ సిటీతో జియో కీలక ఒప్పందం
మాంచెస్టర్ సిటీ జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ (JIO)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ సేవల బ్రాండ్ క్లబ్ అధికారిక మొబైల్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ భాగస్వామిగా జియో అవతరించనుంది.
05 Jan 2023
సూర్యకుమార్ యాదవ్నంబర్వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
శ్రీలకంతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 10 బంతుల్లో 7 పరుగులు చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాకింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ 10 స్థానాలను మెరుగుపరుచుకొని 23 స్థానానికి, దీపక్ హుడా 97వ స్థానానికి చేరుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో హార్ధిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.
05 Jan 2023
టెన్నిస్క్వెంటిన్ హాలీస్‌ను ఓడించిన నోవాక్ జొకోవిచ్
అడిలైడ్‌లో క్వెంటిన్ హాలీస్‌ను నోవాక్ జొకోవిచ్ ఓడించి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గురువారం హాలీస్‌ను 7-6(3), 7-6(5)తో పోరాడి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు నోవాక్ జొకోవిచ్.. 57 నిమిషాలు పాటు ఇద్దరు హోరాహోరీగా పోరాడాడు. భీకర ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ అద్భుతమైన షాట్లతో హాలీస్‌ను గెలుపొందాడు.
05 Jan 2023
క్రికెట్టీ20 సిరీస్‌పై టీమిండియా గురి
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అతి కష్టం మీద మ్యాచ్ ను గెలిచింది. నేడు సాయంత్రం పుణేలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి సిరీస్ సాధించాలని భావిస్తోంది టీమిండియా.
05 Jan 2023
ఆస్ట్రేలియాటెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత రికార్డు
ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ టెస్టు మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిడ్ హెడ్ హఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. మొత్తం టెస్టులో 12 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. కేవలం 59 బంతుల్లో 70 పరుగులు చేశారు. ఎప్పటిలాగే హెడ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 450 పరుగులను పూర్తి చేసింది.
05 Jan 2023
క్రికెట్శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ
ఇంగ్లండ్ యువ క్రికెటర్ శామ్ కర్రన్ ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శామ్ కర్రన్ కు ఎయిర్ లైన్ సంస్థ క్షమాపణలు కోరుతూ ట్విట్ చేసింది. బుధవారం బ్రిటిష్ విమానయాన సంస్థ అయిన వర్జిన్ అట్లాంటిక్ లో ప్రయాణించడానికి శామ్ కర్రన్ అసౌకర్యంగా భావించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా పోస్టు చేశాడు.
05 Jan 2023
క్రికెట్గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ
టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్‌కి దురదృష్టం వెంటాడుతోంది. మంగళవారం వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూకి గాయమైంది. అతని స్థానంలో ఐపీఎల్‌లో అకట్టుకున్న జితేష్ శర్మ టీ20లో అరంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం బీసీసీఐ ధ్రువీకరించింది.
05 Jan 2023
క్రికెట్టీమిండియాలో చోటు దక్కాలంటే యోయో, డెస్కా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే..
టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కొన్ని నెలలుగా చాలా అనుమానాలున్నాయి. గాయాలు కారణంగా బరిలోకి దిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే అందరికీ యోయో పరీక్షలంటే తెలుసు. దీనికి తోడు డెక్సా స్కాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
05 Jan 2023
క్రికెట్డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది
డెత్ ఓవర్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే హర్షల్ పటేల్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా టీమిండియాకి కీ బౌలర్‌గా మారాడు. స్లో బాల్స్‌తో బ్యాటర్‌ను పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టడం హర్షల్ పటేల్ స్పెషాలిటీ. శ్రీలంకతో జరిగిన టీ20లో రెండు వికెట్లు తీసినప్పటికీ, 41 పరుగులు ఇచ్చాడు.
04 Jan 2023
క్రికెట్150కిలోమీటర్ల వేగంతో వెన్నులో వణుకు పుట్టించిన ఉమ్రాన్ మాలిక్
భారత్ యువ ఫాస్ట్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ త ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. బ్యాట్స్ మెన్స్ కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. కాశ్మీర్ కు చెందిన ఈ బౌలర్ ప్రస్తుతం భారత్ తరుపున ఫాస్టెస్ట్ బాల్ వేసి రికార్డు బద్దలు కొట్టాడు.
04 Jan 2023
రిషబ్ పంత్రిషబ్ పంత్ కోసం ప్రత్యేక విమానం.. ముంబైకి తరలింపు
రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ కు వెళ్తుండుగా.. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.
04 Jan 2023
క్రికెట్సూపర్ బౌలింగ్.. అక్షర పటేల్ : సాబా కరీమ్
శ్రీలంకతో జరిగిన టీ20 లో చివరి ఓవర్లో అక్షర్ పటేల్ అధ్బుతంగా బౌలింగ్ చేసి.. భారత్ కు విజయాన్ని అందించాడు. జోరుమీదున్న చమికకు షాట్ ఆడే అవకాశం ఇవ్వకుండా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బంతులు వేసి జట్టును గట్టెక్కించాడు.
04 Jan 2023
ఆస్ట్రేలియా4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. టెస్టులో 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
04 Jan 2023
ఫుట్ బాల్భారీ ఆఫర్లను తిరస్కరించి.. చివరకి మెగా డీల్ పట్టిన రొనాల్డ్
ప్రపంచకప్ నుంచి కన్నీటితో నిష్క్రమించిన సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి క్రేజ్ కొంచె కూడా తగ్గలేదు. ప్రస్తుతం సౌది అరేబియాకు చెందిన అల్-నాసర్ జట్టు క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ చూసి పిచ్చెక్కిపోయింది.
04 Jan 2023
ప్రపంచంవిజయంతో పీలేకు నివాళి
ఫుట్‌బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ తన ఆట వల్ల ఫుట్‌బాల్ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినవాడు మాత్రం పీలే ఒక్కడే.. మంగళవారం స్పానిష్ కప్ రోడ్రిగ్ ఒక గోల్ చేసి, కాసెరెనోపై 1-0 తేడాతో విజయం సాధించారు. ఈ విజయాన్ని పీలేకు అంకితం చేస్తున్నట్లు రోడ్రిగో ప్రకటించారు.
04 Jan 2023
క్రికెట్హడలెత్తించిన మావి.. భారత్ థ్రిలింగ్ విన్
కొత్త ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20లో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు రాణించారు. డెబ్యూ బౌలర్ శివమ్‌మావి లంక బ్యాటర్లకు చుక్కులు చూపించాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠను రేపింది.
03 Jan 2023
పాకిస్థాన్స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ సెలక్టర్‌గా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చి రాగానే జాతీయ జట్టులో పెను మార్పులను ఆఫ్రిది చేయాలని నిర్ణయించుకున్నాడు.
03 Jan 2023
ఐపీఎల్దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ
భారత్ క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ విరమణ పొందారు. మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌గా వస్తున్నట్లు సమాచారం. 2019 సీజన్‌లో గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ అడ్వైజర్‌గా పనిచేశాడు. అదే ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాక డీసీ అడ్వైజర్ పదవికి గంగూలీ రాజీనామా చేశారు.
03 Jan 2023
జస్పిత్ బుమ్రాBumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు
యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రా టీం ఇండియా జట్టులోకి వచ్చేశాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. నాలుగు నెలలుగా టీం ఇండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. మళ్లీ జట్టులోకి తిరిగి రావడంతో టీం ఇండియా బౌలింగ్ లో బలపడింది.
03 Jan 2023
క్రికెట్80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్
భారత్ లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రంజీ టోర్నిలో సంచలన రికార్డును నమోదు చేశారు. ఏ బౌలర్ కి 80 ఏళ్లుగా సాధ్యం కానీ.. రికార్డును నేటితో బద్దలు కొట్టాడు. గతేడాది దేశవాళీ క్రికెట్లో చక్కటి బౌలింగ్ తో అకట్టుకొని 12 ఏళ్ల తరువాత భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో ఎంపికై రెండు మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
03 Jan 2023
టెన్నిస్ఆస్ట్రేలియాకు రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్‌లోనే జకోవిచ్ అద్భుత విజయం
ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో నోవాక్ జొకోవిచ్ విజయంతో టోర్నిని ప్రారంభించాడు. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.
03 Jan 2023
భారత జట్టుటీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేటి నుండి జరిగే శ్రీలంక సిరీస్ టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరిస్తారో లేదో వేచి చూడాలి.
03 Jan 2023
టెన్నిస్టెన్నిస్ దిగ్గజం మార్టినాకు మరోసారి క్యాన్సర్ ఎటాక్
టెన్నిస్ స్టార్ మార్టినా నవత్రిలోవా మళ్లీ కేన్సర్ బారినపడ్డారు. దీంతో అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేన్సర్ తో పోరాడుతున్నానని టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా సోమవారం వెల్లడించారు.
03 Jan 2023
భారత జట్టురాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్..?
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ స్థానంలో ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.
03 Jan 2023
భారత జట్టు'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా
భారత టీ20 కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్ధిక్ పాండ్యా మీద ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ముంబై వేదికగా నేడు శ్రీలంకతో తలపడేందుకు హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది.
03 Jan 2023
క్రికెట్బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లపై క్లారిటీ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహాసంగ్రామానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. 2024-2025 సీజన్‌కు సంబంధించి 43 మ్యాచ్‌లు వరకూ తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
02 Jan 2023
రోహిత్ శర్మ'టీమిండియా ఓపెనర్‌గా అతనే దమ్మునోడు' : గంభీర్
టీమిండియా ఓపెనర్‌గా యువ ప్లేయర్ ఇషాన్ కిషనే దమ్మున ప్లేయర్ అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు సన్నదమవుతున్న టీమిండియా.. ఇషాన్ కిషన్‌నే తమ ప్రధాన ఓపెనర్‌గా ఎంచుకోవాలి. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీ చేసి విమర్శకుల నోర్లకు ఇషాన్ మూయించాడని పేర్కొన్నారు.
02 Jan 2023
క్రికెట్ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..?
2022లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన రోహిత్ సేన.. యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. ఈ ఏడాది ఆరంభంలో సొంత గడ్డ మీద శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. టెస్టు ర్యాకింగ్‌లో రెండోస్థానంలో ఉంది.
02 Jan 2023
క్రికెట్హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేస్తారా.. ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..!
2022లో టీమిండియా అశించిన విజయాలు సాధించకపోవడంతో సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం చెందడంతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టింది. వయస్సు మీద పడుతున్న రోహిత్‌శర్మను తప్పించి కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ నిమగ్నమైంది.
02 Jan 2023
రిషబ్ పంత్'థాంక్ గాడ్.. పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు' : కపిల్
నూతన ఏడాది కుటుంబ సభ్యులకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు.
02 Jan 2023
ఆస్ట్రేలియాసరిగ్గా ఇదే రోజు.. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ అరంగ్రేటం
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన స్పిన్ మాయజాలంలో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కులు చూపించిన లెజెండ్.. తన 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 1992 సరిగ్గా ఇదే రోజున షేన్ వార్న్ భారత్- ఆస్ట్రేలియా తరపున భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.
02 Jan 2023
టెన్నిస్నాదల్ రికార్డులపై జకోవిచ్ గురి..!
ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడేందుకు నోవాక్ జొకోవిచ్‌కు అవకాశం దక్కింది. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.
02 Jan 2023
బంగ్లాదేశ్బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీ20 కెప్టెన్‌గా నియమతులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భవిష్యత్తు క్రికెట్‌పై నూరుల్ మదనపడుతున్నాడు. దీనికి కారణం తన చూపుడువేలుకు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాకపోవడం.