వ్యాపారం: వార్తలు

ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన మరో కంపెనీ, 3,900 ఉద్యోగులను తొలగించనున్న IBM

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM)కూడా ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాల జాబితాలో చేరింది. 3,900 మంది సిబ్బందిని అంటే ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 1.5% మందిని తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ తొలగింపులు asset divestmentలో అంటే కొన్ని రంగాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయడంలో భాగమని అంతేకాని పనితీరు అంచనాల ఆధారంగా కాదని సృష్టం చేసింది.

అలస్కాలో కొత్త తరహా బిజినెస్: కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేక బస్

కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన బస్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇంటింటికి వచ్చి కుక్కపిల్లలను బస్ లో తీసుకెళ్ళి, ఒక ప్రదేశంలో స్వేఛ్ఛగా వదిలేసి, టైమ్ కాగానే మళ్ళీ ఇంటి దగ్గర దింపి వెళ్లే బస్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపొతారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు

మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ Spotify మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం 6% సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.

భారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్

డెలివరీలను వేగవంతం చేసే ప్రయత్నంలో అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఎయిర్ అని ప్రత్యేక ఎయిర్ కార్గో ఫ్లీట్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం తొలుత బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుంది.

23 Jan 2023

సంస్థ

ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో పనితీరు బాగోలేదంటూ 452 మందిని ఇంటికి పంపిన విప్రో సంస్థ

భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కార్పొరేట్ పేలవమైన పనితీరును పేర్కొంటూ 452 మంది కొత్త ఉద్యోగులను తొలగించింది. ఇటీవల జరిపిన ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో తక్కువ స్కోర్లు ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నట్లు విప్రో తెలియజేసింది. మొదట విప్రో 800 మందిని తొలగించాలని అనుకున్నా, ఇప్పుడు తొలగించిన ఉద్యోగుల సంఖ్య అంతకంటే తక్కువే అని బిజినెస్ టుడే పేర్కొంది.

భారతదేశంలో విడుదలైన 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS

హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన హ్యుందాయ్‌ గ్రాండ్ i10 NIOS భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా మారింది.

వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చంట్‌తో గురువారం నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని వర్లీలోని యాంటిలియాలోని అంబానీల ప్రైవేట్ నివాసంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు వ్యాపార, రాజకీయ, సినిమా రంగానికి చెందినవారు అతిధులుగా హాజరయ్యరు.

టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్

టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఓడరేవుల నుండి ఇంధనం వరకు వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు మీడియా కంపెనీని కూడా కొనుగోలు చేసారు. కానీ టెలికాం రంగానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.

రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది

2023లో భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాభాల్లోకి వెళ్ళేటట్లు కనిపిస్తోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా.

415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు

FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు.

18 Jan 2023

గూగుల్

సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్

UPI చెల్లింపులు ఎక్కువగా చేసేది భారతీయులే. ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం ఒక్కోసారి వ్యాపారులకు కష్టంగా మారుతుంది. సౌండ్‌బాక్స్, వాయిస్ అలర్ట్ ద్వారా పూర్తయిన చెల్లింపు గురించి వ్యాపారులకు తెలియజేసే ఈ డివైజ్ లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం

భారతి ఎయిర్‌టెల్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ఐదు ప్రధాన నగరాల్లో 5G ప్లస్‌ను ప్రారంభించింది. ఈ కవరేజీని వినియోగదారుల నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ 5G కనెక్టివిటీ సేవను అందిస్తుంది ఎయిర్ టెల్. ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే వ్యక్తులు 5G ప్లస్‌లో 20-30 రెట్లు వేగాన్నివినియోగదారులు చూస్తారు.

టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు

100 మంది ఉద్యోగులను తొలగించిన ఒక నెల తర్వాత, స్వదేశీ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇప్పుడు 20% మంది ఉద్యోగులను తొలగించింది. ఈ స్టార్టప్ తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత

అమెజాన్ మరోమారు ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఈ నెలలో భారతదేశంలోని సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి ఉద్యోగి తెలిపారు.

13 Jan 2023

ఆదాయం

పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ

బెంగుళూరుకు చెందిన రైడ్-షేరింగ్ కంపెనీ ఓలా ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీ కొన్ని విభాగాల నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సిబ్బంది సంఖ్యను ఓలా ఇంకా నిర్ధారించలేదు.

13 Jan 2023

అమ్మకం

మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 12.68% పెరిగి డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,586 కోట్లు వచ్చాయి. కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో రూ.39,087 కోట్లు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 39,087 కోట్లు, ఇందులో రూ. 38,318 కోట్ల నికర అమ్మకాలు, రూ. 769 కోట్లు ఇతర ఆదాయాల ద్వారా వచ్చాయి.

11 Jan 2023

ప్రపంచం

ఫిబ్రవరి 1 నుండి యూట్యూబ్ Shorts క్రియేటర్లకు కూడా ఆదాయం

గత సెప్టెంబరులో, Shorts కోసం మానిటైజేషన్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని YouTube హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి, యూట్యూబ్ Shorts క్రియేటర్లు తమ కంటెంట్ పై రాబడిని పొందగలరు. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) అప్డేట్ లో భాగంగా ఈ మార్పును ప్రవేశపెట్టింది యూట్యూబ్.

10 Jan 2023

జియో

రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో

రిలయన్స్ జియో కొత్త '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ. 61కు అందిస్తుంది. ఈ కొత్త ప్యాక్ 6GB హై-స్పీడ్ 4G డేటాను అందించడంతో పాటు అర్హత ఉన్న వినియోగదారులకు అంటే జియో 5G సేవకు సపోర్ట్ చేసే ఫోన్ తో పాటు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడినట్లయితే అపరిమిత 5G డేటా యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో

ఎయిర్ టెల్, జియో 2022లో తమ 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. మొదట, 5G నెట్‌వర్క్ ఎంపిక చేసిన నగరాలకు మాత్రమే పరిమితం చేసాయి. ప్రస్తుతానికి, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రెండూ సంస్థలు తమ 5G నెట్‌వర్క్ కవరేజీని విస్తరిస్తున్నాయి.

09 Jan 2023

ఆపిల్

భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ

భారతదేశంలో Apple ఫిజికల్ రిటైల్ దుకాణాలు గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు, కానీ ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం నియామకం ప్రారంభించింది. కొంతమంది లింక్డ్‌ఇన్‌లో తమ నియామకాన్ని అధికారికంగా ధృవీకరించారు.

డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల

2022 డిసెంబర్ లో 15 శాతం వృద్ధిని నమోదు చేసి భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకులు దాదాపు 129 లక్షలకు చేరుకున్నారు.

కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఈరోజే విడుదల చేసింది. Poco C50 పెద్ద 6.5-అంగుళాల డిస్ప్లేతో, 5000mAh బ్యాటరీ, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఫోన్‌లను విడుదల చేయడం లేదు. భారతదేశంలో రూ. 10,000 లోపు ఉన్న ఫోన్‌ను పొందడం కొనుగోలుదారులకు కష్టమవుతోంది. అయితే, Poco C50తో ఇప్పుడు పరిస్థితి మారబోతుంది.

ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!

సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

03 Jan 2023

ఆపిల్

చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్

ఆపిల్ చౌకైన ఎయిర్‌పాడ్స్ ఇయర్‌బడ్‌లపై పనిచేస్తోంది, వాటినే "AirPods Lite" అంటారు. AirPods డిమాండ్ 2022లో 73 మిలియన్ యూనిట్ల నుండి 2023లో 63 మిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కంపెనీ సరసమైన ఇయర్‌బడ్‌లపై పని చేస్తోందని విశ్లేషకులు సృష్టం చేసారు.

'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?

గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.

సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.

భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు

కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం.

డిసెంబర్ లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు: తగ్గింపులే కారణం

భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల (PVS) రిటైల్ విక్రయాలు డిసెంబరులో రికార్డును తాకనున్నాయి. సంవత్సరాంతపు తగ్గింపులు వలన భారీగా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైలింగ్ భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో 400,000 మార్కును తాకే అవకాశం ఉంది.

2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం

ఉక్రెయిన్ యుద్ధం, బలమైన డాలర్, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రూడ్ దిగుమతిదారు చైనా నుండి డిమాండ్ తగ్గడం వలన చమురు ధరలు శుక్రవారం పెరిగాయి.

టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం

కంపెనీలోని షార్ట్ సెల్లర్లు-లేదా ఒక ఆస్తి ధర పడిపోయినప్పుడు లాభపడే బేరిష్ పెట్టుబడిదారులు దాదాపు $17 బిలియన్ల మార్కెట్ లాభాలను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. S3 పార్టనర్స్ డేటా ప్రకారం టెస్లా సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన స్వల్ప వాణిజ్యంగా మారింది.

2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థాయికి ఎదిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ టెన్‌లో ఈ ఏడాది తన సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తి కూడా అదానీ మాత్రమే.

వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి.

అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్న రవాణా శాఖ

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డీలర్ ప్రామాణికతను గుర్తించడానికి రిజిస్టర్డ్ వాహనాల డీలర్‌ల కోసం అధికార ధృవీకరణ పత్రాలను ప్రవేశపెట్టింది. ఈ చర్య వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.

ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ లో అగ్ర స్థానంలో నిల్చిన అర్బన్ కంపెనీ

భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావంతో, గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. అయినా సరే, వీరికి ఇప్పటికీ సరైన వేతనం, మిగిలిన సౌకర్యాలు అందడంలేదని తెలుస్తుంది.

2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం

సాధారణంగా కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఒక కంపెనీ మరొక దానిని స్వాధీనం చేసుకుంటుంది. కొనుగోలు చేసిన కంపెనీ దాని పేరు, బ్రాండ్ విలువ సిబ్బందిని ఉంచుకోవచ్చు లేదా ఉంచకపోవచ్చు.

2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా?

వచ్చే ఏడాది US జాబ్ మార్కెట్ బలహీనంగా కొనసాగితే, కంపెనీలు రిమోట్‌గా పని చేయడానికి ఉద్యోగులను అనుమతించకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగులు సాధారణంగా ఇంటి నుండి పని చేయడంపై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో ఇంటి నుండి పనిచేస్తూ ఎంతో సమయాన్ని ఆదా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెప్తే, మరికొందరు కంపెనీ సంస్కృతి కార్యాలయంలో సరైన విధంగా ఉంటుందని చెప్పారు.

రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం

దేశీయ స్టాక్‌లు శుక్రవారం వరుసగా నాల్గవరోజు పడిపోయాయి, BSE సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పడిపోయింది. NSE నిఫ్టీ మార్క్ 18,000 దిగువకు జారింది.

3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌

జియో అనుబంధ సంస్థ ముంబై రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ మొబైల్ టవర్, ఫైబర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్‌బిఐ ఎస్క్రో ఖాతాలో రూ. 3,720 కోట్లు జమ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నవంబర్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలుపై జియోకు ఆమోదం తెలిపింది.

మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా?

2022 క్రిప్టో కరెన్సీకు పెద్దగా కలిసిరాలేదు, కాకపోతే క్రిప్టో చరిత్రలో నిలిచిపోయే LUNA క్రాష్, FTX పతనం పాటు మార్కెట్లో అనేక ఇతర నష్టాలు సంభవించాయి. అయితే సరైన నిర్ణయాలతో లాభం పొందే అవకాశాలు ఇంకా ఉన్నాయి.

PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు

ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తూ, పీఎఫ్‌ జీతంలో కట్ అవుతున్నవారికి ఇది శుభవార్త.

మునుపటి
తరువాత