వ్యాపారం: వార్తలు

ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం

ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.

27 Feb 2023

ప్రకటన

అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్

కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.

24 Feb 2023

ప్రకటన

జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.

24 Feb 2023

సంస్థ

BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత

Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది.

23 Feb 2023

ఆదాయం

2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం

గ్లోబల్ డిమాండ్‌ దెబ్బతినడం ప్రారంభమయ్యాక కఠినమైన ద్రవ్య విధానం కారణంగా ఏప్రిల్ 1, 2023 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ ఆర్థిక నివేదికలో 2022లో ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోయిందని, 2023లో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, వాణిజ్య విలువ మరింత తగ్గుతుందని పేర్కొంది.

22 Feb 2023

ఆదాయం

వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్

జూన్-డిసెంబర్ 2022 మధ్య UK లో 61 కంపెనీలు పాల్గొన్న నాలుగు రోజుల వర్క్‌వీక్ ట్రయల్ లో,తగ్గిన గంటలతో చాలా సంస్థలు సంతృప్తికరంమైన ఫలితాలను అందుకున్నాయని తేలింది.

2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన దిగ్గజ కంపెనీ 'మెకిన్సీ'

మరో అంతర్జాతీయ సంస్థ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. దిగ్గజ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే & కో తన కంపెనీలోని దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ తొలగింపు జాబితాలో క్లయింట్లతో ప్రత్యేక్షంగా సంబంధం లేని వారు మాత్రమే ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

22 Feb 2023

ఆదాయం

#NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు

కొంతమందికి 2022 పెద్దగా కలిసిరాలేదు, అత్యంత ధనవంతులు 2022లో తమ స్థానాన్ని కొనసాగించలేకపోయారు. స్థానాన్ని కోల్పోయిన కొంతమంది బిలియనీర్లను చూద్దాం.

21 Feb 2023

ఆదాయం

IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్త అభివృద్దిలో 50% సహకారం అందించేది భారతదేశం, చైనా.

వ్యాపారం: బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ నమ్మకాలను వదిలిపెట్టండి

ఉద్యోగం చేసే చాలామంది బిజినెస్ మెన్లని చూసి అసూయ పడుతుంటారు. తాము కూడా బిజినెస్ మెన్లు గా ఎదగాలని అనుకుంటారు. కానీ బిజినెస్ మెన్ల గురించి జనాల్లో ఉండే అపోహల వల్ల వాళ్ళు బిజినెస్ వైపు రాలేకపోతారు. ఆ అపోహలేంటో చూద్దాం.

సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI

ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

అమెరికా ప్రెసిడెంట్ బిడ్‌ కు సిద్దపడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. ప్రెసిడెంట్ రేసులో భారత సంతతికి చెందిన కొందరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారిలో మిలియనీర్ వివేక్ రామస్వామి ఒకరు.

16 Feb 2023

ఆదాయం

భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి

భారతదేశంలో 2022 సంవత్సరంలో 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభం అయ్యాయి, మొత్తం టెక్ స్టార్టప్‌ల సంఖ్య 25,000-27,000కి చేరుకుందని Nasscom and Zinnov కొత్త నివేదిక పేర్కొంది.

మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse

స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.

జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం

ఆల్-ఇండియా హోల్ సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా దేశ వార్షిక ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2022లో నమోదైన 4.95% నుండి జనవరి 2023 (జనవరి 2022 కంటే) నెలలో 24 నెలల కనిష్ట స్థాయి 4.73%కి తగ్గింది, తాత్కాలిక డేటా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం షేర్ చేసింది.

14 Feb 2023

మెటా

ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్

మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్, 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది చివర్లో కంపెనీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలలుగా కంపెనీ నుండి వైదొలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆమె కూడా ఒకరు.

అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్

అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లో అందించే వివిధ రకాల ఉత్పత్తులు అందించే డిస్కౌంట్‌ల కారణంగా కొనుగోలుదారులకు చాలా ఇష్టమైన ఈ-కామర్స్ వేదిక. ఇందులో మిలియన్ల కొద్ది అమ్మేవారు ఉన్నారు. మార్కెట్‌ప్లేస్ పల్స్ అధ్యయనం ఆధారంగా, 2022లో మొదటిసారిగా అమెజాన్ ప్రతి సేల్‌లో కోత 50% దాటింది.

అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.

11 Feb 2023

టాటా

ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్

రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా, టాటా కమ్యూనికేషన్స్ ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారిక ప్రసార పంపిణీ హక్కులు చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది.

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

11 Feb 2023

విమానం

ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా

ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్

ఇండెక్స్ ప్రొవైడర్ MSCI (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) కొన్ని అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్‌ను సమీక్షిస్తామని చెప్పిన తర్వాత అదానీ విల్మార్ మినహా గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.

అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ

స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆకాశాన్నంటుతున్న అప్పులను కూడా నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు, రెగ్యులేటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దేశీయ బ్యాంకులకు మద్దతుగా నిలిచాయి.

ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు

జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ మంగళవారం తన 15% అంటే దాదాపు 1,300 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూమ్ సిఈఓ ఎరిక్ యువాన్ తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తాను బాధ్యత వహిస్తానని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన జీతం 98% తగ్గించడంతో పాటు కార్పొరేట్ బోనస్‌ను వదులుకుంటున్నానని చెప్పారు.

08 Feb 2023

ఆర్ బి ఐ

రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు

గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ బ్రాండ్‌ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు.

ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.

04 Feb 2023

ఆపిల్

రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది.

బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు

వ్యాపార అనుమతులు, లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్ 2023లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు పాన్‌కార్డును సింగిల్ బిజినెస్ ఐడీ కార్డుగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపార అనుమతులు, లావాదేవీలు ఏవైనా పాన్ ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ

డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. స్లీప్ అప్నియా ట్రీట్‌మెంట్ డివైజ్‌లను వెనక్కి రప్పించడంతో కంపెనీ నష్టాల బారిన పడింది. దీని కారణంగా ఫిలిప్స్ తన మార్కెట్ వాల్యుయేషన్‌లో 70% కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థ ప్రకటించిన 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు అదనంగా మరో 6,000 మందిని తొలగించబోతుంది.

30 Jan 2023

ప్రపంచం

యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం

కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్‌ కొనసాగుతారు.

జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్

హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది.

28 Jan 2023

ధర

డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు

ఫిబ్రవరి 1 నుంచి డీటీహెచ్, కేబుల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాల మేరకు ప్రముఖ బ్రాడ్ కాస్టర్లు తమ టీవీ ఛానళ్ల ధరలను భారీగా పెంచనున్నాయి. 30శాతం టారిఫ్ పెరగనుండటంతో టీవీ ఛానళ్లు మరింత ప్రియం కానున్నాయి.

త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT

OpenAI ChatGPTకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో గుబులు పుట్టిస్తుంది. Gmail సృష్టికర్త పాల్ బుచ్‌హీట్ ఈ ChatGPT మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను మించిపోవచ్చని పేర్కొన్నారు. Yellow Pagesకు గూగుల్ ఎలా చెక్ పెట్టిందో అలాగే సెర్చ్ ఇంజన్‌లకు ఈ AI చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

28 Jan 2023

ఆదాయం

వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది.

అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC

అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారం ఒక్క రోజులో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 3.37 లక్షల కోట్లు నష్టపోయాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఐదు అతిపెద్ద అదానీ గ్రూప్ కంపెనీలలో ఏకైక అతిపెద్ద నాన్-ప్రమోటర్ దేశీయ వాటాదారైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC). అదానీ గ్రూప్ కంపెనీలలో తన హోల్డింగ్స్ విలువ క్షీణించిన కారణంగా రూ.16,627 కోట్లు కోల్పోయింది.

28 Jan 2023

గూగుల్

ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన

ఈ నెల ప్రారంభంలో, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో సిబ్బందిని తొలగించిన కంపెనీల లిస్ట్ లో గూగుల్ చేరింది. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. ఇది బాధిత ఉద్యోగుల నుండి వ్యతిరేకతకు దారితీసింది.

ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు

జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP కూడా ఉద్యోగులను తొలగించే టెక్ కంపెనీల లిస్ట్ లో చేరింది. సంస్థ 3,000 మందిని అంటే ప్రపంచవ్యాప్తంగా 2.5%మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.

హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ

అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించడంతో ఇప్పుడు అదానీ గ్రూప్ దానిపై చట్టపరమైన చర్యల తీసుకోవడానికి సిద్దమైంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, బుధవారం మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. రూ.85,761 కోట్లు కోల్పోయాయి.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఒక రోజులో సుమారు $6 బిలియన్లను ఆ సంస్థ కోల్పోయింది.