ఆదాయం: వార్తలు

అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల

అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (GDP) 4.4 శాతం వృద్ధి చెందిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2022-23లో GDP వృద్ధి 2021-22లో 9.1 శాతంతో పోలిస్తే 7.0 శాతంగా అంచనా వేయబడింది.

జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి

కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.

అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్

కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.

8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ

టెక్ పరిశ్రమ తరువాత, టెలికాం తయారీ రంగం కూడా ఉద్యోగ కోతలను మొదలుపెట్టింది. . స్వీడన్ 5 జి నెట్‌వర్క్స్ తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 8,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనివలన సంస్థలో సుమారు 8% మంది ప్రభావితమవుతారు.

25 Feb 2023

గూగుల్

మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు

గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ రహస్య X మూన్‌షాట్ ల్యాబ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన ఒక సంవత్సరం తర్వాత దాని అతి చిన్న అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎవ్రీడే రోబోట్‌లను తొలగించాలని నిర్ణయించుకుంది. డిపార్ట్‌మెంట్‌లో అనేక ప్రయోజనాత్మక ప్రాజెక్టులలో పనిచేసే 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు.

జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.

24 Feb 2023

బ్యాంక్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా

ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్‌ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు.

BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత

Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది.

2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం

గ్లోబల్ డిమాండ్‌ దెబ్బతినడం ప్రారంభమయ్యాక కఠినమైన ద్రవ్య విధానం కారణంగా ఏప్రిల్ 1, 2023 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ ఆర్థిక నివేదికలో 2022లో ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోయిందని, 2023లో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, వాణిజ్య విలువ మరింత తగ్గుతుందని పేర్కొంది.

ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది.

అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత దారుణమైన పతనానికి గురైంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ కోల్పోవడంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.

వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్

జూన్-డిసెంబర్ 2022 మధ్య UK లో 61 కంపెనీలు పాల్గొన్న నాలుగు రోజుల వర్క్‌వీక్ ట్రయల్ లో,తగ్గిన గంటలతో చాలా సంస్థలు సంతృప్తికరంమైన ఫలితాలను అందుకున్నాయని తేలింది.

#NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు

కొంతమందికి 2022 పెద్దగా కలిసిరాలేదు, అత్యంత ధనవంతులు 2022లో తమ స్థానాన్ని కొనసాగించలేకపోయారు. స్థానాన్ని కోల్పోయిన కొంతమంది బిలియనీర్లను చూద్దాం.

IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్త అభివృద్దిలో 50% సహకారం అందించేది భారతదేశం, చైనా.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు పొరపాట్లు చేయడం సర్వసాధారణం. అయితే తరుచుగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే, అవగాహన ద్వారా వాటిని చాలా వరకు నివారించి ఆర్థిక లక్ష్యాలను సాధించచ్చు.

సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI

ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

21 Feb 2023

మెటా

మరిన్ని ఉద్యోగ కోతలకు ప్రణాళిక వేస్తున్న మెటా 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్స్

మెటాలో ఉద్యోగ కోతల సీజన్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ముగిసిన పనితీరు సమీక్షలలో సుమారు 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్‌లు ఇవ్వడం ద్వారా కంపెనీ ఇటువంటి సంకేతాలను అందించింది. గత ఏడాది నవంబర్‌లో మెటా దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.

20 Feb 2023

విమానం

ఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులు విదేశీ ప్రయాణాలకు దాదాపు $10 బిలియన్లు ఖర్చు పెట్టారు.రికార్డు స్థాయి ట్రావెల్ సీజన్ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు.

భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ వస్తువులను విక్రయించడం, కార్యాలయాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్విట్టర్ శుక్రవారం ఉదయం భారతదేశంలోని దాని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది, ఆ కార్యాలయాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని కోరింది.

భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి

భారతదేశంలో 2022 సంవత్సరంలో 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభం అయ్యాయి, మొత్తం టెక్ స్టార్టప్‌ల సంఖ్య 25,000-27,000కి చేరుకుందని Nasscom and Zinnov కొత్త నివేదిక పేర్కొంది.

16 Feb 2023

పేటియం

UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్

తక్కువ-విలువ UPI లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా ఆటంకం లేకుండా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) భారతదేశంలో UPI LITEని ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ ఫీచర్‌ను అందించే దేశంలోనే మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటియం.

ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్

వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 ఉద్యోగాలను తగ్గించాలని అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఇంజన్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండడంతో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. ఫోర్డ్ లో ప్రస్తుతం ఐరోపాలో 34,000 ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికి ఐరోపాలో తన విమానాలను పూర్తిగా విద్యుదీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిపై $50 బిలియన్లను ఖర్చు చేస్తోంది.

మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse

స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.

ఇంటర్నెట్ సంచలనం ChatGPT వెనుక ఉన్న సామ్ ఆల్ట్‌మాన్ గురించి తెలుసుకుందాం

గత కొన్ని నెలలుగా ChatGPT ఎన్నో చర్చలకు దారితీసింది. అయితే అందరూ ఈ చాట్ బాట్ గురించి మాట్లాడారు గాని OpenAI సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ గురించి ఎవరూ మాట్లాడలేదు. 37 సంవత్సరాల ఆల్ట్‌మాన్, చికాగో, ఇల్లినాయిస్‌లో 1985లో జన్మించాడు. అతను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో పెరిగాడు.

జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం

ఆల్-ఇండియా హోల్ సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా దేశ వార్షిక ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2022లో నమోదైన 4.95% నుండి జనవరి 2023 (జనవరి 2022 కంటే) నెలలో 24 నెలల కనిష్ట స్థాయి 4.73%కి తగ్గింది, తాత్కాలిక డేటా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం షేర్ చేసింది.

అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్

అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లో అందించే వివిధ రకాల ఉత్పత్తులు అందించే డిస్కౌంట్‌ల కారణంగా కొనుగోలుదారులకు చాలా ఇష్టమైన ఈ-కామర్స్ వేదిక. ఇందులో మిలియన్ల కొద్ది అమ్మేవారు ఉన్నారు. మార్కెట్‌ప్లేస్ పల్స్ అధ్యయనం ఆధారంగా, 2022లో మొదటిసారిగా అమెజాన్ ప్రతి సేల్‌లో కోత 50% దాటింది.

14 Feb 2023

బీబీసీ

BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది.

13 Feb 2023

మెటా

మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా

మరింత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించే ఆలోచనలో ఉన్న మెటా సంస్థ. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా వచ్చే నెలలో సిబ్బంది పనితీరు సమీక్షలను పూర్తి చేసిన తర్వాత సంస్థను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది.

11 Feb 2023

విమానం

ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా

ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు

మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్‌ తో పాటు Xbox గేమింగ్ డివిజన్‌ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.

H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం

H-1B వీసాపై అమెరికా కొత్త ప్లాన్ అమలు చేస్తుంది దీనితో H-1B, L1 వీసాలపై వేలాది మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో వేలాది మంది భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. పైలట్ ప్రాతిపదికన "దేశీయ వీసా రీవాలిడేషన్" కేటగిరీలు పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాలలో దానిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.

తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో ప్రారంభమైంది. ఇది ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం, వెబ్ ద్వారా HD రిజల్యూషన్‌లో వీడియోలను పోస్ట్ చేయడం, కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ

డిస్నీ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి 7,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించింది.

అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ

స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆకాశాన్నంటుతున్న అప్పులను కూడా నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు, రెగ్యులేటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దేశీయ బ్యాంకులకు మద్దతుగా నిలిచాయి.

08 Feb 2023

ఆర్ బి ఐ

#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?

08 Feb 2023

ఆర్ బి ఐ

రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.