ఆదాయం: వార్తలు

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు

గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ బ్రాండ్‌ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు.

సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని ప్రస్తుతం ఉన్న 38 శాతం నుండి 42 శాతానికి నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.

ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.

కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను కేరళలోని కోజికోడ్, త్రివేండ్రం, త్రిస్సూర్‌లో విడుదల నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో ఆనందించవచ్చు. ప్రస్తుతం ఎయిర్ టెల్ తన 5G డేటా ప్లాన్‌లను ఇంకా వెల్లడించలేదు.

04 Feb 2023

ఆపిల్

రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది.

224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ

సెన్సెక్స్ 59,932.24 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,610.4 పాయింట్ల వద్ద స్థిరపడటంతో గురువారం స్టాక్ మార్కెట్ మందకొడిగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది.

నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

OpenAI సంస్థ ChatGPT చుట్టూ ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించి, మనుషుల లాగే మాట్లాడే సామర్థ్యం ఉన్న చాట్‌బాట్ కోసం కంపెనీ కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. దీనికి ChatGPT ప్లస్ అని పేరుపెట్టింది, అయితే ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వలన ఉచిత సేవకు ఎటువంటి ఆటంకం ఉండదని ఆ సంస్థ తెలిపింది.

02 Feb 2023

మెటా

అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా

మెటా 2023లో ఆదాయాన్ని మరింత మెరుగ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 2022 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరుతో దాని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. 2023లో పొదుపుపై దృష్టి పెట్టాలని కంపెనీ ప్రణాళిక వేస్తుంది.

నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌

స్నాప్ చాట్ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను విడుదల చేసింది.వినియోగదారుల సంఖ్య పెరగినా. ఆదాయం, లాభాలకు సంబంధించిన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి.

ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత

కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ క్యాంపస్‌లో సుమారు 340 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, వేతన కోతలను అమలు చేసినట్లు ఇంటెల్ సంస్థ తెలిపింది. ఈ తగ్గింపులు మిడ్-లెవల్ ఉద్యోగుల నుండి ఎగ్జిక్యూటివ్ వరకు ఉంటాయి. కంపెనీ ఆదాయం వేగంగా పడిపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు

'బడ్జెట్ 2023'లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో భాగంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు.

అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విటర్‌ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ సోషల్ మీడియా సంస్థ పేమెంట్ టూల్స్ పై పనిచేయడం ప్రారంభించింది.

31 Jan 2023

మెటా

మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం

మెటా గత సంవత్సరం, 11,000 మంది ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మంది ఉద్యోగులను తొలగించింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రస్తుతం మెటా సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మానేజ్మెంట్ లో వివిధ టీంలు ఉండడం. ఖర్చులను తగ్గించే ఆలోచనలో ఉన్న జుకర్‌బర్గ్ మరికొన్ని తొలగింపులను దృష్టిలో ఉంచుకున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.

మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ

డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. స్లీప్ అప్నియా ట్రీట్‌మెంట్ డివైజ్‌లను వెనక్కి రప్పించడంతో కంపెనీ నష్టాల బారిన పడింది. దీని కారణంగా ఫిలిప్స్ తన మార్కెట్ వాల్యుయేషన్‌లో 70% కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థ ప్రకటించిన 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు అదనంగా మరో 6,000 మందిని తొలగించబోతుంది.

జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్

హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది.

భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit

Fire-Bolt కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌వాచ్, Ninja-Fit, ఇప్పుడు భారతదేశంలో ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్-సపోర్ట్ మోడ్‌లతో పాటు "అప్‌గ్రేడెడ్ హెల్త్ సూట్" ఇందులో వస్తుంది. దీనికి 1.69-అంగుళాల స్క్రీన్, IP67-రేటెడ్ సేఫ్టీ, బ్లూటూత్ కాలింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT

OpenAI ChatGPTకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో గుబులు పుట్టిస్తుంది. Gmail సృష్టికర్త పాల్ బుచ్‌హీట్ ఈ ChatGPT మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను మించిపోవచ్చని పేర్కొన్నారు. Yellow Pagesకు గూగుల్ ఎలా చెక్ పెట్టిందో అలాగే సెర్చ్ ఇంజన్‌లకు ఈ AI చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది.

28 Jan 2023

గూగుల్

ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన

ఈ నెల ప్రారంభంలో, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో సిబ్బందిని తొలగించిన కంపెనీల లిస్ట్ లో గూగుల్ చేరింది. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. ఇది బాధిత ఉద్యోగుల నుండి వ్యతిరేకతకు దారితీసింది.

25 Jan 2023

గూగుల్

గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఎనిమిది రాష్ట్రాలు గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావాను దాఖలు చేశాయి. కంపెనీ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.ఈ దావాలో DOJతో చేరిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, వర్జీనియా ఉన్నాయి.

నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం

మైక్రోసాఫ్ట్ 2022 చివరి మూడు నెలల ఆదాయాల నివేదికను ప్రకటించింది. ఈ త్రైమాసిక ఆదాయం గత 6 సంవత్సరాల కాలంలో అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి భారీగా ఉద్యోగులను తొలగించింది.

10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ ChatGPT యజమాని OpenAIతో తన భాగస్వామ్యాన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా విస్తరించాలని నిర్ణయించుకుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ లో OpenAI టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్‌లో ChatGPT పెట్టాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గూగుల్ వంటి వాటికి గట్టి పోటీనివ్వచ్చు.

ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

ట్విట్టర్ ఐఫోన్ వినియోగదారులు ట్వీట్‌లను సులభంగా బుక్‌మార్క్ చేసేలా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులు ట్వీట్ వివరాల క్రింద ఉన్న బుక్‌మార్క్ బటన్‌పై నొక్కాలి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల విషయానికొస్తే, ఫ్లాగ్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఫోల్డర్‌లలో తమకు నచ్చిన ట్వీట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

ఫర్నిచర్ వేలం నుండి తగ్గుతున్న ఆదాయం వరకు అసలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది

శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో మిగులు వస్తువులను వేలం వేసి కొంత డబ్బును సేకరించే పనిలో ఉంది ట్విట్టర్. మిగులు కార్యాలయ వస్తువులను విక్రయించడం వలన ట్విట్టర్ ఆదాయం పెరగొచ్చు.

రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్‌

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సహ-వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సిఈఓ పదవి విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. కంపెనీ అద్దె ద్వారా మెయిల్ DVD సేవ నుండి ఎంటర్టైన్మెంట్ వేదికగా ఎదిగేవరకు అతను రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో కొనసాగారు.

ఇక స్విగ్గీ వంతు, 380 మంది ఉద్యోగుల తొలగింపు

భారతదేశపు స్టార్టప్‌లలో ఒకటైన స్విగ్గీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది. దాదాపు 380 మంది సిబ్బందిని తొలగించింది. దేశంలోని స్టార్టప్ వ్యవస్థను మరింతగా కుదిపేసే నిర్ణయం ఇది. ఈరోజు టౌన్ హాల్‌లో ఉద్యోగులకు ఈ తొలగింపుల గురించి సంస్థ తెలిపింది.

టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్

టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఓడరేవుల నుండి ఇంధనం వరకు వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు మీడియా కంపెనీని కూడా కొనుగోలు చేసారు. కానీ టెలికాం రంగానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.

ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం

ట్విట్టర్ ఆర్థికంగా కష్టాల్లో పడింది. దాని కొత్త సిఈఓ ఎలోన్ మస్క్ కంపెనీ ఆ కష్టాలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అందులో విజయం సాధించలేకపోతున్నారు. ట్విట్టర్ రీలింగ్ ప్రకటన వ్యాపార ప్రభావం ఆ సంస్థ ఆర్ధిక స్థితి మీద పడుతోంది. ఈ సంస్థను మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి 500 మంది ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు పెట్టడం మానేశారు.

రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది

2023లో భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాభాల్లోకి వెళ్ళేటట్లు కనిపిస్తోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా.

415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు

FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు.

18 Jan 2023

గూగుల్

సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్

UPI చెల్లింపులు ఎక్కువగా చేసేది భారతీయులే. ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం ఒక్కోసారి వ్యాపారులకు కష్టంగా మారుతుంది. సౌండ్‌బాక్స్, వాయిస్ అలర్ట్ ద్వారా పూర్తయిన చెల్లింపు గురించి వ్యాపారులకు తెలియజేసే ఈ డివైజ్ లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం

కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది.

ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం

భారతి ఎయిర్‌టెల్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ఐదు ప్రధాన నగరాల్లో 5G ప్లస్‌ను ప్రారంభించింది. ఈ కవరేజీని వినియోగదారుల నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ 5G కనెక్టివిటీ సేవను అందిస్తుంది ఎయిర్ టెల్. ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే వ్యక్తులు 5G ప్లస్‌లో 20-30 రెట్లు వేగాన్నివినియోగదారులు చూస్తారు.

టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు

100 మంది ఉద్యోగులను తొలగించిన ఒక నెల తర్వాత, స్వదేశీ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇప్పుడు 20% మంది ఉద్యోగులను తొలగించింది. ఈ స్టార్టప్ తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత

అమెజాన్ మరోమారు ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఈ నెలలో భారతదేశంలోని సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి ఉద్యోగి తెలిపారు.

పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ

బెంగుళూరుకు చెందిన రైడ్-షేరింగ్ కంపెనీ ఓలా ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీ కొన్ని విభాగాల నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సిబ్బంది సంఖ్యను ఓలా ఇంకా నిర్ధారించలేదు.

మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 12.68% పెరిగి డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,586 కోట్లు వచ్చాయి. కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో రూ.39,087 కోట్లు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 39,087 కోట్లు, ఇందులో రూ. 38,318 కోట్ల నికర అమ్మకాలు, రూ. 769 కోట్లు ఇతర ఆదాయాల ద్వారా వచ్చాయి.

సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్‌లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్‌లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.

ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం

ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఆదాయాన్ని పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఆదాయాన్ని సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో యూజర్ నేమ్స్ ను విక్రయించాలని ఆలోచిస్తుంది.

మునుపటి
తరువాత