కింగ్‌ఫిషర్ బీర్ కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మందుబాబు
కొందరి మందుబాబుల సమస్యలు అప్పడప్పుడూ హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లకు అది సీరియస్ సమస్య అయినా, వేరే వాళ్లకు నవ్వు తెప్పించే విషయం అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్
నటుడు శ్రీ విష్ణు గత చిత్రం అల్లూరి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సామజవరగమన అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే'
దిల్లీ మద్యం కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అంశం తెలుగు రాష్ట్రాలు కూడా చర్చశీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొంతర కీలక నేతలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి
కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.
బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు, సంబంధిత టెక్నాలజీల రంగంలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించే వేదిక. ఈ సంవత్సరం వేడుకలో సుమారు 200+ దేశాల నుండి 80,000 మంది పాల్గొంటారని అంచనా. సామ్ సంగ్, HONOR, Huawei వంటి బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను అందించడానికి సిద్ధమయ్యాయి.
'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పురాతన, చారిత్రక సాంస్కృతిక మత స్థలాల పేర్లను మార్చే కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారతదేశం ఒక లౌకిక దేశమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూ మతం ఒక జీవన విధానమని చెప్పుకొచ్చింది.
మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్
దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిసోడియా అరెస్ట్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని చెప్పారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్
మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో మామూలే, హానికరమైన వాయువుల వలన ఈ పని చేసే వారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. భారతదేశంలో 2017 నుండి సుమారు 400 మంది ఈ మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో మరణించారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం మ్యాన్‌హోల్స్‌లోని మురుగునీటిని శుభ్రపరిచే బాండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో ఈ రోబో మ్యాన్‌హోల్ శుభ్రం చేసే కార్మికులకు విశ్రాంతిని అందిస్తోంది.
మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.
The Wall Street Journal: చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చైనాలో జరిగిందని మరో పరిశోధన తేల్చి చెప్పింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రిపోర్డును 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది.
2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం
జర్మన్ లగ్జరీ మార్క్ బి ఎం డబ్ల్యూ గ్లోబల్ మార్కెట్లలో 2023 XM లేబుల్ రెడ్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ హైబ్రిడ్ SUV 2,000 యూనిట్ల కంటే తక్కువ ఉత్పత్తితో 2023 చివరినాటికి మార్కెట్లో వస్తుంది.
కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు
స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజున అతను రాస్ టేలర్‌ను అధిగమించాడు. అంతేకాదు విలియమ్సన్ తన 26వ సెంచరీని కూడా ఈ ఫార్మాట్‌లో పూర్తి చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
మరో రెండు నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన కర్ణాటకలో పర్యటిస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు రెండు నెలల్లోనే ఏకంగా ఐదు సార్లు మోదీ కర్ణాటకలో పర్యటించడం గమనార్హం.
ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం
ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.
D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఆయన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల
ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.
అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్
కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.
దిల్లీ మద్యం కేసు: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనలు; బీజేపీ హెడ్ క్వార్టర్ వద్ద హై టెన్షన్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సిసోడియా అరెస్టు అక్రమమంటూ దేశవ్యాప్తంగా నిరసనలకు ఆప్ సోమవారం పిలుపునిచ్చింది.
National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్
స్ట్రాబెర్రీ.. వేసవిలో విరివిగా లభించే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. స్ట్రాబెర్రీలో శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు ఉంటాయి. సోమవారం(ఫ్రిబవరి 27) నేషనల్ స్ట్రాబెర్రీ డే 2023 కావడంతో స్ట్రాబెర్రీతో చేసే కొన్ని రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో సఫారీ 2023 అప్డేట్ ప్రారంభించింది, మార్కెట్లో ఏడు సీట్ల SUV విభాగంలో మహీంద్రా XUV700కి పోటీగా ఉంటుంది. సఫారీ ఈమధ్య కాలంలో టాటా మోటార్స్ నుండి అత్యంత సమర్థవంతమైన కార్లలో ఒకటి. అయితే, XUV700లో లెవెల్ 2 ADAS ఫంక్షన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ వంటి ఇతర ప్రీమియం ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా సెవెన్-సీటర్ SUV కేటగిరీలో మహీంద్రా దూకుడు పెంచింది.
దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
తెలుగు దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణించి నెల కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయలక్ష్మి మరణించే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్
ఎలోన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్ సోమవారం నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనుంది.
మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం
కేప్‌టౌన్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయ దుందుభిని మోగించింది. దక్షిణాఫ్రికాను 19పరుగుల తేడాతో ఓడించి ఏకంగా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఫిబ్రవరి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
దిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. ఉదయం నుంచి తొమ్మిది గంటలకు పైగా మనీష్ సిసోడియాను సీబీఐ విచారించింది. అనంతరం అదుపులోకి తీసుకుంది.
Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజుకు చేరుకున్నాయి. ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదాని-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 98వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక అంశాలపై మాట్లాడారు.
నాగాలాండ్: 60ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో మహిళకు దక్కని ప్రాతినిధ్యం; ఈసారైనా అబల గెలిచేనా?
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27(సోమవారం) ఒకే దశలో మొత్తం 60అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే 1963లో ఏర్పడిన నాగాలాండ్ అసెంబ్లీకి ఇంతవరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 2023 ఎన్నికల్లో అయినా అబలలకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందా? అని ఆ రాష్ట్ర మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Ontario Gurudwara Committee: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడుల వెనుక భారత నిఘా సంస్థల హస్తం: ఓజీసీ
కెనడాలో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన విషయంలో అంటారియో గురుద్వారా కమిటీ(ఓజీసీ) సంచలన ఆరోపణలు చేసింది.
ఫిబ్రవరి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
Delhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసు విచారణలో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఆదివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ట్విట్టర్ వేదికగా స్పందించారు.