20 Feb 2023
25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్
ప్రీమియం కేటగిరీ సర్వీస్‌లో రైడ్-షేరింగ్ యాప్ ఉబెర్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)లో భాగంగా 25,000 ఎక్స్‌ప్రెస్-టి టాటా మోటార్ ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేయాలని ఆలోచిస్తున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది.
'10మంది ముస్లిం బాలికలను ట్రాప్ చేయండి, భద్రత కల్పిస్తాం'; శ్రీరామ్ సేన అధ్యక్షుడు సంచలన కామెంట్స్
'లవ్ జిహాద్'ను ఎదుర్కొనేందుకు కర్ణాటకలో శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు మార్చి 21న భారతదేశంలో విడుదల చేయనున్న 2023 హ్యుందాయ్ Verna డిజైన్ రెండర్‌లను ఆవిష్కరించింది.
ఆసీస్ మాజీ సారిథి మార్క్ వా- దినేశ్ కార్తిక్ మధ్య మాటల యుద్ధం
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీసారిథి మార్క్ వా-దినేష్ కార్తీక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వా-నేనా అంటూ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఫీల్డ్ గురించి మాట్లాడిన మార్క్ వా.. దినేష్ కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు
20రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న, చివరగా మహాశివరాత్రి రోజున శివైక్యం అయ్యారు. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఐతే నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచారు.
పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G
భారతి ఎయిర్‌టెల్ పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, దుర్గాపూర్, దిన్హటా, అసన్సోల్, జల్పైగురి, డార్జిలింగ్‌తో సహా మరో 15 నగరాల్లో తన 5G సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించింది.
టెస్టుల్లో రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లండ్
టెస్టులో ఇంగ్లండ్ సంచలనాత్మక రికార్డును క్రియేట్ చేస్తోంది. ప్రధాన్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి టెస్టులో అద్భుతంగా రాణిస్తోంది. ఒకప్పుడు టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్.. ఇప్పుడు టెస్టులో రికార్డులను సృష్టిస్తోంది.
దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో విచారణ నిమిత్తం ఫిబ్రవరి 26న మళ్లీ తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోరింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది.
పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్
పొట్టిగా ఉన్నవాళ్ళు ఫ్యాషన్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసుకునే బట్టలు, జుట్టు నుండి చేతికి పెట్టుకునే వాచ్ వరకూ అన్నింట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులు విదేశీ ప్రయాణాలకు దాదాపు $10 బిలియన్లు ఖర్చు పెట్టారు.రికార్డు స్థాయి ట్రావెల్ సీజన్ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు.
భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య
ఓ మహిళ తన భర్త, అత్తను హత్య చేసి, వారి మృతదేహాలను ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిజ్‌లో ఉంచింది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది.
జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..!
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే టీమిండియా కు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. నేరుగా ఐపీఎల్‌లో మైదానంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం.
అనుష్క లుక్ చూసి అయోమయంలో అభిమానులు
అనుష్క శెట్టి.. టాలీవుడ్ కి పరిచయమై 15ఏళ్ళకు పైనే అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకు అంత పెద్ద కెరీర్ ఉండదు.
ఎత్తు నుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయా? దాన్నుండి బయటపడే యోగాసనాలు
అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చేయడంలో యోగా పాత్ర కీలకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుండి కూడా యోగా బయట పడేస్తుంది. ప్రస్తుతం వర్టిగోను దూరం చేసే యోగాసనాల గురించి తెలుసుకుందాం.
ఈ ఏడాది టియాంగాంగ్‌కు రెండు సిబ్బందితో ఉన్న మిషన్లను పంపనున్న చైనా
టియాంజో కార్గో స్పేస్‌క్రాఫ్ట్‌లోని సామాగ్రితో పాటుగా చైనా ఈ సంవత్సరం కొత్తగా పనిచేస్తున్న టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి రెండు సిబ్బంది మిషన్లను పంపుతుంది.
వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో
రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. ఇది 2016లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి వినియోగదారులకు అనుకూలంగా ఉండే రీఛార్జి ప్లాన్స్ అమలుచేస్తూ వస్తుంది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఇంటర్నెట్ డేటాను అందించే ఆల్ ఇన్ వన్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం
ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) వివిధ కోటాల కింద మార్చి 13, 2023న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 18 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఆస్ట్రేలియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ దూరం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న ఆసీస్ ఇప్పటికే రెండో టెస్టులో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు గాయాల బెడద ఎక్కువ అవుతోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు స్టార్ పేసర్లు మిచెల్‌స్టార్క్, జోష్‌హేజిల్‌వుడ్ దూరం కాగా.. తాజాగా అందించిన సమాచారం మేరకు హేజిల్ వుడ్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలిసింది.
వంద టెస్టులు ఆడి చతేశ్వర్ పుజారా అరుదైన ఘనత
టీమిండియా వర్సస్ ఆస్ట్రేలియా రెండో టెస్టులో మ్యాచ్ చతేశ్వర్ పుజారా వంద టెస్టులు ఆడి అరుదైన ఘనతను సాధించారు. ఈ మైలురాయిని సాధించిన 13వ టీమిండియా ఆటగాడిగా పుజారా నిలిచారు. పుజారా పది సంవత్సరాలుగా టెస్టులో ఆడుతూ మెరుగ్గా రాణిస్తున్నాడు. పుజారా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టులో నంబర్ త్రీ బ్యాటర్ గా నిలవడం గమనార్హం.
రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సార్ మూవీ: హృతిక్ రోషన్ సూపర్ 30తో పోలికపై దర్శకుడు క్లారిటీ
తమిళ హీరో ధనుష్ నటించిన తెలుగు చిత్రం సార్, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని చోట్ల నుండి సార్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
$50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ
బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్డేట్ చేసిన డేటా ప్రకారం అతని మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లు.
కేలరీల కొరత: బరువు తగ్గడానికి పనికొచ్చే అద్భుతమైన టెక్నిక్
కేలరీల కొరత అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నాం. సాధారణంగా మన తిన్న ఆహారం నుండి వచ్చే ఎనర్జీని కొలిచే ప్రమాణమే కేలరీ.
జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో ఆడటానికి చూస్తే పళ్లు రాలిపోతాయి
గవాస్కర్ టోఫ్రీలో భాగంగా టీమిండియా 2-0 ఆధిక్యంలో కొసాగుతోంది. టీమిండియా విజయంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించారు. రెండో టెస్టులో వీరిద్దరూ ఏకంగా 16 వికెట్లు తీసి సత్తా చాటారు.
ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య- నాలుగురోజులుగా బాత్‌రూమ్‌లోనే మృతదేహం
ఐఫోన్ కోసం ఒక వ్యక్తి డెలివరీ బాయ్‌ను హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన మూడున్నరేళ్ల తర్వాత లోయలో మోహరించిన అదనపు బలగాలను ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.
Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లో భాగమైన Ampere ఎలక్ట్రిక్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Primus ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ లో Ola S1తో ఇది పోటీ పడుతుంది. ఈమధ్య కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ బాగా పెరిగింది. స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు Ampere, అధిక-స్పీడ్ ఈ-స్కూటర్‌లను సామాన్యులకు అనుకూలమైన ధరకే అందించడం ద్వారా మిగిలిన వాటి కంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తుంది.
కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ హోదా తొలగింపు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.
మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది.
ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి?
బాహుబలి స్టార్ ప్రభాస్, నటిస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించేసింది.
ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్
జీఎస్టీ కౌన్సిల్ శనివారం ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్లు , కొన్ని ట్రాకింగ్ పరికరాలపై వస్తు, సేవా పన్నును తగ్గించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ ఫార్మామెన్స్ అదుర్స్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ అద్భుత ఫర్మామెన్స్ అదరగొడుతోంది. 102 పరుగులతో తేడాతో శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సుజీబేట్స్ 49 బంతుల్లో 56 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఎనిమిది సార్లు అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా సుజీబేట్స్ నిలిచింది.
'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ
'శివసేన' పార్టీ పేరు, 'విల్లు, బాణం' గుర్తును మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ మఫిన్ డే 2023: ఇంట్లోనే మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెసిపీస్
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీని నేషనల్ మఫిన్ డే గా జరుపుకుంటారు. మఫిన్స్ అంటే గుండ్రంగా స్పాంజ్ లాగా ఉండే కేక్స్ అన్నమాట. గుడ్డు, చక్కెర, మైదాతో తయారు చేస్తారు.
సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో?
హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాలతో విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు శైలేష్ కొలను, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్ర గ్లింప్స్ ఆల్రెడీ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
సిరీస్ మధ్యలో జట్టును విడిచి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చెత్తగా ఆడుతోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలను వదలుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది.
ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22
సామ్ సంగ్ Galaxy S22 ఫోన్ ధర తగ్గింపు ధరతో అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. కొత్త మోడల్ Galaxy S23 విడుదల తో, సామ్ సంగ్ Galaxy S22 ధరను గణనీయంగా తగ్గించింది ఆ సంస్థ.
హవాయి: అమెరికా గగనతలంలో మరో 'స్పై బెలూన్'- చైనా పైనే అనుమానాలు
అమెరికా హవాయిలోని హోనోలులు గగనతలంలో పెద్ద తెల్లటి బెలూన్ కనిపించినట్లు కనిపించింది. ఇటీవల చైనాకు చెందిన పలు స్పై బెలూన్లను అమెరికా బలగాలు పేల్చేసిన కొద్దిరోజుల తర్వాత, ఇది తాజాగా దర్శనమివ్వడం గమనార్హం.
కేఎల్ రాహుల్‌పై నాకు కోపం లేదు : మాజీ పేసర్
భారత్ క్రికెట్ జట్టుకు టెస్టులో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు.
లూజ్ మోషన్ ని క్షణాల్లో దూరం చేసే ఇంటి చిట్కాలు
డయేరియా.. దీన్ని నీళ్ల విరచేనాలు, లూజ్ మోషన్ అని కూడా అంటారు. రకరకాల ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజన్ మొదలగు వాటి వల్ల లూజ్ మోషన్ అవుతుంది. ఇలాంటి టైం లో కడుపునొప్పి, మలద్వారం దగ్గర నొప్పి, అలసట, జ్వరం కూడా వస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు
బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఇంటర్‌సెప్టర్ 650 కోసం ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్ల కోసం విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు లైట్నింగ్.
వెస్ట్ హామ్‌పై 2-0 తేడాతో స్పర్స్ విజయం
ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో వెస్ట్ హామ్‌పై స్పర్స్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్ హ్యూంగ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2వ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు
మనం తినే ఆహారాలే మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏ డి హెచ్ డి సమస్యతో బాధపడుతుంటే వారికి కొన్ని ఆహారాలను దూరంగా ఉంచాలి.
దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
దిల్లీలోని తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇంటి కిటికీ ధ్వంసమైనట్లు చెప్పారు.
IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు
ప్రపంచదేశాల్లో కరోనా ఆంక్షలు తొలగిపోయిన నేపథ్యంలో దేశీయ విమానాల ప్రయాణాలు గణనీయంగా పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో దేశీయంగా విమానాల్లో ప్రయాణించే సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే
బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. వన్డే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే మొదటి వన్డే నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు.
బాలకృష్ణ 108: అనిల్ రావిపూడికి అప్పుడే వద్దని చెప్పిన బాలకృష్ణ
వీరసింహారెడ్డి విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా మొదలెట్టాడు బాలకృష్ణ. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. బాలకృష్ణ కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
ఫిబ్రవరి 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
19 Feb 2023
రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.
ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?
ఫిబ్రవరి 24నుంచి 26వరకు నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నియామకాన్ని ఆమోదించనున్నారు. ప్లీనరీలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కూడా ఎన్నుకోనున్నారు. అయితే సీడబ్ల్యూసీని ఎలా ఏర్పాటు చేస్తారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి అల్లాడిపోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా జట్టు అల్లాడిపోయింది. జడేజా ఏడు వికెట్లతో విజృంభించడంతో ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు
ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే రెసిపీ గురించి తెలుసుకుందాం
ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.
ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే ఉక్రెయిన్‌పై దమనకాండకు దిగిన రష్యాపై మరన్ని ఆంక్షలు విధించాలని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.
ఫిబ్రవరి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.