16 Feb 2023
భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి
భారతదేశంలో 2022 సంవత్సరంలో 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభం అయ్యాయి, మొత్తం టెక్ స్టార్టప్‌ల సంఖ్య 25,000-27,000కి చేరుకుందని Nasscom and Zinnov కొత్త నివేదిక పేర్కొంది.
ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలోని సామర్థ్యం గల హారియర్, సఫారీ 2023 వెర్షన్ విడుదల చేసింది. భారతదేశంలో రెండు వాహనాల కోసం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
త్రిపురలో ముగిసిన పోలింగ్; మార్చి 2న ఓట్ల లెక్కింపు
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 5గంటలకు ముసింగింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI
దిగ్గజ కార్ల తయారీ సంస్థ MINI గ్లోబల్ మార్కెట్ల కోసం SE కన్వర్టిబుల్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం కేవలం 999 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తి చేయబడుతుంది. కారు బ్రాండ్ ఆధునిక డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది, స్టాండర్డ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ నుండి చాలా డిజైన్ ఎలిమెంట్‌లతో వస్తుంది. ఇది 181hp ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది.
భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్
iQOO భారతదేశంలో iQOO Neo 7 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.ఇందులో 120Hz AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్, 64MP ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి.
అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్
అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ప్రవేశించిన లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు వర్కౌట్ కాలేదు.
ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి
ఈ ఏడాది మార్చి 31లోపు పాన్ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది.
రెండో టెస్టుపై కన్నేసిన టీమిండియా
నాగపూర్ జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. అయితే టెస్టు సిరీస్ ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మొదటి టెస్టులో 132 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. టీమిండియాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది.
'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్
క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఎ పాల్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే చనిపోతానని ప్రకటించారు. అయితే తాను చివరి వరకు ఏసుక్రీస్తు అనుచరుడిగా ఉంటానని వెల్లడించారు.
మొదటి టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్‌టిక్నర్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్ టిక్నర్ సత్తా చాటాడు. రైట్ ఆర్మ్ పేసర్ ఇప్పుడు టెస్టులో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్ పెవిలియానికి పంపాడు.
సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్?
ఈ మధ్య అభిమానుల నుంచి అప్డేట్ల గోల చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అప్డేట్ కావాలంటూ నిర్మాతల మీద ఒత్తిడి పెంచుతున్నారు. సాక్షాత్తు సినిమా హీరోలే దిగివచ్చి అప్డేట్ల విషయంలో ఆత్రపడద్దని అభిమానులకు చెప్పాల్సి వస్తోంది.
2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల
జపనీస్ బైక్ తయారీ సంస్థ యమహా భారతదేశంలో R15M 2023 అప్డేట్ ను ప్రారంభించింది. అప్‌డేట్‌లో భాగంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు క్విక్‌షిఫ్టర్ ఉన్నాయి.
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తగ్గేదేలే అంటున్న 'ఎయిర్ ఇండియా'; ఏకంగా 840 విమానాల కోనుగోలుకు 'టాటా' ప్లాన్
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానాల కొనుగోళ్లలో ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే రూ.6లక్షల కోట్ల విలువ చేసే 470 విమానాలను బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీలకు ఆర్డర్ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద డీల్‌ను ఎయిర్ ఇండియా కుదుర్చుకుంది.
ఆది మహోత్సవం: ప్రధాని మోదీ ప్రారంభించిన గిరిజనుల పండగ గురించి తెలుసుకోండి
గిరిజనుల సంప్రదాయాలను, కళలను, ఆహారాన్ని, వాణిజ్యాన్ని నగర ప్రజలు తెలుసుకోవడానికి ఆది మహోత్సవం పేరుతో ప్రతీ సంవత్సరం పండగ నిర్వహిస్తున్నారు.
టెస్టు మ్యాచ్‌ని వన్డేలా ఆడిన ఇంగ్లండ్
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. డే-నైట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం 58.2 ఓవర్లలో 325/9 వద్ద డిక్లరేషన్ చేసింది. ఇంకా ఒక వికెట్ చేతిలో ఉన్నా ఉన్నా కూడా డిక్లరేషన్ చేయడం గమనార్హం. ఓపెనర్ జాక్ క్రాలీ (4) ఆరంభంలోనే ఔటైపోయినా.. డకెట్ (68 బంతుల్లో 84 పరుగులు), ఓలీ పోప్ (65 బంతుల్లో 42), హారీ బ్రూక్స్ (81 బంతుల్లో 89 పరుగులు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీ మోత మోగించేశారు.
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితికి అద్దం పట్టే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వైద్యలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించారు తల్లిదండ్రులు.
ఇండియన్ 2 కోసం నెలరోజులు షూటింగ్, కమల్ హాసన్ రెడీ
తమిళ బిగ్ బాస్ సీజన్ 6 పనులు పూర్తి చేసుకున్న కమలహాసన్, ఇండియన్ 2 సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. తిరుపతిలో షూటింగ్ షెడ్యూల్ ముగించుకున్న తర్వాత ఇప్పటివరకు ఇండియన్ 2 షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు.
టెస్టులో చరిత్రను నెలకొల్పిన జేమ్స్ అండర్సన్
వెటరన్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఓపెనింగ్ టెస్ట్‌లో చరిత్ర సృష్టించాడు, 21 సంవత్సరాలుగా అంతర్జాతీయ వికెట్లు తీస్తున్న మొదటి బౌలర్‌గా నిలిచాడు. డే-నైట్ మొదటి ఇన్నింగ్స్ లో ప్రారంభంలోనే జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లను పడగొట్టాడు.
అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు
భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను భారతదేశంలోని కోహిమా, ఐజ్వాల్, గ్యాంగ్‌టాక్, టిన్సుకితో సహా మరిన్ని ఈశాన్య నగరాల్లో ప్రారంభించింది.
లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి
మీరు లావుగా ఉన్నారా? మీకు బట్టలు సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా? మీరు సెలెక్ట్ చేసుకున్న బట్టల్లో ఇంకా లావుగా కనిపిస్తున్నారా? ఇలాంటప్పుడే కొన్ని చిట్కాలు అవసరమవుతాయి.
న్యూజిలాండ్ లెఫ్టార్మ్ పేసర్ నీల్ వాగ్నర్ అరుదైన ఘనత
న్యూజిలాండ్ లెఫ్మార్మ్ పేసర్ నీల్ వాగ్నల్ టెస్టులో అరుదైన ఘనతకు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో 4/82 అకట్టున్నాడు. ఈ మ్యాచ్‌లో జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ ఫోక్స్, జాక్ లీచ్ పెవిలియానికి పంపి టెస్టు కెరీర్‌లో రికార్డును సాధించాడు. వాగ్నర్ టెస్టు క్రికెట్‌లో 250 వికెట్లను పూర్తిగా చేసిన ఐదో న్యూజిలాండ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు
దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 45 గంటలకు పైగా ఏకధాటిగా అధికారులు సర్వే చేస్తున్నారు.
IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది
భారతీయ టెలికాం పరిశ్రమ అప్‌గ్రేడ్‌ను కు సిద్ధంగా ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి, నావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ టెక్నాలజీ (ToT) ట్రాన్స్ఫర్ ని పూర్తి చేసింది.
అక్వేరియంలో చేపలను పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి.
కుక్కలు, పిల్లులను పెంచడం కంటే చేపలను పెంచడం చాలా సులభం. చేపలను ఆడించడం, బయటకు తీసుకెళ్లడం లాంటివి ఉండవు కాబట్టి చాలా ఈజీగా పెంచవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.
మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ
ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రా తన విధులకు ఆటంకం కలిగించారని, తనను దుర్భాషలాడారని సంబల్‌పూర్ జిల్లాలోని ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనితా ప్రధాన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించన వీడియో వైరల్‌గా మారింది.
Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది
జర్మన్ తయారీ సంస్థ Audi భారతదేశంలో Q3 స్పోర్ట్‌బ్యాక్‌ను ప్రారంభించింది. ఈ కారులో స్టైలిష్ డిజైన్, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్ తో పాటు శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది మార్కెట్లో స్వదేశీ బి ఎం డబ్ల్యూ X1తో పోటీపడుతుంది.
తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన బెన్ డకట్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బెన్ డకెట్ వేగంగా ఆడి కేవలం 68 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశారు. మౌంట్
రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా?
పాకిస్థాన్‌లోని క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు వెల్లడించారు. రైలు చిచావత్ని రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన పాకిస్తాన్ మహిళా ప్లేయర్
మహిళా టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహిళల టీ20లలో శతకం బాదిన మొదటి పాకిస్తాన్ మహిళా ప్లేయర్ మునీబా చరిత్ర సృష్టించింది. 68 బంతుల్లో 102 పరుగులు (14 బౌండరీలు) చేసింది. దీంతో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
వినరో భాగ్యము విష్ణుకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ప్రకటించిన నిర్మాతలు
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.
పాక్‌లో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు; లీటరు పెట్రోల్ రూ.272, డీజిల్ రూ.280
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది ప్రభుత్వం.
వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర ఆల్ రౌండర్
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు కొత్త కెప్టెన్‌లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్ ఆటగాడు సాయ్ హోప్, టీ20లకు విధ్వంసకర ఆల్ రౌండర్ రోవ్‌మన్ పావెలను నియమించింది. గతేడాది T20 ప్రపంచ కప్ తర్వాత వైట్-బాల్ కెప్టెన్‌గా నికోలస్ పూరన్ తప్పుకున్న విషయం తెలిసిందే.
పెరుగుతున్న సార్ సినిమా ప్రీమియర్ షోస్: ఒకరోజు ముందుగానే థియేటర్లోకి వస్తున్న ధనుష్
హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 17వ తేదీన సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు
ఫిలిప్పీన్స్‌లో గురువారం భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మాస్బేట్ ప్రాంతంలో భారీ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది
ఆసియా కప్ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇప్పటికే అతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్తాన్ భారత్ కచ్చితంగా పాల్గొనాలని కోరుతోంది. అయితే భద్రతా కారాణాల రీత్యా పాకిస్తాన్‌లో తాము ఆడే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే బీసీసీఐ చీఫ్ కార్యదర్శి జేషా ప్రకటించిన విషయం తెలిసింది.
పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్
ఫిబ్రవరి నెలలో మూడవ గురువారాన్ని ప్రపంచ కొలాంజియోకార్సినోమా డే గా జరుపుకుంటారు. అంటే పిత్త వాహిక క్యాన్సర్ దినోత్సవం అన్నమాట. ఈ రకమైన క్యాన్సర్ చాలా అరుదు.
UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్
తక్కువ-విలువ UPI లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా ఆటంకం లేకుండా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) భారతదేశంలో UPI LITEని ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ ఫీచర్‌ను అందించే దేశంలోనే మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటియం.
విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్
విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్‌టన్ ఎరీనాలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్' ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం జరగనున్న ఈ ఈవెంట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాల ఆవిష్కరణలపై చర్చించనున్నారు. ఉదయం 10గంటలకు సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు.
జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం
క్రికెట్‌లో లెట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తారు. టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటంది. టీమిండియాకు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ విభాగంలో ఒకప్పుడు జహీర్‌ఖాన్ కొత్త చరిత్రలను సృష్టించాడు. ప్రస్తుతం ఆలాంటి బౌలర్ కోసం టీమిండియా అన్వేషిస్తోంది.
టెలిగ్రామ్ vs వాట్సాప్ వీటి మధ్య ఏం జరుగుతోంది
గత వారం, వాట్సాప్ అధిపతి విల్ క్యాత్‌కార్ట్ తన ఎన్‌క్రిప్షన్ విధానాలపై మాట్లాడుతూ టెలిగ్రామ్‌ను డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయలేదని విమర్శించారు. వాట్సాప్ ఇతర యాప్‌ల భద్రతా పద్ధతులపై ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరులో, నిర్దిష్ట భద్రతా ఫీచర్లు లేవని ఆపిల్ Message సేవను విమర్శించింది. వాట్సాప్ గోప్యతా విధానాలపైనా, ప్రైవేట్ సందేశాలను స్నూపింగ్ చేస్తుందనే దానిపై ఆరోపణలను ఎదుర్కుంటుంది.
జాతీయ బాదంపప్పు దినోత్సవం: బాదంతో ఈజీగా తయారయ్యే రెసిపీస్ తెలుసుకోండి
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన జాతీయ బాదంపప్పు దినోత్సవాన్ని జరుపుకుంటారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన బాదంపప్పులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.
అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ నిలబడబోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని కూడా ఇప్పటికే అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ క్రమంలో వైట్ హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది.
చెల్సియాను చిత్తు చేసిన డార్ట్మండ్
జర్మనీలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్ లో డార్ట్మండ్ విజయం సాధించింది. చెల్సియాను 1-0తో తేడాతో ఓడించింది. మొదటి అర్ధభాగం వరకు ఇరువురు గోల్స్ సాధించడంలో విఫలమయ్యారు. అయితే 63వ నిమిషంలో కరీమ్ అడెయెమి ఆతిథ్య డార్ట్మండ్ జట్టుకు గోల్ చేశాడు. 78వ నిమిషంలో చెల్సియా గోల్ చేయడానికి దగ్గరికి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
రామ్ చరణ్ 15వ సినిమా: షూటింగ్ సెట్ లోంచి మళ్ళీ లీకైన ఫోటోలు
రామ్ చరణ్ 15 సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఫిబ్రవరి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
టెక్సాస్ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి
అమెరికా టెక్సాస్‌లోని సీలో విస్టా మాల్‌లో బుధవారం సాయంత్రం దుండగులు తుపాకీతో రెచ్చిపోయాడు. నలుగురిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు.
బాలీవుడ్: సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేలపై కురుస్తున్న ట్రోల్స్ వర్షం
ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ బిజీగా ఉంటున్న పూజా హెగ్డే, ఈ మధ్య కాలంలో సరైన విజయాన్ని అందుకోలేక పోయింది. ఇటీవలి కాలంలో ఆమె చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.
ప్రీమియర్ లీగ్‌లో ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ
ప్రీమియర్ లీగ్ 2023లో మాంచెస్టర్ సిటీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. మాంచెస్టర్ సిటీ చేతిలో ఆర్సెనల్ ఓటమిపాలైంది. 3-1తో తేడాతో ఆర్సెనల్‌పై మాంచెస్టర్ సిటీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్డీ న్కేటియాతో ఎడెర్సన్ గొడవపడటంతో ఆర్సెనల్‌కు పెనాల్టీ లభించింది. అయితే సిటీకి వీఏఆర్ ద్వారా పెనాల్టీ లభించింది.
త్రిపుర అసెంబ్లీ పోలింగ్: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటేస్తున్న ప్రజలు
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. 28.14లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 60స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి 259 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
15 Feb 2023
వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్
భారతి ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తోంది, దానితో పాటు ఉచిత కాలింగ్, ఒక సంవత్సరం వ్యాలిడిటీ రోజుకు 2.5GB డేటా వంటి ప్రయోజనాలు కేవలం రూ. 3,359కే అందిస్తుంది.
IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి
జర్మనీకి చెందిన Lufthansa సంస్థ విమానాలు బుధవారం IT అంతరాయం కారణంగా ఆలస్యం లేదా రద్దు అయ్యాయి.
హత్యకు ముందు 'నిక్కీ యాదవ్' సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు- నెట్టింట్లో వైరల్
దిల్లీలో ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి, అదే రోజు ఆ యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడిని సాహిల్ గెహ్లాట్‌గా, మృతురాలిని నిక్కీ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు.
ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం
USలో వాహన దొంగతనం అనేది ఒక పెద్ద సమస్య, కొన్ని బీమా కంపెనీలు సులభంగా దొంగిలించగల మోడల్‌లకు ఇన్సూరెన్స్ కి నిరాకరిస్తాయి. హ్యుందాయ్, కియా మోటార్స్ దాదాపు 8.3 మిలియన్ వాహనాల కోసం ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి, అది వాటిని దొంగిలించడం కష్టం చేస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే తన కార్లపై ఫర్మ్‌వేర్‌ను అందించడం ప్రారంభించింది.
అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న
బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది.
ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్
వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 ఉద్యోగాలను తగ్గించాలని అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఇంజన్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండడంతో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. ఫోర్డ్ లో ప్రస్తుతం ఐరోపాలో 34,000 ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికి ఐరోపాలో తన విమానాలను పూర్తిగా విద్యుదీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిపై $50 బిలియన్లను ఖర్చు చేస్తోంది.
ఇంగ్లండ్‌తో పోరుకు న్యూజిలాండ్ సై
ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఫిబ్రవరి 16న ప్రారంభ కానుంది. న్యూజిలాండ్ తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమైంది. అలాగైనా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ హోరా హోరీగా తలపడనున్నాయి.
సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా మారుతున్న చైల్డ్ ఆర్టిస్ట్
బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ నటించిన సినిమాల్లో బాలనటుడిగా చేసిన దీపక్ సరోజ్, సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఈ మేరకు సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు.
బౌలర్ల జాబితాలో రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచి టీమిండియా జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగులు తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
నాసాకు చెందిన రోవర్ మిషన్ నిర్మించిన శాంపిల్ డిపో గురించి తెలుసుకుందాం
రోవర్(అసలు పేరు పెర్సి) ఇటీవలే మార్స్‌పై నమూనా డిపో నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ రకమైన శాంపిల్ రిపోజిటరీని మరొక ప్రపంచంలో నిర్మించడం ఇదే మొదటిసారి.
రూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు, సినీ వినీలాకాశంలో నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శత జయంతి సంబంర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
గోవా వెళ్లాలనుకుంటున్నారా? కార్నివల్ లో జరిగే ప్రాంక్ సాంప్రదాయం గురించి తెలుసుకోండి
పర్యటకులను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గోవా. అందులో భాగంగానే గోవా కార్నివాల్ ని తీసుకువచ్చేస్తోంది. కళలు, సాంప్రదాయాలు, వినోదం, ఆహారం ఇలా ఎన్నో రకాల ఆకర్షణలు గోవా కార్నివాల్లో మిమ్మల్ని కనువిందు చేస్తాయి.
సంచలన చరిత్ర సృష్టించిన టీమిండియా
ప్రపంచ క్రికెట్లో టీమిండియా సంచలన చరిత్ర సృష్టించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన క్రికెట్ ర్యాంకుల్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లో భారత్ క్రికెట్ జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మూడు ఫార్మాట్లో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇది రెండోసారి. నాగపూర్ టెస్టు సిరీస్ లో టీమిండియా విజయం సాధించడం ద్వారా 115 పాయింట్లతో టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరుకుంది.
బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు
ముంబయి, దిల్లీలో బీబీసీకి చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి.
2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ
రాబోయే 2023 ఫార్ములా 1 (F1) సీజన్‌కు ముందు, ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫెరారీ తన SF-23 రేస్ కారును ప్రకటించింది. గత సంవత్సరం మోడల్ కంటే చిన్న మార్పులు చేసారు. ఇది 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, V6 ఇంజన్‌తో నడుస్తుంది.
జపాన్ లో ఆర్ఆర్ఆర్ హవా: వన్ బిలియన్ మార్క్ దిశగా అడుగులు
ఆర్ఆర్ఆర్ సినిమా అస్సలు తగ్గట్లేదు. సినిమా రిలీజై సంవత్సరం దగ్గర పడుతున్నా దాని రికార్డుల వేట మాత్రం ఆగట్లేదు. మరీ ముఖ్యంగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ దూకుడు చాలా ఎక్కువగా ఉంది.
చదువు: ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడుతున్నారా? ఈ ఆహారాలు తినండి
కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే సమయం వచ్చేసింది. ఈ టైంలో కొంచెం టెన్షన్ గా ఉండడం సహజమే. ఒక్కోసారి ఆ టెన్షన్ కూడా మిమ్మల్ని బాగా చదివించేలా చేస్తుంది.
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ మొదలు కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు మహిళల జట్టుకు ప్రధాన కోచ్ బెన్ సాయర్ ను నియమించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. గతంలో సాయర్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేశాడు.
మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse
స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.
ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా: పురాణాలను టచ్ చేస్తూ పాన్ ఇండియా మూవీ
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత, సినిమా అభిమానులు అందరికీ తెగ నచ్చేసింది. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ మార్క్ దర్శకత్వం, మాటలు అందరినీ అలరించాయి.
కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న అలిస్సా హీలీ
ప్రస్తుతం జరగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలిస్సా హీలీ సూపర్ ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో అలిస్సా హీలీ 36 బంతుల్లో 37 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో హీలీ మహిళల T20Iలలో అత్యధిక పరుగులు చేసిన 10వ ప్లేయర్ గా రికార్డుకెక్కింది.
వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
హిప్పో.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్షీరదం. అంటే పాలిచ్చే జంతువుల్లో మూడవ అతిపెద్ద జంతువు. మొదటి స్థానంలో ఏనుగు, రెండవ స్థానంలో ఖడ్గమృగం ఉంది.
మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి
2023 అప్‌డేట్‌లలో భాగంగా మారుతి సుజుకి తన ప్రసిద్ధ సెడాన్ మోడల్, సియాజ్ మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్‌లను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ కంట్రోల్ కూడా ఉంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. ఫిబ్రవరి 28న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ తలపడనుంది. ఈ సిరీస్‌కు వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్, బ్యాటర్ న్క్రుమా బోన్నర్‌లకు చోటు దక్కలేదు.
న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు
సైక్లోన్ సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ధృవీకరించింది. ఈ భూకంపం వెల్లింగ్‌టన్ సమీపంలోని లోయర్ హట్‌కు వాయువ్యంగా 78 కి.మీ దూరంలో సంభవంచినట్లు వెల్లడించింది.
కడప: జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
భారతదేశంలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్న Xiaomi TV Stick 4K అమ్మకాలు
Xiaomi భారతదేశంలో TV Stick 4Kని ప్రకటించింది. ఇది డాల్బీ టెక్నాలజీ, 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ ప్యాచ్‌వాల్ సాఫ్ట్‌వేర్ తో పాటు Wi-Fi 5, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీలతో వస్తుంది.
ఎన్టీఆర్ 30 : ఈనెల 24వ తేదీన ముహూర్తం ఫిక్స్?
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అప్డేట్ల కోసం అంతలా అడగొద్దని ఎన్టీఆర్ చెప్పడంతో అభిమానులు దాదాపు కామ్ అయిపోయారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం, ఆత్రం అలాగే ఉంది, ఇప్పుడు అది తీరిపోయే సమయం వచ్చేసింది. ఎన్టీఆర్ 30 షూటింగ్ పై ఒక పుకారు చక్కర్లు కొడుతోంది.
ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిటెనెస్ నిరూపించేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ కొత్త వివాదానికి తెర లేపాడు. జీన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ వ్యవహారంపై చేతన శర్మ నోరు జారాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్
'టాటా'లకు చెందిన ఎయిర్ ఇండియా - అమెరికాకు చెందిన బోయింగ్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. 34 బిలియన డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది.
నాని 31: అంటే, వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చేస్తున్నారట?
తన మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చ్ 30వ తేదీన రిలీజ్ అవుతుంది.
ఇంటర్నెట్ సంచలనం ChatGPT వెనుక ఉన్న సామ్ ఆల్ట్‌మాన్ గురించి తెలుసుకుందాం
గత కొన్ని నెలలుగా ChatGPT ఎన్నో చర్చలకు దారితీసింది. అయితే అందరూ ఈ చాట్ బాట్ గురించి మాట్లాడారు గాని OpenAI సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ గురించి ఎవరూ మాట్లాడలేదు. 37 సంవత్సరాల ఆల్ట్‌మాన్, చికాగో, ఇల్లినాయిస్‌లో 1985లో జన్మించాడు. అతను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో పెరిగాడు.
ICC మహిళల T20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటుతోంది. బంగ్లాదేశ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.
కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
కెనడాలోని మిస్సిసాగాలోని రామమందిరంపై కొందరు దుంగడులు దాడి చేశారు. దీంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యతిరేక భావం జాలం ఉన్న వారే ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
మొక్కల్లో మాంసం దొరికే ఆహారాలు, వాటివల్ల కలిగే లాభాలు, నష్టాలు
మాంసం తినని వాళ్ళకు మాంసహార రుచి ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మాంసంలోని పోషకాలు అందవని మీరు వాళ్ళ మీద జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాంసం లాంటి రుచితో, పోషకాలతో కూడిన మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఫ్రాంచైజీ నూతన సంప్రదాయానికి తెర లేపింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను ఆర్సీబీ మెంటర్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా బుధవారం వెల్లడింది. యూత్ ఐకాన్, భారత ఛాంపియన్ సానియా మిర్జాను మెంటర్‌గా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.
ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి
ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి, అదే రోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దిల్లీలో మిత్రోన్ గ్రామంలో జరిగింది. ఈ హత్యకు సంబంధించి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హీరోలు, హీరోయిన్లపై పిచ్చి ప్రేమ చూపిస్తున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్త
సెలెబ్రిటీలుగా ఎదిగిన వారికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫాలోవర్లలో మీరు కూడా ఒకరైతే పెద్దగా సమస్యేమీ లేదు, కానీ సెలెబ్రిటిలని ఫాలో అవుతూ, వాళ్ళని అతిగా ఆరాధిస్తేనే సమస్య ఎదురవుతుంది.
INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..?
టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరిగే రెండు టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. దీంతో టీమిండియా బలం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు వెన్నునొప్పితో జట్టుకు అయ్యర్ దూరమయ్యాడు. గతేడాది టెస్టులు, వన్డేల్లో టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరించాడు.
చంద్రుడు ధూళితో సౌర ఘటాలను తయారు చేయనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్
బ్లూ ఆరిజిన్, జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ, సౌర ఘటాలు, ట్రాన్స్‌మిషన్ వైర్‌లను తయారు చేయడానికి చంద్రుడి రెగోలిత్(అక్కడి మట్టి)ను ఉపయోగించే టెక్నాలజీతో ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిన సౌర ఘటాలు అక్కడ ఒక దశాబ్దం పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.
జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం
జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో సొంతం చేసుకుంది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్ కేవలం 4 పరుగులు తేడాతో గెలిచి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
రామ్ చరణ్-శంకర్ మూవీ: లీకైన ఫోటోలతో పెరుగుతున్న ఆసక్తి
ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. తన 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా నుండి బయటకు వస్తున్న లీకులు సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ప్రెగ్నెన్సీ విషయంపై వస్తున్న వార్తలకు స్పందించిన సింగర్ సునీత
సినిమా తారలపై పుకార్లు సహజం. కొన్ని సార్లు ఆ పుకార్లు నిజమవుతాయి కూడా. సాధారణంగా ఇలాంటి పుకార్లు కూడా కావాలనే పుట్టిస్తుంటారని కొందరు చెబుతారు.
ఫిబ్రవరి 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్
మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్‌తో బస్సులు వస్తుంటాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది వాటి రూపురేఖలు మారుతుంటాయి. మనం ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, బస్సులను చూశాం. కానీ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు మాత్రం చూడలేదు. అయితే మహారాష్ట్రలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సును జనవరి 13న ప్రారంభించారు.
తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన రైలు నెం.12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. బీబీనగర్- ఘట్‌కేసర్ మధ్య ఈ ఘటన జరిగింది.