10 Feb 2023

H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం

H-1B వీసాపై అమెరికా కొత్త ప్లాన్ అమలు చేస్తుంది దీనితో H-1B, L1 వీసాలపై వేలాది మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో వేలాది మంది భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. పైలట్ ప్రాతిపదికన "దేశీయ వీసా రీవాలిడేషన్" కేటగిరీలు పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాలలో దానిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.

కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

టర్కీలో వరుసగా సంభవించిన భూకంపాల తర్వాత మూడు రోజులపాటు శిథిలాల కింద కూరుకుపోయిన 6 ఏళ్ల బాలికను స్నిఫర్ డాగ్స్ రక్షించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ, శిథిలాల కింద 6 ఏళ్ల నస్రీన్ ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి.

మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు

బోర్కర్ గవాస్కర్ తొలి టెస్టులో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆసీస్ పై భారత్ అధిక్యంగా దిశగా ముందుకెళ్తోంది. ఇప్పటికే 144 పరుగుల అధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో పాటు, ఆలౌరౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడడం వల్లే టీమిండియా సత్తా చాటింది.

బెదురులంక 2012 టీజర్: గ్రామంలో యుగాంతం వింతలు

ఆర్ ఎక్స్ 100 తర్వాత హీరో కార్తికేయకు సరైన హిట్ పడలేదు. విలన్ వేషాలు వేసినా కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే తాజాగా బెదురులంక 2012 సినిమాతో హీరోగా వస్తున్నాడు.

టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు

ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయని అంబటి రాంబాబు ఆరోపించారు.

ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని గురెజ్ సరిహద్దు ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మహిళలు ప్రమాదంలో పడ్డారు.

37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించే క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని క్రికెట్ దిగ్గజాలు చెబుతుంటారు. అయితే టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. గత 37 టెస్టు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ కూడా చేయకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు

సూర్యుడు ఎప్పుడూ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమే. ఇప్పుడు, అయితే ఒక కొత్త పరిణామం శాస్త్రవేత్తలను కలవరపెట్టింది. సూర్యుని నుండి భారీ ముక్క దాని ఉపరితలం నుండి విడిపోయింది . శాస్త్రవేత్తలు ఇది ఎలా జరిగిందో విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయన్ను బ్యాన్ చేశారు. అయితే రెండేండ్ల తరువాత ఆయన అకౌంట్లకు యాక్సిస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల మాతృసంస్థ మెటా ప్రకటించింది.

పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు

సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది..

సమంత శాకుంతలం సినిమాకు కొత్త రిలీజ్ డేట్

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతం కావ్యాన్ని వెండితెరకు శాకుంతలం పేరుతో తీసుకొస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. హిందూ పురాణాల్లోని శకుంతల దుష్యంతుల మధ్య ప్రేమకథను శాకుంతలం సినిమాలో చూపించనున్నాడు.

1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ

యాహూ తన మొత్తం సిబ్బందిలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది, దాదాపు 50% యాడ్ టెక్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుంది రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు మాంద్యం భయంతో కంపెనీలు టెక్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ కోతలను ప్రకటిస్తున్నాయి.

భారత్ క్రికెట్ చరిత్రలో రోహిత్‌శర్మ అరుదైన రికార్డ‌ు

భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యం కానీ రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటో సెంచరీ చేయడంతో ఈ ఘనతను రోహిత్ సాధించాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లోనూ సెంచరీలు సాధించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. టెస్టులో మొత్తం 9 సెంచరీలు సాధించిన ఆటగాడి నిలిచాడు.

ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌

బుల్లెట్ రైలు పని మహారాష్ట్రలో వేగాన్ని పుంజుకుంది, దీనిని బాంబే హైకోర్టు "జాతీయ ప్రాముఖ్యత మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన" ప్రాజెక్ట్ అని పేర్కొంది.

మీరు సింగిల్ గా ఉన్నారా? మీ స్నేహితులతో వాలెంటైన్స్ డేని ఇలా సెలెబ్రేట్ చేసుకోండి

వాలెంటైన్స్ డే రోజున సింగిల్స్ గురించి రకరకాల మీమ్స్ వస్తుంటాయి. ఐతే మీరు కోరుకున్న లవ్ మీకింకా దొరక్కపోతే వాలెంటైన్స్ డే సెలెబ్రేట్ చేసుకోకూడదని రూలేమీ లేదు.

బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హిందూసేన ఈ పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్

ఇండెక్స్ ప్రొవైడర్ MSCI (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) కొన్ని అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్‌ను సమీక్షిస్తామని చెప్పిన తర్వాత అదానీ విల్మార్ మినహా గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.

కాంతార: వరాహరూపం పాటను తీసేయాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు

కన్నడ మూవీ కాంతార సినిమాలోని వరాహరూపం పాటపై కేరళ హైకోర్టు విధించిన కండీషన్ నుండి ఉపశమనం కలిగింది సుప్రీం కోర్ట్. దీంతో చిత్ర నిర్మాతలకు కాంతార సినిమాలో వరాహ రూపం పాటను తీసేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

సూపర్ సెంచరీతో అదరగొట్టిన మార్కరమ్, ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను 14 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడించింది.

యాంగ్జాయిటీ డిజార్డర్ గురించి జనం నమ్మే అపోహాలు

యాంగ్జాయిటీ (ఆందోళన) అనేది సాధారణమైనదని కొందరు అంటుంటారు. అందుకే దాని గురించి జనంలో చాలా అపోహాలున్నాయి. ఈరోజు వాటిని బద్దలు కొడదాం.

తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్

డబ్ల్యూఈఎఫ్ లో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎఫ్‌ఎంసిజి సహా వివిధ రంగాల్లో తెలంగాణ దాదాపు రూ.21,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం స్ఫష్టం చేశారు.

2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన వారం తర్వాత, కేంద్రం ఈరోజు మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి పెంచింది, ఇప్పుడు పూర్తి స్థాయి 34 మంది న్యాయమూర్తుల సంఖ్యకు చేరుకుంది.

టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు

సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.

ఆ రెండు సినిమాల విడుదల వాయిదా వెనుక దిల్ రాజు?

రెండు మూడు రోజులుగా దిల్ రాజు వర్సెస్ అల్లు అరవింద్ అంటూ అనేక వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్, దిల్ రాజు ల సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఇలా వార్తలు వస్తున్నాయి.

జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు

దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో లిథియం నిల్వలు లభించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

రాత్రుళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి కథ తెలుసుకోండి

జాబ్ లేదా టైమ్ పాస్ కోసమో స్మార్ట్ ఫోన్ వాడకం మరీ పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే జేబు దగ్గర గుండె లేదేమో అన్నట్లుగా ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.

టీమిండియాకి పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం

టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ ఉన్నందున బోర్డర్ గవాస్కర్ ట్రోఫికి దూరమైనట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న షారుక్ ఖాన్ డీడీఎల్జే

భారతీయ సినిమా చరిత్రలో మరపురాని చిత్రంగా నిలిచిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీ, దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు మళ్ళీ సిద్ధం అవుతోంది.

పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్‌తో పది రోజుల నుంచి పాక్ చర్చలు జరుపుతోంది. తాజాగా ఐఎంఎఫ్‌తో పాక్ చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.

3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో దాని అత్యంత సరసమైన ఆఫర్ S1 ఎయిర్ కోసం మూడు కొత్త ట్రిమ్ స్థాయిలను ప్రవేశపెట్టింది. స్కూటర్ బేస్ వేరియంట్ ఇప్పుడు చిన్న 2kWh బ్యాటరీ ప్యాక్‌తో , మిడ్-లెవల్ మోడల్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ తో, రేంజ్-టాపింగ్ వెర్షన్ 4kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది.

ఓ మై డార్లింగ్ మూవీ కోసం బుట్టబొమ్మ లిప్ కిస్

ఇటీవల తెలుగులో వచ్చిన బుట్టబొమ్మ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మళయాలంలో హిట్ అయిన కప్పెలా సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా.

వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై వివాదం రేగింది. అసభ్య పదజాలం వాడారని ఆరోపిస్తూ ఆమెను బీజేపీ టార్గెట్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా

గత నవంబర్‌లో, క్రియేటర్‌లు డబ్బు సంపాదించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'గిఫ్ట్‌లను' మెటా పరిచయం చేసింది. ఇప్పుడు మరింత మంది క్రియేటర్‌లకు ఈ ఫీచర్ యాక్సెస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

బాలీవుడ్: షారుక్ ఖాన్ బ్లూ వాచ్ ఖరీదుతో రెండు చిన్న సినిమాల నిర్మాణం

పఠాన్ యాక్టర్ షారుక్ ఖాన్, పఠాన్ సినిమా విజయంతో సంతోషంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత అటు బాలీవుడ్ లోనూ, ఇటు షారుక్ ఖాన్ కెరీర్లోనూ మంచి విజయం వచ్చింది.

క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా

ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా మరోసారి చెలరేగింది. 2023 అబుదాబి ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకొని సత్తా చాటింది. రౌండ్ ఆఫ్-16 క్లాష్‌లో కరోలియా ప్లిస్కోవాపై విజయం సాధించింది.

కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి మొదటి లాంచ్ ప్యాడ్ నుండి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV-D2) ను ప్రయోగించనుంది.

09 Feb 2023

గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ, గురువారం రాజ్యసభలో కూడా మాటల తూటాలను పేల్చారు.

ఆర్ఆర్ఆర్: 10వేల మందితో ఫైట్ చేసినా చిన్న గాయం కూడా కాలేదంటున్న రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ మేనియా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. సినిమా విడుదలై 11నెలలవుతున్నా ఆర్ఆర్ఆర్ గురించి ఏదో ఒక డిస్కషన్ రోజూ వస్తూనే ఉంది.

మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు చుక్కులు చూపించిన ఇండియా బౌలర్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతోన్న మొదట టెస్టులో మొదటి రోజు ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 177 పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి ఆసీసీ బ్యాటర్ల నడ్డి విరిచాడు.

ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ

చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా AI రంగంలోకి ప్రవేశించబోతుంది. ChatGPT లాంటి టూల్‌ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక

జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులను అయన్ను వెంటనే రాంచీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్

వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళాశంకర్ మూవీ షూటింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర్, ట్విట్టర్ వేదికగా ఒక అప్డేట్ ఇచ్చారు.

జడేజా దెబ్బకు ఆస్ట్రేలియాకు మైండ్ బ్లాంక్

గతేడాది గాయానికి గురై కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మొదటి టెస్టులో విజృభించాడు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా ఐదు కీలక వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్‌లలో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రేపు విచారణ

షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై 'కుట్ర'కు పాల్పడిందంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పీఐఎల్)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ పీఐఎల్‌లు దాఖలు చేశారు.

భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్

ఇటాలియన్ ఆటోమోటివ్ సంస్థ పియాజియో ఈ సంవత్సరం భారతదేశంలో వెస్పా, అప్రిలియా సబ్-బ్రాండ్‌ల క్రింద కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

ఫైనల్‌కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ కు రియల్ మాడ్రిడ్ దూసుకెళ్లాడు. ఈజిప్టుకు చెందిన ఆల్ అహ్లీని 4-1తో ఓడించి రియల్ మాడ్రిడ్ సత్తా చాటాడు. అనంతరం సౌదీ అరేబియా జట్టుకు చెందిన అల్ హిలాల్‌తో తలపడనున్నారు. రియల్ తరఫున వినిసియస్, ఫెడెరికో వాల్వెర్డే, రోడ్రిగో, సెర్గియో అర్రిబాస్ గోల్స్ చేశారు. అంతకుముందు, అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఆర్ట్ ఫెస్టివల్ కి ఎప్పుడైనా వెళ్లారా? ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్స్ చూడండి

ఇండియాలో ఆర్ట్ ఫిస్టివల్స్ తరచుగా జరుగుతుంటాయి. పెయింటిగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, శిల్పాలు చెక్కడం ఇలా ప్రతీ ఆర్ట్ కి సంబంధించిన ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం, ఈ ఫిబ్రవరి నెలలో మొదలు కానున్న ఆర్ట్ ఫెస్టివల్స్ ఏంటో తెలుసుకుందాం.

కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దేశం సీరియస్‌గా తీసుకుంటోందని, ఈ క్రమలో కొంతమంది ఎంపీల ప్రవర్తన ప్రజలను నిరాశకు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP

స్వదేశీ స్టార్ట్-అప్ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో OXO మోడల్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్‌సైకిల్ బేస్, ప్రో మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. తయారీ సంస్థ ఈ బైక్‌ను ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించింది. ప్రో ప్యాకేజీ కింద మొత్తం-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఐదు రంగులలో ఆర్డర్ చేసుకోవచ్చు.

టెస్టులో చరిత్రను తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో చరిత్రను సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 450 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో అలెక్స్ క్యారీని అశ్విన్ ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు.

పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒరాకిల్ మాజీ సిఈఓ మార్క్ హార్డ్ మాజీ భార్య పౌలా హర్డ్‌తో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కనిపించారు.

ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' కాదు, 'కౌ హగ్ డే'ను జరుపుకోండి: కేంద్రం

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కాకుండా 'కౌ హగ్ డే'ను జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆవును కౌగిలించుకోవడం వల్ల వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుందని చెప్పింది. ఆవు ప్రేమికుల విజ్ఞప్తి మేరకు కేంద్ర జంతు సంక్షేమ విభాగం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు

ఈ శుక్రవారం (ఫిబ్రవరి 10వ తేదీన) ఓటీటిలో వస్తున్న కంటెంట్ చాలా పెద్దగా ఉంది. సినిమాలు, టాక్ షోస్, సిరీస్.. ఇలా అన్నీ రిలీజ్ అవుతున్నాయి.

మొదటి టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషాగ్నే

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టపటపా వికెట్లను కోల్పోయింది.

హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్

జపాన్ తయారీ సంస్థ టయోటా గ్లోబల్ మార్కెట్ లో గ్రాండ్ హైలాండర్ 2024 వెర్షన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న జరగబోయే 2023 చికాగో ఆటో షోలో దీనిని ప్రదర్శిస్తారు.

వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వారి కోసం స్ట్రాబెర్రీ చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేయండి

స్ట్రాబెర్రీ, చాక్లెట్ ని కలిపి తింటే ఆ రుచే వేరు. ప్రేమికుల రోజున స్ట్రాబెర్రీ నిండిన చాక్లెట్లని ఇంట్లోనే తయారు చేసుకోండి.

దోహా, దుబాయి లీగ్ నుండి తప్పుకున్న ఒన్స్ జబీర్

ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఒన్స్ జబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈనెల చివరిలో డబ్య్లూటీఎ టోర్నమెంట్ లు, ఖతార్ ఓపెన్, దుబాయి టెన్నిస్ ఛాంపియన్ షిప్ నుండి తప్పుకుంటున్న బుధవారం పేర్కొంది. ఈ ఏడాది చివర్లో చిన్న సర్జరీ చేయించుకుంటానని, అందువల్ల ఈ సిరీస్ దూరమవుతున్నట్లు తెలియజేసింది.

రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా

రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్‌పై ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని అమెరికాకు చెందిన ఐరోపా, యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ తెలిపారు.

SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో

ఇస్రో ఫిబ్రవరి 10వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 9:18 గంటలకు కొత్త స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రాకెట్‌ను రెండవ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. SSLV-D2 (Demonstration 2) పేరుతో ఈ మిషన్ మూడు ఉపగ్రహాలతో రాకెట్ లిఫ్ట్‌ఆఫ్‌ను కక్ష్యలో 450 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తుంది. ఆగస్టు 7, 2022న ప్రయోగించిన SSLV-D1 మిషన్ SSLV రాకెట్‌ని రెండవ దశలో వేరుచేసే సమయంలో విఫలమైంది.

ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో ప్రారంభమైంది. ఇది ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం, వెబ్ ద్వారా HD రిజల్యూషన్‌లో వీడియోలను పోస్ట్ చేయడం, కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే?

చైనాలో ఇటీవల కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరిగాయో అందరకీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయా? అనే అంశంపై ఒక పరిశోధన జరిగింది. 'ది లాన్సెట్‌'లో ఆ పరిశోధన ప్రచురితమైంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ షమీ సంచలన రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సంచనల రికార్డును సృష్టించాడు. షమీ అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లను పడగొట్టి చరిత్రకెక్కాడు. ఈ మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా షమీ నిలిచాడు.

ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, తెలంగాణలోని ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.

నిద్రకు సంబంధించిన రుగ్మతల వల్ల కలిగే నోటికి సంబంధించిన ఇబ్బందులు

సరైన నిద్ర వల్ల మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఒకవేళ నిద్ర సరిగ్గా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ప్రస్తుతం నిద్రకు సంబంధించిన రుగ్మతల వల్ల కలిగే నోటి అనారోగ్యాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన కీలకమైన ప్రీమియర్ లీగ్ 2022-23 ఎన్‌కౌంటర్‌లో మేనేజర్‌లెస్ లీడ్స్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

ఫిబ్రవరి 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ

డిస్నీ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి 7,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించింది.

కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక జనాలు థియేటర్ కి రావడం చాలా వరకు తగ్గించారు. ఏదైనా పెద్ద సినిమా ఉంటే తప్ప థియేటర్ వైపు చూడటం లేదు. ఇళ్ళలోంచి కదలకుండా చేతికి దొరికిన సాధనంతో సినిమాలు చూసేస్తున్నారు.

అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ

స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆకాశాన్నంటుతున్న అప్పులను కూడా నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు, రెగ్యులేటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దేశీయ బ్యాంకులకు మద్దతుగా నిలిచాయి.

టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్

నాగ్ పూర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కేఎస్.భరత్ చోటు దక్కించుకున్నాడు. భరత్‌కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్‌ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు.

మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..

ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త.

కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆస్కార్ కాదు భాస్కర్ కూడా రాదు - ప్రకాష్ రాజ్

నటుడు ప్రకాష్ రాజు, కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లెటర్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్, అటు పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలన్న గ్యాంగ్ ని, ఇటు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడిని తీవ్రంగా విమర్శించారు.

భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్

జపనీస్ తయారీ సంస్థ సుజుకి భారతదేశంలో తన Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 బైకుల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా కొత్త రంగు ఆప్షన్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. సింగిల్-సిలిండర్ 155cc, 249cc ఇంజిన్‌లతో నడుస్తాయి. .

టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్

భారత్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు నెరవేరింది. అంతర్జాతీయ టీ20, వన్డేలో అదరగొట్టిన సూర్య.. ప్రస్తుతం టీమిండియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.

అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్

ChatGPTతో ఉన్న కొత్త Bing గురించి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన గురించి ఇంకా అందరు చర్చిస్తుండగానే గూగుల్ తన AI-సెంట్రిక్ "లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ఈవెంట్ ను పారిస్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో Bard-గూగుల్ గురించి ప్రివ్యూతో పాటు గూగుల్ లెన్స్ గురించి కొన్ని అప్‌డేట్‌లు ఉన్నాయి.

భోళాశంకర్ సెట్లో రామ్ చరణ్ దర్శనం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం ప్రపంచ స్టార్ గా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ జనాలు ఫిదా ఐపోయారు. అదీగాక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఇప్పుడు అదే పాట ఆస్కార్ నామినేషన్లో ఉండడంతో ఆర్ఆర్ఆర్ లోని నటించిన అందరికీ హాలీవుడ్ లెవెల్లో మంచి గుర్తింపు దక్కింది.

ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్

స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే భారత్‌కి కనీసం మూడు విజయాలు కావాలి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బంధం: వేధించే బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చేయాల్సిన పనులు

మీ స్నేహితులు గానీ, మీ జీవిత భాగస్వామి గానీ మిమ్మల్ని పదే పదే అసహ్యించుకుంటున్నారా? ఎదుటివారి ముందు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా? వాళ్ళతో మీరున్నప్పుడు మీకు అనీజీగా అనిపిస్తుందా? వీటన్నింటికి మీ సమాధానాలు అవును అయితే మీ బంధం విషపూరితమైనదని చెప్పుకోవచ్చు.

మార్టా కోస్ట్యుక్‌ను చిత్తు చేసిన బెలిండా బెన్సిక్

అబుదాబి ఓపెన్ 2023లో బెలిండా బెన్సిక్ విజయపరంపర కొనసాగుతోంది. బుధవారం మార్టా కోస్ట్యుక్‌ను వరుస సెట్లతో ఓడించి క్వార్టర్స్ కు చేరుకుంది. మార్టా కోస్ట్యుక్‌పై (6-4, 7-5)తో బెలిండా బెన్సిక్ విజయం సాధించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెన్సిక్ రెండో సెట్‌లో 5-3తో మొదట వెనుకబడింది. అయితే 1.35 నిమిషాల తర్వాత 57వ ర్యాంక్ కోస్ట్యుక్‌పై వరుస సెట్లలో చిత్తు చేసింది.

టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు

టర్కీ, సిరియాలో భూకంపం మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గత 24గంటల్లో శిథిలాల కింద చిక్కుకున్న 7వేలకుపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. దీంతో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 15,383కు చేరుకున్నట్లు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

సార్ ట్రైలర్: మర్యాద సంపాదించాలంటే చదువు కావాలంటున్న ధనుష్

తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ధనుష్ చేసే సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందని అందరూ నమ్ముతుంటారు. మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా సినిమాలు తీసే ధనుష్, ప్రస్తుతం సార్ అంటూ తెలుగు సినిమాతో వస్తున్నాడు.

వెస్టిండీస్‌కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు

జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య బులవాయో వేదికగా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులను చేసింది.

బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్‌జెండర్ జంట

దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లి దండ్రులయ్యారు. జహాద్ బుధవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది జియా పావల్, జహాద్ జంట వెల్లడించలేదు.