కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు.
'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన
లక్నో పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కీలక ప్రకటన చేశారు. భదోహిలో జిల్లాలో వివిధ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యావలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA
కొత్త తరం హ్యుందాయ్ VERNA ఈ మార్చిలో భారతదేశంలో ఉత్పత్తికి వెళ్లనుంది. ఏటా 70,000 యూనిట్లను తయారు చేయాలని హ్యుందాయ్ సంస్థ ఆలోచిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతాయి. పెట్రోల్-ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ హేమ మాలిని బుధవారం మండిపడ్డారు. అక్షేపణీయమైన పదాన్ని లోక్‌సభలో మహువా ఉపయోగించారని, నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడలని సూచించారు.
#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?
గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: నిరాశలో చిరంజీవి అభిమానులు
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా బాక్సాఫీసు దగ్గర రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. మహేష్ బాబు పోకిరి నుండి మొదలైన ఈ మేనియా, జల్సా, ఖుషి, ఒక్కడు, నారప్ప సినిమాల వరకూ సాగింది.
టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు నాగ్‌పూర్ లోని VCA స్టేడియంలో ప్రారంభం కానుంది.ఇండియా స్వదేశంలో 2017లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి టెస్టు ఆడే ప్లేయర్స్ ఎంపికలో టీమిండియా ఆచూతూచి వ్యవరిస్తోంది.
మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా
మోటోరోలా Moto E13 ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Moto E13 సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP లెన్స్ తో వస్తుంది.
ఇషాన్ కిషన్ వర్సెస్ కెఎస్ భరత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.
ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది
ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు కానీ ఆ సినిమా గురించిన చర్చ రోజూ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కాబట్టి ఆ మాత్రం ఆసక్తి ఉండడం సహజమే.
రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.
ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్
NBAలో లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కరీమ్ అబ్దుల్-జబ్బాను అధిగమించి ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును సృష్టించాడు. బుధవారం ఓక్లహోమా సిటీ థండర్‌తో జరిగిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ గేమ్‌లో కరీమ్ అబ్దుల్-జబ్బార్ రికార్డును బద్దలు కొట్టి సత్తా చాటాడు.
ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా
స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఈ ఫిబ్రవరిలో భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపుతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. తగ్గింపు ఉన్న కార్లలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 ఉన్నాయి. రూ.70,000 వరకు ఆఫర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
వాస్తు: ఇంట్లో పెంచకూడని మొక్కల గురించి తెలుసుకోండి.
ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. కొన్ని మొక్కలను ఇంటిని అలంకరించడానికి పెంచితే, మరికొన్ని మొక్కలను వాటివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల కోసం పెంచుతారు.
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు!
వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తొలుత నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.
హైబ్రిడ్ ఇంజిన్ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ తన X5, X6 SUVల 2024 వెర్షన్‌లను వెల్లడించింది. ఈ ఏప్రిల్‌లో ఉత్పత్తికి వెళ్లనున్నాయి. కార్లు డ్రైవర్ కు సహాయపడే అనేక ఫీచర్లతో , విశాలమైన క్యాబిన్‌లతో వస్తుంది. వివిధ హైబ్రిడ్ ఇంజిన్‌ల ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. కేవలం 4.2 సెకన్లలో 0-96కిమీ/గం వేగంతో వెళ్లగలదు.
అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ
జమ్ముకశ్మీర్‌లో ఇళ్లను కూల్చడాన్ని నిరసిస్తూ పీడీపీ అగ్రనేత మెహబూబా ముఫ్తీ దిల్లీలో ఆందోళన చేప్టటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనపై ఆమె విరుచుపడ్డారు. పేదలు, అట్టడుగువర్గాల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు జమ్ముకశ్మీర్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ఫ్లెమెంగోను ఓడించిన సౌదీ అరేబియా జట్టు
మొరాకోలోని టాంజియర్‌లో జరుగుతున్న ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో సౌదీ అరేబియా క్లబ్ అద్భుతాన్ని సృష్టించింది. అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో విజయం సాధించింది. కబ్ల్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా సౌదీ అరేబియా క్లబ్ చరిత్రలో నిలిచింది.
వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్సెస్ తో ఇలా అదరగొట్టండి
ప్రేమికుల రోజున మీ ప్రేమజంటతో పార్టీలకు, విహారానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? ఐతే మ్యాచింగ్ డ్రెస్ ట్రై చేయండి. మీ జీవితంలో మరువలేని వాలెంటైన్స్ డే మీ జ్ఞాపకంగా ఉండిపోతుంది.
FA కప్ 2022-23లో షెఫీల్డ్ యునైటెడ్ విజయం
FA కప్ 2022-23 రీప్లేలో రెక్స్‌హామ్ ఓటమి పాలైంది. షెఫీల్డ్ యునైటెడ్ రెక్సహామ్ పై 3-1తేడాతో విజయాన్ని నమోదు చేసింది. యునైటెడ్ టోటెన్‌హామ్ హాట్‌స్‌పుర్‌తో 5వ రౌండ్ క్లాష్‌ను ఏర్పాటు చేయడానికి రెండు ఆలస్య గోల్‌లను సాధించడం గమనార్హం.
ట్రావెల్: జపాన్ లో చాప్ స్టిక్స్ వాడేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జపాన్ దేశస్తులకు క్రమశిక్షణ చాలా ఎక్కువ. అందుకే వారి జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమశిక్షణ వారి తినే విధానాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. జపాన్ లో చాప్ స్టిక్స్ తో భోజనం తినేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఫిబ్రవరి 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ
దిల్లీ మద్యం కేసులో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.
ChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లోని ప్రధాన కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ జర్నలిస్టులు, క్రియేటర్ల సమక్షంలో కొత్త Bing గురించి ప్రకటించింది.
భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్
ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు టెస్టులో తలపడితే అభిమానులకు అంతకుమంచి కిక్ ఏముంటుంది. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
ఓటిటి: జనవరిలో థియేటర్లలో రిలీజైన చిత్రాలు ఈ వారం ఓటీటిలోకి
ఈ వారం ఓటిటిలో తెలుగు సినిమాలు రెండు తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లలో రిలీజై ఎక్కువ రోజులు కాకముందే ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి.
సెలెర్నిటానాపై 3-0తో జువెంటస్ సంచలన విజయం
సీరీ A 2022-23 సీజన్‌లో 21వ మ్యాచ్‌డేలో భాగంగా జువెంటస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సలెర్నిటానాపై 3-0తో విజయఢంకా మోగించింది. మధ్యలో ఫిలిప్ కోస్టిక్ ఒకరిని జోడించగా.. దుసాన్ వ్లహోవిచ్ బ్రేస్ గోల్ చేశాడు. ప్రస్తుతం సీరీ A 2022-23 స్టాండింగ్స్‌లో 10వ స్థానానికి జువెంటస్ చేరుకుంది.
'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా
ఇటీవల అమెరికా గుర్తించిన చైనా గూఢచారి బెలూన్లపై 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన విషయాలను బయపెట్టటింది. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలే లక్ష్యంగా గూఢచారి బెలూన్ల ద్వారా చైనా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది.
ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ మంగళవారం తన 15% అంటే దాదాపు 1,300 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూమ్ సిఈఓ ఎరిక్ యువాన్ తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తాను బాధ్యత వహిస్తానని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన జీతం 98% తగ్గించడంతో పాటు కార్పొరేట్ బోనస్‌ను వదులుకుంటున్నానని చెప్పారు.
పాకిస్తాన్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం, 2 ఏళ్లపాటు ఆటగాడిపై నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్ లో పాక్ ఆటగాళ్లు మరోసారి బయటపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం మరో పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఈ మహమ్మరికి బలి అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.
క్రితిసనన్ తో ఎంగేజ్ మెంట్ వార్తలపై స్పందించిన ప్రభాస్ టీమ్
ప్రభాస్ -క్రితిసనన్ ఎంగేజ్మెంట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయి. సడెన్ గా ఎంగేజ్మెంట్ గురించి వార్త రావడంతో నమ్మాలా వద్దా అనే డైలమాలో పడిపోయారు.
మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి
మహీంద్రా సంస్థ ఇటీవల భారతదేశంలో Thar RWDని విడుదల చేసింది. SUV పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ లో మూడు విభిన్న వేరియంట్లలో రాబోతుంది. Thar RWD డీజిల్ బుక్ చేస్తే మాత్రం డెలివరీకి సమయం పడుతుంది.
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన కమ్రాన్ అక్మల్
పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే జాతీయ సెలక్షన్ కమిటీగా ఎంపికైన అక్మల్.. ప్రస్తుతం తన కొత్త పాత్రపై దృష్టి సారించాడు.
ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ
ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే లేఖ రాశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.
ఊపిరితిత్తులను ఇబ్బందికి గురి చేసే నిమోనియా లక్షణాలు, రావడానికి కారణాలు తెలుసుకోండి
ఊపిరితిత్తులు ఉబ్బిపోయి తీవ్రమైన దగ్గు, కఫం వస్తుంటే అది నిమోనియా లక్షణం కావచ్చు. దీనికి కారణం బాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ అయ్యుండవచ్చు. నిమోనియా తీవ్రత అది ఎలా వచ్చిందన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.
రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
భారతదేశంలో మోటోరోలాతో 5G భాగస్వామ్యాన్ని ప్రకటించిన వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా (Vi) భారతదేశంలోని OEM స్మార్ట్‌ఫోన్ సిరీస్ 5G సాంకేతికతను తీసుకురావడానికి మోటోరోలా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా ఇంకా తన 5G నెట్‌వర్క్ ప్లాన్‌లను ప్రకటించలేదు. అయితే మోటోరోలా నుండి తాజా 5G ఫోన్లు వోడాఫోన్ ఐడియా 5G స్పెక్ట్రమ్ తో పరీక్షించారు.
రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్
భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్. నగరాల్లో ప్రారంభించింది.
నాగపూర్‌లో టెస్టు సమరానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా
గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఎన్నో రికార్డులు, ఘనతలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యత్తుమ టెస్టు పోరుగా మార్చేశాయి. ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌పై రెండు జట్లు సమరం మొదలైంది.
భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు
వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలో మరణాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 8,000 మందికిపైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఈ మధ్య గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సత్యదేవ్ హీరోగా కనిపించిన ఈ సినిమా, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.
వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ లాంచ్ అయ్యింది. 2:25నిమిషాల ట్రైలర్ లో కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ కనిపించాయి.
తగ్గేదేలే అంటున్న ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాన్ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మార్ఫీ తన బౌలింగ్‌లో ప్రత్యర్థుల బ్యాటర్లకు ఇబ్బంది పెట్టే సత్తా ఉంది.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాలు ఉన్నాయి.
అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు
అశోక్ లేలాండ్ తో కలిసి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (H2-ICE)తో నడిచే భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ ట్రక్కును ఆవిష్కరించాయి. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని జెండా ఊపి ప్రారంభించారు. 2022 ఆగస్టు నుంచి ఇది టెస్టింగ్‌లో ఉంది. దానితో, అశోక్ లేలాండ్ 'ఆత్మనిర్భర్ భారత్' ప్రచారంలో భాగం కావాలనుకుంటుంది.
జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత
జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి
ప్రతీ దేశంలో ఆచారాలు, వ్యవహారాలు వేరు వేరుగా ఉంటాయి. మీరు ఈ దేశంలో సరైనదే అనుకున్న పని వేరే దేశంలో కాకపోవచ్చు. పర్యటన కోసం జపాన్ దేశానికి వెళ్ళాలనుకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో చూద్దాం.
ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!
ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించి, యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం మార్స్, బృహస్పతి మధ్య ప్రధాన బెల్ట్‌లో ఒక గ్రహశకలాన్ని గుర్తించింది. 300 నుండి 650 అడుగుల పొడవున్న ఈ గ్రహశకలం, అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా కనుగొన్న అతి చిన్న వస్తువు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల రేసులో గిల్, సిరాజ్
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. గౌరవించడం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి 2021లో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ప్రవేశపెట్టిన విషం తెలిసిందే. 2023 జనవరికి సంబంధించి నామినీల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder
సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (SID) గుర్తుగా, ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ Tinder వినియోగదారులు సులభంగా నియంత్రించడానికి అనేక భద్రతా ఫీచర్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్లలో 'Incognito Mode', 'Block Profile' వంటి భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసింది.
సూపర్ రికార్డుకు చేరువలో హర్మన్ ప్రీత్ కౌర్
భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉంది. ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆ ఫీట్‌ను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 60 పరుగులు సాధిస్తే ఆ మైలురాయిని అందుకొనే అవకాశం ప్రస్తుతం ఉంది.
2023 కేతు సంవత్సరం ఎలా అయ్యింది? కేతు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గ్రహాల్లో రాహువు, కేతువుల గురించి సాధారణంగా అందరికీ తెలుస్తుంటుంది. రాహువు కారణంగా జీవితంలో గందరగోళం ఏర్పడుతుందని జ్యోతిష్యం ప్రకారం చెబుతారు.
అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ
ఇంటర్నల్ ఫ్రెషర్స్ అసెస్‌మెంట్ (FA) పరీక్షలో ఫెయిలైన కారణంగా ఇన్ఫోసిస్ 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. గత నెలలో, దేశంలోని మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఇలానే 450 మంది ఫ్రెషర్లను తొలగించింది.
అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు.
భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault, జపాన్ తయారీ సంస్థ Nissan భారతీయ మార్కెట్ కోసం మూడు మోడళ్లపై పని చేస్తున్నాయి. ఇందులో 3 rd gen Renault Duster, Renault Triber ఆధారంగా ఒక నిస్సాన్ MPV, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనం ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ప్లాన్‌ను విజయవంతం చేసేందుకు రెండు కంపెనీలు దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.
అక్షర పటేల్ ఔట్.. కుల్దీప్ ఇన్..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు తెరవేవనుంది. గురువారం నుంచి నాగపూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో టీమిండియా పట్టు సాధించాల్సి ఉంది.
టికెట్ లేకుండా సినిమా చూడొచ్చంటున్న రైటర్ పద్మభూషణ్ టీమ్
సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ, పోయిన శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్.
టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.
తేనేతుట్టెను చూస్తే అనిజీగా అనిపించిందా? ట్రైపోఫోబియా కావచ్చు
ఒకేచోట చిన్నచిన్న రంధ్రాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటివల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంటుంది. ఒక్కసారిగా వాళ్ళ మనసులో అదోరకమైన జుగుప్స కలుగుతుంది. దాన్ని ట్రైపోఫోబియా అంటారు.
ఫిబ్రవరి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ సురక్షిత దినోత్సవం రోజున వాట్సాప్ ఉపయోగించడానికి ఉత్తమ చిట్కాలు
ఫిబ్రవరి 7న సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంగా ప్రకటించారు. InSafe సంస్థ, ప్రతి సంవత్సరం సేఫ్ ఇంటర్నెట్ డే ను సెలెబ్రేట్ చేస్తుంది. సైబర్ బెదిరింపు, సోషల్ నెట్‌వర్కింగ్, డిజిటల్ గుర్తింపు వంటి ఆన్‌లైన్ సమస్యలతో పాటు మరెన్నో ప్రస్తుత ఆందోళనలపై అవగాహన పెంచడం దీని లక్ష్యం.
అరుదైన రికార్డు చేరువలో కింగ్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య కొద్దిరోజుల్లో బోర్కర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్ పైనే ఉంది. ఈ సిరీస్‌లో పలు రికార్డులు బద్దలు కావడానికి టెస్టు సిరీస్ వేదిక కానుంది. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన మైలురాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
కిమ్‌కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మళ్లీ ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన దాదాపు 40రోజులుగా బహిరంగంగా కనిపంచకపోవడంతో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి.
కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి
ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు గానీ సూదిలాంటి కొనదేలిన ముక్కున్న వారు తమ అందంతో అందరినీ ఆకర్షిస్తారు. అందుకే సెలెబ్రిటీలు కొనదేలిన ముక్కు కోసం సర్జరీలకు లక్షలు ఖర్చు చేస్తారు.
ఆరోన్ ఫించ్ క్రికెట్లో సాధించిన రికార్డులపై ఓ కన్నేయండి..!
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. 12 ఏళ్ల సుదీర్ఘమైన తన క్రికెట్ కెరీర్‌కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్‌మెన్ ఆరోన్‌ఫించ్ ఫుల్‌స్టాప్ పెట్టాడు.గత సెప్టెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో తొలి T20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు ఫించ్ అందించాడు. టీ20ల్లో రెండుసార్లు 150-ప్లస్ స్కోర్ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల: సత్తాచాటిన అబ్బాయిలు, 20మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ( ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో అబ్బాయిలు సత్తాచాటారు. 20మంది అబ్బాయిలు 100 పర్సంటేజ్ సాధించారు. ఈ సెషన్‌లో మహిళా అభ్యర్థులెవరూ 100 పర్సంటేజ్ సాధించలేకపోవడం గమనార్హం.
పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్
ఆసియాకప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్‌ను నిర్వహిస్తే.. పాక్‌లో ఆడేదిలేదని టీమిండియా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఆడాలని భావిస్తే మాత్రం వేదికను మార్చాలని సూచించింది. పాకిస్తాన్‌లో టీమిండియా ఆసియాకప్ ఆడకపోతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాక్ ఆడదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి.
మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
థియేటర్స్ లో ఇచ్చిపడేసేందుకు కాస్త లేట్ అవుతుందంటున్న విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు అలరించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అదేం విచిత్రమో గానీ విశ్వక్ సేన్ విభిన్నంగా కనిపించిన చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వలేదు.
భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం
జర్మన్ వాహన తయారీ సంస్థ Audi త్వరలో భారతదేశంలో తన Q3 స్పోర్ట్‌బ్యాక్ ను విడుదల చేయనుంది. రూ.2 లక్షలు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో ఇది బి ఎం డబ్ల్యూ X1, వోల్వో XC40, మెర్సిడెజ్-బెంజ్ GLA తో పోటీ పడుతుంది.
ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్
వినియోగదారుల సౌకర్యార్థం రైళ్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చింది భారతీయ రైల్వే. తాజాగా రైళ్లలో ప్రయాణికులు భోజన్ ఆర్డర్ చేసుకున్న పద్ధతిని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే సేవలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
క్రికెట్ లీగ్స్‌పై సౌరబ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు
క్రికెట్ లీగ్స్ ఆడటానికి క్రికెటర్లు ఇష్టపడుతుంటారు. ఇండియన్ ఐపీఎల్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్స్ వేలంలో ప్రస్తుతం పోటీ కనిపిస్తోంది. ఏదో ఒక లీగ్‌లో ఆడాలని ప్రస్తుత క్రికెటర్లు ఆరాటపడుతున్నారు. అందుకే ఈ లీగ్స్‌కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఏర్పడింది.
భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో
IIT మద్రాస్, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (IHSP) కోసం వ్యోమగామి శిక్షణా మాడ్యూల్‌పై పని చేయడానికి సహకరించనున్నాయి. ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్‌డ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించబోతుంది.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆ సినిమా, వెండితెర మీద ప్రభావం చూపించలేకపోయింది.
టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్
వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్‌లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది.
ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి
భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, గ్వాలియర్, భోపాల్ నగరాల్లో విడుదల చేసింది. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌లో ప్రారంభించింది..
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచ కప్‌ను అందించడంలో ఫించ్ కీలక పాత్ర పోషించి ఆ జట్టుకు ట్రోఫీని అందించాడు.
'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా
అమెరికా మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'గూఢచారి' బెలూన్‌ను శనివారం అగ్రరాజ్య బలగాలు కూల్చేశాయి. అయితే ఆ బెలూన్ శిథిలాలను తిరిగి చైనాకు అప్పగించేది లేదని తాజాగా అమెరికా ప్రకటించింది.
ప్రభాస్ సలార్ నుండి సాలిడ్ అప్డేట్
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సలార్ పై అభిమానుల్లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కేజీఎఫ్ తో రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఎలా చూపిస్తాడోనన్న ఆతృత అందరిలోనూ ఉంది.
AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్
గూగుల్ ఒక ప్రయోగాత్మక Bard AI సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే గూగుల్ కు గట్టి పోటీనిచ్చే మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడి పెట్టిన Open AI చాట్‌బాట్ ChatGPT సంచలనం సృష్టించింది.
టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు
ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో ఈనెల 10న ప్రారంభ కానుంది.
గజ్జి, దురదను పోగొట్టే ఇంటి చిట్కాలు ఇప్పుడే తెలుసుకోండి
సార్కోప్టేస్ స్కేబీ పురుగుల కారణంగా గజ్జి, దురద అంటుకుంటాయి. ఇది అంటువ్యాధి. గజ్జి లక్షణాలు ఎక్కువగా చేతివేళ్లమీద, మణికట్టు భాగంలో కనిపిస్తాయి.
టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం
టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి 4300మందికిపైగా మృతి చెందినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి 26వ తేదీ వరకూ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడీయం, డివై పాటిల్ స్టేడియాలు ఈ లీగ్ కు అతిథ్యమివ్వనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది.
కాంతార 2 సినిమాపై క్లారిటీ: ఈసారి వెనక్కి వెళ్ళనున్న సినిమా
కేజేఎఫ్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన కన్నడ చిత్రం కాంతార. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించలేదు, కానీ సినిమా సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో డబ్ చేసారు.