ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.
భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్
సామ్ సంగ్ Galaxy S23 ప్రభావంతో గూగుల్ Pixel 7 Pro భారతదేశంలో అత్యధిక తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది.
సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్
వెస్టిండీస్ బ్యాటర్ టాగెనరైన్ చందర్‌పాల్ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా వెస్టిండీస్ యువ ఆటగాడు చందర్‌పాల్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ బ్రాత్‌వైట్, చందర్ పాల్ సెంచరీలతో రాణించారు. బ్రాత్‌వైట్ టెస్టులో తన 12వ సెంచరీని నమోదు చేశారు.
'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్
ఎవరైనా దూరప్రయాణాలకు వెళ్లేటప్పడు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవాలంటే విమానాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు విమానాల కంటే వేగంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లొచ్చని చెబుతున్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఆజ్‌తక్ నిర్వహించిన కాన్‌క్లేవ్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్
NISAR (నాసా-ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్) మిషన్, రాడార్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా భూమిని వీక్షించి అవసరమైన వివరాలను అందిస్తుంది. SUV-పరిమాణ ఉపగ్రహం పర్యావరణ వ్యవస్థ అవాంతరాలు,భూకంపాలు వంటి సహజ ప్రమాదాలతో సహా భూపటలం అంటే భూమి అత్యంత ఉపరితల పొర గురించి మనకు మరింత అవగాహనను కూడా పెంచుతుంది.
అశ్విన్‌కు వార్నర్ చెక్ పెట్టేనా..?
టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటి పడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్ మంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌తో తలపడనున్నాడు.
రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.
జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లను దూరం చేసే ఆహారాలు
మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే మనం యాక్టివ్ గా అన్ని పనులు చేసుకోగలుగుతాం. లేదంటే జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిరులు వంటి ఇబ్బందులు వస్తాయి.
అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోసం, స్టాక్ మానిప్యులేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు.
సంచలన రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. స్మిత్ టీమిండియాతోనే మ్యాచ్ అంటేనే చెలరేగిపోతాడు.
మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది
మారుతి సుజుకి Fronx SUVని గత నెలలో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఇందులో ఫీచర్-లోడెడ్ క్యాబిన్ తో పాటు రెండు పెట్రోల్ ఇంజన్‌ల ఆప్షన్ ఉంది భారతీయ మార్కెట్ లో ఈ SUV కియా Sonetతో పోటీపడుతోంది.
ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.
కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో
ఈ మధ్య వరుస పరాజయాలు మూటగట్టుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్
జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్ శతకంతో అదరగొట్టాడు. తన కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీ చేసి సత్తా చాటాడు. బ్రాత్‌వైట్‌తో పాటు టాగెనరైన్ చందర్‌పాల్ తన తొలి టెస్టు శతకాన్నిసాధించాడు. వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది.
ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు
గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ బ్రాండ్‌ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు.
అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ
అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలయ్య టాక్ షో, ఈసారి బాలకృష్ణను వివాదంలో పడేసింది. ఈ మధ్య రిలీజైన ఎపిసోడ్ లో, బాలకృష్ణ మాటలు నర్సులను హర్ట్ చేసాయి.
బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడిని అతని కుటుంబసభ్యుల ఎదుటే మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏసీ మిలన్ పై ఇంటర్ అద్భుత విజయం
శాన్ సిరోలో ఆదివారం జరిగిన తాజా సిరీస్ A మ్యాచ్‌లో AC మిలన్‌పై ఇంటర్ 1-0తో విజయం సాధించింది. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ మొదటి అర్ధ భాగంలో అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంటర్ విజయానికి పునాది పడింది.
కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు
కర్నాటకలోని కలబురగిలో ఒక వ్యక్తి కత్తులతో వీరంగం సృష్టించారు. మార్కెట్ ప్రాంతంలో సాధారణ ప్రజలపై దాడి చేస్తానని బెదిరిస్తున్న అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు.
హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది
హీరో MotoCorp భారతదేశంలో సరికొత్త Xoom మోడల్‌ను ప్రారంభించింది. స్పోర్టీ స్కూటర్ భారతదేశంలో 110సీసీ విభాగంలో హోండా Dioతో పోటీపడుతుంది. హీరో Xoom సెగ్మెంట్-ఫస్ట్ 'కార్నర్ బెండింగ్ లైట్స్'తో వస్తే, హోండా Dio 109.5cc ఇంజిన్ పై నడుస్తుంది.
గ్రామీ అవార్డ్స్ 2023: రెడ్ కార్పెట్ పై ఫ్యాషన్ లుక్ తో అందరినీ ఆకర్షించిన సింగర్స్
65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని క్రిప్టో.కామ్ ఎరీనాలో అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై చాలామంది సంగీత కళాకారులు విభిన్నమైన ఫ్యాషన్ దుస్తులతో తళుక్కుమన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం.
సెవిల్లాపై 3-0 తేడాతో బార్సిలోనా విజయం
లాలిగా 2022-23లో లీగ్ లీడర్లు ఐదవ వరుస గేమ్‌లో విజయం సాధించగా.. బార్సిలోనా 3-0తో సెవిల్లాను ఓడించింది. జోర్డి ఆల్బా 58వ నిమిషంలో బార్సిలోనాను అగ్రస్థానంలో నిలిపాడు.
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.
రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్, టీమిండియా-ఆస్ట్రేలియా జట్టులో ఎంట్రీ
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా 6నెలలు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 9నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఆడనున్నాడు.
మీ పార్ట్ నర్ గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయా? మీకు ఓసీడీ ఉందేమో చెక్ చేసుకోండి
రిలేషన్ షిప్ ఓసీడీతో బాధపడే వారిలో తమ భాగస్వామి గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. తమ భాగస్వామి తమకు కరెక్ట్ కాదేమో అని, ఇంకా మంచి పార్ట్ నర్ వచ్చేదేమోనని అనుకుంటూ ఉంటారు.
తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే
తెలంగాణ బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2022-23లో సాధించిన ప్రగతిని, వచ్చే ఏడాది చేయనున్న అభివృద్ధి, కేటాయింపులను అసెంబ్లీలో ప్రకటించారు. హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైలెట్స్‌ను ఓసారి చూద్దాం.
వోల్ఫ్స్‌బర్గ్‌ను -2తో ఓడించింన ఎఫ్‌సి బేయర్న్
బుండెస్లిగా 2022-23 మ్యాచ్‌లో ఎఫ్‌సి బేయర్న్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 4-2తో వోల్ఫ్స్‌బర్గ్‌ను ఓడించి సత్తా చాటింది. దీంతో 2022-23 బుండెస్లిగాలో బేయర్న్ 11వ విజయాన్ని సాధించింది. కింగ్స్లీ కోమన్ 14 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గోల్ కొట్టి రికార్డును క్రియేట్ చేశారు.
గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ మధ్య గౌతమ్ తిన్ననూరికి ఓకే చెప్పిన విజయ్, తాజాగా మరో సినిమాను ప్రకటించాడు.
ఫిబ్రవరి 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని ప్రస్తుతం ఉన్న 38 శాతం నుండి 42 శాతానికి నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2023 నిర్వహణపై స్పష్టత రానట్లేనా..?
ఆసియాకప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఎందుకంటే ఆసియా కప్ మీటింగ్‌లో 'ప్రభుత్వ క్లియరెన్స్' చర్చలను పాకిస్తాన్ బోర్డు తిరస్కరించింది
వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వాళ్ళతో డేటింగ్ వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి
వాలెంటైన్స్ డే ఎంతో దూరంలో లేదు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమించిన వారికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేందుకు అందరూ రెడీ అవుతున్నారు. మీరు కూడా ఆ లిస్ట్ లో ఉంటే డేటింగ్ ఐడియాస్ గురించి తెలుసుకోండి.
బంగ్లాదేశ్‌లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం
ప్రపంచ దేశాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
పెట్: మీ పెంపుడు పిల్లికి మరో పిల్లితో దోస్తీ చేయించాలనుకుంటే చేయాల్సిన పనులు
మీకు పిల్లిని పెంచే అలవాటుంటే దానికి తోడుగా మరోపిల్లిని డైరెక్టుగా తీసుకురాకూడదని మీరు గుర్తుంచుకోవాలి. పిల్లులకు ఒక గుణం ఉంటుంది. మీరు చూపించే ప్రేమ, ఆకర్షణ వేరే పిల్లితో పంచుకుంటే అవి తట్టుకోలేవు. వాటిల్లో అవతలి పిల్లిపై కోపం పెరుగుతుంది.
తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే మొదటి, రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ నాగ్ పూర్ టెస్టుకు దూరమయ్యాడు. తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోని మొదటి టెస్టుకు దూరమవుతున్నట్లు హేజిల్ వుడ్ స్వయంగా ప్రకటించారు.
ఆండ్రాయిడ్ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్
ఆండ్రాయిడ్ chromeలో 'quick delete' ఫీచర్‌ను ప్రారంభించే పనిలో గూగుల్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ యాప్‌లో చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల చేసారు. ఈ సంవత్సరం, గూగుల్ ఈ ఫీచర్ ను బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం విడుదల చేయబోతుంది.
గ్రామీ అవార్డ్స్: బెంగళూరుకు చెందిన రిక్కీ కేజ్ ఖాతాలో మూడవ గ్రామీ అవార్డ్
సంగీత పురస్కారాల్లో విశిష్టమైనదిగా చెప్పుకునే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంగీత కళాకారులు చేరుకున్న వేళ, నామినేషన్ దక్కించుకున్న వారిలో నుండి అవార్డు దక్కించుకున్న వారిని అనౌన్స్ చేసారు.
మాంచెస్టర్ సిటీని 1-0తో ఓడించిన టోటెన్‌హామ్
ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఆదివారం మంచెస్టర్ సిటీ, టోటెన్ హామ్ తలపడ్డాయి. ఈ కీలక పోరులో మంచెస్టర్ సిటీని టోటెన్ హామ్ 1-0తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో హ్యారికేన్ అరుదైన ఘనతను సాధించాడు.
టెస్ట్ రన్ లో ఉన్న Citroen C3- MPV కార్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం
Citroen సంస్థ యూరోపియన్ ప్రాంతంలో C3-ఆధారిత మూడు-వరుసల MPV కార్ టెస్ట్ రన్ చేస్తుంది. ఈ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 2023లో భారతీయ మార్కెట్ లో మూడు వరుసల MPV మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు చెప్పారు. శక్తిమంతమైన ప్రకంపనాలకు గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని అనేక భవనాలు నెలమట్టం కాగా, 53మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ టాక్ షోలోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకు మొదటి భాగం ఎపిసోడ్ కూడా రిలీజ్ అయ్యింది.
ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ అద్భుత రికార్డు
ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ సంచలన రికార్డును నమోదు చేశారు. 200వ ప్రీమియర్ లీగ్ గోల్ ను సాధించి అద్భుత రికార్డును తన పేరిట రాసుకున్నారు. ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కారు.
తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
తెలంగాణ బడ్జెట్‌ను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. కేసీఆర్ రెండో దఫా ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మూఢ నమ్మకానికి పరాకాష్ట: ఇనుప రాడ్‌తో 51సార్లు వాతలు, మూడు నెలల చిన్నారి మృతి
మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతమైన షాదోల్ జిల్లాలో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలైంది.
'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రోటీ తయారు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రధాని మోదీ శనివారం షేర్ చేశారు. అంతేకాదు బిల్ గేట్స్‌కు వంటచేయడంలో ఒక టిప్ కూడా ఇచ్చారు.
సెమీస్‌లో సమరానికి సిద్ధమైన బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్నాటక
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ దశ పూర్తి అయింది. బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు ప్రస్తుతం సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్నాయి. అయితే ఇంతవరకు వేదికలు నిర్ణయించకపోవడం గమనార్హం.
కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే అంత సులభమేమీ కాదు, ప్రస్తుతం అందరి చూపు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో కింగ్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆహారంలో చక్కెర ను పూర్తిగా వదిలేసిన మసాబా గుప్తా
ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా చక్కెరను వదిలేస్తానని టార్గెట్ పెట్టుకుంది. 21రోజుల పాటు చక్కెరకు సంబంధించిన ఆహారాలు ముట్టుకోనని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి
జుట్టుకు కావాల్సిన ఆరోగ్యాన్ని అందిస్తామని చెప్పి మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ వస్తుంటాయి. అదే మాదిరిగా ఇటీవల హెయిర్ టోనర్ వచ్చింది. జుట్టుకు అందాన్ని, సరైన ఆకారాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్
ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.
భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త -SUV, Fronxని మార్కెట్ లో విడుదల చేయబోతుంది. కాంపాక్ట్ SUV కోసం బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు ఇప్పటికే 5,000 ప్రీ-ఆర్డర్‌లు కూడా వచ్చాయి. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్
Infinix భారతదేశంలో ZERO 5G 2023 సిరీస్ ను ప్రవేశపెట్టింది, ఇందులో స్టాండర్డ్, టర్బో మోడల్‌లు ఉన్నాయి. స్టాండర్డ్ మరియు టర్బో మోడల్‌లు డైమెన్సిటీ 920, డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌లతో వస్తాయి.ఈ ఫోన్లు ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. Infinix బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ది చెందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ZERO 5G 2022తో 5G విభాగంలోకి ప్రవేశించింది.
తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబద్ అభివృద్ధి, ప్రభుత్వం పనితీరుపై అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరిన సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్‌పై 71 పరుగుల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించి, సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లింది.
భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారత స్టార్ జమ్మాస్ట్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించింది. నిషేధిత పదార్థాన్ని తీసుకున్నందుకు కర్మాకర్‌ను ఇంటర్నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది.
పెరుగుతున్న ధరల వల్ల శాలరీ సరిపోక ఒత్తిడి పెరుగుతోందా? ఈ టిప్స్ పాటించండి
పెరుగుతున్న నిత్యావసర ధరలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశమైన యుకే కూడా ధరల పెరుగుదలను తట్టుకోలేకపోతుంది. ఇక పాకిస్తాన్ లాంటి దేశాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.
'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది.
స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ అపగలడా..?
ఫిబ్రవరి 9నుంచి నాగ్ పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్‌లో చెడటోడుస్తోంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం కోసం వ్యూహాలను రచిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్, టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవించంద్రన్ అశ్విన్ మధ్య పోరు జరగనుంది.
కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు
భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను కేరళలోని కోజికోడ్, త్రివేండ్రం, త్రిస్సూర్‌లో విడుదల నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో ఆనందించవచ్చు. ప్రస్తుతం ఎయిర్ టెల్ తన 5G డేటా ప్లాన్‌లను ఇంకా వెల్లడించలేదు.
ఎన్నెన్నో జన్మల బంధం ఈనాడే కన్నుమూసింది, సింగర్ వాణీజయరాం హఠాన్మరణం
భారతీయ సినిమా పాటలకు తన గొంతునిచ్చిన ప్రఖ్యాత గాయని, భారత ప్రభుత్వంచే ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న దిగ్గజం వాణీ జయరాం ఈరోజు కన్నుమూసారు.
ప్రీమియర్ లీగ్‌లో డ్రాగా ముగిసిన ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్
ప్రీమియర్ లీగ్ 2022-23 మ్యాచ్‌లో ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్ డ్రాగా ముగిసింది. చెల్సియా అటాకింగ్ థర్డ్‌లో ఎటువంటి గోల్‌ను సాధించలేదు. గోల్-స్కోరింగ్ అవకాశాలు ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనంతరం మిడ్‌ఫీల్డ్‌లో అరంగేట్రం చేసిన ఎంజో ఫెర్నాండెజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, కో-ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది.
భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఈ ఏడాది మధ్యలో భారతదేశంలో సెల్టోస్ 2023 అప్డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్టెడ్ SUV ఇప్పటికే దక్షిణ కొరియాతో పాటు USలో అందుబాటులో ఉంది
మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న?
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ, తారకరత్న పరిస్థితిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట
దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ మన్ తల్లి కాబోతోంది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జహాద్, జియా పావల్ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మార్చిలో జహ్హాద్ తమ బిడ్డను ప్రసవించనున్నట్లు జియా పావల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, కంటెంట్‌పై అభ్యంతరాలు
దాయాది దేశం పాకిస్థాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నందునే బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) వెల్లడించింది.
ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం
భారత్‌తో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నాడు.బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఫిబ్రవరి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
గ్రామీ అవార్డ్స్ చరిత్ర, ప్రత్యేకత, ఈ సంవత్సరం నామినేషన్లు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి
65వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం భారతదేశ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం 6:30గంటలకు అందజేయబడతాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ బుధవారమే మొదలైంది.
ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10న ధక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మళ్లీ టైటిల్ పై కన్నేసింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అసిస్టెంట్ సబ్ దిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి
వాలెంటైన్స్ డే బహుమతిగా మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పూలు, గ్రీటింగ్ కార్డులకు బదులుగా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేయండి. మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ప్రకృతిలో పరుగెలుడుతూ, అందాన్ని ఆస్వాదిస్తూ భారతదేశ రోడ్ల మీద మీ బండిని ఎక్కించండి.
వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొన్నిరోజులుగా వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.
మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికలపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ మొత్తాన్ని ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు యోచిస్తోందని క్రిక్‌బజ్ తెలిపింది. డివై పాటిల్, సీసీఐ స్టేడీయాలు వేదిక కానున్నాయి.
రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది.
'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్
జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం
స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్‌ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది.
కోహ్లీని దూషించిన పాక్ పేసర్ సోహైల్ ఖాన్..!
2015 ఫిబ్రవరిలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్- పాకిస్తాన్ తలపడింది. ఈ చిరకాల ప్రత్యర్థి పోరులో ఎప్పటిలాగే టీమిండియానే గెలుపొందింది. ఈ విజయంలో కింగ్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే.
మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి?
మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను అమెరికా గుర్తించింది. లాటిన్ అమెరికా గగన తలంలో ఈ బెలూన్ కనిపించిందని పెంటగాన్ తెలిపింది.
మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ?
మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే సారధి స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభమయ్యింది.
ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం
గత ఏడాది నవంబర్‌లో, ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేయడానికి వీలు కల్పించే 'Go Live Together' ఫీచర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో వచ్చింది.
నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని
సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడీయాలో నెపోటిజం మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. నెపోటిజంపై చర్చ, సినిమాలను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ వరకూ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి.
గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్‌తో కొత్త ఒప్పందం
ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్‌తో గాబ్రియేల్ మార్టినెల్లి కొత్త ఒప్పందంపై సంతకం చేశాడు. 21 ఏళ్ల బ్రెజిలియన్ మార్టినెల్లి మునుపటి ఒప్పందం వచ్చే సీజన్ చివరిలో ముగియనుంది. అయితే, అతను అదనపు సంవత్సరం కోసం ఎంపికతో, నూతనంగా నాలుగున్నర సంవత్సరాల ఒప్పందాన్ని అంగీకరించాడు.
ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు
హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపం సంభవించింది. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.