13 Feb 2023

వినరో భాగ్యము విష్ణుకథ: అన్నమయ్య 12వ తరం వారితో తిరుపతి పాట లాంచ్

ఫిబ్రవరి నెలలో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరికీ ఆసక్తి కలిగిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ అనే చెప్పాలి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా కనిపిస్తుంది.

తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన

తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగినట్లు చెప్పింది. లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.

రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం

రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. 2016లో కార్యకలాపాలను ప్రారంభించి సరికొత్త ఆఫర్లతో భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని పూర్తిగా మార్చింది. ఇది వచ్చినప్పటి నుండి ఆపరేటర్ రీఛార్జ్ ఆప్షన్ సిరీస్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉన్న అన్ని వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకోండి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్ దక్కింది. ఆమెను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటిపడ్డాయి. రూ.2.6కోట్లకు దీప్తిశర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది.

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

ఆర్‌సీబీలోకి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలం ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియాలు వేదిక కానున్నాయి.

'ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నారు'; నెడుమారన్ సంచలన కామెంట్స్

తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ నాయకుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ 30: ఫోటోషూట్ తో తేలిపోనున్న హీరోయిన్ సస్పెన్

కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్, కొరటాల శివతో తాను చేస్తున్న సినిమా గురించి అభిమానులతో మాట్లాడుతూ, ప్రతీసారీ మీరు అప్డేట్స్ అడుగుతున్నారని, కానీ మీరు కావాలన్నారని ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగోదని, అప్డేట్ ఇవ్వాలనుకున్నప్పుడు సరైన ప్లానింగ్ ప్రకారం క్వాలిటీగా అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు.

భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi తన Q3 స్పోర్ట్‌బ్యాక్ కూపే SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఒకే ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. కారు స్టైలిష్ రూపంతో పాటు టెక్నాలజీ సపోర్ట్ తో సంపన్నమైన క్యాబిన్‌ తో వస్తుంది. ఇది 2.0-లీటర్ TFSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది.

'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు

రష్యాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని మాస్కోలోని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. కొత్తగా వెళ్లే వారు కూడా రష్యాకు వెళ్లవద్దని సూచించింది. అక్రమ నిర్బంధాల కారణంగా అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

పవర్ స్టార్ కోసం పాట పూర్తి చేసిన రాక్ స్టార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గతకొంత కాలంగా దేవిశ్రీ ప్రసాద్ దూరమైపోయాడు. అప్పట్లో జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చిత్రాలతో దుమ్ము దులిపేసాడు.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్‌ ప్రపంచకప్‌ సాధించిపెట్టిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆటకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. 2022 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది.

జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట

జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు 370కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభావం చూపదని ధర్మాసనం చెప్పింది.

వాలెంటైన్స్ డే: 2023లో మంచి జంటగా నిలిచే రాశుల కాంబినేషన్ తెలుసుకోండి

ప్రేమికుల రోజు దగ్గర పడుతున్న కొద్దీ తమ బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి లేదా మరో మెట్టు ఎక్కించడానికి అందరూ రెడీ అవుతున్నారు. మీరూ కూడా అదే పనిలో ఉంటే, ఏ రాశుల వారికి ఏ రాశి వారితో మంచి సంబంధం కుదురుతుందో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వినయ్ అరోరా తెలియజేస్తున్నారు.

స్మృతి మంధానకు అదరిపోయే ధర

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం నేడు ముంబాయిలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా లీగ్ వేలం మల్లికా సాగర్ నేతృత్వంలో నిర్వహించారు. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్త 90 బెర్తుల కోసం 409 క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.

భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది

బెంగళూరుకు చెందిన సోషల్ మీడియా యాప్ Slick పాఠశాలకు వెళ్లే పిల్లలతో సహా తన వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసింది. కంపెనీ తన వినియోగదారుల పూర్తి పేర్లు, పుట్టినరోజులు, మొబైల్ నంబర్‌లు, పాస్‌వర్డ్ లేకుండా ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ చిత్రాలతో ఉన్న డేటాబేస్‌ను బహిర్గతం చేసింది.

కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం

గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో 35ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ చరిత్ర సృష్టించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2

2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మరిన్నిఫీచర్స్ తో భారతదేశంలో ప్రారంభమైంది.

ముంబాయి ఇండియన్స్‌కు సేవలందించనున్న టీమిండియా కెప్టెన్

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ వేలానికి 409 మంది మహిళా క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఇందులో నుంచి ఐదు ఫ్రాంఛైజీలు కలిసి అత్యధికంగా 90మంది కొనుగోలు చేయనున్నారు. ప్రతి ప్రాంఛైజీ పర్సులో రూ.12 కోట్లు ఉండనున్నాయి.

వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో శ్రీ విష్ణు కొత్త చిత్రం

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి చిత్రాలతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. కానీ గతకొన్ని రోజులుగా సరైన విజయాలు లేక అవస్థలు పడుతున్నాడు.

నాపోలి చేతిలో క్రెమోనీస్ ఓటమి

2022-23 మ్యాచ్ లో నాపోలి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 3-0తో క్రీమోనీస్‌ను ఓడించి సత్తా చాటింది. ఖ్విచా క్వారత్ స్టెలియా, విక్టర్ ఒసిమ్ హెన్, ఎల్జిఫ్ ఎల్మాన్ గోల్స్ చేసి ఈ సీజన్లో నాపోలికి 19వ విజయాన్ని అందించాడు.

అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.

2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ

2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.

రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిల్ తనపై అత్యాచారం చేశారని మైసూరులో ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

కాన్సాస్ సిటీ చీఫ్స్ సంచలనం విజయం

కాన్సాస్ సిటీ చీఫ్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఫిలిడెల్ఫియా ఈగల్స్ పై ఆదివారం 38-35తో సంచలన విజయం సాధించింది. విజయాన్ని సాధించిన తర్వాత కాన్సాస్ సిటీ చీఫ్స్ సూపర్ బౌల్ 57ను గెలుచుకుంది.

ప్యార్ లోనా పాగల్ పాటతో రానున్న రవితేజ రావణాసుర

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ డూపర్ విజయాలు అందుకున్న రవితేజ, ప్రస్తుతం రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది

OnePlus 11 టోన్డ్-డౌన్ OnePlus 11R డిజైన్ కంటే బాగుంటుంది. OnePlus 11, 11R మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం.

భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా తినడం, థంబ్స్ అప్ సింబల్స్ లాంటి వాటిని ఇబ్బందికరంగా చూసే దేశాలు

అంతా ఓకే అన్నట్టు థంబ్స్ అప్ చూపించడం, కొత్తవాళ్ళని చూసి నవ్వడం, భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా ఊడ్చినట్టుగా తినడం వంటి కొన్ని వ్యవహారాలను ఇతర దేశాల్లో ఇబ్బంది కలిగించే అలవాట్లుగా పరిగణిస్తారని మీకు తెలుసా?

విల్లారియల్‌ను 1-0తో ఓడించిన బార్సిలోనా

లాలిగా 2022-23 మ్యాచ్‌లో బార్సిలోనా సత్తా చాటింది. విల్లారియల్‌ను 1-0తో బార్సిలోనా చిత్తు చేసింది. పెడ్రీ 18వ నిమిషంలో గోల్ చేసి బార్సిలోనాకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా బార్సిలోనా ఈ లీగ్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది.

గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్

మహారాష్ట్ర పుణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారించగా అది ఫేక్ కాల్ అని తేలింది.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతటా ప్రశంసలు అందుకున్న ఎన్టీఆర్, తన నెక్స్ట్ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు సమాధానంగా, మార్చ్ లో షూటింగ్ మొదలవుతుందని ఇటీవల చెప్పారు ఎన్టీఆర్.

కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా

గత కొన్నిరోజులుగా అమెరికాలో గగనతల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా గగనతలంలో అనుమానాస్పదంగా కనిపించిన గుర్తు తెలియని వస్తువును అమెరికా దళాలు కూల్చివేశాయి.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్

Acer Nitro 5 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. ఇది మంచి గేమింగ్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్ కార్ట్ లో చాలా చౌకగా లభిస్తుంది.

భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు ఆదిరిపోయే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో రెండో టెస్టు ఆడనుంది. కాగా ధర్మశాల వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

సింగిల్ గా ఉన్న వాళ్ళు వాలెంటైన్స్ డేని ఆహ్లాదంగా జరుపుకోవడానికి చేయాల్సిన పనులు

వాలెంటైన్స్ డే అనగానే జంటలు జంటలుగా కనిపించే మనుషులు మాత్రమే చేసుకోవాలని, జంటగా లేని వాళ్ళకు వాలెంటైన్స్ డే దండగ అనీ చాలామంది అభిప్రాయ పడుతుంటారు.

లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ

ప్రసిద్ద US తయారీ సంస్థ డాడ్జ్ చికాగో ఆటో షోలో "లాస్ట్ కాల్" స్పెషల్-ఎడిషన్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయనున్నారు. ముందు మోడల్ '426 HEMI' V8 ఇంజిన్‌ను ఉపయోగించి గాడ్‌ఫ్రే క్వాల్స్ 1970 డాడ్జ్ ఛాలెంజర్ R/T SE మోడల్‌ లాగా ఉంది ఈ కారు.

టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య

టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. టర్కీ, సిరియాలో సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భయంకరమైన భూకంపం వచ్చిన వారం తర్వాత ఇది సంభవించింది.

కోహ్లీ కెప్టెన్సీలో చాలా నేర్చుకున్నా : రోహిత్‌శర్మ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

మీ స్నేహితులకు అప్పు ఇచ్చారా? వసూలు చేయడం ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి

ఫ్రెండ్స్ కి డబ్బిచ్చినపుడు వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వమని అడగడం కన్నా ఇబ్బంది మరోటి ఉండదు. అడిగితే ఏమనుకుంటారోనన్న అనుమానంతో చాలామంది అడగకుండా ఆగిపోతుంటారు.

మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా

మరింత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించే ఆలోచనలో ఉన్న మెటా సంస్థ. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా వచ్చే నెలలో సిబ్బంది పనితీరు సమీక్షలను పూర్తి చేసిన తర్వాత సంస్థను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది.

ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.

మాంచెస్టర్ సిటీ చేతిలో ఆస్టన్ విల్లా ఓటమి

ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లా తలపడ్డాయి. ఈ పోరులో మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లాను 3-1తో తేడాతో ఓడించింది. రోడ్రి, ఐకే గుండోగన్, రియాద్ మహ్రెజ్ హాఫ్ టైమ్‌లో సిటీకి 3-0 ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో అర్ధభాగంలో విల్లా తరఫున ఓలీ వాట్కిన్స్ ఒక గోల్ మాత్రమే చేశాడు.

బాలయ్యకు జోడీగా మరోమారు ప్రగ్యా జైశ్వాల్

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రగ్యా జైశ్వాల్, ఆ తర్వాత నటించిన సినిమాలతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలెట్టాయి.

ఏజెంట్ మూవీ బడ్జెట్: అఖిల్ సినిమాకు హిట్ సరిపోదు, బ్లాక్ బస్టర్ కావాలి?

అక్కినేని అఖిల్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. వరుసగా ఫ్లాపులు ఖాతాలో వేసుకున్న తర్వాత, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాతో మోస్తారు విజయాన్ని అందుకున్నాడు.

సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు

సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.

Womens T20 World Cup 2023లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించగా షెఫాలీ వర్మ, రిచా ఘోస్ పర్వాలేదనిపించారు.

అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత

అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు.

ఫిబ్రవరి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

11 Feb 2023

ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్

రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా, టాటా కమ్యూనికేషన్స్ ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారిక ప్రసార పంపిణీ హక్కులు చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది.

నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్

నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

వాలెంటైన్స్ వీక్ లో వచ్చే హగ్ డే విశేషాలు, కొటేషన్లు

ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి14) కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. అయితే మీకీ విషయం తెలుసా? వాలెంటైన్స్ డేకి వారం రోజుల ముందు నుండి వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది.

ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్

నాగ్‌పూర్ మొదటి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికిపోయారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో రోజు కూడా ఆట ముగియకముందే ఆస్ట్రేలియా 132 పరుగులు తేడాతో ఓడిపోయింది.

'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం

త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధాని మోదీ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టినట్లు ఆరోపించారు.

కేఎల్ రాహుల్ ఇంకా నువ్వు మారవా, నీకంటే గిల్ బెటర్

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు రాహుల్ దూరమయ్యాడు. అయితే మళ్లీ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు జట్టులోకి వచ్చాడు.

మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌

స్వదేశీ బ్రాండ్ లావా భారతదేశంలో తన Blaze 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM వేరియంట్‌ను విడుదల చేసింది. గతేడాది 4GB RAMతో మార్కెట్లోకి వచ్చింది.

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్: అదుర్స్ మళ్లీ వచ్చేస్తుంది?

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అభిమానుల కోరిక మేరకు పాత సినిమాలను మళ్ళీ మళ్ళీ థియేటర్లలో వేస్తున్నారు. రీ రిలీజ్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన కుడా వస్తోంది.

తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మహబూబాబాద్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని, రాళ్లదాడి కారణంగా ఒక కిటికీ పగిలిపోయిందని వార్తా సంస్థ పీటీడీ నివేదించింది.

ముదురుతున్న కశ్మీర్ ఫైల్స్ వివాదం: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ వివేక్ అగ్నిహోత్రి

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు, నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అప్పుడెప్పుడో సినిమా విడుదలైనప్పుడు మొదలైన వివాదం సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా తగ్గడం లేదు.

ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా

ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జాక్ పాట్ కొట్టేదెవరో..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది. ఒక జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం క్రికెటర్లు ఎవరో ఇప్పడు మనం తెలుసుకుందాం.

దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.

శేఖర్ మాస్టర్ చూపు సినిమా దర్శకత్వం వైపు ?

కొరియోగ్రాఫర్లు సినిమా దర్శకులుగా మారడం చాలాసార్లు జరుగుతుంటుంది. ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్, సన్నీ మొదలగు కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారారు.

ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు

మెర్సిడెస్-మేబ్యాక్ ఆసియా, యూరోపియన్ మార్కెట్‌ల కోసం S 580e ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లిమోసిన్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన కారు జర్మన్ తయారీ సంస్థ మేబ్యాక్ నుండి మొదటి ఎలక్ట్రిఫైడ్ వాహనం.

సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులను చేసింది.

'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు వ్యతిరేకం కాదని, అయితే వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయని జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ శనివారం అన్నారు. ప్రస్తుత హిందూత్వ రూపం భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని మదానీ పేర్కొన్నారు.

ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో కనబడని ఇద్దరు జడ్జిలు

తెలుగులో బాగా పేరుతెచ్చుకున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో, తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో పాటల పోటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తున్న ఈ కార్యక్రమం రెండవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్

దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వైరం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆప్ నియమించిన ఇద్దరు ప్రభుత్వ నామినీలను ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) బోర్డుల నుంచి గవర్నర్ తొలగించారు.

విజృంభించిన స్పిన్నర్లు, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం

తొలిటెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంతో మరోసారి తమ బలహీనతను ఆస్ట్రేలియా బ్యాటర్లు బయటపెట్టుకున్నారు. దీంతో కంగారులు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్ లో వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి కెమెరా మోడ్‌ తో పాటు, ఒకేసారి 100 వరకు మీడియా ఫైల్స్ ను షేర్ చేయచ్చు.

యాక్సిడెంట్ తర్వాత తొలి అడుగు వేసిన రిషబ్ పంత్

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్న పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే.

ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

మరో ఎయిర్‌లైన్స్‌‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. పౌర విమానయాన అవసరాలను ఉల్లంఘించినందుకు ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ.20 లక్షల జరిమానా విధించింది.

ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు

మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్‌ తో పాటు Xbox గేమింగ్ డివిజన్‌ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.

ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు.

స్టీవెన్ స్పీల్ బర్గ్ నుండి డేనియల్ క్వాన్ వరకూ ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్స్

ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ నామినేషన్లో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి హాలీవుడ్ దర్శకులు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా స్టీవెల్ స్పీల్ బర్గ్, ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడారు.

విరాట్ కోహ్లీని దాటేసిన మహ్మద్ షమీ

టెస్టు క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ కన్నా అత్యధిక సిక్స్ లు బాదిన బ్యాటర్ మహ్మద్ షమీ నిలిచాడు. టెస్టులో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ టెస్టులో 24 సిక్సర్లు కొట్టగా.. మహ్మద్ షమీ 25 సిక్స్ లు కొట్టాడు. నాగ్ పూర్ జరిగిన మొదటి టెస్టులో మహ్మద్ షమీ మూడు సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించాడు.

తెలుగు బాక్సాఫీసు దగ్గర ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్

వేసవి వచ్చిందంటే థియేటర్లలో సినిమాల జాతర జరుగుతుంది. ఈసారి కూడా వేసవిలో థియేటర్లలోకి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఏప్రిల్ 14వ తేదీ మీద పడింది.

రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 400 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.

తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది.

హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా హైదరాబాద్ E-Prixలో XUV400 వన్-ఆఫ్ ఫార్ములా E ఎడిషన్‌ను ప్రదర్శించింది. మహీంద్రా ఫార్ములా ఈ-టీమ్ తో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) ద్వారా ప్రత్యేక లివరీని రూపొందించారు.

ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. మార్చి 4వ తేదీ నుంచి ముంబయిలో ఐదు జట్లతో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామి అయినా మలికా అద్వానీ వేలాన్ని పర్యవేక్షించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ట్రావెల్: శ్రీలంకలోని అతిపురాతన పట్టణం అనురాధపురంలో గల చూడదగ్గ ప్రదేశాలు

శ్రీలంకలోని అతి పురాతన పట్టణమైన అనురాధపుర గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచ వారసత్వ సంపదగా ఈ పట్టణాన్ని యునెస్కో గుర్తించింది. ఇక్కడ చూడవలసిన పురావస్తు ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

ఫిబ్రవరి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీఆర్‌ఎఫ్) శుక్రవారం టర్కీ ఆర్మీ సమన్వయంతో మరొక బాలికను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న 8ఏళ్ల బాలికను సిబ్బంది రక్షించారు.

భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్

2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది.

ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మొదటి టెస్టు వైభవంగా ప్రారంభమైంది. అయితే మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. దీనిపై క్లారిటీ రావడం లేదు.

గోళ్ళు కొరికే అలవాటు మానలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి

చిన్నప్పుడు మొదలైన గోళ్ళు కొరికే అలవాటు పెద్దయ్యాక కూడా కొనసాగుతూనే ఉంటుంది. గోళ్ళు కొరకడం వల్ల పంటి చిగుళ్ళు దెబ్బతింటాయి. కొన్ని కొన్ని సార్లు పంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు గోరు దగ్గర చర్మం దెబ్బతింటుంది.

'స్పై బెలూన్' ఎపిసోడ్: ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అమెరికా

చైనా 'గూఢచారి' బెలూన్ వ్యవహారాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'స్పై బెలూన్‌'‌ను కూల్చేసిన అగ్రరాజ్యం, తాజాగా ఆ దేశ కంపెనీలకు షాకిచ్చింది.

భూ వివాదంలో చిక్కుకున్న రానా, క్రిమినల్ కేసు నమోదు

హీరో దగ్గుబాటి రానా, దగ్గుబాటి సురేష్ పై ప్రమోదు కుమార్ అనే బిజినెస్ మెన్ కేసు నమోదు చేసారు.

సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి

క్వార్టర్ ఫైనల్లో జరిగిన పోరులో ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా 2023 అబుదాబి ఓపెన్ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 లో ఫైనల్‌కు చేరిన రెబాకినా మూడు సెట్లలో ఓడిపోయి నిరాశ పరిచింది.

భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్

చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.

సరికొత్త లుక్ లో అదిరిపోతున్న ప్రభాస్

కొంతకాలం క్రితం ప్రభాస్ లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ లుక్ బాలేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీకి యూపి వారియర్జ్‌గా నామకరణం చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ యజమానులైన కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 757 కోట్లను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న జోన్ లూయిస్‌ ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు.

ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

Realme భారతదేశంలో కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి కోకా-కోలాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మౌత్‌ఫుల్ పేరుతో, Realme 10 Pro 5G కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ దీని ధర రూ. 20,999. Realme ఈ ఎడిషన్ లో కేవలం 1,000 ఫోన్లను మాత్రమే అమ్ముతుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, Realme కోకా కోలా రెండింటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది కానీ ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మాత్రమే విడుదలైంది.

దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్

దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.