14 Feb 2023
జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం
ఆల్-ఇండియా హోల్ సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా దేశ వార్షిక ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2022లో నమోదైన 4.95% నుండి జనవరి 2023 (జనవరి 2022 కంటే) నెలలో 24 నెలల కనిష్ట స్థాయి 4.73%కి తగ్గింది, తాత్కాలిక డేటా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం షేర్ చేసింది.
కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.
కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus
Lexus GECలు అతిథి దేవో భవ అనే భారతీయ స్ఫూర్తితో అసాధారణమైన ఆతిథ్యం, అతిథుల అవసరాలను తీరుస్తూ అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి జపనీస్ తత్వశాస్త్రమైన 'ఒమోటేనాషి'ని ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్
మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్, 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది చివర్లో కంపెనీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలలుగా కంపెనీ నుండి వైదొలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆమె కూడా ఒకరు.
మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్
AMR23 అప్డేటెడ్ డిజైన్‌ను ఆస్టన్ మార్టిన్ ఆవిష్కరించింది. మార్చి 5 నుండి ప్రారంభమయ్యే సీజన్‌లో పాల్గొంటుంది. ఆస్టన్ మార్టిన్ టెక్నికల్ డైరెక్టర్ డాన్ ఫాలోస్, AMR23 AMR22 కంటే 95% భిన్నంగా ఉంటుందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు: త్రిపురలో ముగిసిన ప్రచారం పర్వం, గురువారం పోలింగ్
త్రిపురలో నెల రోజులుగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. 8 జిల్లాల్లోని మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, త్రిపుర స్టేట్ రైఫిల్స్, రాష్ట్ర పోలీసు సిబ్బందితో భారీ భద్రత నడుమ పోలింగ్ జరగనుంది.
వరుస ఫ్లాపులు ఇచ్చిన దేవకట్టా చేతిలో నాలుగు ప్రాజెక్టులు
వెన్నెల, ప్రస్థానం వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన దేవకట్టా, సాయి ధరమ్ తేజ్ తో తీసిన రిపబ్లిక్ తర్వాత మళ్లీ సినిమాను మొదలెట్టలేదు. గత కొన్ని రోజులుగా దేవకట్టా తర్వాతి ప్రాజెక్టుల గురించి అనేక వార్తలు వచ్చాయి. రెండేళ్ళుగా ఒక్క సినిమా గురించి కూడా అప్డేట్ రాలేదు.
వాట్సాప్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్ యాక్సెస్ చేయండిలా
ప్రత్యేక వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌లు వాట్సాప్‌లో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ 2018 అక్టోబర్‌లో స్టిక్కర్ల ఫీచర్‌ను విడుదల చేసింది. స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసే విధానం గురించి ఇక్కడ చదవండి
వాలెంటైన్స్ డే రోజున వైరల్ అవుతున్న సాయి ధరమ్ తేజ్ లవ్ మెసేజ్
ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు. ఈరోజు అందరూ తమ సోషల్ మీడియాలో ప్రేమ గురించి సందేశాలు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..?
ఐదుసార్లు ట్రోఫిని గెలిచిన అంబాని జట్టు.. ప్రస్తుతం మహిళల ఐపీఎల్‌పై ఫోకస్ పెట్టింది. ఏకంగా టీమిండియా కెప్టెనే తమవైపు లాక్కుంది. మొత్తం 12 కోట్లు వెచ్చింది 17 మంది ఆటగాళ్లను తీసుకుంది. భారత మహిళల జట్టుకు నాయకత్వం వహిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబైకి చెందిన జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
ఆరోగ్యం: ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతున్నాయా? ఎలా ఆపాలో తెలుసుకోండి
ఎక్కిళ్ళు వస్తే ఎవరో గుర్తు చేసుకున్నారని చెబుతారు. శరీరంలో రొమ్ముభాగాన్ని కడుపును వేరే చేసే కండరం ముడుచుకుపోయినపుడు ఎక్కిళ్ళు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబైలో అట్టహాసంగా ముగిసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీగార్డనర్ ను గుజరాత్ జెయింట్స్ అధిక ధరకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్ ఆధారిత ఫ్రాంచైజీ అయిన ఇందులో బెత్ మూనీ, డియాండ్రా డాటిన్, స్నేహ్ రానా కూడా ఉన్నారు. వీరందరి చేరికతో గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనపడుతోంది.
HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు
శిక్షణ కోసం వినియోగించే అత్యాధునిక HLFT-42 యుద్ధ విమానంపై ఉన్న హనుంతుడి బొమ్మను తలొగించినట్లు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( హెచ్ఏఎల్) మంగళవారం ప్రకటించింది.
ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం
ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, పీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. కమల దళం కూడా అదేస్థాయిలో తిప్పికొట్టింది.
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..?
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. అయితే ఈసారి ఉమెన్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే కీలకమైన ఆటగాళ్లను ఫ్రాంచేజీ కొనుగోలు చేసింది.
అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్
అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లో అందించే వివిధ రకాల ఉత్పత్తులు అందించే డిస్కౌంట్‌ల కారణంగా కొనుగోలుదారులకు చాలా ఇష్టమైన ఈ-కామర్స్ వేదిక. ఇందులో మిలియన్ల కొద్ది అమ్మేవారు ఉన్నారు. మార్కెట్‌ప్లేస్ పల్స్ అధ్యయనం ఆధారంగా, 2022లో మొదటిసారిగా అమెజాన్ ప్రతి సేల్‌లో కోత 50% దాటింది.
న్యూజిలాండ్‌కు భారీ షాక్, కీలక పేసర్ దూరం
ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కైలీ జెమీషన్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జెమిషన్ వెన్నునొప్పితో కొంతకాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. గాయం మళ్లీ తిరగబడటంతో జట్టు నుంచి తప్పుకున్నాడు.
ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోల్డోవా దేశంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారని వచ్చిన ఆరోపణలపై అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వారంలో ఓటీటీ లేదా థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు
ఈ వారంలో థియేటర్ల దగ్గర సినిమాల సందడిఎక్కువగా ఉండనుంది. మహాశివరాత్రి సందర్భంగా మంచి మంచి సినిమాలు థియేటర్లలో కనిపించనున్నాయి. ఓటీటీల్లోనూ ఈ వారం కంటెంట్ విడుదలవుతోంది.
తొలి మహిళా వ్యోమగామిని త్వరలో అంతరిక్షంలోకి పంపనున్న సౌదీ అరేబియా
సౌదీ అరేబియా ఈ ఏడాది చివర్లో అంతరిక్షంలోకి తొలిసారిగా మహిళా వ్యోమగామిని పంపనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి 10-రోజుల మిషన్‌లో రైయానా బర్నావి, వ్యోమగామి అలీ అల్-ఖర్నీతో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ స్పేస్ మిషన్ యాక్సియమ్ మిషన్ 2 (యాక్స్-2)లో భాగంగా కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే మొదటి సౌదీ వ్యోమగాములుగా చరిత్ర సృష్టించనున్నారు.
ఆసీస్ ఓటమిపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆసీస్ చెత్త రికార్డులను మూటగట్టుకుంది.
మీ పర్సనాలిటీ టైప్ మీకు తెలుసా? ఎక్స్ ప్లోరర్ పర్సనాలిటీ ప్రత్యేకతలు తెలుసుకోండి
మనుషులందరూ ఒకేలా ప్రవర్తించడం జరగని పని. ఒక్కో మనిషి బుర్ర ఒక్కోలా పనిచేస్తుంది. అంటే ఒక్కోమనిషిది ఒక్కో పర్సనాలిటీ అన్నమాట. ఆ పర్సనాలిటీ ప్రత్యేకతల్లో ఎక్స్ ప్లోరర్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం.
20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు
భారతదేశంలో MPV డిమాండ్ పెరుగుతోంది. ఈ వాహనాలు SUV లాగానే విశాలంగా ఉంటాయి. ప్రయాణీకుల సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని Renault, మారుతి సుజుకీ, కియా మోటార్స్, మహీంద్రా, టయోటా వంటి బ్రాండ్‌లు తమ సరికొత్త మోడళ్లను పరిచయం చేశాయి.
WPL వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
ఉమెన్స్ ఐపీఎల్ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పోటాపోటిగా మహిళా ప్లేయర్స్ ను కొనుగోలు చేశారు. ఈ టోర్ని కూడా ఐపీఎల్ అంత హిట్ అవుతుందని బీసీసీఐ నమ్ముతోంది. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ పోటీ పడనున్నాయి.
బంధం: ప్రతీ దానిలో మీ జీవిత భాగస్వామి ఇన్వాల్స్ అవుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఏ బంధమైనా సరే దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో మీకంటూ కొంత స్పేస్ లేకపోతే అవతలి వాళ్ళకు మీరు చులకనగా మారతారు. ఏయే విషయాల్లో ఎలాంటి పరిమితులు ఉండాలో చూద్దాం.
BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు
ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
ఎబోలాను పోలిన వైరస్: ఈక్వటోరియల్ గినియాలో 9మంది మృతి; డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్
సెంట్రల్ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలాను పోలిన మార్బర్గ్ వైరస్ సోకి తొమ్మిది మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రాణాతకమైన ఈ వైరస్ సోకడం వల్ల జ్వరంతోపాటు రక్తస్రావమై వారు మరణించినట్లు తెలిపింది.
ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు
జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్ ను అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 10 ఆ తర్వాత రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రీమియర్ లీగ్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసిన లివర్‌పూల్
ప్రీమియర్ లీగ్ 2022-23లో లివర్‌పూల్ మొదటిసారిగా విజయాన్ని నమోదు చేసింది. 2-0తో ఎవర్టన్‌ను ఓడించి లివర్ పూల్ సత్తా చాటింది. మొహమ్మద్ సలా, కోడి గక్పో గోల్స్ చేసి లివర్ పూల్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముఖ్యంగా 2023లో లివర్‌పూల్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం.
లీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్
ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల్లోనే పాల ధరలు రూ. 30 వరకు పెరిగాయి. దీంతో పాక్‌లో లీటరు పాల ధర రూ. 210కి చేరింది.
అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ధర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే తమ గళాన్ని మారు మ్రోగించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడారు.
సామజవరగమన అంటూ సరికొత్తగా వస్తున్న శ్రీ విష్ణు
హీరో శ్రీ విష్ణు తన కొత్త సినిమాను ప్రకటించాడు. ప్రేమికుల రోజున సామజవరగమన టైటిల్ తో సరికొత్తగా వస్తున్నాడు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల
దక్షిణ కొరియా తయారీ సంస్థ హ్యుందాయ్ 2023 VERNA సెడాన్ మే నాటికి భారతదేశంలో విడుదల చేస్తుందని ప్రకటించింది. ఇప్పుడు ఈ సెడాన్ ను రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. రాబోయే కారు టీజర్ చిత్రాలను కూడా షేర్ చేసింది హ్యుందాయ్.
సంచలన నిజాన్ని బయటపెట్టిన జాకుబ్ జాంక్టో
చెక్ ఇంటర్నేషనల్ మిడ్ ఫీల్డర్, ఫుట్‌బాల్ ఆటగాడు జాకుబ్ జాంక్టో ఓ సంచనల నిజాన్నిబయటపెట్టారు . తనపై వస్తున్న ఆరోపణలపై తాజా ఓ కీలక విషయాన్ని బయటపడ్డారు.
వాలెంటైన్స్ డే: మీ భాగస్వామితో కలిసి వాలెంటైన్ స్వీట్ ని ఇంట్లోనే తయారు చేయండి
వాలెంటైన్స్ డే కోసం బయటకు వెళ్లే తీరిక మీకు లేకపోతే ఇంట్లోనే ఉండి హాయిగా జరుపుకోవడానికి ఈ స్వీట్ రెసిపీస్ బాగా పనిచేస్తాయి.
ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆక్రమణల తొలగింపు సమయంలో ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల మహిళతో పాటు ఆమె కుమార్తె (20) మరణించారు.
మల్లికా సాగర్‌పై పొగడ్తల వర్షం కురిపించిన దినేష్ కార్తీక్
బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముగిసింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పాల్గొన్నాయి. 87 మంది ఆటగాళ్లపై రూ.59.5 కోట్లకు ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరంలో ఘోరం జరిగింది. 27ఏళ్ల మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి సహారా మాల్‌లోని బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన తన కారులోనే నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆరోగ్యం: చిగుళ్ళ వ్యాధులను దూరంగా ఉంచడానికి కావాల్సిన టిప్స్
నోటి ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరు. మరీ ముఖ్యంగా పంటి ఆరోగ్యాన్ని అసలు లెక్కలోకి తీసుకోని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీకిది తెలుసా? పళ్ళు ఆరోగ్యంగా లేకపోతే మీరు అందంగా నవ్వలేరు .
Internet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా Windows 10లో Internet Explorerను డిసేబుల్ చేసింది. ఇది ఫిబ్రవరి 14 నుండి అమలు అవుతుంది. గత సంవత్సరం యాప్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ను కంపెనీ నిలిపివేసినప్పటికీ, బ్రౌజర్ ఇప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ముందు వెర్షన్‌లో నడుస్తుంది.
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ పుష్ప సినిమాతో అమాంతం పెరిగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు మొత్తం ఇండియాలోనే పాపులర్ పర్సన్ అయ్యారు అల్లు అర్జున్.
వేలంలో రికార్డు సృష్టించిన విదేశీ ప్లేయర్లు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మహిళా ప్లేయర్స్ పై ప్రాంఛైజీలు డబ్బులు వర్షం కురిపించాయి. ముఖ్యంగా భారత్ స్టార్ స్మృతి మంధాన రికార్డు స్థాయిలో రూ.3.40 కోట్లకు బెంగళూర్ కొనుగోలు చేసింది. అలాగే విదేశీ ప్లేయర్లు నటాలీ స్కివర్-బ్రంట్, ఆష్లీ గార్డనర్ అత్యంత ఖరీధైన ఆటగాళ్లగా నిలిచారు. బెత్‌మూనీ, ఎల్లీస్‌పెర్ర వేలంలో మంచి ధర పలికారు.
యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
దసరా సెకండ్ సింగిల్: వాలెంటైన్స్ డే కానుకగా బ్రేకప్ సాంగ్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా నుండి బ్రేకప్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇది ఆ సినిమాలోని రెండవ పాట. ఇప్పటివరకు ధూం ధాం దోస్తాన్ అనే మాస్ సాంగ్ ఒక్కటే రిలీజైంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానకు కళ్లు చెదిరే జాక్‌పాట్
మహిళల ప్రీమియర్ లీగ్ కోసం తొలిసారి జరిగిన వేలంలో అమ్మాయిలపై కనకవర్షం కురిసింది. ఇందులో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అంచనాలకు తగ్గట్టే రూ.3.40 కోట్లకు బెంగళూర్ తీసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ను మాత్రం రూ.2కోట్లలోపే ముంబై దక్కించుకుంది. ఇంకా విదేశీ ఆల్ రౌండర్లు ఆష్లే, స్కివర్‌లకు రూ.3.20 కోట్లు పలికారు.
ఫిబ్రవరి 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
13 Feb 2023
వినరో భాగ్యము విష్ణుకథ: అన్నమయ్య 12వ తరం వారితో తిరుపతి పాట లాంచ్
ఫిబ్రవరి నెలలో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరికీ ఆసక్తి కలిగిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ అనే చెప్పాలి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా కనిపిస్తుంది.
తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగినట్లు చెప్పింది. లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం
రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. 2016లో కార్యకలాపాలను ప్రారంభించి సరికొత్త ఆఫర్లతో భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని పూర్తిగా మార్చింది. ఇది వచ్చినప్పటి నుండి ఆపరేటర్ రీఛార్జ్ ఆప్షన్ సిరీస్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉన్న అన్ని వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకోండి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్ దక్కింది. ఆమెను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటిపడ్డాయి. రూ.2.6కోట్లకు దీప్తిశర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది.
ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.
ఆర్‌సీబీలోకి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలం ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియాలు వేదిక కానున్నాయి.
'ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నారు'; నెడుమారన్ సంచలన కామెంట్స్
తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ నాయకుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ 30: ఫోటోషూట్ తో తేలిపోనున్న హీరోయిన్ సస్పెన్
కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్, కొరటాల శివతో తాను చేస్తున్న సినిమా గురించి అభిమానులతో మాట్లాడుతూ, ప్రతీసారీ మీరు అప్డేట్స్ అడుగుతున్నారని, కానీ మీరు కావాలన్నారని ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగోదని, అప్డేట్ ఇవ్వాలనుకున్నప్పుడు సరైన ప్లానింగ్ ప్రకారం క్వాలిటీగా అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు.
భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్
జర్మన్ వాహన తయారీ సంస్థ Audi తన Q3 స్పోర్ట్‌బ్యాక్ కూపే SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఒకే ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. కారు స్టైలిష్ రూపంతో పాటు టెక్నాలజీ సపోర్ట్ తో సంపన్నమైన క్యాబిన్ తో వస్తుంది. ఇది 2.0-లీటర్ TFSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది.
'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు
రష్యాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని మాస్కోలోని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. కొత్తగా వెళ్లే వారు కూడా రష్యాకు వెళ్లవద్దని సూచించింది. అక్రమ నిర్బంధాల కారణంగా అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
పవర్ స్టార్ కోసం పాట పూర్తి చేసిన రాక్ స్టార్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గతకొంత కాలంగా దేవిశ్రీ ప్రసాద్ దూరమైపోయాడు. అప్పట్లో జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చిత్రాలతో దుమ్ము దులిపేసాడు.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్ ప్రపంచకప్ సాధించిపెట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2022 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది.
జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట
జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు 370కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభావం చూపదని ధర్మాసనం చెప్పింది.
వాలెంటైన్స్ డే: 2023లో మంచి జంటగా నిలిచే రాశుల కాంబినేషన్ తెలుసుకోండి
ప్రేమికుల రోజు దగ్గర పడుతున్న కొద్దీ తమ బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి లేదా మరో మెట్టు ఎక్కించడానికి అందరూ రెడీ అవుతున్నారు. మీరూ కూడా అదే పనిలో ఉంటే, ఏ రాశుల వారికి ఏ రాశి వారితో మంచి సంబంధం కుదురుతుందో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వినయ్ అరోరా తెలియజేస్తున్నారు.
స్మృతి మంధానకు అదరిపోయే ధర
మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం నేడు ముంబాయిలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా లీగ్ వేలం మల్లికా సాగర్ నేతృత్వంలో నిర్వహించారు. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్త 90 బెర్తుల కోసం 409 క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.
భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది
బెంగళూరుకు చెందిన సోషల్ మీడియా యాప్ Slick పాఠశాలకు వెళ్లే పిల్లలతో సహా తన వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసింది. కంపెనీ తన వినియోగదారుల పూర్తి పేర్లు, పుట్టినరోజులు, మొబైల్ నంబర్‌లు, పాస్‌వర్డ్ లేకుండా ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ చిత్రాలతో ఉన్న డేటాబేస్‌ను బహిర్గతం చేసింది.
కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం
గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో 35ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ చరిత్ర సృష్టించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2
2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మరిన్నిఫీచర్స్ తో భారతదేశంలో ప్రారంభమైంది.
ముంబాయి ఇండియన్స్‌కు సేవలందించనున్న టీమిండియా కెప్టెన్
మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ వేలానికి 409 మంది మహిళా క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఇందులో నుంచి ఐదు ఫ్రాంఛైజీలు కలిసి అత్యధికంగా 90మంది కొనుగోలు చేయనున్నారు. ప్రతి ప్రాంఛైజీ పర్సులో రూ.12 కోట్లు ఉండనున్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో శ్రీ విష్ణు కొత్త చిత్రం
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి చిత్రాలతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. కానీ గతకొన్ని రోజులుగా సరైన విజయాలు లేక అవస్థలు పడుతున్నాడు.
నాపోలి చేతిలో క్రెమోనీస్ ఓటమి
2022-23 మ్యాచ్ లో నాపోలి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 3-0తో క్రీమోనీస్‌ను ఓడించి సత్తా చాటింది. ఖ్విచా క్వారత్ స్టెలియా, విక్టర్ ఒసిమ్ హెన్, ఎల్జిఫ్ ఎల్మాన్ గోల్స్ చేసి ఈ సీజన్లో నాపోలికి 19వ విజయాన్ని అందించాడు.
అదానీ గ్రూప్ దర్యాప్తుపై అప్‌డేట్ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు
US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.
2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ
2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.
రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిల్ తనపై అత్యాచారం చేశారని మైసూరులో ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
కాన్సాస్ సిటీ చీఫ్స్ సంచలనం విజయం
కాన్సాస్ సిటీ చీఫ్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఫిలిడెల్ఫియా ఈగల్స్ పై ఆదివారం 38-35తో సంచలన విజయం సాధించింది. విజయాన్ని సాధించిన తర్వాత కాన్సాస్ సిటీ చీఫ్స్ సూపర్ బౌల్ 57ను గెలుచుకుంది.
ప్యార్ లోనా పాగల్ పాటతో రానున్న రవితేజ రావణాసుర
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ డూపర్ విజయాలు అందుకున్న రవితేజ, ప్రస్తుతం రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది
OnePlus 11 టోన్డ్-డౌన్ OnePlus 11R డిజైన్ కంటే బాగుంటుంది. OnePlus 11, 11R మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం.
భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా తినడం, థంబ్స్ అప్ సింబల్స్ లాంటి వాటిని ఇబ్బందికరంగా చూసే దేశాలు
అంతా ఓకే అన్నట్టు థంబ్స్ అప్ చూపించడం, కొత్తవాళ్ళని చూసి నవ్వడం, భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా ఊడ్చినట్టుగా తినడం వంటి కొన్ని వ్యవహారాలను ఇతర దేశాల్లో ఇబ్బంది కలిగించే అలవాట్లుగా పరిగణిస్తారని మీకు తెలుసా?
విల్లారియల్‌ను 1-0తో ఓడించిన బార్సిలోనా
లాలిగా 2022-23 మ్యాచ్‌లో బార్సిలోనా సత్తా చాటింది. విల్లారియల్‌ను 1-0తో బార్సిలోనా చిత్తు చేసింది. పెడ్రీ 18వ నిమిషంలో గోల్ చేసి బార్సిలోనాకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా బార్సిలోనా ఈ లీగ్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది.
గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్
మహారాష్ట్ర పుణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారించగా అది ఫేక్ కాల్ అని తేలింది.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతటా ప్రశంసలు అందుకున్న ఎన్టీఆర్, తన నెక్స్ట్ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు సమాధానంగా, మార్చ్ లో షూటింగ్ మొదలవుతుందని ఇటీవల చెప్పారు ఎన్టీఆర్.
కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా
గత కొన్నిరోజులుగా అమెరికాలో గగనతల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా గగనతలంలో అనుమానాస్పదంగా కనిపించిన గుర్తు తెలియని వస్తువును అమెరికా దళాలు కూల్చివేశాయి.
ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్
Acer Nitro 5 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. ఇది మంచి గేమింగ్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్ కార్ట్ లో చాలా చౌకగా లభిస్తుంది.
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు ఆదిరిపోయే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో రెండో టెస్టు ఆడనుంది. కాగా ధర్మశాల వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
సింగిల్ గా ఉన్న వాళ్ళు వాలెంటైన్స్ డేని ఆహ్లాదంగా జరుపుకోవడానికి చేయాల్సిన పనులు
వాలెంటైన్స్ డే అనగానే జంటలు జంటలుగా కనిపించే మనుషులు మాత్రమే చేసుకోవాలని, జంటగా లేని వాళ్ళకు వాలెంటైన్స్ డే దండగ అనీ చాలామంది అభిప్రాయ పడుతుంటారు.
లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ
ప్రసిద్ద US తయారీ సంస్థ డాడ్జ్ చికాగో ఆటో షోలో "లాస్ట్ కాల్" స్పెషల్-ఎడిషన్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయనున్నారు. ముందు మోడల్ '426 HEMI' V8 ఇంజిన్‌ను ఉపయోగించి గాడ్‌ఫ్రే క్వాల్స్ 1970 డాడ్జ్ ఛాలెంజర్ R/T SE మోడల్ లాగా ఉంది ఈ కారు.
టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య
టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. టర్కీ, సిరియాలో సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భయంకరమైన భూకంపం వచ్చిన వారం తర్వాత ఇది సంభవించింది.
కోహ్లీ కెప్టెన్సీలో చాలా నేర్చుకున్నా : రోహిత్‌శర్మ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
మీ స్నేహితులకు అప్పు ఇచ్చారా? వసూలు చేయడం ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి
ఫ్రెండ్స్ కి డబ్బిచ్చినపుడు వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వమని అడగడం కన్నా ఇబ్బంది మరోటి ఉండదు. అడిగితే ఏమనుకుంటారోనన్న అనుమానంతో చాలామంది అడగకుండా ఆగిపోతుంటారు.
మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా
మరింత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించే ఆలోచనలో ఉన్న మెటా సంస్థ. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా వచ్చే నెలలో సిబ్బంది పనితీరు సమీక్షలను పూర్తి చేసిన తర్వాత సంస్థను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది.
ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.
మాంచెస్టర్ సిటీ చేతిలో ఆస్టన్ విల్లా ఓటమి
ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లా తలపడ్డాయి. ఈ పోరులో మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లాను 3-1తో తేడాతో ఓడించింది. రోడ్రి, ఐకే గుండోగన్, రియాద్ మహ్రెజ్ హాఫ్ టైమ్‌లో సిటీకి 3-0 ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో అర్ధభాగంలో విల్లా తరఫున ఓలీ వాట్కిన్స్ ఒక గోల్ మాత్రమే చేశాడు.
బాలయ్యకు జోడీగా మరోమారు ప్రగ్యా జైశ్వాల్
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రగ్యా జైశ్వాల్, ఆ తర్వాత నటించిన సినిమాలతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలెట్టాయి.
ఏజెంట్ మూవీ బడ్జెట్: అఖిల్ సినిమాకు హిట్ సరిపోదు, బ్లాక్ బస్టర్ కావాలి?
అక్కినేని అఖిల్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. వరుసగా ఫ్లాపులు ఖాతాలో వేసుకున్న తర్వాత, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాతో మోస్తారు విజయాన్ని అందుకున్నాడు.
సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు
సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.
Womens T20 World Cup 2023లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించగా షెఫాలీ వర్మ, రిచా ఘోస్ పర్వాలేదనిపించారు.
అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత
అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు.
ఫిబ్రవరి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.