19 Feb 2023

రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.

ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?

ఫిబ్రవరి 24నుంచి 26వరకు నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నియామకాన్ని ఆమోదించనున్నారు. ప్లీనరీలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కూడా ఎన్నుకోనున్నారు. అయితే సీడబ్ల్యూసీని ఎలా ఏర్పాటు చేస్తారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి అల్లాడిపోయిన ఆస్ట్రేలియా

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా జట్టు అల్లాడిపోయింది. జడేజా ఏడు వికెట్లతో విజృంభించడంతో ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు

ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే రెసిపీ గురించి తెలుసుకుందాం

ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే ఉక్రెయిన్‌పై దమనకాండకు దిగిన రష్యాపై మరన్ని ఆంక్షలు విధించాలని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.

ఫిబ్రవరి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

18 Feb 2023

నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ వార్తతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దఃఖసాగరంలో మునిగిపోయింది. తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం

సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొన్నిరోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శివైక్యం చెందారు.

కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస

సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.

పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి

పాకిస్థాన్‌లో పోలీస్ కార్యాలయంపై మరోసారి ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) శుక్రవారం రాత్రి దాడి చేసింది. దీని ఫలితంగా ఒక పౌరుడు, ఆర్మీ రేంజర్, ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు.

అర్ధశతకంతో టీమిండియాను అదుకున్న అక్షర్ పటేల్

ఢిల్లీలో అస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్ రౌండర్ అర్ధశతకంతో రాణించాడు. విరాట్‌కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మొదటి నుండి దూకుడుగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించాడు.

ఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్

ఎయిర్ ఇండియా 470 విమానాలకు అర్డర్ ఇస్తేనే ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు దానికి మించిన విమానాల ఆర్డర్‌ను ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఇవ్వడంతో ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతుందని గమనిస్తున్నారు.

ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు'

యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన కళ్యాణం కమనీయం సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం శివరాత్రి కానుకగా సంతోష్ శోభన్ బాబు నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.

హెలికాప్టర్ కంటే వేగంగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీ వచ్చేసింది..!

మనం ఇప్పటివరకు చాలా టాక్సీలను చూసి ఉంటాం. కానీ ఇది సరికొత్త ఎలక్ట్రిక్ టాక్సీ. ఇది వరకు ఎన్నడూ లేనట్లుగా ఆకాశంలో ఎగిరే టాక్సీ, త్వరలో ఆకాశంలో వెళుతూ గమ్యానికి చేరుకునేలా ఓ టాక్సీ అందుబాటులో రానుంది. త్వరలో బెంగళూరు జరిగే ఏరో ఇండియా ఈ ప్రదర్శనకు వేదిక కానుంది.

ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు.

IND vs AUS, 2nd Test: విరాట్‌ కోహ్లి ఔట్‌పై రాజుకున్న వివాదం

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఔట్‌పై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ఢిల్లీ టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పదరీతిలో ఔటయ్యాడు. బంతికి బ్యాట్‌కి తాకి అనంతరం ఫ్యాడ్‌కి తాకినట్లు రిప్లైలో కనిపిస్తున్నా కోహ్లీ ఔట్ అంటూ ప్రకటించారు. దీనిపై థర్డ్ ఆంపైర్ కూడా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోవడం గమనార్హం.

మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ మరోసారి యూజర్లకు ఝలక్ ఇచ్చింది. ఎస్ఎమ్ఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(2ఎఫ్ఏ) భద్రతా సదుపాయాన్ని ఇకపై ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లే ఇస్తామంటూ శుక్రవారం వెల్లడించింది. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూజర్లకు మరోమారు షాక్ తగిలినట్లు అయింది.

దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ

దిల్లీ మద్యం కేసులో డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ సమన్లు జారీ చేసినట్లు సిసోడియా శనివారం ట్వీట్ చేశారు.

ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తక్కువ బడ్జెట్ తో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. ఈరోజు ఈ సినిమా వెండితెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.

బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

బిహార్, ఒడిశాలోని బెగుసరాయ్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, సోనేపూర్, భవానీపట్నా, పరదీప్‌తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది. అర్హత కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 5జీ సేవలను పొందవచ్చు. కంపెనీ తన 5జీ డేటా ప్లాన్‌ను ఇంకా వెల్లడించలేదు.

టెస్టులో కొత్త రికార్డు సృష్టించిన బెన్ స్టోక్స్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టులో సరికొత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న ఓపెనింగ్ టెస్టులో బెన్ స్టోక్స్ ఈ మైలురాయిని సాధించాడు. మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బెన్ స్టోక్స్ అధిగమించాడు. టెస్టులో అత్యధిక సిక్సర్లు (107) సాధించిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డను చెరిపేశాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 109 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన

ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విషయాన్ని బెంగళూర్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఉమెన్స్ లీగ్ వేలంలో మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. వేలంలో రూ.3.కోట్ల 40 లక్షలకు బెంగళూర్ స్మృతి మంధాన కొనుగోలు చేసింది.

దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు

12 చిరుతలతో దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది.

దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన నిక్కీకి, నిందితుడు సాహిల్‌కు 2020లో పెళ్లి జరిగింది. వివాహానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు వార్నర్ దూరం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండు టెస్టు నుండి తప్పుకున్నాడు.

ఐపీఎల్లో ధోని కన్నా రోహిత్‌శర్మనే బెస్ట్ కెప్టెన్ : వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌కు ట్రోఫీలందించిన రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని చెప్పడం కొంచెం కష్టమైన ప్రశ్న, కెప్టెన్ భారత జట్టుకు ధోని ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ముంబైకి రోహిత్ ఒంటోచెత్తో ట్రోఫీలందించిన ఘనత ఉంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో గొప్పొ తేల్చడం కష్టమే.

అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో శుక్రవారం వరుస కాల్పుల నేపథ్యంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులన్ని అర్కబుట్ల కమ్యూనిటీలోనే జరిగినట్లు వెల్లడించారు.

రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరోసారి ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పాత్ర అమోఘమంటూ కితాబు ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు

టర్కీ, సిరియాలో 11రోజలు కింద సంభవించిన భారీ భుకంపాల ధాటికి ఇప్పటి వరకు 45,000 మందికి పైగా మరణించారు. 40కిపైగా వచ్చిన ప్రకంపనల వల్ల వేలాది భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 2,64,000 అపార్ట్‌మెంట్లు పోయాయి. గడ్డకట్టే చలిలోనూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

మహశివరాత్రి పండుగ ప్రాముఖ్యత

శివరాత్రి రోజు శివున్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి, హిందూ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా శివరాత్రి రోజున ఉపవాసం, ప్రార్థనలు చేసి, ప్రసాదాలను పంపిణీ చేస్తారు.

ఫిబ్రవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.