28 Feb 2023
మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ ఈరోజు తన తొలి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF), Recycle with Respectని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించారు.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల
అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (GDP) 4.4 శాతం వృద్ధి చెందిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2022-23లో GDP వృద్ధి 2021-22లో 9.1 శాతంతో పోలిస్తే 7.0 శాతంగా అంచనా వేయబడింది.
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌కు బుమ్రా దూరం
ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కి భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయయాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విమాన ప్రయాణం భయంగా అనిపిస్తోందా? దాన్ని పోగొట్టుకునే మార్గాలివే
భూమి నుండి 16వేల అడుగుల ఎత్తులో చిన్న సిలిండర్ లాంటి డబ్బాల్లో ఉన్నప్పుడు భయం కలగడం, అది ఆందోళనగా మారడం సహజమే. కానీ అది తీవ్రంగా మారినప్పుడే మీకు ఇబ్బంది కలుగుతుంది.
చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
చంద్రయాన్-3 మిషన్ కోసం లాంచ్ వెహికిల్‌లోని క్రయోజెనిక్ పై స్టేజ్‌కి శక్తినిచ్చే సీఈ-20 క్రయోజెనిక్ ఇంజిన్‌కు సంబంధించిన ఫ్లైట్ యాక్సెప్టెన్స్ హాట్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.
ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవం, కైలాస దేశ వ్యవస్థాపకుడు, స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల జనరల్ అసెంబ్లీలో కైలాస దేశ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా నిత్యానంద తెలియజేశారు. జనీవాలో జరిగిన సమావేశంలో తమ ప్రతినిధులు హాజరైనట్లు పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా తరుపున టెస్టులో అరంగేట్రం చేసిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టోనీ డి జోర్జి, గెరాల్డ్ కోయెట్జీ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల దేశవాళీ క్రికెట్లు ఇద్దరు బాగా రాణించడంతో వాళ్లు తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. బ్యాట్‌మెన్‌గా డిజోరి, రైట్ ఆర్మ్ పేసర్ గా కోయెట్టీ జట్టులో రాణించనున్నారు.
ఓటీటీ: మార్చ్ లో రిలీజ్ అవుతున్న వెంకటేష్ రానా నాయుడు, తరుణ్ భాస్కర్ యాంగర్ టేల్స్
మార్చ్ లో బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అదే మాదిరిగా ఓటీటీలో వినోదం పంచడానికి కొన్ని సిరీస్ లు వచ్చేస్తున్నాయి.
భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో 2023 ALCAZAR SUV కోసం బుకింగ్‌లు ప్రారంభించింది. రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఇది MG హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700, టాటా సఫారి, టయోటా ఇన్నోవా హైక్రాస్‌లకు పోటీగా ఉంటుంది.
ఇంగ్లండ్‌తో పోరుకు బంగ్లాదేశ్ సై
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మార్చి 1 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోపక్క ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. అయితే ఇరు జట్లు వన్డే సిరీస్ పై కన్నేయడంతో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉండనుంది.
పట్టపగలు, కత్తులతో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో పట్టపగలు 26ఏళ్ల యువకుడిని దారుణంగా నరికి చంపారు. కర్ణాటక బీదర్ జిల్లాలోని త్రిపురాంత్ గ్రామంలో ఈ హత్య జరిగింది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.
దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు
మార్చి 2న దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
యాక్షన్ ఇచ్చిన బహుమతులంటూ గాయాలను చూపుతున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత, సినిమాల షూటింగుల్లో పాల్గొనడానికి వచ్చేసింది. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది.
ఇరానీ కప్‌లో తలపడనున్న మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా
గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో మార్చి 1 నుంచి మధ్య ప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మధ్య ఇరానీ కప్ టోర్నీ జరగనుంది. రంజీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన మిగిలిన జట్ల ప్లేయర్లను ఓ టీమ్‌గా చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌గా, రంజీ ట్రోఫీ విజేతతో ఇరానీ కప్ జరుగుతుంది
డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 SUVని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది HSE, X అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 3.0-లీటర్, ఆరు-సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో వస్తుంది.
అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్‌లో జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డాతో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
#PKSDT మూవీలో నటించే వాళ్ళ లిస్ట్ వచ్చేసింది
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా వారం రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా, తమిళ చిత్రమైన వినోదయ సీతమ్ కి రీమేక్ గా రూపొందుతోంది.
Novak Djokovic: టెన్నిస్‌లో జకోవిచ్ ప్రపంచ రికార్డు
ప్రపంచ టెన్నిస్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ పురుషుల ర్యాకింగ్స్‌లో ఏ ప్లేయర్ కు సాధ్యం కాని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO
ఇప్పటి వరకు అధిక పెన్షన్‌లను ఎంపిక చేసుకోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO గడువును మే 3 వరకు పొడిగించింది. 2022లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ మార్చి 3న చివరి తేదీ అని నిర్ణయించింది.
Access Now Report: ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారత్‌లోనే ఎక్కువ
ప్రపంచంలో ఇంటర్నెట్ అంతరాయాలు భారత్‌లోనే అధికంగా జరుగుతున్నాయని అంతర్జాతీయ డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ, కీప్ ఇట్ ఆన్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక చెబుతోంది. 2022లో భారత్‌లో అత్యధికంగా 84ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు జరిగినట్లు పేర్కొంది. వరుసగా ఐదో సంవత్సరం ఇంటర్నెట్ అంతరాయాల జాబితాలో భారత్ టాప్‌లో నిలవడం గమనార్హం. 2016నుంచి అంతరాయాల జాబితాను పరిశీలిస్తే ఒక్క భారత్ వాటా58% ఉన్నట్లు నివేదిక చెబుతోంది.
వ్యాపారం: మీకున్న ఈ అభిరుచులను బిజినెస్ గా మార్చుకోండి
మీకేది ఇష్టమో తెలుసుకోండి, ఆ తర్వాత దానిలో అత్యంత నైపుణ్యాన్ని సాధించండి - స్టీవ్ జాబ్స్
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు.
pakistan super league: ధోనీలాగా షాట్ కొట్టిన రషీద్ ఖాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 లో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై లాహోర్ ఖలందర్స్ భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 20 ఓవర్లలో 200/7 స్కోరు చేసింది. అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంకేతికత భారత్‌కు సాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి
ఎక్కువ వయసున్న కనిపించాలని ఎవ్వరికీ అనిపించదు. కానీ కొన్నిసార్లు మీరు వేసుకునే బట్టలు, మీ అసలైన వయసు కన్నా ఎక్కువ వయసున్న వారిలా కనిపించేలా చేస్తాయి.
మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో
బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి బెంగళూరుకు చెందిన Yulu, మిరాకిల్ GR, DeX GR అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రదర్శించారు. బజాజ్ కు Yulu తన రెండవ తరం ఈ-స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడింది, దానితో పాటు కొన్ని భాగాలను ఉత్పత్తి చేసింది.
క్రికెట్ దేవుడు సచిన్ కోసం భారీ విగ్రహం.. ఫ్యాన్స్‌కు పండుగే
క్రికెట్‌లో అభిమానులందరూ సచిన్‌ను దేవుడితో కొలుస్తారు. ధోని నుంచి కోహ్లీ వరకూ అందరూ సచిన్‌ను ఆరాధిస్తుంటారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ ఎంతోమంది స్ఫూర్తిధాయకంగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ గా కీర్తి గడించిన సచిన్ కు ప్రస్తుతం అరుదైన గౌరవం దక్కనుంది. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనునడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక
ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
జాతీయ సైన్స్ దినోత్సవం 2023: నోబెల్ బహుమతికి కారణమైన సీవీ రామన్ సముద్ర ప్రయాణం
సీవీ రామన్.. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ప్రయోగాన్ని రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. రామన్ ఎఫెక్ట్ ప్రయోగానికి గాను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు వార్ ఫ్యాన్స్‌కు మజానిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది.
కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్ని రాజకీయ పక్షాలను ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉత్తర కన్నడ జిల్లాలోని బనవాసి మార్గంలో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి.
సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు
యాక్టర్ శ్రీ విష్ణు, రెబ్బా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం సామజవరగమన. వివాహ భోజనంబు సినిమాతో మెప్పించిన రామ్ అబ్బరాజు, ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Best FIFA Football Awards: ఉత్తమ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ
పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్ బాల్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం వరించింది.
తలనొప్పి ఇబ్బంది పెడుతోందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి
తలనొప్పిని ఎవ్వరూ భరించలేరు. అకస్మాత్తుగా నొప్పి కలిగితే అప్పుడు తట్టుకోవడం మరింత కష్టమవుతుంది. తలనొప్పిని తగ్గించడానికి మందులు వాడుతుంటారు.
అరుదైన కలయికలో కలిసి కనిపించనున్న బృహస్పతి, శుక్ర గ్రహాలు
చంద్రుడు, శుక్రుడు, బృహస్పతి కలిసి కనిపించిన కొన్ని రోజుల తర్వాత, సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం అయిన బృహస్పతి, భూమికి దగ్గరగా ఉండే శుక్ర గ్రహం మార్చి 1న ఆకాశంలో అరుదైన కలయికతో కనిపించనున్నాయి.
కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం తమ డ్రీమ్ అని ఎంతోమంది బౌలర్లు చెబుతుంటారు. కోహ్లీ క్రీజులో నిల్చుకుంటే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు, అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ వికెట్ కీలకం. ఎలాగైనా కోహ్లీ వికెట్ తీయాలని బౌలర్లు శ్రమిస్తుంటారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్ తీయడం తన లక్ష్యమని పాకిస్తాన్ యువ స్టార్ పేసర్ హారిస్ పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 2022లో టెస్లా షేర్లు క్షీణించడంతో మొదటి స్థానాన్ని కోల్పోయారు.
దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
లిక్కర్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ఆహ్వానం ఎన్టీఆర్ కి అందలేదా? నిజమేంటంటే?
హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ తన సత్తాను చాటింది. నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందుకుని అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది.
945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్
ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి బంధ విముక్తులవుతున్నాయి. సుదీర్ఘ కరోనా కాలానికి ఇక ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో తమ దేశంలో సుదీర్ఘ కాలంగా అమలు చేస్తున్న మాస్క్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం హ్యాక్ అయ్యింది. పార్టీ ఖాతా పేరు మార్పు, లోగోను హ్యాకర్లు మార్చారు.
టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ రికార్డు.. ఒక పరుగు తేడాతో విజయం
బజ్‌బాల్ విధానంతో దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌కు టెస్టులో మొదటిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 258 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కివిస్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని పరువును నిలబెట్టుకుంది.
ట్రావెల్: ఇండియాలోని అత్యంత ఎత్తులో గల సరస్సులను ఎప్పుడైనా చూసారా?
పర్యాటకాన్ని ఇష్టపడేవారు సరస్సుల గురించి తెలుసుకోవాలి.
ChatGPT లాంటిదే అభివృద్ధి చేయడానికి టీంను నియమించనున్న ఎలోన్ మస్క్
ఎలోన్ మస్క్, బాబుష్కిన్ AI పరిశోధనను కొనసాగించడానికి ఒక టీంను నియమించుకోనున్నారు. అయితే ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది అభివృద్ధి చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక లేదు అయితే మస్క్ ఈ ప్రణాళికపై అధికారికంగా సంతకం చేయలేదని బాబుష్కిన్ తెలిపారు.
NZ Vs Eng: వారెవ్వా.. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బకు బిత్తిరిపోయిన బ్యాటర్లు
వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ జాకోలీచ్ అద్భుత బౌలింగ్‌తో అకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌కు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఘనమైన ఆరంభాన్ని అందించారు. కేన్ విలియమ్సన్ మెరుపు సెంచరీతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
పవన్ కళ్యాణ్ సరసన ధమాకా బ్యూటీకి ఛాన్స్?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని, కొత్త సినిమాలు రావాలనీ, అన్నీ కొత్తగా ఉండాలనీ, వింత పోకడలకు పోతున్న సమయంలో వచ్చిన ధమాకా, అందరి నోళ్ళను మూయించిందని చెప్పాలి.
మార్చి 15 నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తో , ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఐబిఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో బరిలోకి దిగనున్నారు.
అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ భద్రతా దళాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మూడో వ్యక్తిని అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
ఫిబ్రవరి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
27 Feb 2023
కింగ్‌ఫిషర్ బీర్ కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మందుబాబు
కొందరి మందుబాబుల సమస్యలు అప్పడప్పుడూ హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లకు అది సీరియస్ సమస్య అయినా, వేరే వాళ్లకు నవ్వు తెప్పించే విషయం అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్
నటుడు శ్రీ విష్ణు గత చిత్రం అల్లూరి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సామజవరగమన అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే'
దిల్లీ మద్యం కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అంశం తెలుగు రాష్ట్రాలు కూడా చర్చశీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొంతర కీలక నేతలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి
కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.
బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు, సంబంధిత టెక్నాలజీల రంగంలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించే వేదిక. ఈ సంవత్సరం వేడుకలో సుమారు 200+ దేశాల నుండి 80,000 మంది పాల్గొంటారని అంచనా. సామ్ సంగ్, HONOR, Huawei వంటి బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను అందించడానికి సిద్ధమయ్యాయి.
'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పురాతన, చారిత్రక సాంస్కృతిక మత స్థలాల పేర్లను మార్చే కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారతదేశం ఒక లౌకిక దేశమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూ మతం ఒక జీవన విధానమని చెప్పుకొచ్చింది.
మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్
దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిసోడియా అరెస్ట్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని చెప్పారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్
మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో మామూలే, హానికరమైన వాయువుల వలన ఈ పని చేసే వారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. భారతదేశంలో 2017 నుండి సుమారు 400 మంది ఈ మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో మరణించారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం మ్యాన్‌హోల్స్‌లోని మురుగునీటిని శుభ్రపరిచే బాండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో ఈ రోబో మ్యాన్‌హోల్ శుభ్రం చేసే కార్మికులకు విశ్రాంతిని అందిస్తోంది.
మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.
The Wall Street Journal: చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చైనాలో జరిగిందని మరో పరిశోధన తేల్చి చెప్పింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రిపోర్డును 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది.
2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం
జర్మన్ లగ్జరీ మార్క్ బి ఎం డబ్ల్యూ గ్లోబల్ మార్కెట్లలో 2023 XM లేబుల్ రెడ్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ హైబ్రిడ్ SUV 2,000 యూనిట్ల కంటే తక్కువ ఉత్పత్తితో 2023 చివరినాటికి మార్కెట్లో వస్తుంది.
కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు
స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజున అతను రాస్ టేలర్‌ను అధిగమించాడు. అంతేకాదు విలియమ్సన్ తన 26వ సెంచరీని కూడా ఈ ఫార్మాట్‌లో పూర్తి చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
మరో రెండు నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన కర్ణాటకలో పర్యటిస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు రెండు నెలల్లోనే ఏకంగా ఐదు సార్లు మోదీ కర్ణాటకలో పర్యటించడం గమనార్హం.
ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం
ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.
D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఆయన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల
ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.
అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్
కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.
దిల్లీ మద్యం కేసు: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనలు; బీజేపీ హెడ్ క్వార్టర్ వద్ద హై టెన్షన్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సిసోడియా అరెస్టు అక్రమమంటూ దేశవ్యాప్తంగా నిరసనలకు ఆప్ సోమవారం పిలుపునిచ్చింది.
National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్
స్ట్రాబెర్రీ.. వేసవిలో విరివిగా లభించే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. స్ట్రాబెర్రీలో శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు ఉంటాయి. సోమవారం(ఫ్రిబవరి 27) నేషనల్ స్ట్రాబెర్రీ డే 2023 కావడంతో స్ట్రాబెర్రీతో చేసే కొన్ని రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో సఫారీ 2023 అప్డేట్ ప్రారంభించింది, మార్కెట్లో ఏడు సీట్ల SUV విభాగంలో మహీంద్రా XUV700కి పోటీగా ఉంటుంది. సఫారీ ఈమధ్య కాలంలో టాటా మోటార్స్ నుండి అత్యంత సమర్థవంతమైన కార్లలో ఒకటి. అయితే, XUV700లో లెవెల్ 2 ADAS ఫంక్షన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ వంటి ఇతర ప్రీమియం ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా సెవెన్-సీటర్ SUV కేటగిరీలో మహీంద్రా దూకుడు పెంచింది.
దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
తెలుగు దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణించి నెల కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయలక్ష్మి మరణించే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్
ఎలోన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్ సోమవారం నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనుంది.
మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం
కేప్‌టౌన్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయ దుందుభిని మోగించింది. దక్షిణాఫ్రికాను 19పరుగుల తేడాతో ఓడించి ఏకంగా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఫిబ్రవరి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.