06 Mar 2023
ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.
"ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి"
ఈ నెల 17 న రానున్న సినిమా "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు, ముద్దు ముచ్చట్లతో సాగే ఈ పాటను యూట్యూబ్ లో సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ పాటలో ఆయన నూతన మోహన్ తో కలిసి ఆలపించారు. భాస్కర భట్ల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.
ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో
స్వదేశీ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల అభివృద్ధి కోసం అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
రేపు శాటిలైట్ రీ-ఎంట్రీ ప్రయోగాన్ని నిర్వహించనున్న ఇస్రో
ఇస్రో మార్చి 7న మేఘా-ట్రోపిక్స్-1 (MT1) అనే లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాన్ని నియంత్రిత రీ-ఎంట్రీకి సవాలు చేసే ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహం పసిఫిక్ సముద్రంలో కూలిపోతుందని భావిస్తున్నారు.
టీవీ ఛానళ్లలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని నిషేధించిన పాకిస్థాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ
పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చింది. ఆయన ప్రసంగాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.
women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రావెల్: ఈజిప్టు వెళ్తున్నారా? అక్కడ ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోండి
ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా అక్కడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే ఆ ప్రాంతపు స్థానికుల కారణంగా మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతమ్ ఈజిప్టు వెళ్తే ఎలా మసులుకోవాలో తెలుసుకుందాం.
BAN vs ENG: అర్ధ సెంచరీతో చెలరేగిన షకీబుల్ హసన్
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. షకీబ్ 71 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో తన కెరీర్‌లో వన్డేలో 52 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (11), లిట్టన్ దాస్ (0) నిరాశ పరిచారు.
50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం
ఇరాన్‌లో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న విషప్రయోగాలు దేశంలో కలకలం రేపుతున్నాయి.
2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది
జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సిటీ సెడాన్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.
తక్కువ రోజుల్లో పూర్తియైన టెస్టు మ్యాచ్‌లపై ఓ లుక్కేయండి
ఈ మధ్య కాలంలో ఐదురోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్‌లు.. మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లతో ఫలితం తేలుతున్నా.. క్రికెట్ అభిమానులకు మాత్రం మాజా రావడం లేదు.
ఓటీటీ: ఈ వారం ఇంట్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు
ఈ వారంలో ఓటీటీలో మంచి కంటెంట్ విడుదల అవుతోంది. సినిమాలతో పాటు సిరీస్ లు కూడా రానున్నాయి. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
జాతీయ సరిహద్దుల వెలుపల ఉన్న ప్రపంచ మహాసముద్రాలలో సముద్ర జీవులను రక్షించడానికి UN సభ్యులు మొట్టమొదటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం
లండన్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో, పార్లమెంటులో ప్రతిపక్ష మాట్లాడనివ్వదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాత్కాలిక సుఖం కోరితే శాశ్వత ఆనందం దూరమవుతుంది
రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు బాగా నిద్రొస్తుంది, ఇంటర్వ్యూ గురించి మీకేమీ తెలియదు, కనీసం మీ గురించి చెప్పమన్నా మీరు చెప్పలేరు. ఇలాంటి టైమ్ లో రాత్రి కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుందని మీ మెదడు చెబుతుంది.
Ind Vs Aus: నాలుగో టెస్టుకు స్టార్ బౌలర్ షమీ రీ ఎంట్రీ
భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇండోర్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. ప్రస్తుతం చివరి టెస్టుపై దృష్టి సారించింది. నాలుగో టెస్టు కోసం మహ్మద్ షమీని మళ్లీ జట్టులోకి తీసుకోబోతున్నారు. మూడో టెస్టులో షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ వచ్చాడు. ప్రస్తుతం షమీ కోసం ఎవరిని రిజర్వ్ బెంచ్ పై కుర్చోబెడతారో వేచి చూడాల్సిందే.
దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను వారం రోజుల రిమాండ్ ముగియడంతో సీబీఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ క్రమంలో సిసోడియాను 14రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అంటే మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
హోళీ 2023: పండగ పూట నోటిని తీపి చేసే రెసిపీస్
హోళీ అంటే రంగులే కాదు, నోటికి తీపి చేసే ఆహార పదార్థాలు కూడా గుర్తొస్తాయి. రంగుల్లో మునిగి తేలుతూ మీకు నచ్చిన రెసిపీస్ ని ఆస్వాదిస్తే ఆ మజాయే వేరు. అందుకే మీకోసం కొన్ని స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం.
మనవడికి స్వాగతం పలికిన బిల్ గేట్స్ మెలిండా దంపతులు
బిల్ గేట్స్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ జంట గర్భం దాల్చినట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో మెలిండా జెన్నిఫర్‌కు బేబీ షవర్ చేశారు.
18 సంవత్సరాలకే వన్డేలోకి ఇంగ్లండ్ కుర్రాడు ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్ కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లోకి ఇంగ్లండ్ తరుపున అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ అహ్మద్ రికార్డు సృష్టించాడు.
నాగశౌర్య మూవీ ఫఫ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ పై అప్డేట్
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం పాట్నాలోని తన నివాసంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ప్రశ్నించారు.
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
మార్చి 17 నుంచి టీమిండియాతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన స్టార్ బౌలర్ జై రిచర్డర్ సన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
మరింత లాభపడిన భారతీయ రూపాయి
విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలకు తిరిగి రావడంతో రూపాయి గత వారం దాదాపు 1% పెరిగి డాలర్‌కు 81.9650 వద్ద ముగిసింది. ప్రస్తుత వారంలో, ఇది 81.60-82.50 మధ్య కదులుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మీ పిల్లల మీద ఎగ్జామ్స్ ఒత్తిడి పడకుండా ఉండడానికి చేయాల్సిన పనులు
మంచి మార్కులు తెచ్చుకోవాలనే విషయంలో పిల్లల మీద చాలా ఒత్తిడి ఉంటున్న మాట నిజం. తల్లిదండ్రులైతే నేమీ, ఉపాధ్యాయులైతే నేమీ పిల్లల నుండి మంచి మార్కులు కావాలనుకుంటూ వారి మీద ఒత్తిడి పెంచేస్తున్నారు.
యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య
లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో బిడ్డను ప్రసవించింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని అంబజారి ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు
10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో ఏపీలో 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కార్పొరేట్, పలు ప్రవేటు పాఠశాలలు అలా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ప్రైమ్ వాలీబాల్ సహకారం
ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ఫైనల్‌కు ముందు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ జనరల్ డైరెక్టర్ ఫాబియో అజెవెడో ప్రకటించారు. పివిఎల్ ఫైనల్ ప్రారంభానికి ముందు, ఎఫ్‌ఐవిబి జనరల్ డైరెక్టర్ మాట్లాడారు. భారతదేశంలో వాలీబాల్ అభివృద్ధికి కృషి చేయడానికి పివిఎల్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి టోల్ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో నేషనల్ హైవేస్ (ఎన్‌హెచ్‌లు), ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించే ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. టోల్ ధరలను 5శాతం నుంచి 10శాతానికి పెంచే ఆలోచనలో ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రీమియర్ లీగ్‌లో మొహమ్మద్ సలా అరుదైన రికార్డు
ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ తరుపున మొహమ్మద్ సలా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. మాంచెస్టర్ యూనైటడ్ 7-0 తేడాతో లివర్ పూల్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సలా ఓ రికార్డును సృష్టించాడు.
ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు
ఈపీఎఫ్ పింఛన్‌దారులకు ఉద్యోగుల భవిషనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) షాక్ ఇచ్చింది. అధిక వేతనంపై ఎక్కువ పింఛన్ పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. అయితే 2014కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఈ నోటీసులను పంపింది.
మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ రూ.62,000 వరకు కార్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది. వేరియంట్, డీలర్‌షిప్ తో పాటు ప్రాంతాన్ని బట్టి ఈ ఆఫర్‌లు మారచ్చు.
రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ
రవితేజ అంటే మాస్.. మాస్ సినిమాలకు రవితేజ పెట్టింది పేరు. అందుకే మాస్ మహారాజ అంటారు. అయితే రావణాసుర టీజర్ చూసిన తర్వాత రవితేజ లోని మరో కోణం బయటపడుతుంది.
IND Vs AUS : స్టీవ్ స్మిత్‌కే చివరి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు
మార్చి 9న ఆహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా జట్టుని కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ పగ్గాలను అందుకోనున్నాడు. ఢిల్లీ టెస్టు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమిన్స్.. ఇంకా ఇండియాకి తిరిగి రాలేదు. భారత్‌తో జరిగే నాలుగో టెస్టు ఆడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పినట్లు సమాచారం.
ఎన్టీఆర్ 30: హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్, అదిరిపోయిన ఫస్ట్ లుక్
ఎన్టీఆర్ 30 నుండి అప్డేట్ వచ్చేసింది. ఎప్పటి నుండో అందరూ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోందని అధికారిక ప్రకటన ఈ రోజే వెలువడింది.
మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
మేఘాలయ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సోమవారం తొలిసారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
WPL 2023 : ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ చేతిలో పరాజయం పాలైంది. మొదటి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన గుజరాత్.. రెండో మ్యాచ్ లో యూపీ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ జెయింట్స్ తరుపున కిమ్ గార్త్ ఐదు వికెట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.
హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్
హోళీ రోజు రంగులతో ఆడడం పిల్లలకి సరదాగా ఉంటుంది. ఐతే రంగులతో అడే సమయంలో మీ పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. రసాయనాలున్న రంగుల నుండి మీ పిల్లలు సురక్షితంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులేంటో చూద్దాం.
మార్చి 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా సెలెక్టర్లు రాజీనామా చేయాలన్న గవాస్కర్
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వివాదంగా మారుతోంది. పిచ్‌పై విమర్శలు రోజు రోజుకు ఎక్కువతున్నాయి. ముఖ్యంగా ఆసీస్ మాజీ క్రికెటర్లు టీమిండియా నాగ్‌పూర్‌ను పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.
ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ప్రాజెక్ట్ కె షూటింగ్ లో యాక్సిడెంట్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన్ ప్రమాదంలో గాయాలు కావడంతో కుడివైపు పక్కటెముకలకు గాయాలయ్యాయి.
హౌస్ పార్టీలో కాల్పులు: ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
జార్జియాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. డగ్లస్ కౌంటీలో 100మందికిపైగా యువకులు గుమిగూడిన హౌస్ పార్టీలో కాల్పులు జరపడంతో శనివారం ఇద్దరు వ్యక్తులు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
మా నాన్న లైంగికంగా వేధించే వాడంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సంచలనం
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, సంచలన విషయాలు బయట పెట్టారు. తన ఎనిమిదేళ్ళ వయసులో తన తండ్రి లైంగికంగా వేధించే వారని చెప్పుకొచ్చారు.
ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ పరాజయం
ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ చెత్త ప్రదర్శనతో ఓటమిపాలైంది. 7-0 తేడాతో మాంచెస్టర్ యునైటెడ్ ని లివర్ పూల్ చిత్తు చేసింది. ప్రీమియర్ లీగ్‌లో టాప్ 4 ఆశలను లివర్ పూల్ సజీవంగా ఉంచుకుంది. కోడి గక్పో, డార్విన్ నునెజ్, మొహమ్మద్ సలా అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు.
ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి
ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉస్మాన్ సోమవారం మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారాలో పోలీసులు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉస్మాన్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
శర్వానంద్ బర్త్ డే: పాత్ర కన్నా సినిమా గొప్పదని నమ్మే నటుడి కెరీర్లోని వైవిధ్యమైన సినిమాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరు మాస్ సినిమాలతో జనాలకు దగ్గరైతే మరికొందరు క్లాస్ సినిమాలతో దగ్గర అవుతారు . కానీ కొందరు మాత్రమే తమ సినిమాలోని వైవిధ్యత వల్ల దగ్గర అవుతారు. ఆ వరుసలో శర్వానంద్ ముందుంటారు.
WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్‌లోనే ముంబై చేతిలో ఖంగుతున్న గుజరాత్ జెయింట్స్ తన అపజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆదివారం గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ తరుపున కిమ్ గార్త్ ఐదు వికెట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.
05 Mar 2023
ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తీవ్రమైన చర్చనడుస్తోంది.
మార్చి 7న నాగాలాండ్ సీఎంగా 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం
ఎన్‌డీపీపీ అధినేత నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతతో ఆయన ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.
మార్చి 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
నాజర్ బర్త్ డే: దక్షిణాది సినిమాల్లో చెరగని ముద్రవేసిన నాజర్ జీవితంలో మీకు తెలియని విషయాలు
నాజర్... పాత్రేదైనా ఆ పాత్రకు కొత్తదనాన్ని తీసుకొచ్చే నటుడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోకు సపోర్ట్ ఇస్తాడు. అలాగే విలన్ గా హీరోను ఎదిరిస్తాడు. అంతేకాదు, కమెడియన్ గా మారి ప్రేక్షకులను నవ్విస్తాడు కూడా.