12 Mar 2023
కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు.
రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది.
మార్చి 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
11 Mar 2023
2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది
జపనీస్ మార్క్ కవాసకి తన హైపర్‌బైక్ 2023 వెర్షన్, భారతదేశంలోని Z H2 ధరను రూ.23.02 లక్షలు. మార్కెట్లో ఇది సెగ్మెంట్ లీడర్, 2023 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4తో పోటీపడుతుంది. ఇది ట్రాక్-ఫోకస్డ్ నింజా H2R మోడల్‌కు వెర్షన్, Z H2 భారతదేశంలో స్ట్రీట్‌ఫైటర్ విభాగంలో కవాసకి MY-2023 అప్‌డేట్‌తో, హైపర్‌బైక్ ఇప్పుడు యూరో 5 BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది.
వన్-ఆఫ్ మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా టాప్ ఫీచర్లు
బ్రిటీష్ మోటరింగ్ ఐకాన్ మోర్గాన్ మోటార్ కంపెనీ తన ప్లస్ ఫోర్ మోడల్ ఒక-ఆఫ్ వాహనాన్ని ప్రకటించింది. దీనిని 'స్పియాగ్గినా' అని పిలుస్తారు. ఈ కారు 1960లలోని ఐకానిక్ రివేరా బీచ్ కార్ల నుండి ప్రేరణ పొందింది. 1910లో హెన్రీ ఫ్రెడరిక్ స్టాన్లీ మోర్గాన్ స్థాపించిన మోర్గాన్ మోటార్ కంపెనీ 1930ల వరకు మూడు చక్రాల రన్‌అబౌట్‌లకు ప్రసిద్ధి చెందింది.
MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది
బ్రిటిష్ తయారీసంస్థ MG మోటార్ ఏప్రిల్‌లో భారతదేశంలో తమ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం కామెట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ. 10 లక్షలు ధరతో, మార్కెట్లో ఇది టాటా టియాగో ఎలక్ట్రిక్ వాహనంతో తో పోటీపడుతుంది.
నా చిన్నతనంలో మా నాన్న లైంగికంగా వేధించాడు: డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన కామెంట్స్
దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ శనివారం తన చిన్ననాటి కష్టాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు.
HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు
యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఎస్‌బిఐతో సహా వివిధ బ్యాంక్‌లు ఈమధ్య డిపాజిట్లు, రుణాలపై తమ వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్ బి ఐ గత నెలలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీనితో, మే 2022 నుండి రెపో రేటును ఆరుసార్లు మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి
ఈ వారం ఓటీటీలో చాలా కంటెంట్ రిలీజైంది. ఏ సినిమా చూడాలనే కన్ఫ్యూజన్ మీకుంటే ఇది చూడండి.
IND vs AUS: గిల్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాణిస్తున్న బ్యాటర్లు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు.
సానియా చాలామందికి స్పూర్తినిచ్చిందన్న ప్రధాని మోదీ
భారత్ మహిళ టెన్నిస్ కు వెలునిచ్చిన సానియా మీర్జా ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించింది. గడిచిన దశాబ్దన్నర కాలంగా భారత టెన్నిస్‌కి ఎనలేని సేవలను హైదరాబాద్ స్టార్ సానియా మీర్జా చేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో శాశ్వితంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.
వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేసారు. 80ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులందరికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కింది. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చడంలో ఆ దేశం విఫలమైందని భుట్టో జర్దారీ అంగీకరించారు.
దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆస్ట్రేలియాపై మరో ఫీట్‌ను సాధించిన పుజారా
భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ మైలురాయిని అందుకున్నాడు.
తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు.
ట్రావెల్: రొమేనియా వెళ్ళినపుడు అక్కడి గుర్తుగా ఎలాంటి వస్తువులు తీసుకురావాలో తెలుసుకోండి
ఏ ప్రాంతానికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒకటి ఇంటికి తీసుకు వస్తారు. ఆ ప్రాంతపు గుర్తుగా ఉంటుందని అక్కడి వస్తువులను జ్ఞాపకాలుగా తీసుకువస్తారు. అయితే రోమానియా దేశం వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకురావాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ
దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్
శుక్రవారం, US రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు, దాని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. SVB దాని స్టాక్ ధర 60% క్షీణించిన రోజు తర్వాత US రెగ్యులేటర్ల నుండి మూసివేత ప్రకటన వచ్చింది.
PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలన రికార్డులు నమోదవుతున్నాయి. మ్యాచ్ స్కోర్లు 200 ప్లస్ దాటినా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌ను చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన మ్యాచ్‌లో చరిత్రాత్మక రికార్డు అవిష్కరించబడింది.
ప్రేరణ: అన్నీ తెలుసనుకునే వాళ్ళు ఇతరుల మాట వినరు, అదొక్కటే వాళ్ళ కొంప ముంచుతుంది
మనుషులు రకరకాలుగా ఉంటారు. అందులో అన్నీ తమకే తెలుసనుకునేవారు కూడా ఉంటారు. వీరితో చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే వీళ్ళసలు అవతలి వాళ్ళ మాటలు వినరు.
దేశంలో హెచ్2ఎన్3 వైరస్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; రాష్ట్రాలకు లేఖ
దేశంలో హెచ్2ఎన్3, హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
ట్రావెల్: పూర్తి వైన్ తాగకుండానే మళ్లీ వైన్ పోస్తే తప్పుగా చూసే గ్రీస్ దేశం పద్ధతులు తెలుసుకోండి
గ్రీస్.. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ఆ దేశ చరిత్ర, అందమైన భూభాగాలు, ఆశ్చర్యంగా అనిపించే సంస్కృతులు.. గ్రీస్ దేశానికి వెళ్లడానికి ఉత్సాహంగా అనిపిస్తాయి.
రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి
ఇండియన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 11, 2023 నుండి అతను సెలవులో ఉంటారు, కంపెనీలో చివరి తేదీ జూన్ 09, 2023. డైరెక్టర్ల బోర్డు మోహిత్ జోషి అందించిన సేవలకు ప్రశంసలను అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
INDvsAUS : ఆస్ట్రేలియాపై గిల్ సూపర్ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విజృంభించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న అతను.. తన కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు.
డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు
''డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్' సోషల్ మీడియా బిలియనీర్లను ఆకట్టుకుంటుంది. ఈ లిస్ట్ లో జాక్ డోర్సే, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇటువంటి సామాజిక నెట్‌వర్క్‌లు కొత్త కాదు. ఇటువంటి మొదటి సామాజిక నెట్‌వర్క్ డయాస్పోరా, 2010లో ప్రారంభమైంది.
కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం దిల్లీలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
బలగం సినిమాపై మెగాస్టార్ ప్రశంసలు,ఈ జన్మకిది చాలన్న దర్శకుడు
చాలా నిశ్శబ్దంగా వచ్చి థియేటర్ల దగ్గర సంచలనాన్ని సృష్టిస్తున్న చిత్రం బలగం. కమెడియన్ గా చిన్న చిన్న సినిమాల్లో, జబర్దస్త్ స్కిట్లలో కనిపించిన వేణు, బలగం చిత్రాన్ని తెరకెక్కించాడు.
అభిమానిని కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశేణి ఆల్ రౌండర్లలో ఒకరు. ప్రస్తుతం టీ20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మైదానంలో, వెలువల ఒక్కొసారి షకీబ్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో తరుచూ సమస్యల్లో చిక్కుకుంటాడు.
దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో హిట్‌మ్యాన్ కొత్త రికార్డు
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ కొత్త రికార్డును సృష్టించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో 17000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ
శాంటా క్లారా, కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) మూలధనాన్ని సమీకరించడంలో విఫలమై కుప్పకూలింది. దాని ఆస్తులను US ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) స్వాధీనం చేసుకుంది. టెక్ లెండర్ షేర్లు గురువారం 60% పడిపోయాయి.
దసరా ట్రైలర్ : ఈరోజు సాయంత్రం అప్డేట్ రాబోతుంది
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేస్తున్న చిత్రం దసరా. తెలుగు, తమిళం, కన్నడ, హిం,దీ మళయాలం భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ పనులు ఆసక్తిగా జరుగుతున్నాయి.
మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్
లెజెండరీ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ మార్చి 16న కొత్త సూపర్‌కార్‌ను ఆవిష్కరించనుంది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ కార్ గురించి చిన్న టీజర్‌ను విడుదల చేసింది.
SL vs NZ: అర్ధ సెంచరీతో రాణించిన మాట్ హెన్రీ
న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మాట్ హెన్రీ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 75 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 373 పరుగులకు అలౌటైంది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ధనుష్ నటించిన సార్ మూవీ: మాస్టారు మాస్టారు అంటూ రికార్డ్
తమిళ హీరో ధనుష్ నటించిన సార్ మూవీ, ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ బ్లాక్ బస్టర్ అయ్యింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన ఈ చిత్రం అందరికీ నచ్చేసింది.
త్వరలో ఈ ఫీచర్లను ఆండ్రాయిడ్, ఇఫోన్లలో ప్రవేశపెట్టనున్న వాట్సాప్
వాట్సాప్ సరికొత్త యూనికోడ్ 15.0 నుండి 21 కొత్త ఎమోజీలను విడుదల చేసింది, వాటిని యాక్సెస్ చేయడానికి వేరే కీబోర్డ్‌ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు పంపింది.
NZ vs SL: సెంచరీతో విజృభించిన డారిల్ మిచెల్
క్రైస్ట్ చర్చ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో డారిల్ మిచెల్ సెంచరీతో విజృంభించాడు. తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న శ్రీలంకను న్యూజిలాండ్ గట్టి ఎదుర్కొంటొంది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు అలౌటైంది.
బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఆస్కార్ అవార్డ్స్: అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది
95వ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు పొందిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి మొదలగు విభాగాలు సహా మొత్తం 11విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది ఈ చిత్రం.
దిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు
దిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతిని కొందరు వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
కేజీఎఫ్ కాంట్రవర్సీ: వెంకటేష్ మహాకు క్లాస్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్
కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా, కేజీఎఫ్ సినిమాపై మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో అతని మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
పాకిస్తాన్ లీగ్‌లో దంచికొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్ రూసో
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ రూసో విధ్వంసం సృష్టించాడు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి
మూలశంఖ లేదా.. మొలలు.. అని పిలవబడే ఈ వ్యాధి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. మలద్వారం వద్ద ఉబ్బడం, మల ద్వారం నుంచి రక్తం రావడం జరుగుతుంటుంది.
ఆస్కార్ అవార్డ్స్: ప్రియాంకా చోప్రా పార్టీలో రాహుల్ సిప్లిగంజ్
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదీన ఉదయం నుండి మొదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం అమెరికాకు చేరుకుంది.
కరోనా మూలాల గుట్టు విప్పే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం; బైడెన్ వద్దకు ఫైల్
పదిలక్షల కంటే ఎక్కువ మంది అమెరికన్లను పొట్టనపెట్టున్న కరోనా వైరస్ మూలాలను తెలుసుకునే కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
WPL : యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ వీర బాదుడు
మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగోసారి ఆర్సీబీ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం యూపీ వారియర్స్ 13 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగోసారి పరాజయం పాలైంది. శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోరంగా విఫలమైంది. సీజన్ ప్రారంభం నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని బెంగళూరు మరోసారి ఓటమిపాలైంది.
దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరుకానున్నారు.
మార్చి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.