18 Mar 2023
ఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం
ఒక నివేదిక ప్రకారం, ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై ప్రపంచ మందగమనం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం (FY) 2023-24లో భారతదేశ వృద్ధి దాదాపు 6 శాతం ఉంటుందని, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ 2023-24లో సంవత్సరానికి 4.7-5 శాతమని OECD నివేదిక పేర్కొంది.
2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్
స్వదేశీ బైక్ తయారీసంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో MY-2023 అప్‌గ్రేడ్‌లతో దాని ప్రసిద్ధ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650ని అప్డేట్ చేసింది. మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా
ఒక వేడుకలో మీ డియాతో మాట్లాడుతూ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ప్రశంసించారు RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా.
గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి.
రంగమార్తాండ టీజర్: కొత్తగా కనిపించే బ్రహ్మానందం
తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ ఎందరో దర్శకుల్లో కృష్ణవంశీ కూడా ఒకరు. ఆయన సినిమాలు మన కళ్ళ ముందు జరుగుతున్న కథల్లాగే కనిపిస్తుంటాయి.
PHL: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌కు హ్యాండ్‌బాల్ ఆసియా ఫెడరేషన్ మద్దతు
భారత్ వేదికగా నిర్వహిస్తున్న ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ కు ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ మద్దతు తెలపడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.
ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా చేసిన వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భానుశ్రీ మెహ్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. వరుడు సినిమా రిలీజ్ వరకూ, హీరోయిన్ ఫోటోలు బయటపెట్టకుండా అందరికీ సర్పైజ్ చేసారు.
FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..?
FA కప్ 2022-23 సెమీ-ఫైనల్స్ మార్చి 19 జరగనుంది. ఇప్పటికే ఎనిమిది ఇంగ్లీష్ ఫుట్ బాల్ జట్లు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ట్రోఫీ కోసం ఆ జట్లు పోటీ పడనున్నాయి.
అమృతపాల్ సింగ్ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత
ఖలిస్తానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 'ఆపరేషన్ అమృతపాల్ సింగ్'ను ప్రారంభించారు. దీంతో పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రేరణ: ఒంటరిగా ఉండడం కన్నా ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి
ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఎక్కువశాతం జనాలు ఒంటరితనాన్నే ఏకాంతం అనుకుని భ్రమపడుతుంటారు. ఈ రెండింటి మధ్య తేడాని ఒక్కమాటలో ఇలా చ్చెప్పవచ్చు.
టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల తన హిలక్స్ పిక్-అప్ ట్రక్ ధరలను సవరించింది. స్టాండర్డ్, హై అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్
WWCH 2023లో నెదర్లాండ్స్ తరుపున ఆడడం లేదని డచ్ బాక్సర్ మేగాన్ డి క్లెర్ స్పష్టం చేసింది. అయితే తాను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించడం నుండి నోటి దుర్వాసన పోగొట్టడం వరకు కీరదోస చేసే మేలు
రుతువు మారినప్పుడల్లా శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందుకే రుతువు మారుతున్నప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.
'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్
స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.
UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్
భారత విశిష్ట గుర్తింపు అథారిటీ UIDAI పౌరులకు వివిధ రకాల ఆధార్‌లను జారీ చేస్తుంది. వారి అవసరం ప్రకారం, PVC కార్డ్, eAadhaar, mAadhaar లేదా ఆధార్ లెటర్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ గుర్తింపు రుజువుగా చెల్లుబాటు అవుతాయని UIDAI తెలిపింది.
ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌కు ప్రమాదం; పాక్ మాజీ ప్రధాని కారు సేఫ్
ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌లోని వాహనం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. అయితే ఇమ్రాన్ వెళ్తున్న కారు సురక్షితంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పాకిస్థాన్ మీడియా తెలిపింది.
WPL: ముంబై ఇండియన్స్ జోరుకు యూపీ వారియర్స్ కు బ్రేకులు వేసేనా..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది.
IPL : ఆర్బీబీలోకి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ఖుషీగా ఆర్సీబీ ఫ్యాన్స్
గాయం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు ఇంగ్లాండ్ స్టార్ ఆలౌరౌండర్ విల్ జాక్స్ దూరమైన విషయం తెలిసిందే.
దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన
దేశంలో కరోనా కేసుల్లో రోజురోజుకు పెరుగుదల నమోదవుతోంది. రోజువారీ కోవిడ్ కేసులు శనివారం నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది.
మీరు ఎక్కువ చక్కెర తింటున్నారని తెలియజేసే కొన్ని లక్షణాలు
భారతదేశంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహార అలవాట్లలో అనేక మార్పులు, తీవ్రమైన ఒత్తిడి మొదలగునవన్నీ చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్యను పెంచుతాయి.
ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!
ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ల లీకేజీ వల్ల ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.
ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది
ప్రజాభిప్రాయాన్ని గుర్తించి హైలైట్ చేయడానికి కృతిమ మేధస్సును ఉపయోగించనుందని ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్ శనివారం తన ట్వీట్ ద్వారా ప్రకటించారు.
రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్
ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా
భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టిన 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'(ఐబీఎఫ్‌పీఎల్) ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది.
NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్
సొంతగడ్డపై శ్రీలంకపై జరుగుతున్న రెండు టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ అదిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో గెలిచిన కివీస్.. రెండో టెస్టుల్లోనూ తన జోరును కొనసాగిస్తోంది.
చిరంజీవి భోళాశంకర్ సినిమాలో లవర్ బాయ్ గా సుశాంత్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి కత్తిలాంటి అప్డేట్ వచ్చింది. అక్కినేని సుశాంత్, ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నట్లు భోళాశంకర్ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
PPF ఖాతాలో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు సంపాదించచ్చు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది చాలా కాలం పాటు డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత సంపాదన ఇచ్చే పథకం. నిబంధనల ప్రకారం, పెట్టుబడిదారుడు ₹100 డిపాజిట్ చేయడం ద్వారా ఏదైనా బ్యాంక్ లేదా సమీపంలోని పోస్టాఫీసులో ఈ PPF ఖాతాను తెరవవచ్చు. ప్రతి సంవత్సరం ఖాతాలో కనీసం ₹500 డిపాజిట్ చేయడం అవసరం.
అందం: వేసవిలో అందాన్ని కాపాడే పండ్లతో తయారయ్యే ఫేస్ ప్యాక్స్
వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ టైమ్ లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. అదే సమయంలో అధిక వేడి కారణంగా వచ్చే చెమట కాయలను, ఇతర చర్మ సమస్యలను దూరం చేసుకోవాలి.
వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని వైట్‌హౌస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
లిమిటెడ్-ఎడిషన్ తో మార్కెట్లోకి 2023 KTM 1290 సూపర్ డ్యూక్ RR
ప్రసిద్ద ఆస్ట్రియన్ మార్క్ KTM తన 2023 పరిమిత-ఎడిషన్ 1290 సూపర్ డ్యూక్ RRని ప్రదర్శించింది. ఈ హైపర్ స్ట్రీట్‌ఫైటర్ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే.
టెస్టుల్లో డబుల్ సెంచరీని బాదేసిన హెన్రీ నికోల్స్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు విజృంభించారు. ఫలితంగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది.
నేషనల్ కార్న్ డాగ్ డే: అదిరిపోయే రుచిగల ఫ్రై ఆహారాలను ఇప్పుడే ట్రై చేయండి
ప్రతీ సంవత్సరం అమెరికాలో మార్చ్ 18వ తేదీని నేషనల్ కార్న్ డాగ్ డే గా జరుపుకుంటారు. కార్న్ తో చేసిన ఆహారాలను హాట్ డాగ్స్ తో కలిపి తినేవాటిని కార్న్ డాగ్స్ అంటారు.
ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు?
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పుతిన్ నిజంగా అరెస్టు అవుతారా? ఒకవేళ అరెస్టు అయితే ఎవరు అరెస్టు చేస్తారు?
ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు
ప్రపంచంలో అత్యంత జనాదరణ టిక్‌టాక్ పొందిన యాప్ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జో బిడెన్ ప్రభుత్వం యాప్‌ను దేశవ్యాప్త నిషేధంతో బెదిరించింది, యాప్ చైనీస్ మూలాలు ఆ సంస్థ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. టిక్ టాక్ లో బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారే.
భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం
క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు కేవలం లేడ్-బ్యాక్ రైడింగ్ స్టైల్ కోసం మాత్రమే అని కొనుగోలుదారులలో ఒక అభిప్రాయం ఉంది. ఈ క్రూయిజర్ సెగ్మెంట్ కొన్ని వర్గాలుగా విడదీస్తే, ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది.
వెట్రిమారన్ థ్రిల్లర్ మూవీ విడుతలై తెలుగులో కుడా రిలీజ్?
విసారణై, వడివాసల్, అసురన్ వంటి చిత్రాల దర్శకుడు వెట్రిమారన్, తాజాగా విడుతలై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కమెడియన్ సూరీ, ప్రధాన పాత్రలో నటించారు.
సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..?
సన్ రైజర్స్ హైదారాబాద్ టీంకి సైబర్ నేరగాళ్లు గట్టి షాక్‌నిచ్చారు. ఏకంగా సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానల్ కి హ్యాక్ చేసి ఝలక్ ఇచ్చారు. ఆరు గంటల్లో ఏకంగా 29 వీడియోలను అప్‌లోడ్ చేయడంలో అభిమానులు షాక్ కు గురయ్యాడు.
వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్ చూస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీని పలువురు క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటుంటారు.
OpenAI ChatGPT వెనుక ఉన్నటెక్నాలజీ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సంవత్సరం సంచలనం సృష్టించింది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత డేటా నుండి ఎలా చర్యలు తీసుకోవాలో నేర్చుకుంటుంది.
హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు
దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్ సోకి 9మంది మృతి చెందినట్లు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న రామ్ చరణ్
అస్కార్ అవార్డ్ వేడుకలకు అమెరికా వెళ్ళిన ఆర్ఆర్ఆర్ టీమ్, ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగి వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కోసం ఎయిర్ పోర్టుల్లో అభిమానులు అందరూ ఎదురూచూసారు.
డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ విలియమ్సన్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. 123 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 580 పరుగులు చేసింది . ఈ స్కోర్ వద్ద న్యూజిలాండ్ డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చారు. విశ్వక్ సేన్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్, డైరెక్షన్ ఆపేయమని సలహా ఇచ్చాడు.
భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం
ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్
ఉక్రెయిన్- రష్యా యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌తో పాటు మరో రష్యా అధికారికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
మార్చి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
17 Mar 2023
తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్
టీ20, టెస్టులో వరుసగా విఫలమవుతూ టీమ్‌లో చోటు కోల్పోయిన టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ వన్డేల్లో సత్తా చాటాడు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాని అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకొని.. కేఎల్ రాహుల్ ఘన విజయాన్ని అందించాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు.
గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ల లీకేజీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలని కేటీఆర్ అన్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారం బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించారు.
శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కుట్ర కేసులో ఇద్దరు రాడికలైజ్డ్ బి.టెక్ గ్రాడ్యుయేట్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది
జపనీస్ మార్క్ కవాసకి తన స్వదేశీ మార్కెట్లో ఎలిమినేటర్ 2023 వెర్షన్ ను పరిచయం చేసింది.
కొత్తగా టాటూ వేసుకున్నారా? మొదట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి
కొత్తగా వేసుకున్న టాటూని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే టాటూ తొందరగా చెరిగిపోవడం, చర్మానికి ఇబ్బందులు కలగడం జరుగుతుంటుంది.
కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్
గతంలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన తెల్లటి రంగు ఆడి R8, మహారాష్ట్రలోని ఒక పోలీసు స్టేషన్ వెలుపల పాడుబడిన స్థితిలో గుర్తించారు. 2012లో ఈ R8 మోడల్ సూపర్‌కార్ ను కోహ్లి కొనుగోలు చేశారు.
పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ సిరాజ్
వన్డేలో టీమిండియా తరుపున హైదరాబాద్ స్టార్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలను చూపిస్తున్నాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లను రాబడుతున్నాడు.
ప్రేరణ: అనుకున్నది సాధించాలంటే చదువు, తెలివి కన్నా ముందు ధైర్యం సంపాదించాలి
మీరో బిజినెస్ మొదలెట్టాలనుకున్నారు, మీ దగ్గర 10లక్షల రూపాయలున్నాయి. ఏ బిజినెస్ పెట్టాలో డిసైడ్ అయ్యారు. కానీ బిజినెస్ లో నష్టం వస్తుందేమోనన్న భయం మిమ్మల్ని బిజినెస్ పెట్టకుండా ఆపేస్తుంది.
ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.
శుక్ర గ్రహంపై తొలిసారిగా యాక్టివ్ అగ్నిపర్వతం కనుగొన్న శాస్త్రవేత్తలు
మొదటిసారిగా, శాస్త్రవేత్తలు శుక్ర గ్రహంపై యాక్టివ్ అగ్నిపర్వతం ప్రత్యక్ష సాక్ష్యాలను కనుగొన్నారు.
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 189 పరుగులు
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. మొదటగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు.
ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడడానికి వచ్చిన రజనీకాంత్, ఫోటోలు వైరల్
ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడడానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ వెళ్ళారు. ఈ మేరకు మ్యాచ్ చూస్తున్న రజనీకాంత్ ఫోటోలను ముంబై క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, మైదానంలో తలైవా అని అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది.
కిరణ్ పటేల్: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ప్రధానమంత్రి కార్యాలయం( పీఎంఓ)అధికారిగా నటించి అడ్డంగా దొరికిపోయిన గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌ను శుక్రవారం శ్రీనగర్ కోర్టు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్
OpenAI ఫిబ్రవరిలో, కంపెనీ అనేక ప్రయోజనాలతో చాట్‌బాట్ ప్రీమియం వెర్షన్, ChatGPT ప్లస్‌ను పరిచయం చేసింది.
నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి
నథింగ్ తన కొత్త TWS ఇయర్‌ఫోన్‌లను నథింగ్ ఇయర్ (2)గా మార్చి 22న రాత్రి 8:30 గంటలకు IST ప్రకటించనుంది. దాని ప్రత్యేకమైన డిజైన్ ఫిలాసఫీతో టెక్ బ్రాండ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందడం లేదు.
వన్డే మ్యాచ్‌లు చాలా డల్‌గా ఉన్నాయి : సచిన్ టెండూల్కర్
గడుస్తున్నా కాలం కొద్దీ క్రికెట్‌లో చాలా మార్పులొస్తున్నాయి. ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్ రాగా.. దానిని 50 ఓవర్లకు కుదించారు. 2000 సంవత్సరంలో ధనాధన్ క్రికెట్ ను ప్రవేశపెట్టడంతో సక్సస్ అయింది.
దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు
మద్యం పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5రోజులు పొడిగిస్తున్నట్లు రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.
నాన్ వెజ్ లో మాత్రమే దొరికే కొల్లాజెన్, వెజ్ తినే వాళ్ళకు ఎలా దొరుకుతుందో తెలుసుకోండి
అందమైన చర్మం కోసం, కీళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం, ఎముకలు బలంగా ఉండడానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ చాలా అవసరం. ఈ కొల్లాజెన్ ప్రోటీన్, జంతుమాంసం లో మాత్రమే ఎక్కువగా లభిస్తుంది.
భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి
భారతీయ స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో సుమారు $1 బిలియన్ల విలువైన డిపాజిట్లను ఉన్నాయి. దేశ డిప్యూటీ ఐటి మంత్రి మాట్లాడుతూ స్థానిక బ్యాంకులు వారికి మరింత రుణాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసేశారు.
టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం
టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఎలిమినేటర్ 1లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆ ఫీట్ ను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
TSPSC సంచలన నిర్ణయం; గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తోపాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా సత్యనాదేళ్ల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఫ్రాంచేజీలు విశ్వవాప్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించిన ఫ్రాంచేజీలు తాజాగా ఆమెరికాపై దృష్టి పెట్టాయి.
నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ప్రవేశపెట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
ప్రపంచాన్ని ఊపేస్తున్న 'నాటు..' పాటతో తెలుగు ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టడమే కాదు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్న RRR సినిమా బృందం ఇటీవలే తిరిగి హైదరాబాద్ వచ్చారు. భారతదేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చి పెట్టిన ఆ సినిమా బృందాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఆహ్వానం అందింది.
ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.
వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చిచెప్పిన హైకోర్టు
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ఆదేశించింది.
క్రికెట్ గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్ని ఫార్మట్లకు కొన్నేళ్లుగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సెక్సెటింగ్ కుంభకోణం కారణంగా నవంబర్ 21లో అతను టెస్టు కెప్టెన్‌గా అప్పట్లో వైదొలిగాడు. తాజాగా అన్ని ఫార్మట్లకు రిటైర్మెట్ ప్రకటిస్తున్నట్లు టిమ్ పైన్ ప్రకటించాడు.
లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్‌లో జరుగుతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం కూడా గందరగోళంగా మారాయి. లండన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్‌కు నోటీసును అందచేశారు.
చుండ్రును పోగొట్టి జుట్టును మృదువుగా, మెరిసేలా చేసే అరటి పండు మాస్క్
మన రోజువారి అలవాట్ల కారణంగా జుట్టులో మెరిసే గుణం తగ్గిపోయి, చుండ్రు తయారై అస్తవ్యస్తంగా మారుతుంది. మరి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్కెట్లో వస్తువులు వాడాల్సిందేనా?
వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ 365 యాప్‌ల సేవల కోసం కోపైలట్‌ను పరిచయం చేసింది, GPT-4 సపోర్ట్ చేసే కోపైలట్ అనేది ఒక సహాయకుడి లాంటిది, ఇది వినియోగదారులకు వివిధ పనులను చేయడంలో సహాయపడుతుంది.
విరాట్ కోహ్లీని లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఔట్ చేస్తాడా..?
ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానముంది. కోహ్లీ దేశం సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను ఒకటోకటిగా బద్దలుకొడుతూ రికార్డులను సృష్టించాడు. ప్రస్తుతం నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్‌లో తలపడనుంది.
ఎన్టీఆర్ 30 మూవీలో మరో బాలీవుడ్ యాక్టర్, విలన్ గా కన్ఫామ్
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని, ఎన్టీఆర్ 30వ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిండే. ఇప్పుడు మరోసారి మరో బాలీవుడ్ యాక్టర్ ని ఎన్టీఆర్ 30లోకి ఆహ్వానం పలుకుతున్నట్లు వినిపిస్తోంది.
స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదుర్స్
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో తెలంగాణ స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 50కేజీల విభాగంలో అజర్ బైజాన్‌కు చెందిన ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసింది.
విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేయనున్న డీజే టిల్లు భామ
డీజే టిల్లు సినిమాతో పేరు తెచ్చుకున్న నేహా శెట్టి, ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. డీజె టిల్లు సినిమాలో తన గ్లామర్ తో యువత మతి పోగొట్టిన నేహా శెట్టి, బెదురులంక 2012చిత్రంతో ఉగాది రోజున ప్రేక్షకులను పలకరించనుంది.
తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి
తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని నివాస సముదాయంలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్
ఐకానిక్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్త రోమా స్పైడర్‌ను విడుదల చేసింది. రోడ్‌స్టర్ మోడల్ గురించి ఇటీవల తయారీసంస్థ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు.
WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటింది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్ లో రెండో విక్టరీని నమోదు చేసింది.
ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు
ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఏ దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదు.
ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి
సినిమా సినిమాకు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ, చివరికి ఎవ్వరికీ అందని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి, అమెరికా నుండి హైదరాబాద్ వచ్చేసారు.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. గురువారం ఒక్కరోజే 754కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు లేఖలు రాసింది.
Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు
చైనా సంస్థ బైడు ఎర్నీ బాట్ అనే కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్‌బాట్‌ను గురువారం ఆవిష్కరించింది, అయితే ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను ఉపయోగించడం, పబ్లిక్ లాంచ్ లేకపోవడంతో పెట్టుబడిదారులను నిరాశపరిచింది, వెంటనే ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి.
ప్రపంచ నిద్రా దినోత్సవం: మీరు సరిగా నిద్రపోతున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి
ప్రతీ సంవత్సరం మార్చి 17వ తేదీన ప్రపంచ నిద్రా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి అవగాహన చేయడానికి నిద్రా దినోత్సవాన్ని జరుపుతారు.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ విజయాలపై ఓ కన్నేయండి
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సైనా నెహ్వాల్ నేడు 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె సాధించిన విజయాలను కొన్ని తెలుసుకుందాం. ఒలంపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత షట్లర్‌గా సైనాకు రికార్డు ఉంది.
ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ తన మిడ్-సైజ్ SUV, సెల్టోస్‌ను MY-2023 అప్‌గ్రేడ్‌లతో అప్‌డేట్ చేసింది. ఇందులో స్టాప్ సిస్టమ్ ఉంది. 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లు స్థానంలో కొత్త 1.5-లీటర్ T-GDi ఇంజన్ తో నడుస్తుంది. మార్కెట్లో ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్‌తో పోటీపడుతుంది.
డీఎల్ఎఫ్ ఫ్లాట్లకు భారీ డిమాండ్, మూడురోజుల్లో 8000కోట్ల ప్రాపర్టీ అమ్మకాలు
నగర ప్రాంతాల్లో ఫ్లాట్ల అమ్మకాలకు మంచి గిరాకీ ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది కావచ్చు. కేవలం మూడంటే మూడు రోజుల్లో 8000కోట్ల విలువ చేసే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యాయంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది.
టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రాజీనామా; కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింత
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్( టీసీఎస్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)& చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాజేష్ గోపీనాథన్ తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.
విరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.
భళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా
రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా, ఆ సిరీస్ ప్రమోషన్లలో ఆక్టివ్ గా పాల్గొంటున్నాడు. రానా నాయుడు సిరీస్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.
ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్ నాయకుడు అన్సారీ అరెస్టు
ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఉమేష్ పాల్ హత్య కేసు వ్యవహారం దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ కేసులోని నిందుతులకు నేపాల్‌లో ఖయ్యూమ్ అన్సారీ అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చినట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) గుర్తించింది. ఖయ్యూమ్ అన్సారీకి అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని నెట్స్ శ్రమిస్తున్నాడు. సీఎస్‌కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోని.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ తో కెరీర్ ఘనంగా ముగించాలని తహతహలాడుతున్నాడు.