21 Mar 2023

Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO

OPPO తన Find X6 సిరీస్‌ని పరిచయం చేసింది, ఇందులో Find X6, Find X6 Pro మోడల్‌లు ఉన్నాయి. హైలైట్‌ల విషయానికొస్తే, పరికరాలు అధిక-రిజల్యూషన్ AMOLED స్క్రీన్, 50MP ట్రిపుల్ కెమెరాలు, 16GB వరకు RAMతో పాటు వరుసగా టాప్-టైర్ MediaTek, Snapdragon చిప్‌సెట్‌లతో వస్తుంది.

SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా

లగ్జరీ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన బ్లాక్ బ్యాడ్జ్ వ్రైత్ బ్లాక్ యారో మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ఒక రెగల్ డిజైన్ తో బెస్పోక్ 'స్టార్‌లైట్ హెడ్‌లైనర్'తో ఉన్న క్యాబిన్‌ ఉంటుంది. కారు గ్లాస్-ఇన్ఫ్యూజ్డ్ టాప్‌కోట్‌తో పెయింట్‌వర్క్‌తో వస్తుంది.

UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది

సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ను UBS స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది భారతీయ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రెండు బ్యాంకుల ఇండియా టెక్నాలజీ బ్యాక్ ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

యోగాసనాలు వేయడం కష్టంగా ఉందా? వీల్ యోగా ట్రై చేయండి

చక్రంతో యోగా గురించి మీరెప్పుడూ విని ఉండరు. కానీ ఇది నిజం. చక్రం సాయంతో యోగాసనాలు వేయడమే వీల్ యోగా. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.

భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ

అధిక పన్నులు, పేలవమైన రహదారి మౌలిక సదుపాయాలు భారతదేశంలో సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని పరిమితం చేస్తున్నాయని లంబోర్ఘిని గ్లోబల్ సిఈఓ, స్టీఫన్ వింకెల్‌మాన్ అభిప్రాయాన్ని వ్యాకటం చేశారు. దేశంలోని మౌలిక సదుపాయాలు అభివృద్ది ఇంకా వేగంగా జరగాలని అన్నారు.

కుంబ్లే తో గొడవ తరువాత.. కోచ్ గా ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్

టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 2016లో భారత ప్రధాన కోచ్ గా పదవి బాధ్యతలను చేపట్టాడు. అయితే 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుంబ్లే స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతలను తీసుకున్నాడు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు

మరణశిక్షను అమలు చేసే కేసుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలులో భాగంగా మెడకు తాడును వేలాడిదీసి ఉరివేయడం క్రూరమైన చర్యగా చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.

భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7

iQOO తాజా Z-సిరీస్ మోడల్, iQOO Z7 ఇప్పుడు భారతదేశంలో రూ. 18,999కు అందుబాటులో ఉంది. ఇందులో 90Hz AMOLED స్క్రీన్, 64MP ప్రధాన కెమెరా, డైమెన్సిటీ 920 చిప్‌సెట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది. 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్-ఆధారిత ఫీచర్స్ ను అందిస్తుంది.

జస్ప్రిత్ బుమ్రాపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐదు నెలలకు పైగా క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నెముక గాయం పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి ప్రస్తుతం టీమిండియాకు దూరమయ్యాడు.

ప్రేరణ: మనసు పడ్డ ప్రతీదీ మన దరికి రావాలని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే

మన మనసు చాలా అల్లరి చేస్తుంటుంది. దానికి ఊహలెక్కువ. ఆశలెక్కువ. ఆకాశంలో ఎగరాలని చూస్తుంది, దారం లేకపోయినా. నీళ్ళలో తడవాలని చూస్తుంది, ఈత రాకపోయినా.

కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మూడో వన్డే మార్చి 22న చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

మొటిమల వల్ల కలిగిన ఎర్రటి మరకలను ఒక్క రాత్రిలో పోగొట్టే ఇంట్లోని వస్తువులు

రెండు మూడు రోజుల్లో పెళ్ళనగా అనుకోకుండా మీ ముఖం మీద మొటిమలు వచ్చాయనుకోండి. అది పగిలిపోయి ఎర్రటి మరకలా మారిందనుకోండి. మీకెలా ఉంటుంది. ఆ మరకలను తొందరగా ఎలా పోగొట్టుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.

AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిన చిత్రాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఒక కళాకారుడు ఈ టెక్నాలజీని గతంలో ఉన్నవారితో సెల్ఫీలను సృష్టించడానికి ఉపయోగించారు.

ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్

పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.

వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ వన్డేలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేలో 5వేల పరుగులు చేయడానికి కేవలం 61 పరుగుల దూరంలో ఉన్నాడు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు.

హాకీ ప్లేయర్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం

ఇండియా మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం లభించింది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ స్టేడియానికి ఆమె పేరును నామకరణం చేశారు. ఈ స్టేడియం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉంది. గతంలో ఈ స్టేడియానికి 'MCF రాయ్‌బరేలీ' అని పేరు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 'రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్'గా మార్చారు.

రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తో జరిగిన చివరి టెస్టులో సెంచరీ చేసి కోహ్లీ అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75కి చేరింది. అయితే అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు.

బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా?

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్ వచ్చింది.

ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు

దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్నును ప్రభుత్వం మంగళవారం టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గించింది.

కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావు చించన్‌సూర్ పార్టీని వీడారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.

ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్

భారతీయ జనతా పార్టీపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని పేర్కొంది. వాల్టర్ రస్సెల్ మీడ్ ఈ కథనాన్ని రాశారు.

ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడో వన్డేలో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.

మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్

క్రికెట్‌లో లీగ్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తోంది. తాజాగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ అమెరికాలోని డల్లాస్ లో జూలై 13 నుంచి 30 వరకూ జరగనుంది. కొందరు టాప్ ప్లేయర్స్ ఈ లీగ్‌తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.

సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్

టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి దిగితే బౌండరీ వర్షం కురింపించే సెహ్వాగ్.. బ్యాటింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు

ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌కు కోసం పంజాబ్ పోలీలులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగు రోజులుగా అమృతపాల్ సింగ్‌ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృతపాల్‌కు మద్దతుగా ఖలిస్థానీ సానుభూతిపరులు వివిధ దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు.

ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం

Pro సిరీస్ ఐఫోన్‌లు ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి, ఆపిల్ ఫీచర్స్ ను మారుస్తుంది. Pro ఐఫోన్‌ని ఎంచుకున్నప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్, మరింత సామర్థ్యం గల ట్రిపుల్ కెమెరా సెటప్, మెరుగైన డిస్‌ప్లే కూడా ఇందులో ఉంటాయి. ఆపిల్ ఐఫోన్ 15 Pro కూడా అలాగే తేలికగా కనిపించేలా అనుభూతి చెందడానికి ప్రత్యేకంగా రూపొందుతుంది.

పిల్లల పెంపకం: మీ పిల్లలు బయట ఆడుకోవట్లేదా? భవిష్యత్తులో జరిగే ప్రమదాలు ఇవే

ప్రస్తుత తరంలో పిల్లలు బయట ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అతి జాగ్రత్త చూపిస్తూ బయట ఆడుకోవడానికి పంపట్లేదు.

ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు గురించి తెలియని వాళ్ళు లేరు. ఐతే ఈరోజు ఉదయం, ఆయన మరణించారని వార్త బయటకు వచ్చింది. ఈరోజు ఉదయం నుండి ఈ వార్త బాగా చక్కర్లు కొట్టింది.

హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం

హోండా షైన్ 100 ప్రారంభ ధర 1,64,900 (ఎక్స్-షోరూమ్, ముంబై) తో అందుబాటులో ఉంది. మరోవైపు ఈ సెగ్మెంట్ లో హోండాతో పోటీపడుతున్న హీరో స్ప్లెండర్ ప్లస్ ధర 1,74,420-1,74,710 (ఎక్స్-షోరూమ్, ముంబై).

హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత

బ్రిటీష్ యాక్టర్ పాల్ గ్రాంట్ ఆకస్మికంగ మరణించారు. లండన్ లోని ప్రాంకస్ స్టేషన్ లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారని, ఆ తర్వాత మరణంతో పోరాడలేక కన్నుమూసారని ది గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది.

'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక విడుదల చేసింది. 2022లో భారతదేశంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలను జరిగినట్లు ఆ వార్షిక నివేదికలో పేర్కొంది.

క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్, సాక్షి చౌదరి

ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సోమవారం భారత బాక్సర్లు ఫర్వాలేదనిపించారు. సాక్షి చౌదరి (52 కేజీలు), లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లి సత్తా చాటారు.

ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'

గ్లోబల్ వార్మింగ్‌(ఉపరితల ఉష్ణోగ్రతలు)పై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. వాతావరణ మార్పులపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఐపీసీసీ పెంపొందిస్తుంది.

అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు?

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. ఏప్రిల్ 28వ తేదీన సినిమాను రిలీఝ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

WPL: 9ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించాలనుకుంటున్నారా? పని ఒత్తడిలో ఉండటం, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వల్ల మ్యూజియంకు వెళ్లేందుకు సమయం కేటాయించకలేకపోతున్నారా? అయితే మీలాంటి వారికోసమే మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక ఆన్‌లైన్ ప్రదర్శనను ప్రారంభించారు.

విభిన్న జోనర్లలో థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు

ప్రతీ శుక్రవారం సినిమా థియేటర్లకు కొత్త కళ వస్తుంది. కానీ ఈ సారి ఆ కళ, కొంత ముందుగానే వచ్చింది. ఉగాది సందర్భంగా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి.

ఇది యుద్ధాల సమయం కాదు.. పాక్‌కు టీమిండియా రావాలి : షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సూమారు ఆరు నెలలగా ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది.బీసీసీఐ కార్యదర్శి జైషా 2023 లో పాకిస్థాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని ఇఫ్పటికే స్పష్టం చేశారు.

స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్

గత ఏడాది సెప్టెంబర్‌లో, నరసింహన్ కంపెనీ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టార్‌బక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు అవుతారని స్టార్‌బక్స్ ప్రకటించింది.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023: టాప్ లో ఫిన్లాండ్, మెరుగుపడ్డ ఇండియా స్థానం

మార్చ్ 20వ తేదిన ప్రపంచ ఆనంద దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్, ప్రపంచ దేశాల్లో ఏయే దేశాల ప్రజలు ఎంత ఆనందంగా ఉంటున్నారో రిపోర్ట్ ఇచ్చింది.

మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

మరో రౌండ్ ఉద్యోగ కోతలు ప్రారంభించిన టెక్ దిగ్గజం అమెజాన్ తమ AWS క్లౌడ్ యూనిట్, ట్విచ్ గేమింగ్ డివిజన్, అడ్వర్టైజింగ్, PXT (అనుభవం, సాంకేతిక పరిష్కారాలు) ఆర్మ్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 ఉద్యోగులను తొలగిస్తోంది.

లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్

లెజెండ్ లీగ్ క్రికెట్ సమరంలో ఆసియా లయన్స్ విజేతగా అవతరించింది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ జెయింట్స్‌ను ఆసియా లయన్స్ ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. ఈ క్రమంలో అమె అరెస్టుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మార్చి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

20 Mar 2023

ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంపై వడగళ్ల వాన పడింది. దీంతో విమానం భారీగా దెబ్బదిన్నది.

మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా 2023 కారు మార్చి 21న భారతదేశంలోలాంచ్ కానుంది. హ్యుందాయ్ వెర్నా 2023 వెర్షన్ కారును లాంచ్ చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది.

భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR), నకిలీ మొబైల్ ఫోన్ మార్కెట్‌ను అరికట్టడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ విభాగం (DoT) ద్వారా నిర్వహిస్తుంది.

భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా కిర్లోస్కర్ మోటార్ టయోటా ఇన్నోవా క్రిస్టా 2023ని రూ.19.13 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది.

రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం

జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, జపాన్ మధ్య రెండు కీలక ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.

ట్రావెల్: ఆస్ట్రియాలో అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు

ఆస్ట్రియా దేశంలో చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడికి పర్యటనకు వచ్చినపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.

టీమ్ ఓటమి కారణంగా కెప్టెన్సీకి రాజీనామా

న్యూజిలాండ్ చేతిలో 2-0తేడాతో సిరీస్ కోల్పోయిన తరుణంలో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 18) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ ప్రకటించారు . ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కరుణ్ రత్నే తెలియజేశాడు.

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ అగ్రస్థానం

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ విజృంభించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

రంగమార్తాండ ట్రైలర్: కట్టుకున్న ఇల్లు, కన్న కూతురు మనవి కావు

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రూపొందిన రంగమార్తాండ చిత్ర ట్రైలర్ ఇంతకుముందే రిలీజైంది. నిమిషంన్నర పాటున్న ఈ ట్రైలర్, జీవితంలోని లోతులను ఆవిష్కరించిందని చెప్పవచ్చు.

'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే అమృతపాల్ సింగ్‌ వేటలో పోలీసులకు లభిస్తున్న ఆధారాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం

గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభాల గురించిన ఆందోళనలతో సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం క్షీణించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించి 57,177 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 50 17,000 మార్కు దిగువన ఉంది.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 918 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,350కి పెరిగినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.46 కోట్లు (4,46,96,338)కు చేరుకున్నట్లు చెప్పింది.

WPL : టాస్ నెగ్గిన గుజరాత్.. గెలిస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 17వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని కైవసం చేసుకోవాలని యూపీ వారియర్స్ భావిస్తోంది.

విరూపాక్ష సినిమా ప్రమోషన్లు షురూ, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం విరూపాక్ష, ఏప్రిల్ 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మొదలుపెట్టింది చిత్రబృందం.

ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం

దేశీయ మార్కెట్‌కు శుద్ధి చేసిన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగిసిన తర్వాత డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించాలని భారతదేశం ఆలోచిస్తుందని, ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రెండు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది.

రాహుల్‌ను విమర్శించిన మాజీ ప్లేయర్స్‌కి మాసాలా కావాలి : గౌతమ్ గంభీర్

టీమిండియా ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌కి టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌పై కొంతకాలంగా మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, రాహుల్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు.

ప్రేరణ: పదేళ్ల తర్వాత నువ్వేమవుతావ్ అనేదానికి సమాధానం మీ దగ్గరుందా? అసలేంటి నీ లక్ష్యం?

ఈరోజు జీవిస్తున్నామంటే దానికి కారణం రేపటి మీద ఆశ. ఆ ఆశే లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఆ ఆశ పేరే లక్ష్యం. మీకంటూ ఒక లక్ష్యం ఉందా? ఒక్కసారైనా ఆలోచించారా?

iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్

వాట్సాప్ తన కమ్యూనిటీ ఫీచర్ కింద కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కమ్యూనిటీల ఇంటర్‌ఫేస్‌ను ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం మారుస్తోంది.

ఒకరోజును సమంగా చేసే మార్చ్ విషువత్తు గురించి మీకు తెలియని విషయాలు

వసంత విషువత్తు.. భూమధ్య రేఖకు ఎదురుగా ఉంటూ దక్షిణార్థ్ర గోళం నుండి ఉత్తరార్థ్ర గోళానికి సూర్యుడు వెళ్ళడాన్ని వసంత విషువత్తు అంటారు. ఇలా రెండు విషువత్తులు ఉంటాయి.

భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం!

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు కిందకు లాగిన ఘటన సంచలనంగా మారింది.

వైరల్ వీడియో: నాటు నాటు పాటకు టెస్లా కార్ లైట్ల తో సింక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట రీచ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ పాటకు స్టెప్పులు వేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు విఫలం.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్

రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుది. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ డబుల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది అభిమానుల మనుసుల మనషుల్ని గెలుచుకున్నాడు. 2018 లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ

కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.

టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాడు ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 185 బంతుల్లో 98 పరుగులు చేసి అరుదైన ఫీట్‌ను సాధించాడు.

నీహారిక కొణిదెల బ్రేకప్ రూమర్స్, ఆజ్యం అవుతున్న అన్ ఫాలో

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక కొణిదెల వివాహం, చైతన్య జొన్నలగడ్డ తో అట్టహాసంగా జరిగింది. 2020 డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు

ట్విట్టర్ SMS టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) పద్ధతి నుండి మారడానికి ఈరోజే చివరి రోజు. మార్చి 20వ తేదీ నుండి ట్విట్టర్ దాని SMS ఆధారిత 2FAని నెలకు $8 బ్లూ సబ్స్క్రిప్షన్ తో అందిస్తుంది.

లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు.

శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో వెటరన్ శ్రీలంక బ్యాటర్ దినేష్ చండిమాల్ అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 92 బంతుల్లో 62 పరుగులు చేశాడు.

పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ

పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్ రాబోతుంది. అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఊగిపోయే అప్డేట్ ఇవ్వడానికి మైత్రీ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ ఆనంద దినోత్సవం: అత్యంత ఆనందంగా ఉన్న దేశాలు, భారతదేశ స్థానం

ఆనందాన్ని ఎవరు కోరుకోరు అని థియేటర్లలో రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటుంది. అవును, ప్రతీ ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు. కానీ ఎంతమందికి అది దొరుకుతుందనేదే ప్రశ్న.

ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎలెనా రైబాకినా

ఎలైనా రైబాకినా 2023 సీజన్‌లో దుమ్ములేపింది. ఇండియన్ వెల్స్ టైటిళ్లను గెలుచుకొని సత్తా చాటింది. తన కెరీర్‌లో తొలి WTA 1000 టైటిల్‌ను, BNP పారిబాస్ ఓపెన్ ఇండియన్ వెల్స్‌తో ఆమె రికార్డు సృష్టించింది.

'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా

ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో మాక్సీ-స్కూటర్ విభాగంలో హోండా మంచి పేరుంది. భారతదేశంలో మాత్రం మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ఈ సంస్థ అడుగుపెట్టలేదు.

దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.

బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు

బెంగళూరులో బైక్‌ ట్యాక్సీ సేవలను నిరసిస్తూ సోమవారం ఆటోరిక్షా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. బెంగుళూరు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఫెడరేషన్ రాపిడో, ఇతర బైక్ టాక్సీ సర్వీసులు నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని పేర్కొంది.

IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందే చైన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2023 మినీ వేలంలో అతన్ని సీఎస్కే కోటీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఉగాది 2023: పండగ పర్వదినాన ప్రత్యేకంగా చేసుకోవాల్సిన వంటలు

ఉగాది.. తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఉగాది తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాదిని యుగాది, సంవత్సరాది అని కూడా అంటారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.

క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్

స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద బ్యాంక్ UBS, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ చిత్తు

సొంతగడ్డపై రియల్ మాడ్రిడ్‌ను బార్సిలోనా ఓడించింది. లా లిగా 2022-23 ఎల్ క్లాసిక్ పోరులో రియల్ మాడ్రిడ్‌ను 2-1 తేడాతో బార్సినాలో చిత్తు చేసింది. 9వ నిమిషంలో రొనాల్డ్ అరౌజో రియల్ మాడ్రిడ్‌కు అధిక్యాన్ని అందించారు.

2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది

మెర్సిడెస్-బెంజ్ తన ఎంట్రీ-లెవల్ SUV GLAని MY-2024 అప్‌డేట్‌లతో గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయనుంది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో బి ఎం డబ్ల్యూ X1తో పోటీ పడుతుంది. SUV బాడీ స్టైల్ కు ఈమధ్య డిమాండ్ బాగా పెరిగింది.

అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు

యంగ్ యాక్టర్ హీరో నిఖిల్, గత సంవత్సరం రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి వందకోట్ల క్లబ్ లో చేరాడు.

ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇంటర్ మిలాన్‌ను ఓడించిన జువెంటస్

సెరీ A 2022-23 సీజన్‌లో 27వ మ్యాచ్‌లో ఇంటర్‌ మిలాన్‌పై జువెంటస్ 1-0 తేడాతో విజయం సాధించింది. 23వ నిమిషలో జువెంటస్ తరుపున ఫిలిప్ కోస్టిక్ గోల్ చేసి విజృంభించాడు.

రంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు

రంజాన్ లేదా రమదాన్.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పవిత్రమైన పండగ. రంజాన్ మాసం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో రంజాన్ విశేషాలు తెలుసుకుందాం.

అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. శనివారం నుంచి అమృతపాల్ సింగ్‌కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌లో విజేతగా నిలిచిన సెర్గియో పెరెజ్

సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌లో ఆదివారం రెడ్‌బుల్ డ్రైవర్ సెర్గియో పెరెజ్, డిఫెండింగ్ ఫార్ములా 1 ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ ఈ సీజన్‌లో రెంోవ వరుస రేసు కోసం మరోసారి అధిపత్యం చెలాయించింది.

మార్చి 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.