22 Mar 2023
భారత్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా
ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2తో కోల్పోయింది. తొలి నుంచి భారత్ గెలుపు దిశగా సాగగా.. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లింది.
హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అధునాతన హంగులతో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వారికి సేవలను ఇక్కడి నుంచి అందిస్తున్నారు.
సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో ఫేస్‌బుక్ విఫలం; కోర్టులో దావా
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక దోపిడీని అరికట్టడంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, దాని యంత్రాంగం విఫలమయ్యారని అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో దావా దాఖలైంది.
నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్
మరో ఎనిమిది రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ ఇండియా ఫిల్మ్ 'దసరా' రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను నాని అదరొట్టాడు.
లెస్బియన్ అని ఒప్పుకున్న బాక్సర్
మహిళల ఫెదర్‌వెయిట్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఇటాలియన్ బాక్సర్ ఇర్మా టెస్టా తాను లెస్బియన్ అనే విషయాన్ని ప్రకటించింది. ఈ నిజాన్ని బహిరంగంగా చెప్పడం ఎంతో ధైర్యానిచ్చిందని పేర్కొంది.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. గత 24గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి పెరిగింది.
వరల్డ్ కప్‌లో ఇండియాపై పగ తీర్చుకుంటాం : షోయబ్ అక్తర్
ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాతో సహా అన్ని జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ టోర్నీ టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ మెగా టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్థాన్ మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?
ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని దేవస్థాన్‌లో దీన్నిఏర్పాటు చేశారు.
సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్‌బాట్లలో ఏది ఉత్తమం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI). ఇదొక సాంకేతిక విప్లవం. ఏఐ విషయంలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య వార్ నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన OpenAI సంస్థ ChatGPTని తీసుకురాగా, దీనికి పోటీగా గూగుల్ 'Bard'ను రెడీ చేస్తోంది. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
దాస్ కా ధమ్కీ రివ్యూ : విశ్వక్‌సేన్‌కు ధమ్కీ ఇచ్చాడా ..?
ఫలక్‌నామా దాస్ తో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. తర్వాత నటించిన చిత్రాలను అశించిన స్థాయిలో ఆడలేదు. దాస్ కా ధమ్కీ కమర్షినల్ ఎంటైర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ ఈ సినిమాతో ధమ్కీ ఇచ్చాడో లేదో ఇప్పుడు మనం చూద్దాం..
బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం
తమిళనాడులోని కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో మంటల చేలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ఫ్యాక్టరీలోనే చనిపోయారు.
బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు
గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్య కేసులో 11మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. టెస్టు ఛాంపియన్ షిప్ కాకుండా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?
అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రంగ మర్తాండ రివ్యూ.. కన్నీరు కార్చేలా ఎమోషన్స్
కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మనందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజాలతో కృష్ణవంశీ ప్రయోగం చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
ఫేస్‌బుక్ మోడరేటర్‌ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న 'సామ' ఔట్‌సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 260 మంది కంటెంట్ మోడరేటర్ల తొలగింపు ప్రక్రియకు కెన్యా కోర్టు బ్రేక్ వేసింది.
అల్లరి నరేష్, ఫారియా అబ్ధుల్లా కాంబినేషన్‌లో కొత్త మూవీ
నాంది సినిమా తర్వాత హీరో అల్లరి నరేష్ రూట్ మార్చేశాడు. ఈ టాలెండెట్ హీరో ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమా అప్‌డేట్ అందించాడు.
రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు
ఆస్ట్రేలియాతో చైన్నై వేదికగా మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. చివరి వన్డేలో నెగ్గి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే రెండో వన్డే గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని అసక్తికర విషయాలను వెల్లడించారు.
మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు
ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కానుంది. మార్చి 25 నుంచి 30 మధ్య ఐదు గ్రహాలు ఒకే కక్ష్యలోకి రానున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ ఒకే సెక్టార్‌లోకి వచ్చి కనువిందు చేస్తాయని స్టార్ వాక్ అనే వెబ్ సేట్ పేర్కొంది.
NBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది
నందమూరి బాలకృష్ణ వరుస హిట్‌లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఇటీవల అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం, సంక్రాంతికి వీరనరసింహరెడ్డితో మళ్లీ హిట్ కొట్టడం.. వరుసగా యాడ్స్ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే ఊపుమీద NBK 108 కూడా మొదలుపెట్టారు.
గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్
ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు శనివారం ఆపరేషన్‌ను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన ఓ గురుద్వారాకు వెళ్లి 45నిమిషాలు గడిపిన విషయం తాజాగా బయటికి వచ్చింది.
వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ
మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే బ్యాటర్లలో టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ముందు స్థానంలో ఉంటాడు. సాధారణంగా మనిషి గంటకు 12-13 కిమీ వేగంగా పరిగెత్తగలడు. కానీ విరాట్ కోహ్లీ 24-25 కిమీ వేగంతో పరిగెత్తే సత్తా ఉంది.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.
Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల'
యాంకర్ సుమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్లైనా అక్కడ సుమ యాంకరింగ్ చేయాల్సిందే. సుమ పుట్టినరోజు బుధవారం(మార్చి 22) కాగా, ఆమె గురించి తెలుసుకుందాం.
ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ను ఇస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా వాతావరణం ఇరుపక్షాల మధ్య హీట్‌గా ఉంటుంది. అయితే స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎప్పుడు ముందు ఉంటారు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..!
వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీమిండియా కప్పును కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు
'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఏడు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆయన ఆచూకీని కనుగోనలేకపోయారు.
WPL: యూపీ వారియర్జ్‌ను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్ లోకి నేరుగా ప్రవేశించింది.
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
21 Mar 2023
Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO
OPPO తన Find X6 సిరీస్‌ని పరిచయం చేసింది, ఇందులో Find X6, Find X6 Pro మోడల్‌లు ఉన్నాయి. హైలైట్‌ల విషయానికొస్తే, పరికరాలు అధిక-రిజల్యూషన్ AMOLED స్క్రీన్, 50MP ట్రిపుల్ కెమెరాలు, 16GB వరకు RAMతో పాటు వరుసగా టాప్-టైర్ MediaTek, Snapdragon చిప్‌సెట్‌లతో వస్తుంది.
SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.
రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా
లగ్జరీ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన బ్లాక్ బ్యాడ్జ్ వ్రైత్ బ్లాక్ యారో మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ఒక రెగల్ డిజైన్ తో బెస్పోక్ 'స్టార్‌లైట్ హెడ్‌లైనర్'తో ఉన్న క్యాబిన్ ఉంటుంది. కారు గ్లాస్-ఇన్ఫ్యూజ్డ్ టాప్‌కోట్‌తో పెయింట్‌వర్క్‌తో వస్తుంది.
UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది
సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ను UBS స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది భారతీయ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రెండు బ్యాంకుల ఇండియా టెక్నాలజీ బ్యాక్ ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
యోగాసనాలు వేయడం కష్టంగా ఉందా? వీల్ యోగా ట్రై చేయండి
చక్రంతో యోగా గురించి మీరెప్పుడూ విని ఉండరు. కానీ ఇది నిజం. చక్రం సాయంతో యోగాసనాలు వేయడమే వీల్ యోగా. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ
అధిక పన్నులు, పేలవమైన రహదారి మౌలిక సదుపాయాలు భారతదేశంలో సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని పరిమితం చేస్తున్నాయని లంబోర్ఘిని గ్లోబల్ సిఈఓ, స్టీఫన్ వింకెల్‌మాన్ అభిప్రాయాన్ని వ్యాకటం చేశారు. దేశంలోని మౌలిక సదుపాయాలు అభివృద్ది ఇంకా వేగంగా జరగాలని అన్నారు.
కుంబ్లే తో గొడవ తరువాత.. కోచ్ గా ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్
టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 2016లో భారత ప్రధాన కోచ్ గా పదవి బాధ్యతలను చేపట్టాడు. అయితే 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుంబ్లే స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతలను తీసుకున్నాడు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.
ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు
మరణశిక్షను అమలు చేసే కేసుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలులో భాగంగా మెడకు తాడును వేలాడిదీసి ఉరివేయడం క్రూరమైన చర్యగా చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.
భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7
iQOO తాజా Z-సిరీస్ మోడల్, iQOO Z7 ఇప్పుడు భారతదేశంలో రూ. 18,999కు అందుబాటులో ఉంది. ఇందులో 90Hz AMOLED స్క్రీన్, 64MP ప్రధాన కెమెరా, డైమెన్సిటీ 920 చిప్‌సెట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది. 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్-ఆధారిత ఫీచర్స్ ను అందిస్తుంది.
జస్ప్రిత్ బుమ్రాపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐదు నెలలకు పైగా క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నెముక గాయం పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి ప్రస్తుతం టీమిండియాకు దూరమయ్యాడు.
ప్రేరణ: మనసు పడ్డ ప్రతీదీ మన దరికి రావాలని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే
మన మనసు చాలా అల్లరి చేస్తుంటుంది. దానికి ఊహలెక్కువ. ఆశలెక్కువ. ఆకాశంలో ఎగరాలని చూస్తుంది, దారం లేకపోయినా. నీళ్ళలో తడవాలని చూస్తుంది, ఈత రాకపోయినా.
కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మూడో వన్డే మార్చి 22న చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
మొటిమల వల్ల కలిగిన ఎర్రటి మరకలను ఒక్క రాత్రిలో పోగొట్టే ఇంట్లోని వస్తువులు
రెండు మూడు రోజుల్లో పెళ్ళనగా అనుకోకుండా మీ ముఖం మీద మొటిమలు వచ్చాయనుకోండి. అది పగిలిపోయి ఎర్రటి మరకలా మారిందనుకోండి. మీకెలా ఉంటుంది. ఆ మరకలను తొందరగా ఎలా పోగొట్టుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.
AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిన చిత్రాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఒక కళాకారుడు ఈ టెక్నాలజీని గతంలో ఉన్నవారితో సెల్ఫీలను సృష్టించడానికి ఉపయోగించారు.
ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్
పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.
వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ వన్డేలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేలో 5వేల పరుగులు చేయడానికి కేవలం 61 పరుగుల దూరంలో ఉన్నాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు.
హాకీ ప్లేయర్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం
ఇండియా మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం లభించింది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ స్టేడియానికి ఆమె పేరును నామకరణం చేశారు. ఈ స్టేడియం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉంది. గతంలో ఈ స్టేడియానికి 'MCF రాయ్‌బరేలీ' అని పేరు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 'రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్'గా మార్చారు.
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తో జరిగిన చివరి టెస్టులో సెంచరీ చేసి కోహ్లీ అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75కి చేరింది. అయితే అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు.
బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా?
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్ వచ్చింది.
ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు
దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్నును ప్రభుత్వం మంగళవారం టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గించింది.
కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావు చించన్‌సూర్ పార్టీని వీడారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.
ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్
భారతీయ జనతా పార్టీపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని పేర్కొంది. వాల్టర్ రస్సెల్ మీడ్ ఈ కథనాన్ని రాశారు.
ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..!
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడో వన్డేలో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్
క్రికెట్‌లో లీగ్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తోంది. తాజాగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ అమెరికాలోని డల్లాస్ లో జూలై 13 నుంచి 30 వరకూ జరగనుంది. కొందరు టాప్ ప్లేయర్స్ ఈ లీగ్‌తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.
సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్
టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి దిగితే బౌండరీ వర్షం కురింపించే సెహ్వాగ్.. బ్యాటింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు
ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌కు కోసం పంజాబ్ పోలీలులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగు రోజులుగా అమృతపాల్ సింగ్ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృతపాల్‌కు మద్దతుగా ఖలిస్థానీ సానుభూతిపరులు వివిధ దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు.
ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం
Pro సిరీస్ ఐఫోన్‌లు ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి, ఆపిల్ ఫీచర్స్ ను మారుస్తుంది. Pro ఐఫోన్‌ని ఎంచుకున్నప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్, మరింత సామర్థ్యం గల ట్రిపుల్ కెమెరా సెటప్, మెరుగైన డిస్‌ప్లే కూడా ఇందులో ఉంటాయి. ఆపిల్ ఐఫోన్ 15 Pro కూడా అలాగే తేలికగా కనిపించేలా అనుభూతి చెందడానికి ప్రత్యేకంగా రూపొందుతుంది.
పిల్లల పెంపకం: మీ పిల్లలు బయట ఆడుకోవట్లేదా? భవిష్యత్తులో జరిగే ప్రమదాలు ఇవే
ప్రస్తుత తరంలో పిల్లలు బయట ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అతి జాగ్రత్త చూపిస్తూ బయట ఆడుకోవడానికి పంపట్లేదు.
ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు గురించి తెలియని వాళ్ళు లేరు. ఐతే ఈరోజు ఉదయం, ఆయన మరణించారని వార్త బయటకు వచ్చింది. ఈరోజు ఉదయం నుండి ఈ వార్త బాగా చక్కర్లు కొట్టింది.
హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం
హోండా షైన్ 100 ప్రారంభ ధర 1,64,900 (ఎక్స్-షోరూమ్, ముంబై) తో అందుబాటులో ఉంది. మరోవైపు ఈ సెగ్మెంట్ లో హోండాతో పోటీపడుతున్న హీరో స్ప్లెండర్ ప్లస్ ధర 1,74,420-1,74,710 (ఎక్స్-షోరూమ్, ముంబై).
హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత
బ్రిటీష్ యాక్టర్ పాల్ గ్రాంట్ ఆకస్మికంగ మరణించారు. లండన్ లోని ప్రాంకస్ స్టేషన్ లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారని, ఆ తర్వాత మరణంతో పోరాడలేక కన్నుమూసారని ది గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది.
'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక విడుదల చేసింది. 2022లో భారతదేశంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలను జరిగినట్లు ఆ వార్షిక నివేదికలో పేర్కొంది.
క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్, సాక్షి చౌదరి
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సోమవారం భారత బాక్సర్లు ఫర్వాలేదనిపించారు. సాక్షి చౌదరి (52 కేజీలు), లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లి సత్తా చాటారు.
ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'
గ్లోబల్ వార్మింగ్(ఉపరితల ఉష్ణోగ్రతలు)పై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. వాతావరణ మార్పులపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఐపీసీసీ పెంపొందిస్తుంది.
అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు?
అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. ఏప్రిల్ 28వ తేదీన సినిమాను రిలీఝ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
WPL: 9ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి
ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించాలనుకుంటున్నారా? పని ఒత్తడిలో ఉండటం, హైదరాబాద్‌లో ట్రాఫిక్ వల్ల మ్యూజియంకు వెళ్లేందుకు సమయం కేటాయించకలేకపోతున్నారా? అయితే మీలాంటి వారికోసమే మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక ఆన్‌లైన్ ప్రదర్శనను ప్రారంభించారు.
విభిన్న జోనర్లలో థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు
ప్రతీ శుక్రవారం సినిమా థియేటర్లకు కొత్త కళ వస్తుంది. కానీ ఈ సారి ఆ కళ, కొంత ముందుగానే వచ్చింది. ఉగాది సందర్భంగా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి.
ఇది యుద్ధాల సమయం కాదు.. పాక్‌కు టీమిండియా రావాలి : షాహిద్ అఫ్రిది
ఆసియా కప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సూమారు ఆరు నెలలగా ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది.బీసీసీఐ కార్యదర్శి జైషా 2023 లో పాకిస్థాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని ఇఫ్పటికే స్పష్టం చేశారు.
స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్
గత ఏడాది సెప్టెంబర్‌లో, నరసింహన్ కంపెనీ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టార్‌బక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు అవుతారని స్టార్‌బక్స్ ప్రకటించింది.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023: టాప్ లో ఫిన్లాండ్, మెరుగుపడ్డ ఇండియా స్థానం
మార్చ్ 20వ తేదిన ప్రపంచ ఆనంద దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్, ప్రపంచ దేశాల్లో ఏయే దేశాల ప్రజలు ఎంత ఆనందంగా ఉంటున్నారో రిపోర్ట్ ఇచ్చింది.
మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్
మరో రౌండ్ ఉద్యోగ కోతలు ప్రారంభించిన టెక్ దిగ్గజం అమెజాన్ తమ AWS క్లౌడ్ యూనిట్, ట్విచ్ గేమింగ్ డివిజన్, అడ్వర్టైజింగ్, PXT (అనుభవం, సాంకేతిక పరిష్కారాలు) ఆర్మ్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 ఉద్యోగులను తొలగిస్తోంది.
లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్
లెజెండ్ లీగ్ క్రికెట్ సమరంలో ఆసియా లయన్స్ విజేతగా అవతరించింది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ జెయింట్స్‌ను ఆసియా లయన్స్ ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. ఈ క్రమంలో అమె అరెస్టుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మార్చి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.