29 Mar 2023

ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా

మెటా ఈ నెల ప్రారంభంలో 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. సిబ్బందికి బోనస్ చెల్లింపులను తగ్గించి, ఉద్యోగి పనితీరు అంచనాలను తరచుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు బోనస్ రేటు 85% నుండి 65%కి తగ్గించింది.

సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు సూర్యునిపై భారీ నల్లటి ప్రాంతాన్ని గుర్తించింది. ఇది మన భూమి కంటే 20 రెట్లు పెద్దదని వైస్ న్యూస్‌ నివేదిక పేర్కొంది.

అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్

ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి (NATS) చెందిన కర్టెన్ రైజర్ ఈవెంట్, హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన తారలు హాజరయ్యారు.

పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?

గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న రీజా హెండ్రిక్స్

టీ20ల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20ల్లో ఆ ఫీట్ ను అధిగమించాడు.

IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ

గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ స్పీడ్‌ స్టార్ దీపక్ చాహర్ ఐపీఎల్ 16వ సీజన్ లో ఆడనున్నాడు. సీఎస్కే తరుపున 2018 నుంచి అడుతున్న చాహర్ నాణ్యమైన బౌలింగ్‌తో అకట్టుకున్నాడు.

ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే, నీవు దాన్నెప్పటికీ పూర్తి చేయలేవు

మీరో పని చేయాలనుకున్నారు. ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు ఐపోయింది. రెండు రోజులు గడిచాయి. మూడు రోజు కూడా ఆ పనిని ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు.

మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుతపులి 4 పిల్లలకు జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో ఒక చిరుత మరణించిన మూడు రోజుల తర్వాత మరో చిరుత 4 బుల్లి చిరుతలకు జన్మనిచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతను చిరుత పిల్లల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఐపీఎల్‌లో డాన్స్‌తో రచ్చచేయనున్న తమన్నా

మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా దక్షిణాదితో పాటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనుంది

పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత

శాకుంతలం ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత, వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. మీడియాతో రకరకాల విషయాలు ముచ్చటిస్తున్న సమంత, పుష్పలో ఐటెం సాంగ్ ఎందుకు చేసిందో కారణం తెలియజేసింది.

భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌

మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్)గా బెంగళూరు విమానాశ్రయం అవతరించనున్నది. భారతదేశంలోనే మొట్ట మొదటిగా ఈ స్థాయి గుర్తింపు పొందిన విమానాశ్రయంంగా బెంగళూరు నిలవనుంది.

త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ రోజు 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ నుండి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. అది కూడా త్రివిక్రమ్ బ్యానర్ లో కావడం విశేషం.

ఐపీఎల్‌లో ధోని మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది.

కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ తన EV9 SUVని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోగా విచాణను ముగించాలని సీబీఐని ఆదేశించింది.

నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల హీరోగా వస్తున్న చిత్రం నారాయణ అండ్ కో టీజర్ రిలీజైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేసిన ఈ టీజర్ ద్వారా ఇదొక నవ్వించే సినిమా అని అర్థమైంది.

142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్ భారతదేశంలోని దాని ఇంజనీరింగ్ విభాగంలోని మొత్తం సిబ్బందితో సహా 142 మందిని తొలగించింది.

SA vs WI : సౌతాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం

జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన 3వ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేశారు.

మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?

లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో తమ నాయకుడు తిరిగి లోక్‌సభలో అడుగుపెడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు

ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఏదైనా పని చేస్తున్నా ఆ పనిలో సక్సెస్ అవుతామో లేదోనన్న భయం ఉంటుంది. సక్సెస్ అయితే సమస్య లేదు కానీ ఫెయిల్ అయితే ఏం చేయాలన్నది అర్థం కాదు.

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ హ్యాట్రిక్ గొల్స్‌తో రికార్డు

అర్జెంటీన్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కురాకోతో జరిగిన ఫెండ్లీ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన మెస్సీ అర్జెంటీనా తరుపున వంద అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ దిగువ‌సభ బుధవారం పునరుద్ధరించింది.

ముంబై ఫ్యాన్స్‌ కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ దూరం!

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కి గట్టి షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్: 14 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 162మంది వైద్య నిపుణుల నియామకం

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమానికి చెందిన వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల నియామకం కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులు భర్తీ అయ్యాయి.

ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డులను సృష్టించనున్నాడు. ప్రత్యర్థుల వికెట్లను తీయడంలో చాహెల్ ముందు ఉంటాడు. చాహల్ బౌలింగ్‌లో ఆడటానికి విధ్యంసకర బ్యాటర్లు కూడా వెనకడుగు వేస్తారు.

ఆరోగ్యం: నోటి పూత ఇబ్బంది పెడుతున్నట్లయితే టూత్ పేస్ట్, తేనె ట్రై చేయండి

శరీరంలో విటమిన్ల కొరత కారణంగా పెదవి లోపలి భాగంలో చిన్న చిన్న పుండ్లు తయారవుతాయి. వీటిని నోటి పూత అంటారు. ఇవి కేవలం పెదవి లోపలి భాగంలోనే కాకుండా నాలుక మీదా, చిగుళ్ళ మీదా, అంగిలి భాగంలో అవుతుంటాయి.

ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు

దాదాపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు కూడా 12 శాతం పెరగనున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను

దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత రహదారి ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల టోల్ ఏప్రిల్ 1 నుండి 18 శాతం పెరుగుతుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!

భారత్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్-19 వ్యాక్సిన్ సిఫార్సులను సవరించింది. కరోనా కొత్త దశను అరికట్టడంతో పాటు అధిక జనాభాలో రోగనిరోధక శక్తిని పెంపొందేలా ఈ సవరణలను ప్రతిపాదించింది.

బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని

దసరా ప్రమోషన్ల జోరులో ఉన్న నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారల్లో ఎవరితో పనిచేయాలనుందో చెప్పేసాడు.

ఇకపై ఖరీదైనవిగా మారనున్న ఆన్‌లైన్ చెల్లింపులు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక నోటీసులో, వాలెట్ లేదా కార్డ్‌ల వంటి ప్రీపెయిడ్ టూల్స్ ను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చేసే వ్యాపార లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీజులను వసూలు చేయాలని సూచించిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపు మరింత ఖరీదైంది.

వరుస వైఫల్యాలతో తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ.సింధు

భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. తాజాగా బిడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్‌లో 2016 తర్వాత తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయింది. గతవారం ముగిసిన స్విస్ ఓపెన్ లో సింధు మహిళల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రిక్వార్టర్‌లో నిష్ర్కమించింది.

ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం

ఆపిల్ Music క్లాసికల్ అనే ఆపిల్ శాస్త్రీయ సంగీత స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు ఐఫోన్ లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం ప్రకటించింది.

టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్

టీమిండియా విజయాల్లో ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్.. అనూహ్యంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు.

అందం: పసుపు పదార్థంగా ఉన్న ఫేష్ వాష్ లను ట్రై చేయండి

అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందుకే అందాన్ని మెరుగులు దిద్దడం కోసం రకరకాల ఫేష్ వాష్ లు, క్రీములు ముఖానికి పూస్తుంటారు.

5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఆకాశంలో ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించిన అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ అన్నీ సరళ రేఖలో క్రమంగా ఉన్నాయి. ఈ వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది.

దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా; కొత్తగా 2,151 కేసులు, 5 నెలల్లో ఇదే అత్యధికం

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ, తగ్గడం లేదు. దేశంలో గత 24గంటల్లోనే 2,151 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

కొత్త కుర్రాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేస్తుందా..?

2013లో ఐపీఎల్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2016లో టైటిల్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా కనీసం ఫ్లేఆఫ్ కూడా క్వాలిఫై కాకుండా అభిమానులను నిరాశపరిచింది.

#OG: పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో సినిమాకు టైటిల్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, #PKSDT, #OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలున్నాయి.

కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3-ఆధారిత SUVని ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. మార్కెట్లో ఇది కియా కేరెన్స్‌తో పోటీ పడుతుంది.

ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు

ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా సాగుతున్నాయి. అదానీ, రాహుల్ గాంధీల వ్యవహారాలతో నెలకొన్న ఆందోళనల కారణంగా ఉభయ సభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా పోతోంది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 3మూడు కీలక బిల్లు ఆమోదం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ

అదానీ గ్రూప్ కు మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి, మీడియా నివేదికలు ఆ సంస్థ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రశ్నించాయి.

ట్రావెల్: పక్షిలా మారి గాల్లో ఎగరాలనుందా? ఈ రోప్ వే ప్రయాణంతో సాధ్యమే

మనిషి గాల్లో ఎగరలేడు. కానీ గాల్లో ప్రయాణించే వాహనాన్ని తయారు చేయగలడు. అలాంటి వాహనాలకు అవసరమయ్యే దారులు కూడా సృష్టించగలడు. ఈ దారులకు రోప్ వే అని పేరు పెట్టుకున్నాడు.

ఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది?

ఈ రోజుల్లో యాక్సెస్ చేయగల ఆన్-డిమాండ్ కంటెంట్ లైబ్రరీతో Spotify, అమెజాన్ Music, ఆపిల్ Music, యూట్యూబ్ Music వంటి ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీచర్‌లు, సబ్‌స్క్రిప్షన్ ధరలను తెలుసుకుందాం.

సూపర్ ఫామ్ లో మార్ర్కమ్ మామా.. ఇక సన్‌రైజర్స్ కప్పు కొట్టినట్లే..!

దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఐడెన్ మార్ర్కమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల అతను సూఫర్ ఫామ్‌లో ఉండటంతో కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సమంత

శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తోంది సమంత. మయోసైటిస్ తో బాధపడుతున్న కారణంగా గతేడాది మొత్తం సినిమాలకు, షూటింగులకు దూరమైన సమంత, ఈ మధ్య వరుసగా సినిమాలను మొదలెట్టింది.

అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు

అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో బుధవారం ఉదయం భూకంపం సభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను ప్రకటించనుంది. దిల్లీలోని ప్లీనరీ హాల్ విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో

విశ్వక్ సేన్.. తెలుగు సినిమా హీరో. ఈయన మాట్లాడితే కాన్ఫిడెన్స్ కే కాన్ఫిడెన్స్ పుట్టుకొస్తుంది. కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దంలాంటి హీరో, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

మార్చి 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

28 Mar 2023

ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాలెట్ మార్గదర్శకాలను మార్చి 24న ప్రకటించింది, ఇది వాలెట్‌ల ప్రాముఖ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి మార్గం సుగమం చేసింది.

హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది

హోండా తన యాక్టివా 125 స్కూటర్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. OBD-2-కంప్లైంట్ ఇంజిన్ కొత్త ఫీచర్లతో వస్తుంది.

మొదటిసారిగా ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను గుర్తించిన నాసా JWST

TRAPPIST-1 b అనే ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను కొలవడానికి పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించారు. ఎక్సోప్లానెట్ ద్వారా విడుదలయ్యే ఏదైనా కాంతి రూపాన్ని మొదటిసారిగా గుర్తించింది, సౌర వ్యవస్థలోని రాతి గ్రహాల లాగా చల్లగా ఉంటుంది.

అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

ప్రేరణ: జీవితంలో కష్టం ఉందని తెలుసుకున్నప్పుడే సుఖాన్ని ఎంజాయ్ చేయగలవు

జీవితంలో కష్టాలు రాకుడదని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. దేవుడికి మొక్కుకుంటారు. కానీ మీకి తెలుసా? మీ జీవితంలో అసలు కష్టాలే లేకపోతే సుఖం గురించి మీకెప్పటికీ తెలియదు.

కంటి వ్యాధులను గుర్తించడానికి AI యాప్‌ను అభివృద్ధి చేసిన 11 ఏళ్ల కేరళ బాలిక

దుబాయ్‌కు చెందిన 11 ఏళ్ల మలయాళీ బాలిక AI అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది, ఇది వివిధ కంటి వ్యాధులు, పరిస్థితులను గుర్తించగలదని పేర్కొంది. లీనా రఫీక్ ఐఫోన్ ద్వారా స్కానింగ్ ప్రక్రియను ఉపయోగించే తన ప్రత్యేకమైన సృష్టిని లింక్డ్‌ఇన్‌ ద్వారా ప్రకటించారు .

ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నాడు. 2012 లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన జోరూట్.. 2023 ఐపీఎల్‌ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడనున్నాడు.

టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని పెంచగలడు.

దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం

పంజాబ్ నుంచి పారిపోయి వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ దిల్లీలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు.

AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్

ChatGPT విప్లవం వివిధ రంగాలలో ప్రభావం చూపిస్తుంది. AI సామర్థ్యాలను చూసి ఆనందించినా , ఇది లేబర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు.

రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర చిత్రం, ఏప్రిల్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత కష్టపడి పైకొచ్చాడో చాలామందికి తెలియదు. రోహిత్‌శర్మ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు.

అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు.

2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్

బి ఎం డబ్ల్యూకి 2021తో పోల్చితే 2022 భారతదేశంలో 35% కార్ల అమ్మకాలు పెరిగాయి. సంస్థ ఈ సంవత్సరం కూడా అదే రెండంకెల వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.

దసరా నాలుగవ పాట రిలీజ్: సిన్నప్పటి గ్నాపకాలను యాదికి తెచ్చే పాట

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా నుండి నాలుగవ పాట రిలీజ్ అయ్యింది. ఓ అమ్మలాలో అమ్మలాలో అంటూ సాగే ఈ పాట చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉంది.

వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకున్న శ్రీలంక..!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేలు, టీ20 సిరీస్ లు ఆడేందుకు అడుగుపెట్టిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన శ్రీలంకకు న్యూజిలాండ్ చావు దెబ్బ కొట్టింది.

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఆర్ఆర్ఆర్ బృందాన్ని సన్మానించిన మెగాస్టార్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే.

2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్

Triumph బజాజ్ ఆటో కొత్త రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌పై కలిసి పని చేస్తున్నాయి, ఇది 2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో మంగళవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఇద్దరు గాయపడ్డారు.

కోహ్లీ ఓ అహంభావి.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్

విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరని గట్టిగా చెప్పొచ్చు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. ఎంతో శ్రమించి తిరుగులేని ఆటగాడిగా రికార్డులను సృష్టించాడు.

వేసవి వేడి తగలకుండా ఉండాలంటే సత్తుపిండి ఆహారాలు తినాల్సిందే

సత్తులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్చిన శనగ పప్పును గ్రైండర్ రుబ్బడం వల్ల సత్తు తయారవుతుంది. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సత్తు పదార్థంతో పానీయాలు తయారు చేసుకుంటారు.

ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ

లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంపై మంగళవారం రాహుల్ గాంధీ స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

IPL 2023: ఐపీఎల్‌లో కొత్త రూల్స్ ఇవే

ఐపీఎల్ మాజా ఇంకా మూడురోజులలో ప్రారంభ కానుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లో చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొన్ని మార్పులను తీసుకొచ్చింది. పోయిన ఏడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతున్నాయి.

అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు

నివాసి సంక్షేమ సంఘాలు (RWA) ఫ్లాట్‌ల యజమానులు లేదా అద్దెకు ఉండే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా నియమాలు, నిబంధనలను ఏర్పరుస్తాయి.

ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్

గంగోత్రి సినిమాతో తెలుగు సినిమాకు హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా, 2003 మార్చ్ 28వ తేదీన రిలీజైంది.

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్‌ను దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌తో పాటు దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌లకు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్‌ ప్రధాన సాక్షి కావడం గమనార్హం.

కెప్టెన్‌గా నితీష్ ఎంపికపై కేకేఆర్ తప్పు చేసిందంటూ ట్రోల్స్..!

ఐపీఎల్ లో రెండు సార్లు టైటిగ్ నెగ్గిన కోల్ కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గాయంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు.

'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మంగళవారం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

నేషనల్ ట్రైగ్లిజరైడ్స్ డే: రక్తంతో ప్రవహించే కొవ్వులాంటి గడ్డల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రతీ ఏడాది మార్చ్ 28వ తేదీన జాతీయ ట్రైగ్లిజరైడ్ డేని జరుపుకుంటారు. అధిక శాతం ట్రైగిల్జరైడ్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అవగాహన పెంచుకోవడానికి ఈరోజును జరుపుతారు.

ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి అండ్రీ రస్సెల్ రెడీ

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ అండ్రీ రస్సెల్ ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి సిద్ధమయ్యాడు. 2014 నుంచి కోల్ కత్తా నైట్ రైడర్స్ తరుపున అడుతున్న అండ్రీ రస్సెల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రస్సెల్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ ఐపీఎల్‌లో రస్సెల్ కొన్ని రికార్డులను బద్దలుకొట్టనున్నాడు.

రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు కేటాయించిన దిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‍‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్

ఎన్టీఆర్ 30 సినిమా నుండి సాలిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక కావడం, యాక్షన్ డైరెక్టర్ గా హాలీవుడ్ నుండి కెన్నీ బేట్స్ రావడం సహా తాజాగా మరో హాలీవుడ్ టెక్నీషియన్ ని రంగంలోకి దించుతున్నారు.

పాకిస్థాన్ తొలి బౌలర్‌గా షాదాబ్ ఖాన్ సంచలన రికార్డు

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ సంచలన రికార్డును నమోదు చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20ల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాక్ తరుపున టీ20ల్లో 100 వికెట్లు తీసిన తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

చంద్రునిపై ఉన్న గాజు పూసల లోపల నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు

చంద్రుని ఉపరితలంపై ఏర్పడిన గాజు పూసల లోపల నీటిని పరిశోధకులు కనుగొన్నారు, సోమవారం నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, పూసలలో నిల్వ ఉన్న నీటి పరిమాణం సుమారు 270 ట్రిలియన్ కిలోగ్రాములుగా అంచనా వేశారు.

'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు

ఇప్పటికే వరుస బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన సైన్యానికి మంగళవారం కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధాల నిల్వలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించనట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) పేర్కొంది.

సింగిల్స్ కోసం ప్రత్యేకమైన ఉంగరం, డేటింగ్ యాప్ లపై గురి

సరైన పార్ట్ నర్ కోసం డేటింగ్ యాప్ లో తెగ వెతుకుతున్నారా? ఎంత సెర్చ్ చేసినా మీకు తగిన జోడీ దొరకట్లేదా? అయితే ఈ రింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

బాబర్ కంటే కోహ్లీనే బెస్ట్ : పాక్ మాజీ ఆల్ రౌండర్

ప్రపంచ స్థాయి క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఇద్దరు బెస్ట్ క్రికెటర్లుగానే కనిపిస్తారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, ఫీల్లిండ్, కెప్టెన్సీ ఇలా చెప్పుకుంటూ అన్నింట్లో అత్యుత్తమంగా రాణిస్తాడు. ప్రస్తుతం విరాట్‌తో బాబర్ ను ఎక్కువగా పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO

రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈరోజు జరిగిన సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, స్పెషల్ గా తెలుగు డాక్యుమెంటరీ

మార్చ్ నెల పూర్తి కావస్తోంది. ఈ టైమ్ లో ఓటీటీలో మంచి మంచి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తెలుగు డాక్యుమెంటరీ రిలీజ్ అవుతోంది.

ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం

లియోనల్ మెస్సీ.. ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ఎందకంటే అతడు సాధించిన ఘనతలకే అందుకు కారణం.

ఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5

సోనీ భారతదేశంలో తన ప్లేస్టేషన్ 5 (PS5) ఏప్రిల్ 1 నుండి రూ.5,000 తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అంటే PS5 (డిజిటల్ ఎడిషన్) రూ. రూ. 39,990కు (రూ. 44,990 నుండి), సాధారణ PS5 ధర రూ. 49,990కు (రూ. 54,990 నుండి) లభిస్తాయి.

రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టు కేసును తాము నిశితంగా పరిశీలిస్తోందని, అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు

ఏప్రిల్ 15 నుండి ప్రారంభమయ్యే పోల్స్‌లో ధృవీకరణ అయిన ట్విట్టర్ ఖాతాలకు మాత్రమే ఓటు వేయడానికి అర్హత ఉంటుందని ఎలోన్ మస్క్ సోమవారం ప్రకటించారు.

ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్టు ప్రాథమిక విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగూనంగా ఈ మార్పులను తీసుకొచ్చినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

#SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు

మహేష్ బాబు 28వ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చింది.

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేనా..?

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. స్వీస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రౌండ్ రౌండ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. ఈ సీజన్లో టైటిల్ కొట్టాలని పీవీ సింధు పట్టుదలతో ఉంది.

తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ

తెలంగాణలోని రేషన్‌కార్డు‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ నుంచి పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ విజేత నిఖత్ జరీన్‌కు 'థార్' బహుమతి

ఢిల్లీ జరుగుతున్నప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు

కొన్ని మంచి సినిమాలు థియేటర్ల దగ్గర ఎందుకు ఫెయిలవుతాయో అర్థం కాదు. అలా అర్థం కాకుండా మిగిలిపోయిన చిత్రమే ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం 2010లో రిలీజై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం

అమెరికాలో దారుణం జరిగింది. ఓ యువతి మూడు అత్యాధునిక తుపాకులతో టేనస్సీ రాష్ట్రం నాష్‌విల్లేలోని ఒక ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఆరుగురు మరణించారు.

మార్చి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.